అనిర్వచనమైన కావ్యమై ఈనాటికీ నవ్య నవనీతం
లౌక్యనికి తావులేదు తేటతెల్లమె నామనసు
లౌకిక వాదాలతో పనిలేదు నేను ఎప్పుడూ కాను అలుసు
మనసైన మాటలు స్పందించిన క్షణాలను రమ్యంగా రచించుకుంటాను
మరెవరోకో నాభావన తెలిపెయత్నం కాదంటాను
నీ సందేశాలకు స్పందించడం పొరపాటో ఏమొ
నీవు తెలిపే ప్రతి మాటా నా మనసుకు కష్ఠం
Tuesday, 28 August 2018
మాటలే మత్రమై మనసు దైవవశమైపొయింది
మానసమున మధుర గానం ఉదయిస్తొంది
Monday, 27 August 2018
విన్నపాలు వినిపించి వెన్నపూస నైవెద్యం
విన్నా కన్నా అమ్మవారి ఆలాపనలు అందులో అనందం
Sunday, 26 August 2018
సొగసు కు నిర్వచనం ప్రవర్తన లో నైపుణ్యం
సొంత సైలి మనిషి ప్రత్యేకతని చెస్తుంది ప్రకాశవంతం
Saturday, 25 August 2018
అక్షయపాత్రలో ఆహరం ఎప్పుడూ అయిపొదో
అదేవిధంగా నా ఇంట్లో పనులూ అయిపొవడంలేదు
Friday, 24 August 2018
కళలన్నీ కలబొసి కమనీయ చిత్రం గీస్తే అది నీవే శివా
కళ్ళలో కొలువై న నీ రూపం ఏనాటికీ చెదరదురాశివా
నీ నామమే మైమరుపు
నీ తలపే కొసమెరుపు
Thursday, 23 August 2018
ఆమని కోయిల ఇలా నా జీవన వెణువులూదగా
ఈ మొబైల్ తో మాట్లాడ్డం తొనే గడిచిపొతోంది
ఈ ఇంటి పనులు మిగిలిపొతుంటే చిరాకుగా ఉంది
Wednesday, 22 August 2018
ఎనలేని స్పూర్తి మానవాళి లో మహనీయలది
ఎలుగెత్తి చాటి మానవీయతను చవిచూపించింది
జలమయమై జనం లో జ్వలించె ప్రాణభయం
జలదిగ్భంధమై జడివానకు జడిసి జీవశ్చవమైన జనం
కేరళ కష్టాల సంద్రం కెరటం తాకి కన్నీట మునిగింది
కేళ భీభత్సవ కేళ ప్రకృతి ప్రాణికోటితో ఆడే వింత కేళ ఇది
Tuesday, 21 August 2018
మరణం వరిస్తే ఎలావుంది
మనసులో ఆ ఉహ రాగానే భయంవెస్తుంది
Monday, 20 August 2018
కలికి కాళ్ళకు పసుపు రాసి మెరిసే శ్రావణ మాసం
కంటికి కాటుక పట్టు పీతాంబరాలతో పసిడి మెని చందం
పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి....ప్రణవనాద జగతికీ
తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని
చలనచిత్రం :స్వాతికిరణం రచన : శ్రీ సి.నారాయణ రెడ్డి గారు గానం : వాణి జయరామ్ గారు సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్ గారు దర్శకత్వం : 'కళాతపస్వి' శ్రీ విశ్వనాధ్ గారు
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
నీ దోవ పొడవున కువకువల స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి
నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు
పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు
తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
నీ దోవ పొడవున కువకువల స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
