Monday, 17 September 2018

భర్త ఒక భద్రత నమ్మకం అందరినీ వదిలి మన అనుకుని బ్రతికే గొప్ప భావం
భారీ అంచనాలే వుంటాయి మొదట్లో కానీ అంకిత భావం కన్నా ఎక్కువగా కనిపించెది అవసరం
భవిష్యత్తులో మార్పు సంభవించకపొతుందా ఆశించడం
భగ్నం అయి  బాధపడడం
భావవ్యక్తీకరణ చెసుకుని చులకన అవడం
భవిష్యత్తు పై ఆశలు పెంచుకొవడం
భంగపడి జీవితం అర్థం కాక అనిపించెది అగమ్యగోచరం
భగవంతుని పై భారం వెసి బ్రతికేయడం
భక్తి నా జీవితానికి ఇచ్చింది గొప్ప పరిష్కారం
భళా అనిపించెలా నమ్మలేని నిజాలు జరగడం
భలే మార్పులు తీసుకువచ్చింది ఈ భక్తి భావం
భద్రతనిచ్చింది భవిష్యత్తు పై కలిగించింది నమ్మకం
భస్మమైపొయాయి బాధలన్నీ ఇప్పుడు ప్రశాంతమైన జీవనం నా సొంతం

No comments:

Post a Comment