Tuesday, 28 October 2014

నీవులేని నేనులేను



నీ చెక్కిలి అద్దంలో నను చూసుకోని చెలి
నీ మధుర గానలలో నను మైమరచిపోని చెలి
నీ అధర మధువులో నను మునిగిపోని సఖి
నీ అరవిరిసిన కన్నుల నను దాచేయి చెలి
నీ కురుల వింజామరల్లొ నను సేదతీరని సఖి
నీ బిగి కౌగిట శాస్వత బందినై పోనీ సఖి
నిర్మలమైన నా మనసులో నీవే నిండావు చెలి
నీవే నా ప్రేమకు నిర్వచనం సఖి
నిక్కము నిన్నే నమ్మితి ననువీడకు నేచేలి
నిను మిక్కిలి ప్రేమించితి నను వీడకు నేచేలి
నిదురలేక కలలురాక కలవరమాయే చెలి
నీలో ఆ కడలికన్న మిన్న ప్రేమ నాదే చెలి
నీవులేని నేనులేను నీలోనే నిండి  ఉన్నా చెలి
నీవు నాలోనే కొలువయి ఉన్నవే   సఖి
                                    -కళా వాణి-

No comments:

Post a Comment