Wednesday, 3 April 2019

కొయిల పాట వింటే నాలోప్రాణం పునఃజన్మిస్తుంది
కొత్త సంవత్సరం మొదలౌతోంది
వసంతం విరబూస్తోంది
వగరు, తీపి, ఇలా షడ్రుచులు అందిస్తుంది
గానకొయిల గాత్రం విప్పితే ఏమౌతుంది
గాలి స్వరరాగాన్ని మొస్తూ పులకిస్తుంది
కొమ్మారెమ్మా  కొయిల పాటకు కొత్త చిగురుతొడుగుతుంది
కొసరికొసరి ఉల్లాసంగా ఊయలలూపుతుంది
నల్లనైన కొయిల నయగారంగా పాడితే
నవ్వు నా పెదవులపై నాట్యమాడుతుంది
కన్నుల విందు నెమలి నాట్యం
కనిపించక కొమ్మల్లో వినిపించె వీనుల విందు కొకిల గాత్రం
స్రవణానందం స్రావ్యమైన కొయిల గానం
స్రవంతి లా సాగుతుంది సరళమైన స్వరం
సృష్టిలో ప్రత్యేక మైన స్థానం మైనాది
సృతి చేసిన మైనా స్వరం సంగీత జగత్తుకే మత్తెక్కిస్తుంది

No comments:

Post a Comment