Wednesday, 31 October 2018

అనుమానాలు అబద్రతాభావాలు ఎప్పుడైతే వదిలెస్తామొ అప్పుడే ఆనందంగా ఉండగలం
ఆలుమగలమధ్య దాపరికాలు లేకుండా వుంటే ఆ సంసారం ఆనందమయమె
పెళ్లి అయిన తొలి రొజులో ప్రణయ రాగమె సంసారం
ప్రేమ సరాగాలు పాడుకుంటూ మేడమీద వెన్నేలరాత్రుల వసంతం


Tuesday, 30 October 2018

మంచు కురిసే వేళ ఉదయ రాగాలాపన
మనసు మురిసే వేళ మధుర స్పందన
తొలిప్రేమ లో నిండి ఉన్న అమాయకత్వం
తొలకరి వాన జల్లులా తుమ్మెద ఝంకారంలా 
శ్వఛమైన మనసుల సరాగం.

సీతమ్మ అంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని

రామ నామం ఎంతోమధురం అంటే నమ్మలేదు నా రాముడి నామమం అంతకన్నా మధురమే



Monday, 29 October 2018

మొబైల్ మొసం బాధాకరం
మొదటి సారి కూడా కాదు పాపం


Sunday, 28 October 2018

పొద్దుపొడుపులొ ముద్దమందార వెలుగులు
పొదరింట గువ్వల కువకువలు

Saturday, 27 October 2018

రవివర్మ చిత్రం లా ఎంతో కొమలంగా ఈపాట మనసుని తాకుతుంది

చల్లని గాలి నులివెచ్చని ఎండ ఇలా చాలా బాగుంది
చలి మొదలౌతొంది గాలి వెగంపెరుగుతొంది

Friday, 26 October 2018


ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎన్ని రంగుల డ్రెస్ లొ ఈ కలర్ డ్రెస్ లు ఎవరూ వెసుకునుండరు 😂😃😄
రెడ్, వైట్, ఆరంజ్ బ్లూ గ్రీన్ అన్ని కలర్స్ వాడెసాడు హీరో




ధర్మాన్ని కొంతవరకైనా పాటిస్తే మానవజన్మ సార్థకం

Thursday, 25 October 2018

ఆడవాళ్లు తమ హక్కులు సాధించు కొవాలనే స్పృహ లేకుండా చెసారు. ఎంతచదువుకున్నా తల్లి తండ్రులు చూపించిన వాన్నే పెళ్లి చెసుకొవాలి. అమ్మాయి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు లేదు. ఒక స్త్రీ తనతో జీవితకాలం కలిసి జీవించే వ్యక్తిని ఎన్నుకునే హక్కు లేదు ఒక అమ్మాయి తల్లి కూడా స్త్రీ యె ఆమే వ వైవాహిక జీవితం లో ఎన్నో కష్టాలు పడ్డా  కూడా ఒక అమ్మాయి కి భర్త ని ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వదు. తల్లి బానిస జీవితానికి అలవాటు పడి కూతురినికూడా అదే ఉబిలొకి లాగుతుంది 

Wednesday, 24 October 2018


ఆనందంతో జీవిస్తె అన్ని అలా నీముందు అవుతాయి ప్రత్యక్షం

అవసరం అయివి అందుబాటులొకి రావాలంటే ఆనందమే మంత్రం
అనుభవ సత్యం


Tuesday, 23 October 2018

జీవా అంటే చాలా ఇష్టం. జీవా అంటె ఎందుకు ఇష్టమొ ఇంతవరకూ జవాబు లేని ప్రశ్న
కానీ ఈ హీరోయిన్ అసలు నచ్చదు
ఉదయకిరణాలు తాకనైనా లేదు
ఉద్యావనం లాంటి నా చిన్ని మొక్కలు పూలు పూస్తున్నాయి


