Thursday, 28 February 2019

మానసమున మహోల్లాసం కలిగించే కొబ్బరి వనం తాటి వనం
మాగాణి మల్లెల వనం కళ్ళకు కనువిందు చెస్తున్నాయి సుమాల పరిమలాల పరవశం
వృక్షాలను ఆధారంచెసుకున్న ఉడతలు ఊగిఊగి ఉల్లాసంగా ఆడుతున్నాయి
వృదాఅయిన వ్యర్థాలు ప్రకృతి అందాలను పాడు చెస్తున్నాయి
నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతతతో ప్రకృతిలాజీవించాలి
నిమగ్నమై నిరంతరం ప్రేమ ప్రవాహంలో మునిగిపొవాలి
విశ్వమంత ప్రేమ ప్రతి ప్రాణిలో దాగుంది


సృతిమెత్తగా గాలి స్పృసిస్తుంది
సృష్ఠి అంతా గాలితొనే ప్రాణం పొసుకుంటొంది
కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపిలేని అమ్మ బొమ్మేకదా రాతిబొమ్మకదా




మనిషి ఇంకో మనిషిపై చూపించె మానవత్వం ప్రేమ ఇవి అవకాశవాదులకు అవకాశం
మనకు అవసరంవచ్చినప్పుడు  బయటపడుతుది అసలురూపం 
నమ్మకం వున్నచోటే మొసం జరుగుతుంది
నాఅన్నవాళ్ళే మొసంచెస్తే మనసు గాయపడుతుంది
తల్లినికూడా నమ్మలేని రోజులివి
తల్లడిల్లిపొతుంది దగాపడ్డ మనసు
తమ్ముడని జీవితం బాగుపడుతుందని చెసా శక్తికిమించి సాయం
తనామనా అనే బంధాలకు విలువేలేని స్వార్థం చేస్తుంది మొసం
మనుషుల వచనలకు బలై మానవత్వం బలైపొతుంది
మమతలకోసం పాకులాడే నాకు తగిన శాస్థి జరిగింది
 






Wednesday, 27 February 2019

అందరంకలిసి ఆనందించె రోజు వచ్చేసింది
అందరాని ఆ చందమామ అందినంత ఆనందంగా వుంది
మాటలన్నీ మనసులో గూడుకట్టుకున్నాయి
మాలలుగా అల్లి మమతలు మెడలో వేస్తున్నాయి
మనసు ఉప్పొంగి ఉరకలెస్తోంది
మదనపడే నా మనసు ఆనందాల వెల్లివిరిసింది
ఆగలేక ఆనందభాష్పాలు పొంగుతున్నాయి
ఆకాశం అంచులు తాకుతున్నాయి
కళ్ళు కాయలు కాచెలా ఎదురు చూసా ఈరోజు కోసం
కనువిందు చెసే నా చిట్టితల్లి ఈరోజే ఇస్తుంది దర్శనం
ఆ స్పర్శ సృతిమెత్తనిది
ఆ పలుకు తెనెకన్నా తియ్యనిది
చిన్నారి మనసులో నాపై ప్రేమ మరువలేనిది
చిట్టిపొట్టి కథలన్నీ విని చిరునవ్వు చిందిస్తుంది
పాలుకారు చెక్కిలిపై ముత్యమంత ముద్దు
పారాడు పాదాలు నడిచొస్తే మురిపాలకు లేదు హద్దు


Tuesday, 26 February 2019

పసిపాపల్లే మారామెంచేసె మగడు మహాశయా
పక్కనచేరి మక్కువ చూపే చక్కని చెలిమి చెదరనిదయ్యా
మురిపెంగా నా మనసున పూయించావు సంపెంగలు



Sunday, 24 February 2019


అన్నీ అనుకూలిస్తూ అడుగులు వెస్తుంటే అది అద్భుతం
అలవోకగా అలా అనుకున్నవి కొన్ని అనుకున్నట్టు జరుగుతుంటే ఆశ్చర్యం

