Wednesday, 22 May 2019

కొమ్మమీది కొకిలమ్మ కుహుఅన్నది కుహుకుహూ అన్నది
అది కూన విన్నది ఓహో అన్నది

కొరికలన్నీ నెరవెరె కొత్తజీవితం మొదలౌతుంది
కొంత కష్టమైనా ఇష్టపడ్డాను కనుక నెరవెరుతుంది

Monday, 20 May 2019


వెన్నెలరేడు వేంచేయు వెళ వెన్నెలలు నాపైవెదజల్లె విన్నపం
వెన్నెల వరదై వాగై వచ్చె వెడుకై వన్నెల జలకాలాడగ ఈ రెయి వరమె

Saturday, 18 May 2019


పగలే జాబిలి పరుగున వచ్చెసింది
పలకరించె వెన్నెలతొ  మనసంతా పండగ చెస్తొంది
పల్లవించె తలపులొ పల్లకిపై ఊరేగుతొంది
పరవశించి పరవశించి జాబిల్లిలొ ఏకమైపొతున్నా
పక్కన చేరి చక్కని నెలరాజుకై చుక్కనైపొతున్నా



Friday, 17 May 2019

సొగసైన బాధ్యతలు నిర్వహించడంలొ నిమగ్నమయ్యాను
సొమరి పెనిమిటికి గడసరి సొగసరి భార్యను అయ్యాను


Thursday, 16 May 2019


ఉదయం చల్లని గాలులతో హయి వెల్లివిరిసింది
హృదయం ఆనంద డొలలూగెలా కొయిలగానం వినిపిస్తొంది 
మనసుకు చెదలు పడితె వస్తుంది కొపం
మనసు శరీరం నాదికాదనుకుంటే వచ్చెది మొక్షం
వస్తువులతో గుర్తింపు ఏర్పరచుకున్న మనిషికి లేదు శాంతి

Wednesday, 15 May 2019

బంధాల బాధవ్యల తొ అంటీముట్టనట్లు వ్యవహరిచడం ఉత్తమం
బలాబలాలు ఆత్మాభిమానాలు అహంకారాలకు తావివ్వక జీవించడం యొగం
మిగులున్నది తక్కువ సమయం
మిన్నగా జీవించడం ప్రదానం
ఈ జీవనానికి అవసరమైనది ఆంతర్యం శొధించడం
ఈ యొగ సాధనే చెర్చెను గమ్యం
ఇతర ఆలొచనలకు ఇక పొడాలి చరమగీతం
ఇందులొ ఆనందం ఆనంతం



Tuesday, 14 May 2019

జరిగిపోయిన వాటి ప్రభావం మనిషి పైవున్నా అవి అలానే జరుగుతూవుంటాయి
జగమంతా ఒకే లా వుండదు రకరకాల మనుషులు వివిధ మనస్తత్వలు వుంటాయి
అమ్మ మనసుతో క్షమించెయాలి
అర్థం చేసుకుని మారితె మంచిదే లేకున్నా వదిలెయాలి






Monday, 13 May 2019

మనసులో గూడుకట్టుకున్న బాధనంతా చెసా బహిర్గతం
మదిలో సంఘర్షణ గడచిన ఘొరానికి తెలెను పరిష్కారం
నేను మదన పడ్డ విషయం వివరించాను
నేటితో మావారిలొ మార్పు రావాలి ఆమార్పే నడిపిస్తుంది
అలసిన మనసు కాస్త తెలిక పడింది
అంతరాలలో అయొమయాలు అవాంతరాలు తొలగాలి
మొదటి నుండి కొనసాగే పరిణామాలకు ముగింపుకావాలి  మొండిగా బ్రతికెసాను మెండైన దైర్యంతొ
మనసును పిండెసెది పిల్లలకు పడ్డశిక్షకే
మన్నించినా మనసున తొలగెనా గాయం
నన్ను నేను క్షమించుకొలేనిదే ఈ స్థితి
నలిగిన మనసుకు లేదు నిష్కృతి
పిల్లలే ప్రపంచం నాకు
పిండెస్తొంది గుండె పిడుగులాంటి మాటకు
విడివడి జించివుంటే అదీకూడా శిక్షే పిల్లలకు
విధి ఆడే ఆటలో పావునైపొయానో తెలియదు నాకు
ఎదీ తిరిగి తీసుకురాలేను
ఎదైనా దిద్దుకునే అవకాశం కొరుకుంటాను
బాధ కానేకాదు పరిష్కారం
బాధ్యత మరచిన తత్వం
మదర్స్ డే నను అభినందించినా నా మనసు అంగీకరించకుంది
మన్నించె మనసు మీకున్నా చెయని నెరానికి నాకు శిక్ష పడింది
అమ్మను కాను మీకు శాపాన్ని
అమాయకత్వమె శాపం నను మన్నించండి😢



