Saturday, 14 December 2013

ఆరంభం

అంకురించే నాలో అంతర్గతమై ఉన్న కవితా ప్రవాహము
అంబరమే హద్దాయే అనంతమైఎగసే  కావ్య సాగరము
అంతకరణమున అంశమాయె కావ్య స్వరము
అనంతమైన కావ్య ప్రపంచం ఇక నా సొంతం
ఆపాద మస్తకము అవహించే కవితావేశము
అక్షయ పాత్రగా మారే అక్షర మస్తకము
అత్యంత అద్భుతానైనా అవపోసన పట్టేస్తా
అవలీలగా హిమాలయాలనైనా అదిరోహిస్తా
అదిక్షేపములు అడ్డొచ్చినా ఛేదిస్తా
అందమైన ప్రపంచంలోకి అడుగేసా
అలలైన ఆలోచనలతో ముడేసా
                                -కళావాణి-
                            -



1 comment: