Thursday, 31 May 2018

అందమైన తీపి జ్ఞపకం ఈ పాట



మండు వెసవిని చల్లార్చె తొలకరిజల్లులు మొదలయ్యయి
మండిపడ్డ సూరీడు శాంతించి సద్దు మనిగాడు 

Wednesday, 30 May 2018

చందమామ చందనాలు వెన్నెలు

చాంపేయ ఛాయతో చందమామఉదయిస్తుంటే చిత్తమున చంపకాలు పూస్తున్నాయి
చారడెసి కళ్ళు చందమామ కేసి చూస్తుంటే రెండు కళ్ళు చాలవంటున్నాయి
చాటు మాటుగా మేఘాల మాటున దొబూచులాడేవు
చారులోచన చక్కనైన ఆ చుక్క చక్కదనంలో చిక్కుకు పొయావు
చాలు లేఓయి ఆ తారతో వన్నెల వెన్నెల జలకాలు
చాలాచాలా చిత్రాలు చెస్తావు చిలిపి ఉహాలు మదిని రేపుతావు
చాలవులే నీ వెన్నెల జల్లులు మాకు, జానవులే వలపుల వీణలు  మీటేవు                                                         చారుమతినై నీ నిండు పున్నమి వెలుగులకై నిరీక్షిస్తూ వుంటాను
చామంతి ముద్దబంతి మల్లె కలువ నీచల్లని చెలువము నకు మురిసిపొయేను
చాంద్రి చమక్కులు చద్రుడు వెదచల్లగానే చిమ్మచీకటి పారిపోయేను








Tuesday, 29 May 2018

మృదువైన పదాలతో సృతిమెత్తని పాట
కంచి కి పొతావా కృష్ణమ్మా




మామిడి పండు కు ఎక్కడిది అంత మాధుర్యం
మామిడి కాయ పులుపు పండుగా మారగానే తియ్యదనం
మాఘమాసంలో వచ్చే ఈ ఫలం మానవాళికే వరం
మాటలు లేవు ఈ పండుని వర్ణించుటకు వర్ణనాతీతం



Monday, 28 May 2018


కమనీయ కావ్యం మా కాపురం

కవితలా నవ్య కాంతిలా నా జీవన కావ్యం నీవే
కవ్వించె నవ్వించే నవ వసంత రాగం నీవే
కన్నులలో పదిలపరిచిన వన్నెల రూపం నీదే
కన్న నా కలల రాజువి మహరాజువీ నీవే
కలికి కాంత నె నీఇంట వలపుపంట పండితునే
కళ్యాణ తిలకముతొ పారాణిపాదాల నీ పడతినినేనే
కలిసి ఎన్ని పున్నమిలు చూసామొ
కసిరినా విసిగినా అంతా ప్రేమెనేమొ
కలహించిన మన కలహాలు పట్టు మని పదినిషాలైనా నిలువలేవు
కబుర్లు చెబుతూ కలుపుకు పోతుంటే వెంటనే ముసురుకునెది ముసిముసి నవ్వు
కలువలరేడు తో తియ్యని ఊసులు
కలల రే రాజు మాశ్రీవారి మిసమిసలు
కళ్ళకు కట్టి నట్లు అన్నీ జ్ఞాపకమే నాకు
కలసివుంటే తనతో నాకాటుక కళ్ళకు కునుకు
కలత నిదురే తనచెంత లేని రేయి నాకు
కట్టు కథే అది మాకు ప్రేమ లేదన్నది
కమ్మని ప్రేమ మా మనసున నిండిపొయింది
కలహాలు కమనీయ కావ్యాలు
కలిసి నవ్వుకునే హస్యాలు
కలిమి లేమి కేవలం కాకతాళీయం
కష్టాలను ఇష్టాలుగా మార్చుకున్నాం
కడతేరె దాకా ఆనందంతో కాపురం వుంటాం
కవినై మా కాపురాన్ని కావ్యమై రచించినా ఇంకాస్త మిగిలేవుంటుంది
కవిత్వాన్ని కలబోసి అక్కడక్కడ రంగులద్ది రంగరిస్తే మాకథ గ్రంధమే అవుతుంది