Monday, 22 October 2018


మంచి మనుషులతో కొరా మంచి స్నెహం
మధరమైన నిస్వార్థంమైన స్నేహాలు లభించాయి నా అదృష్టం
అమ్మలాంటి ప్రేమ
అక్కున చేర్చుకునే బాధ్యత
భక్తి భావంతో ఒక్కటైన చొట అది అందరి ప్రేమ సంగమం
భయం లేని బద్రత నమ్మకం

Sunday, 21 October 2018

 
విసుగు లేక ఎప్పుడూ వినాలని పించే విరహగీతం

పదహారు ప్రాయంలో ఉరకలెసే ఉశ్చహం
పరవళ్లు తొక్కే ప్రాయంలో ప్రపంచాన్నే మర్చేయాలి అనుకొవడం
అదొ తియ్యని ఉహాలోకం
అనుభవంలేని ఆవేశం
అన్నీ ఆనుభవంలోకి వచ్చాక వయసు మళ్ళి ఏం సాధించలేరు

Saturday, 20 October 2018

  

ప్రేమలేఖ గుర్తొస్తె చుట్టూ వాతావర్ణం తియ్యగా మారిపొతుంది
ప్రేమలొని బలం ఎంటొ మధురానుభూతిని కలిగిస్తుంది


కొమలమైన సున్నిత్వం
రౌద్రం దుష్ట సంహారం
శాంతి శౌలభ్యం
తొమ్మిది రోజుల దీక్షలో మానవ జన్మ ధన్యం

Friday, 19 October 2018

Tuesday, 16 October 2018

నాకు ఒక చిన్ని కొరిక ఉండెది TV చుస్తున్నంతసేపూ ఎలా ప్రొగ్రాం నంతటినీ షూట్ చెస్తారు చూడాలి అని అంతే ఈ చిన్ని కొరిక సఫలం చెసుకొడానికి fb లో ఒక ఫ్రెండ్ దొరికాక షూటింగ్, స్టూడియో చూడాలని తొందరెక్కువై మెసేజ్ చెయడం అంతకన్నా ముందు ఒక న్యూస్ నన్ను కలవరపెట్టింది మీ మొబైల్ నుండీ అన్ని మెసెజ్ లు ఇతరులు చూడవచ్చు మీరు ఎక్కడ వున్నా వాళ్ళకు తెలిసిపొతుంది ఇంకాఇలా చత్త అంతా తెలిసాక ఆ న్యూస్ పెట్టిన అతనికి కాల్ చెయడం అతనికి పెళ్ళైన విషయం తెలీదు. నా టెన్షన్ ఎక్కువై కాల్ చెసా చిరాకు పడుతూ రిప్లయ్ ఇచ్చాడు చాలాకొపంవచ్చింది వీడేనా మాట్టాడెది అని మళ్ళీ కాల్ చెసా వాడి బార్య అర్థం లెకుండా వాగెసింది మల్లి కాల్ చెస్తె పొలీసులకు కంప్లైంట్
చెస్తా అంది మ్యటర్ ఏమీలేదు ఇదెంటిలా మాట్లాడు తుంది అని చాలాకొపమొచ్చింది నవ్వుకూడా వచ్చింది నేనేవరో తెలీదు ఆ అమ్మాయికి నేను డి యస్ పి కూతుర్ని ఈమాటే చెప్పాలి అనుకున్నా గొప్పలకు పొవడం నాకు ఇష్టం వుండదు.  న్యూస్ అనెది వివరంగా చెప్పాలి కానీ సమస్య ఒక్కటేచెప్పె సరికి నాకు కంగారు వచ్చెసింది అది వెరే వాళ్ళను అడిగితే వివరంగా చెప్పారు అంతటితో ఆగానా బ్లాగులో చావు తొక్కాతొలు అంటూ రాసిన రాతలు చూసి నాలొ మానవత్వం చలించి 100000rs మావారు వద్దన్నా పిలిచిమరీ ఇచ్చినందుకు బాగానే బద్ది వచ్చే లా చెసాడు బ్లాగు చదవడం తప్ప మనిషిని ఎప్పుడూ చూసి ఎరుగను డబ్బు ఇచ్చిన తరువాత అసలు స్వరూపం బయట పడింది ఫెక్ అడ్రస్ ఇచ్చాడు అంటే అడ్రస్ తెలీకపొతే నా డబ్బు ఎగరెయాలనే ఆలొచనవున్నట్టే కదా నా మొబైల్ నంబర్ బ్లాక్ చెసాడు fb id బ్లాక్ చెసాడు నా భార్య వార్నింగ్ ఇచ్చింది అంటూ బ్లాక్ మెయిల్ చెసాడు  50000rs ఇచ్చాడు ఇక 50000rs కి చుక్కలు చూపించాడు ఒక మహనుభావుడు నా సమస్య కు పరిష్కాం చూపించి నాకు చాలా సహయం చెసాడు అతనికి నా కృతజ్ఞతలు 🙏 ఈసాయం ఎప్పటికీ మరువలేను. నా డబ్బు నాకు వచ్చింది నాకు బుద్ధి లెదు ఎవరినీ అనే పనిలేదు ఈ చిన్న కొరిక ఇంత కథ నడిపింది దీనినుండీ చాలా నేర్చుకున్నాను. ఎప్పుడైనా గుర్తొస్తె చాలా బాధెస్తుంది మనుషులు ఇలా కూడా వుంటారా అని.  ఇప్పుడు నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నా నా జీవితం లో ఇంకెప్పుడూ ఇలాంటి వాళ్ళను గుర్తు చెసుకుని టైం వెస్టు చెసుకోను నా టైం చాలా విలువైనది.