Friday, 22 February 2019

అంబరం అరుణ వర్ణం సంతరించుకుంది
అందంగా భానుడు ఉదయిస్తున్నాడు


వాన జల్లులో తడిస్తే ఆనందం
వాగులు పొంగి వనమంతా వసంతం జల్లితే ఆనందం
చందనాల చందమామ వెన్నెలెంతో ఆనందం
చల్లగాలి చిలిపిగా గిలిగితలు పెడిడుతుంటే ఆనందం
ఉదయకిరణాలు మెనిని తాకితే ఆనందం
ఉప్పెనై సంద్రం అల ఒడ్డున ఎగసి పాదం తాకితే ఆనందం
మంచు బిందువులు నేలపై ముత్యమై మెరిస్తే ఆనందం
మయూరం నర్తిస్తే నయనానందం
కొయిల పాటలో తేనెలూరు స్వరం ఆనందం
కొండలూ కోనలూ మబ్బులు కమ్మేస్తే ఆనందం
కొలనులో కలువ నవ్వితే ఆనందం
కొమ్మ పై గువ్వ కువకువలాడితే ఆనందం
అంతులేని అందాలను ఆశ్వాదిస్తూవుంటే అమితానందం






Thursday, 21 February 2019


చందమామతో చెలిమి

          చందమామతో చెలిమి
జాబిల్లి కొండ ఎక్కి కూర్చుంది
జాజిపువ్వు నవ్వులు ఆరబొస్తోంది
వెన్నెలమ్మతో మంతనాలు ఆడి
వెన్నదొంగల్లే నా మనసు దొచేస్తుంది
కన్నుల్లో దోబూచాడే నిన్ను కౌగిట్లో బంధించాలి
కరిగిపొతావో పారిపొతావో చూడాలి
రాతిరైతే చాలు వెన్నెల చిచ్చు రేపుతావు
రాగాలు ఆలపిస్తే రాలేవు నీవు
పలకరిస్తె చాలు పులకించి పండువెన్నెలు పంచుతావు
పండగంటి వెన్నెలంతా పానుపెసి కవ్విస్తావు
నెలరేడా నెలకు దిగిరావా
నెమలినై నాట్యం చెస్తా చూస్తావా
నువ్వు కవ్విస్తే వెన్నెలైపొతా
నులివెచ్చగా నీలో కలిసిపొతా
నన్ను నేనే మరచిపొతా
నవ్వునై నీ పెదవిపై మెరిసిపొతా
ముగ్దమనోహరం నీ మొము
ముందరికాళ్ళకు వెస్తావు బంధము
తారనైపోతా నీ చెరువైవుంటా
తాపసినై నీ చెలిమి నే పండించుకుంటా






సమయాన్ని వృధా చేయడంలో నాకు నేనే సాటి
సందర్భానుసారంగా వ్యవహరించకపొతే సాధించెదెమిటి
సామరస్యంతోనే సాదించాలనుకన్నా తగిన సాధన లేదు
సాధ్యమైనంత వరకు ప్రయత్నంకుడా లేదు
సంకల్పం అయితే వుంది అదే నడిపిస్తుంది
సవ్యంగా సాగుచెస్తే మొక్క ఎదిగి ఫలాన్ని ఇస్తుంది
సరియైన సమయం రావాలి అప్పుడే ఫలిస్తుంది
సమస్య కు ప్రశ్నానాదే జవాబూనాదే మనసు మధిస్తోంది
సమయస్ఫూర్తి తో వ్యవహరించాలి అందుకే ఈ ఆలస్యం
సమకూర్చాలి అన్నీ సవ్య సాధన కోసం
సంకల్పసిద్ధితో మొదలైంది ప్రయత్నం

Wednesday, 20 February 2019

 