Sunday, 27 May 2018

వాగులు వంకలు చిన్నతనంలొ చూసాం
వానలు కురిసి మహావృక్షాలు సంతరించుకుని రావాలి పూర్వ వైభవం
వాహనాల జోరులో కలుషితం అవుతోంది వాతావరణం
వారసులు కావాలని కంటున్నారు జనాభాని విపరీతంగా పెంచెస్తున్నారు
వాటాలు వెసి ఆస్తులు పంచుతున్నారు ఆక్సిజన్ లేక ఆస్తులు అమ్మినా శ్వఛమైన గాలిని కొనలేరు
వాటర్ ని కొంటున్నారు రేపు గాలినీ కొంటారు కొనలేని పేదలు మరణిస్తారు
వాపోయి ఎమిలాభం వారసులూ వుండరు వారసత్వం మిగలదు
వాడకం గమనిస్తే యెధేచ్చగా ప్లాస్టిక్ వాడి నీటినీ, నేలని సముద్రాన్ని కాలుష్యం చెస్తున్నాడు
వాణిజ్యం వ్యాపార సౌలభ్యం కొసం వాడె ప్లాస్టిక్ సముద్ర జీవరాసులను అంతరించెలా చెస్తున్నాయి
వాత్ఛల్యం, ప్రేమ ప్రకృతి పట్ల బాధ్యత మనిషికి కరువయ్యాయి
వాడిపొయి బీడు బారిన భూములన్నీ పచ్చదనాన్ని సంతరించుకొవాలి
వాగ్దానం చేసి మానవులంతా భక్తితో బాధ్యతతొ                       ఒక్కటిగా ఏకమై మునుపటి కన్నా మిన్నగా                           నేలను చెట్లతో నింపాలి




Saturday, 26 May 2018

మంత్రం వెసినట్లు ముగ్దమనోహరం 
మరులుగొలిపె వరుని కళ్ళలో ప్రేమ మురిపం
ఎన్నిసార్లు విన్నా తనివితీరలేదు
ఎంత చక్కని అభినయం NTR ని అలా చూస్తూ వుండిపొయా 


Friday, 25 May 2018

పక్షిలా అలా అలా ఆకాశంలో విహరిస్తె ఎంతబాగుంటుంది
పట్టు కొమ్మలపై వాలి నెలపై చిన్నగా కనిపించే అందరినీ చూసి నవ్వుకోవాలనుంది
కొయిలగా ఒకరోజు మారాలి
కొత్త పాట సరికొత్తగా పాడాలి
పిట్ట లా రివ్వున ఎగరాలి
పట్టిపట్టి పొలాల్లో గింజలన్నీ తినాలి
లేడి పిల్లలా అడవి అంతా గంతులెయాలి
లేలేత చిగురులు తింటూ బెదురు చూపులు చూసె కుందేలు నైపొవాలి
పూచె పూలపై వాలే శీతాకోకచిలుకై పొవాలి
పూలమకరందం తాగె తెనె గువ్వనవ్వాలి
గలగల పారె గొదావరిలా మారిపొవాలి
గగనంలొ మబ్బునై కొడాకొనలను కమ్మెయలి
నెమలినై పులకించి పురివిప్పి నర్తించాలి
నెరవేరు నా కలలన్నీ  దైవమె మెచ్ఛి వరమివ్వాలి




Thursday, 24 May 2018

నగరంలో జీవితాలు అందరూ వున్నా ఒంటరివాళ్శే ఎవరికివారు
నచ్చినట్లు జీవించవచ్చు ఎవరూ పట్టించుకునెవాళ్ళు వుండరు
మన ఊళ్ళల్లో  అన్నీ గమనిస్తూ వుంటారు
మన అనే భావన అందరిలో వుంటుంది
మనుషులలో అభిమానం వుంటుంది
మదమెక్కిన కామాంధులు నగరంలో ఎక్కువ
మరీ దుర్మార్గాలు మన ఊళ్ళల్లో తక్కువ


Wednesday, 23 May 2018

మండె ఎండలు సంద్రంలో నీటిని మొసుకెళ్ళి మేఘాలుగా మార్చెస్తున్నాయి
మచ్చుకైనా ఉప్పు ఉండదు వాననీటిలో మంచు ముద్దలా చల్లని వాననీరు నేలను తాకుతాయి
మళ్ళీ మళ్ళీ వానలో తడిసి మద్దౌవ్వలనిపించెలా వుంటాయి
మట్టి వాసనలు నాసికానికి తాకినంతనే  మైమరిపిస్తాయి
మధురమైన అనుభూతులివి ఈ అనంతంలో ఎన్నో అద్భుతాలు వున్నాయి



