Sunday, 30 September 2018


చల్లని సాయం సదెవేళ
చిట్టి గువ్వలన్నీ గూడుచెరేవేళ
సుమాలన్నీ సుమధుర పరిమళాలు వెదజల్లె వేళ
సూర్యుడు అరున వర్ణం లో అలరిస్తూ సూర్యాస్తమయం సుందరం సుమధురం

Saturday, 29 September 2018


తూరుపు తొలివెలుగుల తలుపు తీసి భానుని స్వాగతిస్తోంది
తుషార శీతల మేఘాలను తొలగిస్తూ భానుని కిరణాలు భూదేవిని తాకి పులకిస్తొంది

Friday, 28 September 2018


త్వరితగతిన అన్నీ పనులు నిర్వహించాలని ఆశించడం
తత్వం అర్థమవ్వక తికమక సమయం గడిచాక చింతిచడం
నిన్నటిదాకా నిదుర రాని నాకు నిదురలోనే రోజు గడిచిపొతొంది
నిదరుంటే చాలు ఆకలికూడా తెలీడంలేదు అంతా  మైకంలావుంది

Wednesday, 26 September 2018


హంస లా జీవిచలంటే ఇష్టం కానీ చెపలు తినడం కష్టం
హాయిగా ఆకాశలో విహరం  నడకలో వయ్యరం
హుందాగా నీటిపై తెప్పలా తేలుతూ శ్వేత వర్ణంలొ మెరిసిపొవడం అద్భుతం
హుషారుగా తుషార శీతలంలో విహగ విన్యాసాలు చెస్తుంటే కన్నులకది మనోహరం

Tuesday, 25 September 2018


సంపగి వర్ణంలో చందమామ ఉదయిస్తూ చందనాలు చల్లే
సరసన ప్రియుడేడని సరసాలాడే జాబిల్లి

Monday, 24 September 2018

Sooo cute song
I love this song

షరతులు లేని ప్రేమన్నది
షడ్రుచుల ఉగాది పచ్చడి లాంటిది

Sunday, 23 September 2018

Saturday, 22 September 2018

సంపంగి భావాలోయి

వనం లో ప్రతి సుమం
వరించే వర్ణచిత్రం
వానజల్లుకు వలపు సరాగం
వాగులు వంకలు గలగల గానం
వున్నది వున్నట్లుగాక ఊహలకు రెక్కలు తొడిగి గగన విహారం
వున్నట్టుండి ఎగసిపడే కెరటంలా మనసును తాకే ఆనందం


Friday, 21 September 2018


లక్ష్యం పెట్టుకుని సాదించెది ఏదీ లేదని అర్థం అయింది
లగ్నం చూసుకొడం సంఖ్యాబలంచూసుకొడం చెసెదాన్ని ఇప్పుడు అనుకుంటే నవ్వు వస్తుంది

Thursday, 20 September 2018

 

రమనీయ కావ్యం మనిషి ఆనందంగా జీవించడం
రగిలిపొయె మనుషులకు అర్థం కాని వెదాంతం
రాగాలుపలికే కొయిల మంచు ముసిరి మూగబొతుంది
రామూ లేక నామనసు మూగబొయి వేచిచూస్తొంది

Wednesday, 19 September 2018

యమునా నది గొప్పతనం ఒడ్డున బృందావనం వున్నందుకే
యదుకులోత్తముడు యద ఎరిగిన రాధతో రాసలీలలు ఆడినందుకే
యమునాతటిలో నల్లనయ్యకై ఎన్నో  సంవత్సరాలుగా ఎదురుచూసింది రాధ 
నా రామూ కొసం ఒక వారం నుండీ ఎందుచూస్తున్నా సహనం కొల్పొతున్నా
రాధ చాలా గొప్పది అందుకే రాధాక్రిష్ణులు అన్నారు కృష్ణుని కన్నా రాధకే ప్రాధాన్యత ఇచ్చారు
 



Tuesday, 18 September 2018

మనసు మలయమారుతం
మది నిండా ఉహల సుగధం
మాటలకు ఆందని భావం
మాలికలన్నీ సుగంధ పరిమళం
మిక్కిలి ఆనందం దానికి ఉండదు కారణం


Monday, 17 September 2018

చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి


భర్త ఒక భద్రత నమ్మకం అందరినీ వదిలి మన అనుకుని బ్రతికే గొప్ప భావం
భారీ అంచనాలే వుంటాయి మొదట్లో కానీ అంకిత భావం కన్నా ఎక్కువగా కనిపించెది అవసరం
భవిష్యత్తులో మార్పు సంభవించకపొతుందా ఆశించడం
భగ్నం అయి  బాధపడడం
భావవ్యక్తీకరణ చెసుకుని చులకన అవడం
భవిష్యత్తు పై ఆశలు పెంచుకొవడం
భంగపడి జీవితం అర్థం కాక అనిపించెది అగమ్యగోచరం
భగవంతుని పై భారం వెసి బ్రతికేయడం
భక్తి నా జీవితానికి ఇచ్చింది గొప్ప పరిష్కారం
భళా అనిపించెలా నమ్మలేని నిజాలు జరగడం
భలే మార్పులు తీసుకువచ్చింది ఈ భక్తి భావం
భద్రతనిచ్చింది భవిష్యత్తు పై కలిగించింది నమ్మకం
భస్మమైపొయాయి బాధలన్నీ ఇప్పుడు ప్రశాంతమైన జీవనం నా సొంతం