వెన్నెల్లో గుసగుసలు
కన్నుల్లో మిసమిసలు
తలుకుమనే తారలే తెల్లబోయి చూసేను
కలువలు కొలనులో కన్ను గీటి పిలిచేను
మరులుగొలిపే మామవే మా మనసు దొచి పోయేవు
విరుల సిరుల నీ వెన్నెలలో మైమరచిపోయేము
మాఘమాస వేళ మంచుతేరలు వీడి వెచ్చనైన కౌగిళ్ళు ముచ్చటించుకున్నాయి
మయూరాలు పురివిప్పి  నవ నాట్యమెదో చెసాయి
నందన వనములో మురళీ పాట మొగింది
చందన చలువతో చందమామ మెరిసింది
మా మాటలన్ని మూట కట్టి పాటలే పాడేము
మా మామవంటి చందమామ తో జతకట్టి ఆడేము
మల్లెవంటి చంద్రుడా మత్తుమందు చల్లరా
చల్లనైన వేళలో నీ వెన్నెలంత మాదిరా


Tuesday, 19 February 2019


వెన్నెల్లో కూర్చుంటే వెన్ను జల్లు మంటుంది
వెన్నలా కరిగే మనసు నా వెన్నంటి నడిచింది
మేడపై వెన్నెలమ్మ ఉల్లి పొరల చీర పరిచింది
మేటికీ  నీతీయని సాగత్యం ననుఅల్లుకునే వుంది
విడదీయనిదేలే మన బంధం
విలువలతో నీ ప్రేమ తెలిసే అది ఎంతో ఉన్నతం
నీవు ఎంతో మారావు నాకోసం
నీమనసున నాకున్న స్థానం ఆ హిమవత్ పర్వతం
చద్రుని కాంతిలా నీ చెలిమి చల్లదనం
చందన పరిమళమే నీ కౌగిలివెచ్చదనం
నీతో కలిసుంటే కలహమైనా కమనీయం
నీ తోడే నాకు నవ జీవనం
పున్నమిలో పులకింతల జ్ఞాపకం
పుస్తకంమే రాయాలి పూసల పుస్తుల కావ్యం
                                                    శ్రీ వారికి వెన్నెల లేఖ

ఈ చిన్ని పావురాన్ని పిల్లి చంపేసింది
ఈ చిన్ని ప్రాణాన్ని కాపాడలేకపొయాను చాలా బాధగా ఉంది
నా ఇంట్లో ఎన్నో పావురాలు పురుడు పొసుకున్నాయి 
నా చెత్తో గూడును తయ్యరు చెసా అలా గూడు పెట్టగానే వచ్చి చెరిపొయేవి 
వాటి అల్లరి భరించాను 
వాడి ముక్కుతో పొడిచెవి నవ్వు కున్నాను
నాకళ్ళముందే చనిపోతుంటే చూడలేకపోతున్నాను 
నా వల్లే చనిపోయింది పావురం ఇక ఈ బాధ భరించలేను
పాపం పావురం పిల్లికి బలైయిపోయింది
ప్రాణాన్ని బలికొని ఇంకో ప్రాణి బ్రతకడమేంటో చూడడానికి చాలా బాధాకరంగా వుంది
అన్ని ప్రాణులకూ బ్రతికే హక్కు వుంది
అన్యాయంగా ఇంకోప్రాణిని చంపేస్తుంటే
మనసు వికలమైపొతోంది
ఈ ధోరణి మారాలి



సుతిమెత్తగా నీవు.ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సుతిమెత్తగా నువ్వు.తల్పాలు వేస్తావు
సువాసనలతోటి.తానమాడిస్తావు
ఉల్లాసకేళికి.ఆ ఆ ఆ ఆ ఆ
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు.
ఉసిగొలిపి ఉసిగొలిపి.కళ్ళుమూస్తావు
ఉసిగొలిపి ఉసిగొలిపి.కళ్ళుమూస్తావు



ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా.
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా.
పూబోణి కానుకవె సిరిమల్లికా

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా.
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా.
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

జవరాలి జడలోనా.ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జవరాలి జడలోన.జలతారు తారవై
కాముకుల మెడలోన.కర్పూర హారమై
దేహాన్ని.ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దేహాన్ని పులకించి.మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ.
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ...