Tuesday, 22 May 2018

తొలికొడి కూయగానే తూరుపు తెల్లని చల్లని వెలుగులను వెదజల్లుతొంది
తొలివెలుగు చూసిన కొయిల పులకించిపొయి తన గళం విప్పి సుప్రభాతం పాడుతొంది
తొలిపొద్దు సిందూరంలా మందారంలా వర్ణాలు వలక బొస్తే సూర్య వదనం ఉదయిస్తోంది
తొందరేక్కువ సూరీడికి అమాంతం తన అరుణకిణాలను అవనిపై వెదజల్లె పనిలొ పడ్డాడు
తొలికిరణం తాకీ తాకగానే పువ్వులన్నీ నవ్వుతున్నాయి



Monday, 21 May 2018

నిండుగా జీవించడం అంటే గతంలో తెలిసేది కాదు
నిజంగా ఇప్పుడు నా అనుభవం లొకి వస్తేకానీ తెలీలేదు

Sunday, 20 May 2018

మట్టిలొ అలా పడెస్తెచాలు విత్తనాన్ని అందగా బుజ్జి మొక్క వచ్చేస్తొంది
మక్కువ ఎక్కువ అవుతొంది మొక్కలను చూస్తే పిచ్చి మొక్క అయినా అందంగా వుంది
మాట్లాడుతూ వుంటా బుల్లి మొక్కలతో నా మాటలకే పెరుకుతున్నట్లు అనిపిస్తుంది
మారాకు తోడిగె కొమ్మలకు తీగలు చిత్రంగా అల్లుకు పోతున్నాయి.
మా పూలకుండీలో పిచ్చి మొక్కలే అన్నీ నాకొసమె పుట్టాయి.


Saturday, 19 May 2018

చీకటి కూడా ఇంత అందంగా వుంది
చీల్చుకుటూ చీకటిని చిన్ని దీపం వెలుగుతొంది
అంత పెద్ద ఆకాశానికి చీకటిని తరిమెసె నక్షత్రాలు
అనంతమైన చీకటిని పారద్రొలడానికి చిన్ని దీపం వెలిగించె చేయి వుంటే చాలు

Friday, 18 May 2018

కొత్త లొకం

కొత్త లొకం ఒకటి కాలి మా కొసం
కొలువై వుండాలి కొయిల గానామృతం
కొరుకున్న నాలొకంలో వుండాలి రోజు మయురనాట్యం
కొసరి కొసరి కృష్ణ జింకలకు నేను తినిపించాలి గ్రాసం
కొనకొమ్మలకు గువ్వల గూళ్ళు వుండాలి
కొమ్మల్లో గువ్వలన్నీ ఉదయం కువకువలతో నిద్రలెపాలి
కొండలు నాకుటీరం చుట్టూ కొటగొడలా వుండాలి
కొటిరాగాలు కొయిలతో పాడిచుకొవాలి
కొయంబత్తూర్ లొ కుటీరం కట్టుకుని ఉండాలి
కొవెల కూడా కొలువై వుంది అన్నీ నాకొసమె ఇలా ఏర్పాటు చెసారెమొ అనుకొవాలి



Thursday, 17 May 2018

చిలిపి గాలి చిన్నగా మొదలై మెఘాలు మెరుపులతొ జొరువాన నెలపై నాట్యం ఆడేసింది
చినుకు చినుకు చెరి వాగులా పారుతోంది
మనసంతా చల్లగా మావారితొ చెరి ముచ్చటగా ముచ్చటిస్తొంది
మనబంధం ఆచ్చంగా స్వచ్ఛమైన చినుకులా గతాన్ని మరచి ఈరోజే తొలిపరిచయంలా తోస్తోంది
తొలకరివాన తెలియని తపనేదొ ప్రేమై పొంగుతొంది
తొలిసారిగా తెనెలొలికే మనసులు ఒకటిగా మమెఖం అవుతోంది
మణిహరం మావారి మమకారం
మధురాతి మధురం మా సంసారం
వాన ఆగింది కొయిల తనగొంతు సవరించి పాడింది
వాలిపొయే పొద్దులో వానకారు కొయిల ముగ్ధ మనోహరంగా కచెరిచెస్తొంది
ఆ పాటకు నామనసు పులకరించి పరవశిస్తోంది
ఆహా ఏమాస్వరం? ఈ కొయిల స్వరామృతం తాగింది
అందుకే నేమొ అంత మాధుర్యం
అందమైన వసంతం అంటే ఇందుకే ఇష్టం

