Thursday, 11 September 2014

ముకుందా మాధవా



నీలి గగనాలలో నిండు చందురుడు
నీలాకాశ వీధుల్లో నీకై వేచిన తారకలు
నీలిమేఘాల పానుపువేసి వేచే తారకలు

నీల మోహనా నీ రాధానురా
నీ గానము విని నిలువగ జాలనురా
నీవులేని ఈ జగమే చీకటి
నీ నామమే శరణంటి
నీతోటిదే నా లోకమంటి
తేనెలొలుకు నీ తియ్యని రాగం
తనువంతా దహించే మోహన రాగం
తరీయించె నా జీవితం
దరిచేరిన మనసు మధురం
దరి కానరాదు ఏ లోకం
ముగ్ద మనోహర రూపా
ముకుందా మాధవా

No comments:

Post a Comment