Tuesday, 17 December 2013

సుభోదయము

సప్తాశ్వుడు ఉషాస్సులతో మనస్సును స్పృసించే
సమస్త లోకాలకు సువర్ణ సౌదామినులు కురిపించే
సుమనస్సు  సుమనోరజములు వెదజల్లే
సరస్సున సరోజములు సౌరభ్యములతో విప్పారే
శాకుంతలలు సౌమ్య స్వర రాగ సుధలు చిలికించే
సాహిత్యము నా మనస్సున సరళమై సాగే
సప్తస్వరములు శృతి మెత్తగా వీణలు మీటె
సర్వజనీనమే కదా ఈ సుందరము
సుమనోహారము కడు సుకుమారము

No comments:

Post a Comment