Wednesday, 16 May 2018

ఎండలు మండె వెసవిలొనే కొయిల కూస్తుంది
ఎంత ఎండనైనా భరించి చెట్టు మంచి మల్లెలను ఇస్తుంది
ఏడాదిలో ఒక్క వసంతకాలమే అందంగా ముస్తాబౌతుంది
ఏకమయ్యె జంటలకొసం మాఘమాసం వెసవిలోవస్తుంది

Tuesday, 15 May 2018

దేవుడా తగిన శిక్ష వెయ్యి

సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేని మనుషులు వుండడంవల్లే మన దేశం అభివృధ్ధికి నొచుకొవడంలేదు. ఎవడికి తొచినట్లువాడు యువతను నిర్వీర్యం చెసున్నారు.  పిల్లల్ని చిదిమెస్తున్నారు. ఇవన్చీ విచ్చలవిడితనంవల్లే నెట్ లో అశ్లీల చిత్రాలు వీడియోలు అడ్డుఅదుపులేకుండా విచ్చలవిడిగా నెట్ లో ఫెస్ బుక్కుల్లొ అన్ని సోషల్ మీడియాలలో ప్రదర్శించడంవల్లే. చిన్న పిల్లలు కూడా మొబైల్ వాడుతున్నారు టీనేజ్ పిల్లలు పాడౌతున్నారు తెలిసీ తెలియని వయసులో తప్పులు చెస్తున్నారు అమ్మాయిలు బ్లాక్ మెయిల్ కి గురై ఆత్మహత్యలు చెసుకుంటున్నారు. ఈ అశ్లీల వీడియోల వల్ల ఎందరి జీవితాలో నాశనం అవుతున్నాయి ఇలాంటి వీడియోలు పొస్టు చెసెవాళ్ళకు అమ్మ,అక్క చెల్లి కూతురు వుంటారు వాళ్ళకూ ప్రమాదం పొంచి ఉందన్నది గుర్తుంచుకొవాలి రేపు నీ కూతురు నీ చెల్లి మీ అక్క ఈ అశ్లీల చిత్రాలు వీడియోలు చూసిన కామాంధుడు రేప్ చెస్తె నీ గుండె పగిలిపొదా? వీటి వల్ల వావి వరసలు మర్చిపోతున్నారు ఆడవాళ్లు చిన్న పిల్లలతో సహ బాధలకు హింసలకు గురౌతున్నారు వీటన్నింటికి కారణం ఇలాంటి వీడియో లు ఫొటోలులే కారణం పనీపాటాలేని ఇలాంటి వాళ్ళు పొస్టు చెసే ఈ చెత్తవల్ల సమాజం ఎంతొ కలుషితం అయిపొతోంది ఈ నేరగాళ్ళకు ఖటిన శిక్షలు వెయాలి. నేరాలకు కారణమైన వాళ్ళను వదిలేస్తున్నారు. గాయం ఒకచోట అయితే మరోచొట మందువెస్తె ఎలాగైతే ప్రయోజనం వుండదొ ఇదీ అంతే అసలు నేరగాళ్లు ఇలాంటి అశ్లీల చిత్రాలు వీడియో లు పొస్టు చెసేవాళ్ళే. ఉసుపొక చెసే ఈ లాంటి నీచమైన పనులకు అమాయకపు జీవితాలు చెల్లా చెదురౌతున్నాయి ఇలాంటివాళ్ళు రేపు వాళ్ళ కూతురు గురించి ఆలొచించాలి ఈ పాపాలకు తగిన శిక్ష పడుతుంది దేవుడిన్ని మొసం చెయలేరు. నేను ఎంతో బాధతో బాధ్యత శపిస్తున్నా ఇలాంటి వాళ్ళకు నేను అనుకున్నదానికన్నా ఎక్కువే శిక్ష పడలి ఆ దేవుడికే వదిలేస్తున్నా తగినశిక్షపడాలి మానవ శిక్షలు సరిపొవు ఇలాంటి వాళ్ళకు అంతకు మించి వుండాలి