Sunday, 12 May 2019


సుమధుర సుందర సూర్యోదయాల సొయగం
సుస్వరాల సుకుమార స్వర స్వాగతం కొకిలగానం
ఆలపించెగానం ఆలకిస్తుంటే ఆనంద డొలాబృతం
ఆలలా తాకె నవవసంత గానం
మెత్తని పూల నెత్తావులు
మత్తు గాలి సూగంధాలు
రమ్మనే జుమ్మనే బ్రమరనాదాలు
రమనీయం కడుసుంరము ప్రకృతి సొయగాలు



Saturday, 11 May 2019

మనిషి లొ నుండీ జ్ఞాపకాలను తీసివెస్తే స్తంబించి పొతాడు
మనసు లేకుండా మనిషి జీవించగలడా జీవించలేడు
జీవించె విధానంలో అనుభవాలకు జ్ఞాపకమే మూలం
జీవి పుట్టిన క్షణం నుండీ శరీరం చెసె సాధనే జ్ఞాపకం
శరీరం అంతా జ్ఞాపకాల నిధి  

Friday, 10 May 2019

చుట్టూ ఎలాంటి పరిస్థితులు వున్నా ప్రశాంతంగా వుడడం నాకెప్పుడు అలవడుతుంది
చూడలేని అనంత శక్తి నాలొనే దాగుంది అది ఎప్పుడు శొధించెది
తలచె ప్రతి తలపు తరించి పొయెది లా వుండాలి
తపన ఆశక్తి భక్తి పట్ల పెరగాలి
అల్పాయుష్సు జీవికి అంతు చిక్కని భక్తిపై మక్కువెందుకు
అలా చిటికెస్తే కాలం అదృశ్యం అయిపొతొంది



Thursday, 9 May 2019

మౌన వ్రతం పాటిస్తే ప్రశాంతత అవుతుంది నా సొంతం
మౌనంగా వుండడం అందరితో వున్నా మాట్లాడకపొవడం ఆనందంగా పుడమితో స్నేహం బురదలో వేళ్ళు కాళ్ళు చెస్తుంటె నాట్యం పసితనం జ్ఞాపకం
ఆనాటి ఆటలు ఆకలి గురుతేరాని లొకం అందరూ ఒకే కుటుంబంలా జీవించె జీవనం
నేడు ఆ ఆటలు అన్నీ మాయం
నేలను తాకితెనే నెరమైనట్లు అమ్మ ఆగ్రహం
వానచినుకు మెను తడిస్తె భయం
వాగులు చూడలెదు వంకలూ చూడలెదు నెటి తరం
ఈ నాటి ఈ తరంవైపు జాలిగా చూస్తుంది నా గతం
ఈ జీవితాలా నెటి భారతి భవితకు రక్షణ
నా ఈ మౌనాన్ని మనసు ప్రశ్నిస్తోంది
నా ఈ మౌనం ష్ ష్ మౌనాన్ని పాటించు ఈక్షణం లో జీవించు అంటొంది
ఈక్షణం జారిపొతే రేపటికి జ్ఞాపకమెది అనుభూతే ఆనందం
ఈ అనుభూతిని మౌనం ఆనందంగా మార్చె సాదనం



నను వరించి పొయినవస్తువులు, ధనం, వరించి చెరితె ఆ ఆనందమె వెరు
నన్ను మెచ్చి మా నాన్నమ్మ ఇచ్చిన జ్ఞపిక అమాంతం నా ఒడిలొ వాలితె ఆవరమె చాలు

