Wednesday, 30 January 2019

పెళ్లికి ముందు ఒకరిపై ఒకరికి వున్నప్రేమ అది వ్యక్తపరిచే విధానం జీవితకాలం కలిసుండేలా చేస్తుంది. ఉదయం లేవగానే ముసిముసి నవ్వులు మొదలై ఎప్పుడెప్పుడు కలవాలి ఎన్నోకబుర్లు చెప్పుకొవాలి నాకు తనపై ప్రేమ ఎంతవుందో ప్రకటించుకొవాలి అనే తపన అది అద్భుతం
 

మనసు మైమరచి విహంగమై విహరిసోంది
మననం చేసుకున్న మధురస్మృతులతో జలకాలాడుతోంది

Tuesday, 22 January 2019


కథ చెప్పి చిన్నారి మనసు దోచిన వైనం
కంటి మెరుపుతో చంటి మనసు వేచి చూసే కథ కోసం
నాచిన్నారి కి పిట్టకథలు చెప్పే అదృష్టం నాదైయింది
నాటికీ నేటికీ కథలు చెప్పి ఆకట్టుకునే వంతు నదైంయిది
చిట్టితల్లి తల ఊపుతూ వింటుది
చిలికి చిలిపి ఆనందం మదిలో చిందేస్తోంది


Sunday, 20 January 2019

సాధనకే అంకితం ఈ జీవనం
సాధించాలి శివానుగ్రహం
సాగే ధీక్ష శివరాత్రి కొసం
సాక్షాత్కరించి ఇస్తాడు వరం
సారాంశం అంతా క్రూడీకరిస్తే కలిగేదే జర్మరాహిత్యం

Saturday, 19 January 2019

భరించలేకపొతున్నా ఈ చలిని
భరోసాగా చలిమంట ఇస్తుంది ఉపశమనాన్ని
వణికిస్తున్న చలికి చరమగీతం మర్చితరువాతేనేమొ


Thursday, 17 January 2019

ఉహాగానాల్లో గగనాన్ని తాకుతోంది
ఊరించే భవిష్యత్తు విహాంగలా విహరిస్తోంది

Wednesday, 16 January 2019


గంభీరంగా మారింది జీవనం
గమ్యయం గొచరించడంలేదు
గడచిపొతొంది వేగంగాకాలం
గందరగోళం వీడినా ధర్యంచాలడంలేదు

Monday, 14 January 2019


సంక్రాంతి సంబరాల సాప్రదాయం
సంతోషంగా మానవాళిలో మమతలు నింపే సదాచారం
సాదనలతో ఉన్నతికి చేరే భక్తి మార్గం
సామాజిక ఐక్యతకు దోహదం చేసే ఆనందాల పరవశం

Saturday, 12 January 2019

భోగి పండుగ వెచ్చని చలిమంటల జ్ఞాపకాలను ముచ్చటిస్తుంది
సంక్రాంతి సంబరాలు గాలిపటాల రెపరెపలు మనసున మరువలేని మదురకావ్యం మెదులుతుంది
కనుమ కైనా కరుగలేదు కదలనీయక కట్టి పడెసాను కాదనలేక కాలం కట్టుబడింది

Sunday, 6 January 2019

మారింది మనిషి జీవనవిధానం
మానవత్వం మనసులో మాయం