Monday, 14 May 2018

మంచిగా నటించె మలినమైన మనసున్న మనుషులకు దూరంగా వుండడం ఉత్తమం
మనిషి ముసుగులో మానవ మృగాలు fb లొ అదికంగా వుండడం విశేషం

I love u Ramu

నా మనసు బాగా డీలా పడిపొయింది
నాకే తెలినంతగా మాయలా కమ్మెసింది
నేను అనుకున్నాను సొమరితనంవచ్చెసింది
నేనేంటి ఇలా తయారయాను నాకే నచ్చలేదిది
నాలుగు రోజులు గా ఇలాగే జరుగుతోంది
నాకు ఈ రోజు బూస్టుతానట్లు ఉల్లాసం ఉశ్చాహంవచ్చింది
ఎందుకు కలా అని ఆరాతీస్తే రామూ ఉ‌రినుండీ వచ్చాడు
ఎప్పుడూ ఈ విధమైన ఆలొచనే రాలేదు
నాలో నాకే తెలీని ఇంకో కొణంవుంది
నాలాగే నా రాముకీ కూడా ప్రేమ వుంది
నాకనిపిస్తుంది  విడిపడి ఇక వుండలేం
నా విసుగు నీ కొపాన్నీ అన్నీ భరిస్తాడు పాపం
I love you so much ramu😍😙😍

Sunday, 13 May 2018

అమ్మ నవమాసాలూ మొసి కన్నది
అమ్మ ఆ పదానికే నా నాన్నమ్మ వన్నె తెస్తుంది
ప్రపంచంలో అందరి అమ్మల ప్రేమలన్నీ తెచ్చి ఒక్కచొట పెర్చిన నా నాన్నమ్మ ప్రేమ అవుతుంది
ప్రణమిల్లి ప్రతిఫలంగా నా ప్రాణమే ఇచ్చినా సరి తూగని ఋణమది
పుట్టిన పసికందునునేను తల్లి పాలు విషంగా మారాయి
పురిటి బిడ్డను ఆవుపాలు పట్టి పెంచింది నాన్నమ్మ చెయి
అరచెతులలో అపురూపంగా పెరిగాను నాన్నమ్మ ప్రేమలో
అక్కరలేదనుకుంది అమ్మ, చావునే జయించాను నాన్నమ్మ ఒడిలో
నేను ఇలా బ్రతికున్నది నా నాన్నమ్మవల్లే
నేలను తాకనీయక తన ఒడినే చేసింది పూలపాన్పువలే
నాలేలేత పాదాలు తన మొముపై ఆటాడాయి
నా చెతులు ఎన్నోసార్లు తన జుట్టును లాగాయి
నాతో ఇవన్నీచెబుతూ అప్పుడే ఇంత ఎదిపొయవు అంటూవుండేది
నా పెళ్ళిచూడలన్న కోరిక తీరకుండానే అనంత లొకాలకు వెళ్ళిపొయింది
నాన్నమ్మా ఒక్కసారి రావా నాకొసం నాగుండెలొఎప్పుడూ నువ్వు వున్నావు
నాలా నిన్ను చూసుకొవాలనుంది అమ్మలకే అమృతంనీవు



Saturday, 12 May 2018

భక్తి మనిషిలో ఎప్పుడు మొదలైందో తెలీదు
భక్తులకు తమ లో ఎంత భక్తి వుందో తెలిసే దారిలేదు


Friday, 11 May 2018

నిషబ్దం నిండిపోయి మాటలకు చొటేలేదు
నిశ్చలంగా ద్యానదశలో ఆలోచనలకు ఆస్కారం లేదు
నాలొఎదొమార్పు మాటలురాని మూగతనం
నా అంతరంలో అనంతమైన సూన్యం
నిర్మలంగా  ద్యనంలో ఉన్నట్లు మనసు ప్రశాంతంలా
నింగిలో తేలుతూ నామనసు విహరిస్తొంది విహంగంలా
నిర్మానుష్యమై నిలిచింది నా మనసు మైదానం
నిర్వహించడానికి ఏదో ఘనమైన కార్యంఉన్నట్టు గభీర్యం
నా మనసు పొకడ చూస్తే అయొమయం
నా భక్తిలొ ఏదో మార్పు సంతృప్తి సంతోషం


Thursday, 10 May 2018

ఆనందాలు సంద్రంలొ అలలవలే ఎగసిపడుతున్నాయి
ఆంక్షలెలేని ఆకాంక్షలన్నీ శ్వేచ్చగా విహరిస్తున్నాయి