Wednesday, 8 May 2019

రొకలి చిగురు వెయ్యావచ్చు ఏమొ 


కప్పలు అప్పాలైపోవచ్చు..సున్నం అన్నాలైపోవచ్చు
నేలను చాపగ చుట్టావచ్చు..ఊ..నీటితో దీపం పెట్టావచ్చు 
ఏమో..చుచు చుచు చుచు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు 

కప్పలు అప్పాలైపోవచ్చు..సున్నం అన్నాలైపోవచ్చు
నేలను చాపగ చుట్టావచ్చు..నీటితో దీపం పెట్టావచ్చు 
ఏమో..చుచు చుచు చుచు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు

చరణం::1

ఆనాటి నీతల్లి ఆకాశ జాబిల్లి తారలన్ని..నీకు తలంబ్రాలుపోసి 
హరివిల్లు దిగివచ్చి హరివంటి పతినిచ్చి వెళ్లావచ్చు..రోజు మళ్ళావచ్చు 
ఆ మారు తల్లైన తల్లల్లె తామారి పట్టు చీరలు కట్టి పరమాన్నం వడ్డిస్తే 
ఆరారు కాలాల నీకంటి నీలాలు ఆరావచ్చు..మనసు తీరావచ్చు 
దైవాలు పెట్టెను లగ్గాలు పెళ్ళిళ్ళ లోగిళ్ళు స్వర్గాలు 
ఆ నింగి ఈ నేల పాడాలనీ పాట ఈ పూటా 
పాములు పాలు ఇవ్వావచ్చు బెబ్బులి పిల్లిగ మారావచ్చు  
నవ్విన చేను పండావచ్చు రోకలి చిగురు వేయావచ్చు 

ఏమో..చుచు చుచు చుచు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు 

చరణం::2

ఏడింట సూరీడు ఏలుతున్నాడు..రాకుమారుడు నీకు రాసి ఉన్నాడు 
రతనాల కోటకే రాణి వంటాడు..పగడాల దీవికే దేవి వంటాడు 
గవ్వలు రవ్వలు కానూ వచ్చు..కాకులు హంసలు ఐపోవచ్చు 
రామ చిలుక నువ్వు కానూవచ్చు..రాంబంటు కలా పండావచ్చు
ఏమో..చుచు చుచు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారి చెయ్యవచ్చు 

కప్పలు అప్పాలైపోవచ్చు..సున్నం అన్నాలైపోవచ్చు
నేలను చాపగా చుట్టావచ్చు..నీటితో దీపం పెట్టావచ్చు 
ఏమో..చుచు చుచు చుచు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హు హు 

మన సమస్యలన్నింటికీ ప్రకృతి లొనే సమాదానం వుంది
మనిషి ప్రకృతి కి దూరం కావడమె సమస్య అయింది

Tuesday, 7 May 2019


ఆపద అలా రాగానే వెంటనే అమ్మ ఇస్తుంది అభయహస్తం
అమ్మవారి మనసు వెన్న మము సంరక్షించె సువర్ణ కవచం
అగస్మాత్తుగా వచ్చి పడె ఆపదలు అమ్మకె తెలుస్తుంది
అయొమయంలో పడి ఆపదగురిచె మనసు ఆరొచిస్తుంది
అడగకనె వరాలిచ్చెతల్లి అండగావుండగా భయమెముంది
అమ్మ అనుగ్రహంలో ఆనందడొలికలు ఊగె వంతు నాది
అసమాన అనుగ్రహం ఆమెది
అందుకే అనంత లొకాలకు అమ్మ అయింది
అందమైన నాజీవితంలో అన్నీ తానై రక్షిస్తోంది
అన్ని అడ్డంకులు అడిగినవైనా అడగనివైనా తొలగిస్తుంది
ఆమెలో నా జీవం మమైకమైపొవడమె నా కర్తవ్యం
అనంతమైన ఈ విశ్వం పంచభూతాల మయం
అందులో ఐక్యం అవ్వడం జీవం తత్వం
అది ఈ జర్మకు ఫలించడం నా అదృష్టం


