Saturday, 30 June 2018

ఆరుబయట చందమామ అందంగా

Friday, 29 June 2018

చినుకు పడి చిగురించిన చెట్లు దారి పొడవునా ద్వారపాలకుల్లా వున్నాయి
చిట్టిగువ్వలన్ని చేరి మా గురించి ఏవో మంతనాలు చెస్తున్నాయి
కోయిల కుహూ కుహూ అనే పాట వింటే మనసుకు ఎంతో హయి

Thursday, 28 June 2018

మబ్బుల్లో దొబూచాడే జాబిల్లి
మనసున మల్లెలు పూరించే అల్లిబిల్లి

Wednesday, 27 June 2018

చంద్ర కుండలి మునక వెసె వేళ మనసు మనోహరం
చంద్రుడు మబ్బులుదాటి దేవి హరతి తిలకించే దృశ్యం అద్బుతం

Tuesday, 26 June 2018

గమనిస్తున్నా నాలో మార్పులను ఉన్నట్టుండి భావోద్వేగాలలో మార్పు

Monday, 25 June 2018

కలిసి వస్తోంది కాలం కలలు పండే కమ్మని కాలం

Sunday, 24 June 2018

చల్లని పల్లగాలి మెల్లగా మేని తాకితే పులకింతే
చలి గిలి మలిసందెల్లో కరిమబ్బులు కమ్మితే కవ్వింతే
చెక్కలి మీటే చక్కదనాల చందమామ లా పక్కన మా     శ్రీ వారు
చెక్కిన శిల్పం నేనై జక్కనకే మిక్కిలి మక్కువ గొలిపేను 
పూజలు  పునస్కారాలు శుచి శుబ్రం 

Saturday, 23 June 2018

Friday, 22 June 2018

మాశ్రీవారి ని నొప్పించక మెప్పించ గలిగితే చాలు
సహవాసం మనకు నివాసం 
సరిహద్దు నీలాకాశం 


Thursday, 21 June 2018


శాంభశివునీ సన్నిధికే

అంతా సాధించెసా అనుకున్నదానికన్నా మిన్నగా
అందుకే నా జీవనం కొనసాగుతుంది ఆనందంగా


Wednesday, 20 June 2018

భూమిక  so cute 
I love this song

ఔన్నత్యాం అద్భుతంగా కుటుంబం పై పనిచేస్తుంది

Tuesday, 19 June 2018

ఓంకారం లా అరుణోదయం అలరిస్తోంది

Monday, 18 June 2018

ఒక్కడే వీరుడు చక్కదనాల మక్కువ రేడు
ఒకే ఒక్క కొరిక కొరగా, సీతమ్మకు బంగారు లేడిని తేచ్చిన రాముడిలా తీసుకొచ్చాడు
ఒకటి బాగా అర్థమౌతుంది నారాముడికి చాలాప్రేమ వుంది
ఒకరు ఇంకొకరిపైచూపించె శ్రద్ధ మధురం
ఒక్క ఈ సందర్భమె నాకు కనువిప్పు డబ్బు కన్నా నేనే మిన్న  అని నిరూపించడం అభినందనీయం
ఒంటరిగా మనిషి సాధించలేనిది జంటగా సాది
ధించుకొవడానికే వివాహ బంధం
ఒట్టి మాటలుచెప్పరు మావారు గట్టిగా నిరూపించారు
ఒట్టు ఇది నిజం నిన్నటిదాకా నేనూ నమ్మలేదు
ఒడ్డున పడేసాడు నా సమస్యలన్నింటినుండి ఇదిచిన్న విషయం కాదు

Sunday, 17 June 2018

ఐతేనేం ప్రతిదీ అలా కలా నిజమై స్థిరంగా నిలుస్తోంది 
ఐనది కానిది అనేదేదీలేదు అన్నీ నాకొసమే జరుగుతున్నట్లుంది
ఐదులక్షల రూ, కార్యం ఇదు క్షణాల్లోనిర్ణయం అంతాఅలా జరుగుతోంది ఇది ఒక అద్భుతం
ఐకమత్యం కుటుంబసహకారం అన్నీ అలాకలిసిరావడం గొప్పవిషయం
ఐక్యంగా ఒకరితో ఇంకొకరు సఖ్యతగా జీవించడం మా సంసార సాంగత్యం
ఐపొతుంది ఈ శుభకార్యం నా ఆశయాలు తీరే అకాశాన్నితాకే ఆనందపు అపురూప వరం 
ఐనా నాకన్నింటా అమ్మవారు తోడుగా వుంటే అనుకున్నది అలా జరిగిపోవడం సులభం
ఐశ్వర్యం ఆనందం ఇవి మాఇంట తాండవంచేయడం ఖాయం
ఐదవతనం మాంగళ్య బలం అన్నిభయాలూ పారిపొయే శుభసమయం

ఐక

Friday, 15 June 2018

ఏంజరుగుతుందో మనసున మెదిలే కోరికతీరాలి అంతా అమ్మవారుమీదే ఆధారపడి వుంది
ఏదైనా సమ్మతమే  ఎవరినీ.ఇబ్బంది కలిగించ నా ఈపేద్ద కొరిక తీరాలనివుంది
ఏర్పాట్లన్నీ చేసి ఆతల్లి కోసం కోటిఆశలతో ఎదురు చూస్తున్నా