Sunday, 16 September 2018


బద్రపరిచా అల్లుకుపొయిన జ్ఞాపకాలు
బదిలీ అయి నా సొంత బాణీ ఒకటి అవ్వలి అమలు

Saturday, 15 September 2018

ఫలించె కలలు నేడే ఇది నేడు
ఫలితం నే ఆశించలేదే ఇది గతం
బాధ్యత నే మొసా భారం అనే భావనే రాలేదు
బాంధవ్యాలు నిలుపుకున్నా ఆనందమొ బాధో తెలీలేదు
జరిగిన వాటికి పిల్లల కు సంజాయిషీలు చెప్పుకొవాలి
జఠిల సమశ్యలకు పరిష్కారం కనబడలేదు కాలమే పరిష్కరించాలి


Friday, 14 September 2018

పండుగ పర్వదినాలు ఎలా గడపాలో తల్లి తండ్రులు అవలంభిస్తె పిల్లలు అనుసరిస్తారు
పంచభక్ష పరమాన్నాలు వండి కుటుంబంతో కలిసి తింటుంటే ఆ ఆనందమే వేరు

Thursday, 13 September 2018

నన్ను పొగుడుతుంటే గర్వంతొ మనసు పొంగిపొయింది
నచ్చినట్లు నేను జీవించడం నా పిల్లలకు అది ఎంతో నచ్చింది


Wednesday, 12 September 2018

ధనం లేకుండా ఒక్క రొజునైన గడపడం కష్టం
ధరలు ఇంతపెద్దఎత్తున పెరగడమె కారణం

Tuesday, 11 September 2018


దాచుకున్న జ్ఞాపకాలు ఒక్కొక్క వస్తువులొ గుర్తు చెస్తున్నాయి
దాగి వున్న ఈ జ్ఞాపకాలు అన్నీ మధురానుభూతులే అప్పుడు కష్టం అనిపించాయి
దిద్దుకొడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాయి




Monday, 10 September 2018

థంబాలా నిలుచుండిపొయా వర్షాన్ని చూచి
థకాయించిన మనసు కు ఊరటనిచ్చింది వానవచ్చి

Sunday, 9 September 2018


తలచిన నే తదనుగుణంగా అనన్నీ సవ్యంగా జరిగి పొతే ఎంత బాగుంటుంది
తడబడుతూ సంకోచంతో చెసే పని ఏదయినా ఆలస్యమే అవుతుంది

Saturday, 8 September 2018



 
డబ్బులేకుంటే గుడిలో దేవున్నికూడాదర్శించుకోలెం
డజన్లకొలదీ వెలిశాయి గుడులు బడికన్నా మిన్నగా కానీ భక్తి సూన్యం

Friday, 7 September 2018


ఠీవిగా గంభీరంగా వుండాలి అనుకునెదాన్ని అదికాదు జీవితం
ఠికాణా లేకపొయినా ఎంతో గంభీరంగా వుండేవాళ్ళను చూస్తే ఆశ్చర్యం
ఏమీ లేకపొయినా ఆనందంగా వుండగలగడమే జీవితం
ఏదీ వెంటరానిదానికొసం బంధం అనుబంధం

Thursday, 6 September 2018


టక్కున ఒడిసిపట్టుకొవాలనుంది చిక్కక ఎగిరె గువ్వలన్నీ
టకటకా ధాన్యాన్ని చకచకా తిని రివ్వున ఎగిరే పిట్టల్ని
అలా చూస్తూ వుండిపొవడం నా అదృష్టం
అలల గలగలలు గువ్వల కువకువలు అదొ అద్భతం

Wednesday, 5 September 2018

Beautiful song

జ్ఞాపకాలను క్రూడీకరించుకుని అనుభవాల సారమే జీవితం
జ్ఞాన సముపార్జన తో అజ్ఞానాన్ని తొలగించుకొవడమే జీవితానికి పరమార్థం

Tuesday, 4 September 2018


ఝంకారం చెస్తూ తుమ్మేద పువ్వు పై వాలుతుంది
ఝుంటుతేనెను అందిస్తూ పుప్పొడి కై తుమ్మద కోసం ఎదురు చూస్తుంది
ఝుమ్మనే గాలిలో పువ్వు పరిమళాలు వెదజల్లుతుంది
ఝల్లున వీచే పరిమళానికి ప్రాణికోటే పులకరిస్తుంది

Monday, 3 September 2018

 


జడివానకు మనసుకు ఏంటి అనుబంధం
జలదరించి వానచినుకుకు చెస్తోంది మురిపెం

Sunday, 2 September 2018


చిన్ని కృష్ణుని చిన్ని పాదాలను ముగ్గు వేయలేకపొయను
చిలిపి కృష్ణుని కథలు వింటే మేను పులకరించెను
తలచి తలచి కృష్ణుని సొలసిపొయాను
తరించె తన్మయమె  వేణు గానలోలుని గానాంమృతం

Saturday, 1 September 2018

 కోల కళ్ళు కోటేరు లాంటి ముక్కు బూరిబుగ్గలు శృతిమెత్తని శరీర సౌష్ఠవం చిన్ని నొరు అన్నీ నే మెచ్చినవే నా కలల రాకుమారుడు అన్నింటినీ మించి నాపై అభిమానం ప్రేమ భర్త నుండి బార్య ఇంకెం కొరుకుంటుంది




గతం గుర్తొచ్చి జ్ఞాపకాలు రంగరించి
గమ్మత్తులు గుర్తొచ్చి మావారి చెవిన గుమ్మరించి
గడచిన మధురానుభూతులను చవిచూచి
గళమున స్వరపల్లవులు స్పురించి
గమకాలతో కమ్మని కావ్యాలు ఆలపించి
గజిబిజి మనసును మైమరపించి
గంతులేసే లేడి లా చిందులేసె
గమ్మత్తుగా మనసు మురిసె
గంగ పరవళ్లు తొక్కి ప్రవహిచె
గగనతలమున మనసు విహరించె