జవరాలి జడలోన.జలతారు తారవై
కాముకుల మెడలోన.కర్పూర హారమై
దేహాన్ని పులకించి.మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ.

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా.
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా.
పూబోణి కానుకవె సిరిమల్లికా

సుతిమెత్తగా నీవు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి.తానమాడిస్తావు
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు.
ఉసిగొల్పి ఉసిగొల్పి.కళ్ళుమూస్తావు

సుతిమెత్తగా నీవు.ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సుతిమెత్తగా నువ్వు.తల్పాలు వేస్తావు
సువాసనలతోటి.తానమాడిస్తావు
ఉల్లాసకేళికి.ఆ ఆ ఆ ఆ ఆ
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు.
ఉసిగొలిపి ఉసిగొలిపి.కళ్ళుమూస్తావు
ఉసిగొలిపి ఉసిగొలిపి.కళ్ళుమూస్తావు

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా.
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా.
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా


మల్లెల కాలం మొదలయింది
మంత్రాలతో మాఘమాసం పందిరివెస్తోంది
మరు మల్లియ మొగ్గతొడిగింది
మత్తుమత్తుగా సుమగంధం ముంచేస్తోంది

Monday, 18 February 2019

అడవి అందం ఆకు అంచునజారే మంచు ముత్యం


ముగిసే కథకు మెరుగు లెందుకు
మురిసే మెరిసే భావన లేదు మనసుకు
కాలం పరిగెడుతుంది
కావ్యాలకు కాలం చెల్లిపొయింది
కర్తవ్యం గమనం వైపు నడిపిస్తోంది
కనుచూపుమెరకు గమ్యం కనబడకుంది
కారు చీకట్లో ప్రయాణం
కాలవేగాన్ని అందుకోలేక అవుతున్నా సతమతం



Beautiful song


మనిషికి మనిషికి మధ్య ఇంతతేడా ఎందుకు ఒకేలా ఉంటే సృష్ఠికి ఏంటి నష్టం?
మనుగడకి ముడేసి మమేకమై జీవించడానికి మనిషికి ఎందుకు అంత కష్టం?
ఉహలకూ జీవితానికీ తేడా ఎంతో వుంది అవి కలపకు
ఉపిరాగిపొయెలోపు ఎడతెగని ఆశలెందుకు
ఏదీ శాస్వితం కాదు
ఏవరికి వారే మహదానందులు
అన్నీ నావని పొరాడి అలసి ముగిసిపొతుంది జీవితం
అవేవీ వెంటరావని తెలిసినా మనిషిని వీడదే స్వార్థం
ఏ అవసరాలు లేకుండా జీవించడం కష్టం
ఏ జీవి అయినా ఆకలి కోసంచేస్థుంది పోరాటం


మనిషికి మనిషికి మధ్య ఇంతతేడా ఎందుకు ఒకేలా ఉంటే సృష్ఠికి ఏంటి నష్టం?
మనుగడకి ముడేసి మమేకమై జీవించడానికి మనిషికి ఎందుకు అంత కష్టం?
ఉహలకూ జీవితానికీ తేడా ఎంతో వుంది అవి కలపకు
ఉపిరాగిపొయెలోపు ఎడతెగని ఆశలెందుకు


Sunday, 17 February 2019

జీవితం ఎంతచూసినా ఏముంది మేడిపండు చందం
జీవించే ప్రతి మనిషి ప్రకృతికి దగ్గరగా వుంటే ఆనందం


Friday, 15 February 2019


గడచిన జీవితానుభవం ముందు అన్నీ అపురూపాలే కాదనే సాహసంలేదు
గలగలా పారే ఏటికి ఎన్ని ఆటుపోట్లు అలుమగలుఅర్థం చేసుకునే ముందు అసంతృప్తి తప్పదు

Thursday, 14 February 2019

కలిసి కలబొసుకున్న ప్రేమలో ఆ అనుభవం అద్భుతం
కలహాలు కాఠిన్యాలూ ప్రేమ ముందు కాలిపోయి మిగిలే                                                                       భస్మమం
                   Happy Valentine's day