Thursday, 14 June 2018

ఎటుచూసినా ఆకాశంలో నల్లని మబ్బులు
ఎలా అలుముకుటాయొ మబ్బుల గుంపులు
ఎల్లలు లేవు వీటికి మెల్లగా చల్లగా నేలకు జారే మేఘాలు
ఎక్కడినుండీ వస్తాయొ అలా కమ్ముకుంటాయి మబ్బుల దిబ్బలు
ఎక్కువైన మబ్బులు  అలుముకుంటే పక్కన వున్నదేదీ కనపడదు
ఎత్తైన కొండలు గుట్టలు మంచు మబ్బుతో కప్పేస్తుంటే మది మురిసిపోక మానదు
ఎదలో మనసైన పాట సరాగాలే కచెరిచెస్తొంది
ఎలకొయిల మంచుతాకిమూగబొతె నామదికి బాధౌతుంది
ఎరుపెక్కిన సూరీడు మేఘం తేరుపై ఊరేగుతుంటే సంద్రం  అరుణవర్ణం సంతరించుకుంది


Wednesday, 13 June 2018

ఋణ పడివుంది సర్వ ప్రాణీ ఆ భగవంతుడికి
ఋషి సంస్కృతి మనది వేదవ్యాసుడు వేదాలను అందించాడు మనకు
ఋజువు వుందా దేవుడు వున్నాడని అడిగితే ఈ సృష్టి యే దాని సాక్ష్యం
ఋతువులననుసరించి ఇన్ని రకాల మార్పులను ఎవరు చేయగలరు గరిక దగ్గరనుండీ అన్నీ అద్భుతం

Tuesday, 12 June 2018

ఊరు వాడా ఎండల వెడికి తాళలేక ఆకాశం వంక చూస్తోంది వర్షం కొసం
ఊరట కలిగిస్తూ రైతులకోసం కురుస్తొంది తొలకరి వర్షం
ఊగే గాలులు తేలే మేఘాల ప్రేమ తాకిడికి తాళలేక కరిగిపోయి వానైకురుస్తోంది
ఊపిరి సలపనీయక నేలపై కుంబపొతగా వర్షం కురిపిస్తోంది
ఊడి పడుతున్నాయి వాన జాతర సందడికి పిడుగులు
ఊరించి ఉడికించి వానచినుకులు నేలపై కురిపిస్తోంది ముద్దులు
ఊహించని విధంగా నేలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
ఊరేగే దారుల ఉప్పెనై వాగులు వంకలుగా సాగుతోంది

Monday, 11 June 2018

ఉండాలి మనిషి ప్రకృతి బడిలో ప్రాణకోటిని ప్రశాంతంగా జీవించెలా
ఉపకరించాలి వీలైతే మానవత్వంతో మనిషి,  జీవులను పునరుద్దరించెలా
ఉహలకు నాలోని ఆశలకు వున్నఫలంగా ప్రాణం పోసుకొవాలి
ఉద్యానవనంలా ప్రపంచం మొత్తం పచ్చని చెట్లతో  నిండి పొవాలి



Sunday, 10 June 2018

ఈ వేళ నీవు లేక కదలకుందు కాలం
ఈ వేదనలో ఎదో తీపి గాయం
ఈ నిదుర రాని రాతిరులు అలా గడిచిపొతున్నాయి
ఈ నిశిరాతిరి నీ జ్ఞాపకాలే నిదురలేకుండా చెస్తున్నాయి
ఈ కలువ కన్నుల్లో కొలువై వున్నది నీవే
ఈ కమ్మని కలలకు రేరాజువు నీవే
ఈ జీవితం లో నీవు లేకుంటే జీవంలేదు
ఈ జీవనం కలసి మొదలెట్టిన రోజు మరువలేదు
ఈ సంసార నావకు చుక్కానివి నీవు
ఈ సంగమం సతతం స్థిరముగ నిలిపే ఓర్పు నీవు
ఈరోజు వరకూ నాకొసం నే కొరినది కాదనలేదు నీవు
ఈ రోజైనా ఏరోజైనా నీ మనసులో నాపై నిన్ను మించిన ప్రేమను దాచావు
ఈ మనసు అందుకే నీకు దాసోహం
ఈ మక్కువ అంతా నీకొక్కడికే సొంతం

Saturday, 9 June 2018

ఇలాగే ప్రశాంతంగా సాగాలి జీనం
ఇంతకుముందు జీవితం అంతా గందరగోళం

Friday, 8 June 2018

అంతా అర్థం అయినట్లే ఈ ఆధ్యత్మికత అనిపిస్తుంది
అంచనాలకు అందనంతగా ఆచరణలో అయొమయాంలో పడేస్తుంది
ఆశ్వాదిస్తూ భక్తిని ఆనందిస్తుంటే అన్నీ సందెహలే వస్తున్నాయి 
ఆలోచనలలో ఎంతో తేడా అన్నిటి లో స్పష్టత అంతా సంతోషం హయి
అనుభూతులన్నీ రెక్కలుకట్టుకుని రివ్వున ఎగరుతున్నట్లు వుంది
అన్నింటిలో చెసే ప్రతి పనిలో లీనమై చెస్తుంటే ఆనందం కలుగుతోంది