Wednesday, 9 May 2018

చలిగాలి చెలిమొముపైవాలి గిలిగితపెడుతొంది
చలించి మనసు మట్టి సుగంధపుగాలికి మైమరచిపొతొంది
చిరుగాలి చిగురాకు కొమ్మనుచేరి ఆటాడెస్తొంది
చిరునామా లేని సుడిగాలి నేలపై చిద్విలాసం చెస్తొంది

Tuesday, 8 May 2018

పెళ్లి చూపులు

తొలకరిసిగ్గు మొగ్గలేసి తలదించి కూర్చున్నా
తొలిసారి తన మాటల ఆస్వరం వింటున్నా
తోబుట్టువు సైగచెసి తలఎత్తి చూడమంది చూడలేకున్నా
తోడు కొరివచ్చాడు నచ్చానెమొ కళ్ళు నావైపునుండీ మరల్చలేదు ఒరకంట చూస్తున్నా
తొలిసారి తన కళ్ళల్లో కిచూసా సన్నని భయం  నను కమ్మెస్తుంటే నిగ్రహించుకున్నా
తొందరగా  తనకళ్ళల్లో చిక్కున్న నాకళ్ళను మెల్లగా విడిపించుకుని నేలకేసి చూస్తున్నా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ  


కల్లాకపటం కానని వాడా
లోకం పోకడం తెలియని వాడా
కల్లాకపటం కానని వాడా
లోకం పోకడం తెలియని వాడా  


ఏరువాక సాగారో రన్నో... చిన్నన్నా
నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా



చరణం 1 :



నవ ధ్యానాలను గంపకెత్తుకొని... చద్ది అన్నము మూట గట్టుకొని
నవ ధ్యానాలను గంపకెత్తుకొని... చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని...  ఇల్లాలు నీ వెంటబెట్టుకొని  


ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్నా



చరణం 2 :


పడమట దిక్కున వరద గుడేసె...   ఉరుముల మెరుపుల వానలు గురిసె
పడమట దిక్కున వరద గుడేసె...   ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె...   ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె  


ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్నా 



చరణం 3 :


పోటేరును సరి జూచి పన్నుకో యలపటదాపట ఎడ్ల దోల్నుకో
హై హై హై హై
రాళ్లు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో  


ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్నా 


చరణం 4 :


పొలాలమ్ముకొని పోయేవారు...  టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు...  ఈ చట్టిని గమనించరు వారు 

 

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్నా 



చరణం 5 :


పల్లెటూళ్లలో చల్లని వాళ్లు...  పాలిటిక్సుతో బతికే వాళ్లు
ప్రజాసేవయని అరచేవాళ్లు...
ప్రజాసేవయని అరచేవాళ్లు... వొళ్లు వంచి చాకిరికి మళ్లరు 

 

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్నా 



చరణం 6 :


పదవులు స్థిరమని బ్రమిసే వాళ్లే...   కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్... 
నీవే దిక్కని వత్తురు పదవోయ్... 
రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్..  మారాయ్..  మారాయ్..  రోజులు మారాయ్  


ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్నా  

Monday, 7 May 2018

స్త్రీ మూర్తి

కలిసి స్రీ పురుషులు ఇద్దరు జీవించె జీవితాన్ని  అంటారు సంసారం
కలకాలం కలిసిజీవించడానికి కళ్యాణం ఇది సమాజంలో గౌరవంకొసం
కళ్యాణం జరిగాక అన్యోన్యత లోపించడం ఈరోజుల్లో సర్వసాధారణం
కలలుకని అమ్మ,నాన్న,అక్కా చెల్లి, అన్న‌ ,తమ్ముడు అందరినీ వదిలి భర్త వెంట వెళడం
కన్నకలలను కూడా తృణప్రాయంగా పక్కకుతొసి భర్తే లొకం గా భావించడం
కష్టాలను ఓర్చి సమర్ధవంతంగా సంసారాన్ని నడిపించడం బార్య తన ధర్మంగా భావించడం
కడుపులో నీ వంశానికి జన్మనిస్తుంది పురిటినొప్పులతో స్రీకి మరోజర్మే ప్రసవం
కంటికి రెప్పలా సంతానాన్ని కాపాడి వారి అభివృద్ధే తన జీవిత లక్ష్యం గా భావించడం
కడతేరెదాకా కుటుంబంకొసమే జీవించెత్యాగశీలి బార్య స్త్రీ త్యాగాలకు విలువకట్టే ధనవండులేడు ఇది సత్యం



