Tuesday, 30 April 2019

నిన్ను తలచిన మనసుకు నిదురే లేదు
నిండిన నీరూపం  నాకన్నుల చెదరదు 
వీచెగాలిలో  సుమగంధాలు పొసి వింజామరలు వీచనీ
వీనుల విందైన గానంలో మధువును కలిపి వినిపించనీ
నీ అనుగ్రహానికి అర్హతలేనిదా నా భక్తి
నీ నామం వీడనురా శంభో శివ శంభో నాకిదియె ముక్తి
నీలకంఠా నీవే నా కన్ను ల పంట
బంధాలను బాధలతో ఎందుకు బంధించావు

Monday, 29 April 2019


దరిచెర్చని ద్వేషాలను నెట్టెయాలి దూరం
దహించిపొనీ పాతకథలు దారులన్నీ అయ్యాయి ద్వంశం
దండన పడి నిలిచింది పశ్చాత్తాపం
దయదలిచి స్వాగతిస్తే స్వర్గం సొంతం
తల్లి లేని పెంపకం తప్పొఒప్పో తెలియనితనం
తల్లడిల్లిపొతుంటే తగువుతగదు నీలో గుణం అమ్మతనం
అందించాలి నీవే ఆత్మీయత అదే ధర్మం
అలిగి ఆఖరి దశలో ద్వేషించడంకాదు సమంజశం
నీకోసం పడ్డ తపన తెలిపే తనలో ప్రేమ
నీకై పసిపిల్లాడై పిలిచె ఆన్నీమరచి నీవు అవ్వాలి అమ్మ
విలువలు తెలియని వాడు కాదు
విసిగించినా అవమానించినా నిను వదలలేదు
వెదించ లేదె వెళ్ళిపొమ్మని కనబడదా విడలేనితనం
వెలమాటలన్నా మారు మాటాడని మౌనం
వలపించుకొ వదిలించుకోకు నీ వలపులపంటని
వదలేని నీ చెయి విడవలేని సహనశీలిని


Sunday, 28 April 2019




కంటికి ఇంపైనది మనసును మరిపించెది ఇంకా కనబడదే
కాలం కలిసివస్తే దైవం అనుగ్రహిస్తే కనిపిస్తుందికళ్ళముందే

Saturday, 27 April 2019

వసంతం అమాతం కొయిలకు వంతపాడింది
వగరు రుచి వలచి కొత్తరాగం మత్తుగా పాడెస్తోంది
వగలమారి కొయిల కో అంటే నాలో కోటివీణలు మీటె
వడివడిగా ఎండలుమెండై భగభగ సూరీడు మండుతుంటే
వళ్ళు ఉబికే ఉప్పునీటీ సంద్రమై ముంచెస్తోంది
వెకువనే సూరీడు వేడిసెగలకు వనం వాడిపొతోంది
వెలవెలబొయె వసతంలో కొయిల చల్లనిరాగం పాడుతోంది
శిగలో పూలు పిలిచె చిలకలా పలుకే తెనెలొలికె
శిశిరంలో శీతవేళ శెగాలాయె సరసన నీ మురిపానికె
నీలో లీనంమై నేనే వుంటే
నీకై నిండి నామదిలో నాకై చొటె లెకుంటే
నిదురే రాని నాకన్నుల నిండిన రూపం నీదేరా
నిండుగ మెండుగ కడదాకా నాకు అండవు నీవేరా
మదిలో నిండిన మమతవు నీవు
మనసెదొచి మురళిగ మలచి మైమరపించెవు
రాధనురా కృష్ణ నీ రాధనురా
రాగాలు పలికె రాధేయా నీకై నె వెచితిరా
యదలొ యమునే పొంగెనులే
యనలేని ప్రేమ మనదేలే