నేను పూనే  వెళ్లినప్పుడు FTI collegeలో చాలా దగ్గరగా చూసా షూటింగ్ ఎలా తీస్తారు సీరియల్ కి సెట్ ఎలా వెస్తారు  వీడియొ ఎడిటింగ్ ఎలాచెస్తారు ఒల్డు టైప్ లోఎలాఉండెది ఒక పెద్ద హాలులో బయటనుండి ఎలాంటి వెలుతురూ జొరబడకుండా పదిమందికి పైగా నె మనుషులు అక్కడ వర్క్ చెస్తారు వీడియో రీలు ఎలా కట్ చెస్తారు ఆ మిషనరీ అంతా చూసా అదో ప్రపంచం 70mm ఇంకా చిన్నవి 3 4 రకాల రీలు చూపించారు old హిందీ సినిమాలు చూసాను అమితాబచన్ వి ఇలా 3 రోజులు చూసా ఒక సాంగ్ షూటింగ్ చూసా సీరియల్ షూటింగ్ చూసా అక్కడ ఆ సెట్ అంతా చూసి చాలా నవ్వు కున్నా చుట్టూ లైట్స వెసి చాలామంది వర్క్ చెస్తారు మా అబ్బాయి దగ్గరుండి మరీ అన్నీ వివరంగా చూపించాడు నేను చాలా happy 

లక్ష్మీ దేవి అలంకారం అపురూపమైన ఆ తల్లికి పూజలు మంగళ హారతులు
లయమైపొవాలి అమ్మ వారిలో అందులో ఆనందం అనిర్వచనీయం 

Monday, 15 October 2018


పండు

హౌస్ అరెస్టు 😁😂😃

గాలిపటాలు గనంలో ఎగురుతూ కనిపిస్తె నాలో నేను నవ్వు కుంటా 😁😍😃
గానకచేరీ తో అందరూ కలిసి ఆనందంగా గాలిపటాలు ఎగరెస్తుంటే నామాట కొసం పడ్డావు తంటా
అప్పుడు అలా నిన్ను ఇబ్బందిలో పడేసాను
ఇప్పుడు అది తలచుకుని నవ్వు కుంటున్నాను 😘😍😂
పండుగ రోజు బంధీవైపొయావు

Sunday, 14 October 2018

అన్నీ విస్మరించి సూన్యం అయిపొతే 
అనిర్వచనీయమైన ఆనందం పొందే వంతు నాదైతే
అమ్మవారి సమక్షంలో అలా తెలిపొతా