విత్తు లే వెయలేదు కొన్ని ప్రాంతాల్లో
విపత్తులు మారెనా రైతు జీవితాల్లో
నేల అదునుకై వానకొసం వేచి వేసారిపొయాడు
నేడు నేల పదునుకై చినుకుకోసం చింతిస్తున్నాడు
వానచినుకుకై వగచె రైతన్నలు
వాగులు వంకలు పొంగిపొరలే కాలాలు
ఆ రోజులు మనకు ఇకరావు
ఆచరణలో విలువలు లేవు
చెట్లను బలితీసుకున్న పాపమొ ఏమొ
చెప్పినా వినని మనిషికి ఇది శాపమెమొ
సమూలంగా చెట్లను నాశనం చెశాడు
సజీవ దహనం చేశాడు స్వార్ధానికి వాడుకన్నాడు
తెలిసిచేసినా తెలియక చేసినా దానిఫలితమే వర్షాలు రాని స్థితి
తెలివైన స్వార్థ మానవుని మస్తకములో పుట్టే ఆలోచనల వల్లే దుస్థితి
ఒకచోట క్షామం
మరొక చోట దుర్భిక్షం
Friday, 17 August 2018
సుమనోహరం సూర్యోదయం సుప్రభాతసౌందర్యం
సుమం సుందరం సువాసన భరితం
శ్రావణ శుక్రవారం సందెవేళ స్త్రీల సందడి
శ్రావ్య సంగీత స్వరఝరుల వరవడి
సిరులొలికించే శ్రీ దేవి కి మనసారా పూజలు
సింగారాలొలికించే తల్లికి బంగారపు అలంకారాలు
Thursday, 16 August 2018
నీలిమేఘాలు జాలువారే వాన చినుకులు
నీటిని తాకి వీచే చల్లని పవనాలు
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా...
Wednesday, 15 August 2018
వికసించే నవమల్లికా నీ పరిమళం పరవశం
విరజాజుల వనం సుమగంధాల పవనం
Tuesday, 14 August 2018
శీవారి ఆపశొపాలు అన్యులముందు వుంచరాదు
శీతల సరససల్లాపాలు కలహలు పెదవి దాటరాదు
సత్ సంబంధాలు బంధువులలో కావు స్థిరం
సమయం వస్తే చులకన చేయడం తధ్యం
మావారి కన్నుల్లు తమ్మిపువ్వుల్లు
తమ్మిపువ్వుల్లోన కమ్మతెనెల్లు
కోరికల పాన్పుపై కొంగుపరిచెను
ఎవరులేనీచోట జొలపాడెను జొజోజొజో
Monday, 13 August 2018
కనులకు కలలొక వింత
కలవరం మనసున కమ్మితే చింత
భక్తి కి పరాకాష్ట ప్రేమతత్వం
భక్తురాలిగా నాకు ప్రేమే వరం
అనవసరమైన విషయాలను త్యజించడం ఉత్తమం
అన్నింటా ప్రేమని గుర్తించగలిగితే ఆనందం
Sunday, 12 August 2018
నన్ను నేను బందీని చెసుకుని వున్నా
నగర జీవితాల్లొ ఇది సహజమే ఇల్లే బందీఖానా
ఎవరైనా బందిస్తే నేరం, అరిచి గొలచెస్తాం
ఎవరికి వారు బందీలైతే అది వ్యక్తిగతం
Saturday, 11 August 2018
సంపంగి శ్వాస నను తాకగనే మైమరపు
సన్నజాజి స్పృశిస్తే నీ తలపు
మళ్ళీ మొదలైయింది కొత్తకల నెరవెరాలి చిలిపికల
మలయమారుతంలా మనసును మైమరపించెకల
మానస సరోవరంలా నిర్మలమైన కల
మావిచిగురులా మంగళకరమైనకల
మిక్కిలి మక్కువైనకల
మిసిమి వన్నెల కల
మీటేవీణలా లోలోన దాగే కల
మీనాక్షి కన్నులా నాలొనే దాచె కల
మురిపించి మైమరపించె కల
ముచ్చటగా మధురమై నను దొచేకల
మూగనైపొయి మమత చిగురించేకల
మూసిన తలుపులు తెరిచే తెనెలొలికే కల
మెత్తగా మంచుకన్నా చల్లనైన కల