Friday, 26 April 2019


వరించు మరదలా సుఖించు సందెలా
ధరించు ధనుస్సును సంధించు మనస్సును
నీలాల కన్నులా బంధించు నన్నిలా
గారాలు చెయను మారాముచేయను అందిచు ప్రేమను
రవ్వంతగాలికి రమించె మనసులు
రతిమన్మదుల రంజింప జెసిన రతిక్రీడలు
దేవాలయాలపై దివ్యనుభూతులు
తొలకరి వెళల తొలితొలి సంధ్యల
తొందరపడెనె తొలకరి వయసు
మరులే రేపెను తుంటరి మనసు
చలిలో చెలియా చినుకై చిగరై చలించనీ మనస్సుని వరించనీ ఉషస్సుని ఆకాశ వర్ణాలన్నీ కన్నుల నింపేయని

Thursday, 25 April 2019


Cute  జంట 👌😊😁😍

మనసొక మాయాజాలం వద్దన్నదే చెస్తుంది
మనిషిని సంఘషణలో పడేసి సతమతం చెస్తుంది
వీడిపొని భావాలతో స్మృతులతో లొయలో పడేస్తుంది
వీటినుండీ బయటపడడం కష్టం కానీ కాలం మార్చెస్తుంది
ఈరొజు నాకు help చెసిన video, great video tq so much sadguru

Wednesday, 24 April 2019

అనంద డొలలాడించే కొయిల స్వరం
ఆశ్వాదించే మనసుకు అంబృతతుల్యం

డబ్బు మనిషిని నడిపిస్తుందా
డబ్బు జబ్బు నుండీ బయటపడే దారుందా
మనిషి తయ్యారుచెసిన ఈ డబ్బుని ఎక్కువైనా కష్టం
మనీ మనుగడకు అవసరం ఇది లేకున్న జీవితం దుర్భరం
దేవుని సన్నిధికైనా ధనంలేనిదే దొరకదు దర్శనం
దేనికైనా ధనం అవసరం కానీ ధనమే కాదు ప్రదానం
తామరాకుపై నీటిబిందువులా జీవించడం ధర్మం
తాను అనుసరించె మార్గం ధర్మబద్ధం అయితే జర్మ ధన్యం
కష్టమేమీకాదు ధనం సంపాదించడం
కచ్చితంగా ధనం వల్ల కీర్తి లబిస్తుంది కావాలి జీవనం ధర్మబద్దం
అడ్డదిడ్డంగా సంపాదించె ధనానికి ఆయుక్షీనం
అడుగు అడుగునా అవమానమే చివరకు జీవనం అసంపుర్ణం












Sunday, 21 April 2019

సందె కిరనం సన్నగా చీకటి ఒడిలొకి జారుకుంటోంది
సన్నాయి పాటలా సిందూరపువ్వలా సంధ్య అస్తమిస్తోంది

Friday, 19 April 2019

వెన్నెలరెడు వలపుల బాణాలు వెస్తున్నాడు
కన్నుల కొలనులో కలువలు పూయిస్తున్నాడు

Monday, 15 April 2019

ఒక్కటైన మనసులు దూరంగా వుంటే వెదనే వెరు 
పక్కింట్లో వున్నా అది ఏడు సంద్రాల దూరమె భరించలేరు
మా పెళ్లికి ముందు ఈ వెధన మాకూ తప్పలేదు
మారాం చెసే మనసుతో వెగడం అంత సులువుకాదు

ప్రతి సుమం సుగంధపరిమళం
ప్రణయమై పరవసించే వనం
కూసేకోయిల చేసే రాగాలాపన రమ్యం
కూనలమ్మ కొత్త చీర సింగారం




Wednesday, 10 April 2019



కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓయన్నది
దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
కోకిల కోకిల కూ అన్నది.హ.హ.
వేచిన ఆమని ఓ యన్నది.హ.హ.
గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడకావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా.
కోకిల కోకిల కూ అన్నది.హ.హ.
వేచిన ఆమని ఓ అన్నది.హ.హ.
వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ
వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సొగసైన ఈ రొజు నా సొంతం అయింది
సొమ్ము రావాలని  అలా అనుకున్నది ఇలా వచ్చింది


Tuesday, 9 April 2019


చైత్రంలోన చినుకుపడాలని కొరెవు
మార్గశిరాన మండుటెండకై చూసెవు
చైత్రంలో చినుకు చిందెసింది
చైతన్య ప్రకృతి చిత్రంగా కొత్త చిగురులతో సందడిచెస్తోంది
వనం సూర్యుని వెడిని తాళలేక వెడుకున్నాఏమొ ఆకాశం వర్షిస్తోంది