అన్నపూర్ణాదేవి 

Saturday, 13 October 2018

మనలోని మార్పులు మనకేతెలీనంతగా జీవిస్తున్నాం
మనలోకి మనం చూసుకొగలిగితే అదిఒక అద్భుతం
మానవ శక్తి తెలుసుకొలెక వృధా కాలయాన చెస్తున్నాం
మాటలెందుకు మూసిన కళ్ళతో ప్రపంచాన్నే మర్చగల శక్తి మనిషి సొంతం
భక్తిలో పారవశ్యం ప్రపంచంతో పనిలెదనిపిస్తుంది
భగవంతుడే అన్నీ అని ఐక్యం అయితే ఆ ఆనందమే చాలనిపిస్తుంది
కన్నకలలు గొప్పవని భావించినవి తుచ్చమైనవిగా కనిపిస్తాయి
కనీవినీ ఎరుగని ఈభావాలు అనుభవంలొకి వస్తెనే అర్థం అవుతాయి


లలితా దేవి

శ్రీ లలితా దేవి అలంకరణ
అమ్మవారు రోజూ ఒక్కో అలంకరలో అందంగా అలా దర్శనమిస్తే జర్మ ధన్యం

Friday, 12 October 2018

దేవి
దేవి
గాయత్రీ మంత్రమును జపించేభక్తుడనే కొరుకన్నవరములను ఇవ్వకున్న వదలనులే
 

గాయత్రీ మంత్రం అద్భుతమైన మంత్రం
గాయత్రీ దేవి మంత్రం 24 అక్షరాలసమూహం

Thursday, 11 October 2018

ఈరోజు బాలాత్రిపురసుందరిరీ అలంకరణ అద్భుతం
ఈపండుగ రోజు చిన్నిపిల్లలకు అందంగా అలంకరించడం,
ఇల్లు అంతా కోలాహలం

Wednesday, 10 October 2018

నవరాత్రులో ఇది రెండవరొజు


ఇప్పటి వరకు ఒక జీవితం
ఇకముందు కొత్త జీవితం
అన్నీ మార్పులే ఈ మార్పు మంచికొ చెడుకొ ముందు ముందు తెలుస్తుంది

Tuesday, 9 October 2018


ఈజర్మకు మానవ జీవితం చాలు ఇక ఏ జర్మా అవసరంలేదు
ఈలా అన్ని కర్మలూ పొయి జర్మరాహిత్యన్ని పొందాలి పాపమూవద్దు పున్యమూవద్దు

Monday, 8 October 2018


ఒంటరితనం శాపమొ అని ఎందుకు అంటారో అర్థం కదు
ఒక్కదాన్నే ఉండాలంటే నాకు మహా ఇష్ఠం ఎవ్వరిగొలా వుండదు

Sunday, 7 October 2018

ఈరోజు ఎందుకు ఇంత త్వరగా గడిచిపొయింది
ఈ టైమ్ కి సంసారం లేదు ఏం పనిపాటా లేేేనిిదిిిది

Saturday, 6 October 2018


ఆలోచనలు పవాహంలా అలా పరుగులు తీస్తునే ఉన్నాయి
ఆనకట్ట వెయలేక ఆలోచనల వెంట పరుగులు తీస్తుంటే వివేకం ప్రశ్నిస్తోంది
శవాన్ని మొసుకుని వెళుతున్నావా అని గడచినవన్నీ తిరిగి రానివే
శాంతిని కొల్పొడానికి తప్ప మరేప్రయొజనం లెనివే
మనసు ఒక చెత్త పర్వతమే
మరుగున పడిన ఆలోచనలు తవ్వుతుంటే
కుళ్ళిన కళేబరం నుండీ దుర్వాసన వెదజల్లుతొంది