Sunday, 6 May 2018

సత్ సంగ్ అలా వెళ్లి ఇలా వచ్చానా ఆనందం
సహజంగా ఎంతో మార్పు నీరసంగావెళాను వచ్చెసరికి ఎనలేని ఉశ్చహం
ఈ భక్తి యొగాలో ఏదొమాయ ఉంది
ఈ మార్ప గమనిస్తున్నా ప్రతిసారీ ఇలాగే జరుగతుంది
వెళ్ళగానే చిరునవ్వుతో ప్రేమ పలకరింపు
వెసవి పెట్టె చిరాకును మరపించే నేర్పు
ఆనందం తో మనసు గంతులేస్తుంది
ఆకాశం అంత ప్రేమ ఎలా ఉంటుందో తెలిసింది
ఇలా ఎంత రాసినా తక్కువె
ఇలాంటి భక్తి దొరకడం నాకు ఎక్కువె
నిన్న నిరాశతో విసిగి వదిలేయాలనిపించిది
నిన్నే లే అంటూ నిర్వీర్యం నుండీ నిద్రలేపింది


Saturday, 5 May 2018

నాదో భకిలొకం పిచ్చి మాలొకం

Friday, 4 May 2018

కొయిల కుహూ గానాలతో తూరుపు తెల్లవారుతొంది
కొత్త పాటరాదు పాడినపాటే పదే పదే పాడుతుంది
కొసరి కొసరి స్వరాలు వడ్డిస్తోది వసంతానికి
కొరికొరి వసంతం ముస్తాబుఅయింది కొయిలపాటకి
కొద్ది రోజులెగా నీ గానం ఆరు మాసాలు మూగబొతావు
కొంత కాలానికె ఎందుకు పరిమితం అయ్యవు
కొల్లగొట్టెస్తున్నావు నీపాటతో నా మనసుని
కొనగలమా తెనెలొలికె నీస్వర మాధుర్యాన్ని
కొమ్మా రెమ్మా నీపాటకే చిగురుతొడుగుతుంది
కొమలమై నీగానాంబృతం ప్రవహిస్తొంది



Thursday, 3 May 2018

కారుమేఘాలు కమ్మి  కురిసింది కుండపోత వాన
కాంతులు వెదజల్లుతూ మెరుపులు ఉరుముల వాన
కారణమే లేకుండా కబురైనా లేకుండా ఊడిపడుతుంది
కాళ్ళు పరుగున వెళ్లి వర్షం లొ తడవమంటోంది
కానీ వెళ్ళలేను అందరూ కలిసివున్న అపార్టుమెంటు ఇది



Wednesday, 2 May 2018

పండగంటి ఎన్నెలా పలకలరించ రా ఇలా
పడమటింటి దారిలా పరుగుతీయకే అలా
పాలపుంత చుక్కలా పాపిడంటి మెరుపులా
పాలవంటి వెన్నెలా వెల్లువైన పాలవెల్లిలా
పిలుపు లన్ని వలపులన్ని అల్లినానె పైటలా
పిల్లతెమ్మెరలు వీచె చల్లగా కలువ కళ్ళు మూసె నిదురలా
పులకరింతలన్ని పూలపానుపెసె పరవసంలా
పురివిప్పి నా మనసు నర్థించె నాట్యమయూరిలా



Tuesday, 1 May 2018

బ్రహ్మ నంద స్వరూపా ఈషా జగదీషా
అఖిలానందశ్వరూపా ఈషా మహేషా

మీ మనస్సును ఉపయోగించి ఈ పరిమితులను అధిగమిస్తే, దానిని మనం జ్ఞానయోగం అని అంటాం. 

మీరు మీ భావాలను ఉపయోగించి ఈ పరిమితులను అధిగమిస్తే, దానిని భక్తియోగం అంటాం

మీరు మీ శరీరాన్ని ఉపయోగించి వీటిని అధిగమిస్తే, మనం దానిని కర్మయోగం అంటాం.

మీరు మీ శక్తిని ఉపయోగించి ఈ పరిమితులను అధిగమిస్తే, దానిని మనం క్రియాయోగం అని అంటాం.