Monday, 8 April 2019


మబ్బులు కమ్మేస్తున్నాయి చల్లని గాలి మెల్లగా వీస్తోంది
మయూరం మైమరచి నాట్యం ఆడుతోంది
మదిలో మొహనరాగం పలుకుతొంది
మృదుమధుర భావాల నీటిలో ముంచుతోంది
మచ్చిక తో మెచ్చె ప్రకృతి ముచ్చటిస్తోంది
మచ్చుకైనా మచ్చలేని స్వచ్ఛమైన స్వరం కోయిలది
మనసు విని ఆనందాలనదిలో మునకలేస్తోంది
మధురమైన స్వరం కొసం కొయిల మధువునెతాగిందా
మావిచిగురు వగరుకే ఆ అదృష్టం దక్కిందా
మళ్ళీ మళ్ళీ కూస్తుంటే మనసాగదు
మల్లెలు విచ్చె మాసం చిగురులు తొడిగే చైత్రమాసం
మాడ్చె ఎండలను మరిపించే వసంతం సొగసందం
మారాకువెసి వనం వసంతం కోసం పలికె స్వాగతం


Sunday, 7 April 2019


వసంతమా వరమా కొయిల స్వరమా ఇది మాఘమాస మత్రం
వనాలలో సుమాలు సుస్వరాల సుమగంధాలు అలరించి కొత్త సంవత్సరానికి పలుకుతోంది స్వాగతం

Saturday, 6 April 2019

పండుగలలో ఉగాది ఉల్లాసాన్ని నింపుతుంది
పగలు ఎండలుమండినా నూతన ఉశ్చహం పొంగుతుంది
పచ్చని కొత్త చిగురులతో పసిడికాంతులు వెదజల్లుతొంది
పల్లకిఎక్కి కోయిల ఊరేగుతూ పాటల కచెరిచెస్తొంది
పల్లవించె పాటల సందడిలో మనసు పరవసిస్తోంది



Thursday, 4 April 2019

దీపం చిదిమి వెలిగించి చీకటి ని పాలద్రోలి మనసు సంబరపడుతుంది
దీక్షాత్రయంబై దృక్కోణంబున శంకర స్మరణలో జీవం ధన్యమైపొయినది
దీనంగా దివిలో మెరిసే నక్షత్రాలు నేలపై వీక్షిస్తున్నాయి తక్షణమె నీ తపస్సు తేజస్సు కై
దీనభంధూ దహించివెయి ఈ బంధాలు బంధనాలై నను బంధించకముందే తపించనీ నీకై



Wednesday, 3 April 2019

 

కొయిల పాట వింటే నాలోప్రాణం పునఃజన్మిస్తుంది
కొత్త సంవత్సరం మొదలౌతోంది
వసంతం విరబూస్తోంది
వగరు, తీపి, ఇలా షడ్రుచులు అందిస్తుంది
గానకొయిల గాత్రం విప్పితే ఏమౌతుంది
గాలి స్వరరాగాన్ని మొస్తూ పులకిస్తుంది
కొమ్మారెమ్మా  కొయిల పాటకు కొత్త చిగురుతొడుగుతుంది
కొసరికొసరి ఉల్లాసంగా ఊయలలూపుతుంది
నల్లనైన కొయిల నయగారంగా పాడితే
నవ్వు నా పెదవులపై నాట్యమాడుతుంది
కన్నుల విందు నెమలి నాట్యం
కనిపించక కొమ్మల్లో వినిపించె వీనుల విందు కొకిల గాత్రం
స్రవణానందం స్రావ్యమైన కొయిల గానం
స్రవంతి లా సాగుతుంది సరళమైన స్వరం
సృష్టిలో ప్రత్యేక మైన స్థానం మైనాది
సృతి చేసిన మైనా స్వరం సంగీత జగత్తుకే మత్తెక్కిస్తుంది

Tuesday, 2 April 2019

వసంతఋతువు వచ్చేస్తోంది
వసంతకోయిల స్వరాలపంట పండిస్తుంది