Monday, 6 May 2019

ఈ శరీరం సాధన మయం ఇదే శరీర ధర్మం
ఈ సాధన లేని శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం కష్టం
ఈ ఆధ్యాత్మికమైన జీవనం లో అంతా తెలిసినట్లే తొచినా అందులొ అంతా అమాయకత్వం
ఈ తెలియని తనంతొ పడె సంఘర్షన స్థిమితంగా ఉండనీయదు అదే అజ్ఞానం
ఈ తెలివైనతనంతొ నిరంతరం నిరూపనలతో ఒప్పించడం లొ కొట్టుమిట్టాడుతుంది జీవితం
ఈ గొప్పలు గొడవని తగలబెడితె  నిరాడంబరంగా ఉండగలం
ఈ నేను అన్న దాన్ని తొలగించుకుంటే అదే జ్ఞానం
ఈ అనంతంలో ఈ జీవి అణవు బుడగలొని గాలి అవుతుంది అనంతంలొకి ఐక్యం
ఇక వున్నదంతా సూన్యం



మనసులొ భావన అలా పలికిస్తె చాలు ముడిబడిన మనసు పలుకుతుంది
మగువ మూగబొతె మగని మనసును తాకుతుంది ఇది తెలిసిన ప్రతిక్షణం మాయలా తొస్తుంది
స్వచ్ఛమైన స్వప్నం లాంటి సత్యం
స్వయం అనుభవం కలిగితె తధ్యం
ఆనందం ఆశల హరివిల్లుల తోనే సఫలం
ఆనవాలు చూపలేని అద్భుత సారం
ప్రత్యక్షంగా అనుభవం కళ్ళకు చూపినా నమ్మలేం
ప్రతిదీ జరిగె బాహ్య అంతర క్రియలు మాయాఅద్భుతం
అనవసరమైన ఆలోచనలతొ కాకు సతమతం
అంతర్ములం అయితే అవలీలగా అన్నీ సాధ్యం

Sunday, 5 May 2019




సఖియా వివరించవే.
సఖియా వివరించవే.
వగలెరిగిన చెలునికి నా కథా.
సఖియా వివరించవే.
వగలెరిగిన చెలునికి నా కథా.
సఖియా వివరించవే.
నిన్ను జూచి కనులు చెదిరి.
కన్నె మనసు కానుక జేసి.
మరువ లేక మనసు రాక.
విరహాన చెలి కాన వేగేననీ .
సఖియా వివరించవే.
మల్లెపూలా మనసు దోచి.
పిల్లగాలి వీచేవేళ.
మల్లెపూలా మనసు దోచి.
పిల్లగాలి వీచేవేళ.
చలువరేని వెలుగులోనా.
సరసాల సరదాలు తీరేనని .
సఖియా వివరించవేవగలెరిగిన చెలునికి నా కథాసఖియా వివరించవే

చొరవతొ చెరువై పంచనీ ప్రేమని
చొరుడై వీరుడై చెంతకే చెరని
కాలం మాకు కలిసి రాని
కావ్యమై జీవనం గడచిపొనీ
ఏదూరమూలేని ఎడబాటేలేని
ఏకాంతం అంతా మాదై సుఖాంతం కానీ
అనంతమైన ఈ జగం మా కథే జపించనీ
అసాధ్యమె సుసాధ్యమై నా ఆశయం ఫలించనీ
ఎపుడొస్తావో నీకేమివ్వను
ఎదలో గుడినె మలచి నిను కొలువుంచెను


Saturday, 4 May 2019

ఉహల పరువాలు ఉసుల పరవళ్లు వెన్నెల రాజుకు కబురంపెనే
ఉపిరి నీవైన నాదమునేనై పలికిన మానస రాగాలు మనవేనులే


పల్లవి :
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

చరణం : 1
ఆకులపై రాలు... ఆ... ఆ... ఆ.....
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించినా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం...
నీవు నాకు వేద నాదం... ఆ... ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

చరణం : 2
కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేవిఁటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం... ఆ... ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