Friday, 5 October 2018

నా తీపి జ్ఞాపకం ఈపాట

మనిషికి  వేరెవరో కాదు శత్రువు
మంచి అలవాట్లు లేదని ప్రతి మనిషి తనకు తానే శత్రువు

Thursday, 4 October 2018


ఇష్టమైన పనులు చెస్తుంటే ఆ కిక్కే వెరబ్బా
ఇలా చిటికెలొ పనులన్నీ ముగిసిపొతుంటే యమ కిక్కేనబ్బా

Wednesday, 3 October 2018


బంధాలు బాధ్యతలు
ఇద్దరు కలిసి జీవించాలి అంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉండాలి. ప్రేమలేని బార్య భర్తల బంధం షొకేష్ లో బొమ్మ లాగా అలంకరణప్రాయంగా వుంటుంది సమాజం కొసం సమాజం లో వాళ్ళ మెప్పు కొసం బ్రతికే మనుషులే ఎక్కువ స్వతంత్ర భావాలు లేని మనుషులు వ్యక్తిత్వం లేని మనుషులే ఎక్కువమంది వున్నారు అందరూ ఎలా ఉన్నారొ వాళ్ళ లాగా వీళ్ళలాగా బ్రతకాలి అనుకుంటారే గానీ  ఎవరికి వారు వాళ్ళకు నచ్చెలా బ్రతకడం తెలీదు ఒక అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తి ని జీవిత భాగస్వామి గా ఎన్నుకునే స్వతంత్రం లేని సమాజంలో వున్నాం తల్లి తండ్రి పిల్లలు తమ ఆస్తులు గానొ వస్తువులుగానొ చూస్తున్నారు పిల్లలు తల్లి తండ్రులకు బానిసగా జీవితకాలం బ్రతకాలి కన్న పాపానికి తల్లి తండ్రుల చెతిలో కీలుబొమ్మలాగా నిరంకుశమైన ఈ తల్లి తండ్రుల నుండీ స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుందో పిల్లలకు పక్షి కూడా పిల్లల్ని పెంచుతుంది ఎగిరే శక్తి రాగానే స్వేచ్ఛ గా ఎగిరి స్వతంత్రంగా జంటను ఎన్నుకునే స్వేచ్ఛ వుంది వాటికి మనిషి మిగిలిన జీరాశులకన్నా గొప్పవాడు అలొచించె శక్తి కలవాడు అయినా మతం కులం వీటితొ పిచ్చివాడై మర్ఖంగా పిల్లల ఆనందాన్ని చిదిమెస్తున్నారు ఎంత నిరంకుశత్వం మనిషిని మనిషి చంపె అనాగరికం
     
     పిల్లల్ని తల్లి తండ్రులు బాధ్యత గా పెంచాలి సమాజం పట్ల అవగాహన కలిగించాలి స్వేచ్ఛ నివ్వాలి చెడ్డవారి పట్ల జాగర్తలు నేర్పాలి ధర్యన్నిఇవ్వాలి  

అమృత జీవితం తలచు కుంటేనే బాధ కలుగుతుంది
చిన్నవయసులోనే వైధవ్యం ప్రేమ లేని తల్లి తండ్రులకు పిల్లలు ఎందుకు, పిల్లలు మమ్మల్ని కనండి అని అడిగారా
ఇలాంటి కర్కొటకులకు భగవంతుడు పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి

Tuesday, 2 October 2018

 సంపంగి పువ్వుల నువ్వే నా 
జాబిలి నవ్వుల నువ్వే నా



Monday, 1 October 2018

స్వప్నాల సరోవరం మనస్సున స్పృశించె
స్వరాలు సుమాలుగ పూచి వరించి తరించె



ఆకశాన్ని భూమిని కలిపేస్తూ మంచు కమ్మిసింది
ఆకులు చాటున ఏడ దాగుందో కోయిల మూగబొయింది
మావిచిగుతొడిగాకే  మళ్ళీ ఆ మధుర స్వరం
మాఘమాసం వచ్చాకే వినిపిస్తోంది తీయ్యని స్రావ్యం