Wednesday, 3 October 2018

బంధాలు బాధ్యతలు
ఇద్దరు కలిసి జీవించాలి అంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉండాలి. ప్రేమలేని బార్య భర్తల బంధం షొకేష్ లో బొమ్మ లాగా అలంకరణప్రాయంగా వుంటుంది సమాజం కొసం సమాజం లో వాళ్ళ మెప్పు కొసం బ్రతికే మనుషులే ఎక్కువ స్వతంత్ర భావాలు లేని మనుషులు వ్యక్తిత్వం లేని మనుషులే ఎక్కువమంది వున్నారు అందరూ ఎలా ఉన్నారొ వాళ్ళ లాగా వీళ్ళలాగా బ్రతకాలి అనుకుంటారే గానీ  ఎవరికి వారు వాళ్ళకు నచ్చెలా బ్రతకడం తెలీదు ఒక అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తి ని జీవిత భాగస్వామి గా ఎన్నుకునే స్వతంత్రం లేని సమాజంలో వున్నాం తల్లి తండ్రి పిల్లలు తమ ఆస్తులు గానొ వస్తువులుగానొ చూస్తున్నారు పిల్లలు తల్లి తండ్రులకు బానిసగా జీవితకాలం బ్రతకాలి కన్న పాపానికి తల్లి తండ్రుల చెతిలో కీలుబొమ్మలాగా నిరంకుశమైన ఈ తల్లి తండ్రుల నుండీ స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుందో పిల్లలకు పక్షి కూడా పిల్లల్ని పెంచుతుంది ఎగిరే శక్తి రాగానే స్వేచ్ఛ గా ఎగిరి స్వతంత్రంగా జంటను ఎన్నుకునే స్వేచ్ఛ వుంది వాటికి మనిషి మిగిలిన జీరాశులకన్నా గొప్పవాడు అలొచించె శక్తి కలవాడు అయినా మతం కులం వీటితొ పిచ్చివాడై మర్ఖంగా పిల్లల ఆనందాన్ని చిదిమెస్తున్నారు ఎంత నిరంకుశత్వం మనిషిని మనిషి చంపె అనాగరికం
     
     పిల్లల్ని తల్లి తండ్రులు బాధ్యత గా పెంచాలి సమాజం పట్ల అవగాహన కలిగించాలి స్వేచ్ఛ నివ్వాలి చెడ్డవారి పట్ల జాగర్తలు నేర్పాలి ధర్యన్నిఇవ్వాలి  

అమృత జీవితం తలచు కుంటేనే బాధ కలుగుతుంది
చిన్నవయసులోనే వైధవ్యం ప్రేమ లేని తల్లి తండ్రులకు పిల్లలు ఎందుకు, పిల్లలు మమ్మల్ని కనండి అని అడిగారా
ఇలాంటి కర్కొటకులకు భగవంతుడు పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి

No comments:

Post a Comment