Friday, 3 May 2019

స్నేహానికి అర్థాన్నే మర్చే ప్రబుద్దులు మొబైల్ ని హ్యక్ చెయడాలు ఇతరులు ఎంచెస్తున్నారో అని దొంగగా చూడ్డమే పని కొందరికి ఎం ఆనందమొ ఈ సైకొలకు ఇలాంటి వాళ్ళను జీవితాలనుండీ వెలి వెయాలి మళ్ళీ నా జీవితంలో ఇలాంటి వాళ్ళ ను జ్ఞాపకానికి కూడా రానీవ్వను ఇంక చాలు. మంచి నిర్ణయం తీసుకున్నాను మనసు చాలా తెలికగా వుంది అబద్ధాలు, మొసాలు, మొబైల్ హ్యక్ చెయడాలు ఇవన్నీ పాడుబుద్దులు ఇలాంటి వాళ్ళను తలచుకున్నా అసహ్యం వెస్తుంది
మనిషి నిజాయితీగా ఉండడం చాలా సులువు కానీ ఉండరు. పైకి మంచిగా నటన ఎవరిని మొసం చెయడానికి

Thursday, 2 May 2019

 

ఆలోచనలు గజిబిజిగా నను ఆల్లెస్తుంది
అప్పుడు ఎప్పుడో ఆపరిస్థితులకు అలా ఆలోచనకలిగింది
అదేశించినట్లు అమాంతం ఇప్పుడు ప్రత్యక్షమైంది
అది వద్దనుకున్నా వదలక వెధిస్తొంది
అవే ఆలోచనలు కొన్నిమార్పులతో కొత్తపుంతలు               .                                                              తొక్కుతోంది అలా జరగడానికి కారణం లేకపొలేదు
అన్నీ నా మనసుకు గుర్తే ఆవేదన లో తప్పదు
అయితే, భావాలను కవినై రచిస్తే ఒక గ్రంథమే అవుతుంది
అంత పిచ్చి పనిని పనికట్టుకుని చెయలేను
అలొచన ఫలించె సరికి అందులొ అనంతలొపాలు
అందినదాన్ని ఆశ్వాదించాలంటే అసహ్యం
అభిమానం  అడ్డు గొడలా అవతరిస్తుంది
అడ్డుచెప్పెవారూలేరు నాసంస్కారం నను హెచ్చరిస్తుంది
అర్థం చెసుకునె మనుషులు నాకు వున్నందుకు ఆనందం
అందులో మనుషులే అవసరమైనది అందించలేక                                                            పొవడం నా దురదృష్టం
అనుకొడానికెముంది అంతా ముగిసిపొయేకాలమిది
ఆశలూఆశయాలూలేవు ఆలోచనలలో అన్నీ మార్పులే
అంతులేని ఆంనందం ఎలా వుంటుందో అదీ చూస్తున్నాలే
అందరూవున్నా లేకపొయి నా ఆనందానికి లొటులేదు
ఆఖరిరి రొజుల్లో నా ఉహలకు రూపంరావాలి పఫలించాలి
అసహించుకునేదిగా కాక ఆనందంగా ఆశ్వాదించాలి
అనుభవించడానికీ అన్నివసతులూ సమకూరాలి
ఆహ్లాదంగా అరమరికలులేక సాగిపొవాలి
అలసిపొయాను అనవసరపు రాజకీయాలతో
అలుపెరుగని ఈ ఆలోచనలు అంతం అయ్యేది నాతొనే
ఆధ్యాత్మికంలో అంతులేనీ ఆంనదాన్ని చవిచూస్తే చాలు
అనంతలొకాలూ నాలొనే చూడగలను

Wednesday, 1 May 2019


శ్రీ కారణం చుట్టీ అంకురించింది అభ్యుదయం
శ్రీ శబ్దం శుభపరిణామం నాఇంట స్థాపితం
అనంతమైన ఆనుగ్రహం అలా నన్ను ఆశీర్వదించింది
అవరోధాలు లేని ఆనందాలకు అంకురార్పణ చెస్తొంది
ఇది గమనించలేని నా అజ్ఞానం దుఃఖించింది
ఇలాంటి అనూహ్యమైన మార్పు నా ఉహకు అందనిది
నా ఆనందానికి అవధులు లేక ఉక్కిరిబిక్కిరి అయింది
నాలో ప్రాణమే తిరిగి జీవం పొసుకుంది
అమ్మ మనసుకు ఆలంబన దొరికింది
అద్భుతమైన మత్రబలం నిదర్శింపబడింది