Tuesday, 26 March 2019

 మురిపాల పాదాల పై మురిసిపొతూ మువ్వ నవ్వింది
 మురిపెంగా ముంగిలి పారాడే పాదాల పావనమైంది
ముద్దు ముద్దు పాలబుగ్గలు ముద్దబంతి సొగసులు
ముద్దమందారంలా మెరిసే పెదాలు
ముసిముసి నవ్వుల చందం
ముసిరే నిదురమ్మకి నీలాల కన్నుల నీలిరాగం
ముచ్చటైన మొము మొహించె మొహనరాగం
ముత్యాలమూటల మాటలు ముందరికాళ్ళకు బంధం
మూసిన నాకంటి కలలపంట సిరివి చిన్నారివి
మూగనోము పంటపండించిన నా వరాలపంటవి వర్నికవి






Thursday, 21 March 2019

పదిలంగా పండు వెన్నెల పులకిచే పుడమి దొసిట పండుతోంది
పగలంతా పనుల అలజడికి అలసినా, పున్నమి వెన్నెల స్నానాలతో పులకిస్తోంది నా మది
నిండు చందమామా వెన్నెల వన్నెల రంగుల రంగేళి రంగరించి జల్లుతోంది


Wednesday, 20 March 2019

నిగనిగలాడే నిండు పున్నమి నింగినంతా వెన్నెలతొ నింపుతోంది
నిన్నలలో నిండైన మెండు మల్లెల పానుపు నిన్ను నన్ను నిండునూరేళ్ళూ కలిపెస్తోంది

Sunday, 10 March 2019

చెపల గుంపు అలలా కదులుతుంటే ఇంపు
చెరువుల్లో గుంటల్లో చేప ఎక్కడున్నా చేపకు ముప్పు
చంపకు చక్రంలాంటికళ్ళు మినుకు మినుకుల మీనం
చప్పుడు లేకుండా చెపల ముప్పుకు  కొంగల మౌన తపం
చూస్తుంటే చిత్రం చెపలు ఎన్నో జీవులకు ఆహరం
చూడచక్కని చెపలు జీవికి ఆహారమౌవుతుంటే దుఃఖం



Saturday, 9 March 2019

ప్రపంచంలో వైరాగ్యం అంతా నాలొనే వుంది
ప్రధమంగా సంతానం ఆద్యాత్మిక ఎదిగినా చింతే వుంది
ఏది సృతిమించినా మంచిదికాదు
ఏపరిస్థితి ఎలా మొదలౌతుందో తెలీదు
మౌనాన్నే ఆశ్రయించాలి ఉడుకురక్తం బాధ అర్థం కాదు
మౌలిక మైన అంశాలు చెవినపడవు స్వేచ్ఛ వననివ్వదు
నిప్పు కాలుతుంది జీవితం ఒక పాఠం
నిలకడమీదె తెలిసేది నిజం 

Friday, 8 March 2019

కుదుపులతో రైలు కూ ... అంటూ కదులుతోంది
కూనిరాగాల పాట చుకుచుకు మంటూ తాళం  అదిరింది
కిటికిలోంచి లైవ్ వీడియో చూపిస్తుంది
కిక్కురుమనకుండా కిక్కిరిసిన జనాలను తీసుకెళుతొంది
అటు ఇటూ తిరుగుతూ అందరిని తమ ఉరికి చెరుస్తుంది

Thursday, 7 March 2019

ఆనందానికి ఇంత చిన్న పదమా ఎంత చెప్పినా తరగని పదం ఆనందం
ఆకాశానికి హద్దు వుందేమొ కానీ ఆనందానికి హద్దులు లేవు హద్దేలేని ఆనందం

Wednesday, 6 March 2019

అమావాస్య శివునికి అభిషేకం అందివచ్చిన అదృష్టం
అడుగు మొపానా ఆశ్రమంలో కురుస్తుంది అదృష్టాలవర్షం

Tuesday, 5 March 2019

శివరాత్రి రోజు అచంచలమైన భక్తి ని అనుభవించాను అది చాలు నా జర్మ ధన్యం
శిరస్సు వంచి శంభో శంభో అని స్మరిస్తుంటే ఆ శివ నామం లో ఎదో పుంది అద్భతం
అలముకున్న అమావాస్య నిశిలో తారలన్నీ తొంగి చూస్తున్నాయి
అచంచలమైన దీక్షతో దీపారాధనలు చెసిన చెందంగా అకాశ దీపాలు  మెరుస్తున్నాయి
కమ్మని కుసుమాల సుగంధాలు పిలుస్తున్నాయి
కన్నులపంటే కలువలను కన్న కనులకు


Sunday, 3 March 2019

మానసమున మలయమారుతం వీస్తోంది
మారాంచెసే మనసుకు ఆజ్యం పొస్తోంది
చిట్టిగువ్వలా మారి చెట్టూపుట్టా చుటెయలని వుంది
చిట్టచివరి చిగురాకులను తాకి రావాలని వుంది
సుమనోహరం సుమాలసొయగం
సుస్వరాల శ్రవణానందం శకుతలల స్వరమాధుర్యం
ఉదయాన భానుని లెతకిణాల లావణ్యం
ఉదరమున మెల్లని చల్లగాలి గిలిగితల గడసరితనం
గఠం మ్రొగి మొహనరాం గళంపాడె పరవశం
గమకాలు గతితప్పి సృతిమించే రాగం


Saturday, 2 March 2019

వరమా శాపమొ జరిగెవన్నీ మంచికే అనుకున్నా
వరుసగా కుప్పకూలి పొతున్నాయి కలలన్నీ
నిలదీసి అడగాలనుంది సద్గురువుని నే చెసిన నేరమెమని
నిందలు విని నమ్మలేదుకానీ
నిప్పులేనిదే పొగరాదని ఇప్పుడే అర్థం అవుతొంది