Thursday, 7 June 2018

మనిషి గా జీవనవిధానం గమనిస్తే చిన్నతనం నుండి తల్లి తండ్రిని అనుసరిస్తూ పెరిగి పెద్ద అయ్యాక సమాజాన్ని అనుసరించడమే మనిషి జీవనవిధానంగా కొనసాగుతొంది
సమాజంలో కొంతమంది సద్గురు లాంటివాళ్ళు మానవాళి కి మనిషి జీవనవిధానం ఉన్నతంగా వుండాలని చెబితె గానీ తెలీలేదు తెలుసుకుని మనిషి గా ఎదుగుతుంటే కొత్త జన్మ ఎత్తి నట్లువుంది ఇంత ఆనందమైన జీవనం చిన్న తనం నుండి తల్లి తండ్రి అందించి ఉంటే ఈ సమాజాన్నే మార్చెసెవాళ్ళమేమొ నా జీవితాన్ని ఇలా మర్చెసిన సద్గురు కి నేను ఋణపడి ఉన్నాను ఈ ఋణం తీర్చలేనిది

Wednesday, 6 June 2018

ఏకాంతం అప్పుడప్పుడు అనందమే
ఏం చెసినా ఆట పాట అన్నీ నాకొసమే
ఎవరూ వద్దు నాతో నేనే
ఎవరితో మాట్లాడను నాలో నేనే
ఏపనీ చేయను పనులకు సెలవు
ఏక్కడ సోమరితనం ఇక్కడ వాలిపోనువ్వు
ఎలా వున్నా నావంట నచ్చేనులే
ఎన్నిసార్లు నే మెచ్చిన వంట వండినా పసందేలే

ఏమీ బాగొలేదు ఒంటరిగా, సోమరిగా
ఏదో ఒక్క రోజు బాగుంది









Tuesday, 5 June 2018

సుందరమైన సంధ్య అరుణవర్ణం సంతరించుకుంది
సువాసనలు వెదజల్లె సంపంగి విరబూస్తోంది
సుమమాల విరిమాల సన్నాయి జడలో తరించాలంటొంది
సుగంధ పరిమళం సొయగాల విందులు చెస్తోంది
సుమధురగీతాలు శ్రావ్య స్వరఝరులు


Monday, 4 June 2018

సందెపొద్దు లో చల్లగాలి సన్నాయి రాగాలు
సందడి చేసె మనసుకు సరస సల్లాపాలు
సద్దుచెసే వేళకి బుగ్గలు ముద్ద మందారాలు
సుద్దు లేవో చెప్పె ముద్దుల ఎంకి మరదలు
సయ్యటలాడే నాగమల్లితొటలో నాయుడు బావ
సన్నజాజి పూలు ఎంకి కొప్పునతురిమె ఎంకి బావ
సజ్జచెనులో వద్దకుచేరి పండించె ముద్దు మురిపాలు
సంపంగి తోటలో సన్నాయి రాగాలు
సవ్వడి చెసె సిరిమువ్వల సరిగమలు





Sunday, 3 June 2018

మంచి నిద్రకున్న ప్రశాంతత మరి దేనికీలేదు
మనసు ఆనందంగా లేకపోతే మంచి నిద్ర రాదు
అనవసరమైన ఆలొచనలు మానాలి
అన్ని బాధలూ నావే అనే భావన తొలగాలి
ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రశాంతంగా వుండాలి
ఎన్నడో ఏదో జరిగిందని ఎందుకు కుమిలిపొవాలి
ఆనందంగా ఈ రోజుని గడిపితే అదే రేపటి తీపి జ్ఞాపకం
ఆలోచనల పుట్ట మనసు అవి మంచివైతే అంతా ఆనందం



ఒక నిర్ణయం తీసుకుని తన భార్య పట్ల బాధ్యతాయుత మైన భర్తగా  ప్రేమను చూపడం అదర్శవంతమైన నిర్ణయం కమల్, రెవతి జీవించారు పాత్రల్లో

Friday, 1 June 2018

కొయిల తనగొంతు సవరించె ఆలపించె ఆమని గీతం
కొమ్మల్లో ఊరించె మరపించె వినిపించె మధుర స్వరం
చల్లని గాలులు పిల్ల తెమ్మెరలు తొలకరి వర్షం కొసం
చల్లె నేలంతా కల్లాపీ అవనితల్లి కది వాననీటి అభిషేకం
మల్లె మొగలిరేకు సంపెంగ వెదజల్లె సుగంధ పరిమళం
మలయపవనాలు వీచే మారాకు తొడిగె విచ్చేసె వసంతం
తుమ్మెద తారాడె పూల తెమ్మెరలపై తీపి తెనెలకొసం
తన్మయత్వంతో తూలే తేలే తావిమరచిన తామరం