మెల్లగా మత్తైన మల్లెల కల
మేఘాలపై తేలిఆడే కల
మేఘమాలతో ఊసులాడే కల
మైమరపించే కల
మైకంలో ముంచేకల
మొదలైంది మనసైన కల
మొమాటాలే లేని మొగలిపువ్వంటికల
మోయలేక మాటరాక తాళలేని కల
మోజు పడి మాయలో పడే కల
మౌనమై మాటలే లేనికల
మౌనరాగాలు మదిలో పలికించే కల
మంజీరమై గల్లున జల్లున మ్రొగేకల
మంజులనాదాల మనసును మీటేకల
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్ (గుమ) సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో(మామా) కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో!! ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం.... చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగే పసి చినుకే ఇగురు సుమా మూగి రేగి దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే) శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లె ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నే నమాజుల్లో ఓనమాలు మరిచా (కన్నానులే)
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే చిత్రం: బొంబాయి సంగీతం: ఎ ఆర్ రెహమాన్ రచయిత: వేటూరి గానం: చిత్ర
ఆ..యింట..నూరేళ్ళ పేరంట మాడంగా..శ్రీశైలవాస
నీ చరణా..ఆ..ఆ సన్నిధికే....ఏ..ఏ
కలికీ..ఈ..ఎక్కడికే..
సాంబ శివునీ సన్నిధికే..ఏ..ఏ..ఏ..
చరణం 2:
వీనుల నీ పదములంట.. నేను నీ శ్రీపదములంట..
బ్రతుకు నిండా నీ పసుపు కుంకుమేనంట..మూ..ఊ..ఊ
నీవి కాటుక కన్నులంట..తేలిపొయే కలల వెంట..
శ్రీశైలావాసా నీ శరణా ఆ ఆ సన్నిధికే..ఏ..ఏ..
నీ చరణా...ఆ..ఆ..ఆ సన్నిధికే..ఏ..ఏ..ఏ
కలికీ..ఈ..ఈ..ఈ..ఈ ఎక్కడికే..
నీ చరణ సన్నిధికే..ఏ..ఏ..ఏ
Wednesday, 8 August 2018
కొన్ని అనవసరమైన బంధాలు తెగిపొవడమె మంచిది
కొత్త సమస్యలు రాకుండా కాపాడుతుంది
కొరుకుంటె వచ్చాయెమొ తెలీడంలేదు
కొలుకొని మాయ నుండీ బయటపడితె కానీ అర్థం కాలేదు
కొంత ఆలస్యంగా కొన్ని అనుభవంలోకివస్తాయి
కొందరి మనస్తత్వాలు అర్థం అయ్యాక నిజాలు తెలిసాయి
కొద్ది దూరంలోనే ప్రమాదంతప్పిన ఆనందం నాది
కొంచం, లంచం, కంచం, మంచం, దుర్భరజీవితంఅయ్యేది
కొలుకోలేని దెబ్బ తగిలేది తృటిలో తప్పింది
కొలిచే దైవమే కాపాడిందేమొ మరువలేను
కొండంత ధైర్యం ఇచ్చి అండగానిలిచిన మనిషిని గుర్తుంచుకొంటాను
Tuesday, 7 August 2018
నన్ను నేను మరిచె అంతగా బిజీ అయిపొయా
Sunday, 5 August 2018
కవితలు రాయలంటే ఖాళీసమయం దొరకడం లేదు
Friday, 3 August 2018
మా ఊర్లో మా చందమామతో వెన్నెల కబుర్లు
మా అమ్మ ఎన్ని అన్నా మళ్లీ మాటల సందడ్లు
మానశికంగా కాస్త కృంగిపొయింది ఏదోక మాట అంటుంది
మా అమ్మెకదా అంటే పడతాను ఆమెకా హక్కు ఉంది