పండువెన్నెల్లో నిండు పున్నమి జాబిల్లి నీవు
పరదాలలో ప్రణయాలు స్వరాలూ పలికించెవు
పరువాల ప్రాణాలు తోడేసేవు
ప్రణయాల వీణ శృతి మెత్తగా మీటేవు
పలుకు రాక సిగ్గుల పైట కంమేస్తుంటే
పలుకులేల అని నా సిగ్గు దోచేస్తావు
ప్రాణమున్న బొమ్మనై మైమరచిపోతుంటే
ప్రాణాలు తోడేస్తావునేనున్నానని కంమ్మేస్తావు
పలుకుతెనేలోలుకు నీ పిలుపు వింటే
పలికింది నామది వేయి వేణువుల రాగమై
పన్నిటి స్నానాలై నీ ఉపిరి సోకుతుంటే
పులకించి ఉప్పొంగే నామది వేయి యమునలై
నీవులేక నిలువలేనురా నల్లనయ్య
నీతోడులేనిదే బ్రతకలేనురా కన్నయ్య
-కళా వాణి -
No comments:
Post a Comment