Monday, 30 April 2018

గురు పౌర్ణమి

పుట్టింది రాజవంశం లో మనసు మాత్రం కడు సున్నితం
పున్నమిరోజే పుట్టుక   మళ్ళీ పౌర్ణమికే జరిగిది బుద్ధుని జ్ఞనోదయం
పున్నమికి గౌతముడికి వుంది ఎదొ అవినాభావ సంభంధం
పురిటినొప్పులతో  పల్లకీ దిగిన మహారాణికి అడవిలో జరిగింది ప్రసవం
పుత్రుని చూసిన గౌతముని తల్లి పులకించిపొయింది
పుత్రోత్సాహం తొ ఉప్పొంగిపొయింది
పుడమి తల్లి బుద్ధుని జననంతోపరవశించింది
పుణ్య భూమి గా బుద్ధుని ప్రవచనాలతో ప్రశాంతతని సంతరించుకుంది
పుణ్యపురుషుడి జ్ఞనోదయంతో మారణహొమాన్ని మాని మానవాళి లో మానవత్వం ప్రకాశించింది
పునీతుని పొందిన జ్ఞనోదయం రోజుని గురుపౌర్ణమి గా నిర్ణయించడం జరిగింది
పూజించి ఆమహనీయున్ని మనలో జ్ఞానాన్ని పొందడానికి సహకరించమని వెడుకుందాం


Sunday, 29 April 2018

వెన్నెలరెడు భూమి మీద తన వెన్నెల వెలుగులు నింపుతున్నాడు
వెండిగిన్నెలో పాయసం పంచుకుంటూ పరవశించె మాజంట మెండు 

Saturday, 28 April 2018

పాదం భూమికి తాకగానే మంత్రించినట్లు మమకారం
పారాణి అయింది మట్టి నాపాదాలకు పారవశ్యం
పారిజాతాలు పరిమళిస్తున్నాయి ఈ సుగంధం మట్టిదా?
పాటలు పాడె కొయిల స్వరంలో ఆ తీపి వసంతానిదా?


Friday, 27 April 2018

గతాన్నంతా గుమ్మరించి కలంతో పుస్తకాలు నింపెస్తున్నా గడిచిపొయిన ఆనందాల అమృతాన్ని తాగుతున్నా
గమ్యం తెలీక బాధలు అని బ్రమించిన వన్నీ రాసేస్తున్నా గమనించనేలేదు ఆనందపుక్షణాలు ఎన్నో ఉన్నాయని                                                              అన్నీ అల్లేస్తున్నా గంటల తరబడి రాసినా ఇంకా పుడుతూనే ఉన్నాయి                                            దీన్ని ఆపెదెలాగో ఆలోచిస్తున్నా


Thursday, 26 April 2018

తనివితీరా సూర్యాస్తమయం చూస్తుంటే మనసు తైతక
తక్షణం నేను ఆకాశంలో సంధ్యనై సూర్యున్ని లాలించాలిక
భగభగా మండి బడలికతో బంగారు రంగు భానుడు
భస్మమం చెసేవాడిలా భూమిమీద విరుచుకు                             ...                       ..                . పడుతున్నాడు

Wednesday, 25 April 2018

మేఘాలలో దాగి చూసే జాబిల్లి
మేడపైన వీచె చల్లని గాలి
నక్షత్రాలు మిలమిలా మెరిసి అలసి తొకచుక్కలా రాలి
నచ్చిన వన్నీ వచ్చి నన్ను ఆనందంలొ ముంచేయాలి

Tuesday, 24 April 2018

వెన్నెల్లొ బృదావనం ఆడిపాడె కొలాటం
వెన్నదొంగ రాధ ను చేరి వన్నెల ప్రేమసరస సల్లాపం
యమునానది చెసుకున్న పుణ్యమొ
యాదవునికై ఎదురు చూపుల విరహమొ
రాధామాధవుల అపురూపమైన ప్రేమకలాపం
రాసలీలల రాగహెళలలో సుందరఘట్టం




Monday, 23 April 2018

వెసవి వెడికి విలవిలలాడి పొతున్నాం
వెళ్ళిపొవాలి హైదరాబాద్ అనిపిస్తోది ఈక్షణం
విపరీతమైన ఈ వెడిని ఎలా భరించడం
విపత్కర పరిస్తితి వచ్చిపడింది తప్పించలేం
విరివిగా చెట్లను నరకడంవల్లే ఈ దుస్థితి
విచక్షణ లేక మనిషి కొరి తెచ్చుకున్న దుర్ఘతి
ఒక మొక్క చెట్టుగా ఎదగడానికి ఎన్నో సంవత్సరాల                   .    ..                           సమయం పడుతుంది
ఒక్క గంటలొ సమూలంగా చెట్టును నరికెస్తున్నాం ఇది                ..                       ..       చాలా దారుణమైనది
అభివృద్ధి ముసుగులో అనాలొచితంగా భూమండలాన్ని చెస్తున్నాం వినాశనం
అభివర్ణించాలో  విచారించాలో అభివృద్ధి పేరున జరిగే అడవుల నాశనం
అన్నీతెలిసి అడ్డుకొలేని నిస్సాయత ఎలా కాపాడాలి నా అడవి తల్లిని
అనివార్యంగా ఎదెని చట్టం రావాలి చెట్లుని చంపిన కఠిన శిక్షలు రావాలి







Sunday, 22 April 2018

వరాల వాన వెసవి తాపాన్ని తగ్గిస్తొంది
వర్షం పడగానే పుడమి పులకించి పరిమళాలు వెదజల్లుతొంది
మేడపైన మల్లెలవాన నేను మావారి సరసన
మేఘాలు మెరుపులతొ సరికొత్త సరదాల వాన
చీకట్లో చిటపట చినుకులు
దొసిట్లొ ముత్యాల చినుకులు
మాశ్రీవారి ముచ్చట్లకు మురిపెమైపొయె చినుకులు

Saturday, 21 April 2018

ఆకాశం చుక్కలచీరకట్టింది సింగారంగా
ఆ నింగి నెలవంక తార నుచేరి చెక్కిలిమీటె చిలిపిగా
చుక్కలంటే మక్కువ పక్క వెసి పవ్వళించి పైన తళుక్కున మెరిసె చుక్కలంటే మక్కువె
చక్కగా ఆకాశంలో ముగ్గు వెయాలని పెదరాశి పెద్దమ్మ చుక్కలు పెట్టి ముగ్గువెయడం మరిచావె


Friday, 20 April 2018

నాకొసం సూరీడు కాసంత సల్లబడ్డాడు

Thursday, 19 April 2018

ఆకాశం లో మెరుపులు  మెఘాలు
ఆకర్షణీయంగా ఆకాశాని అలంకరిస్తున్నాయి

Wednesday, 18 April 2018

వెసవి భగభగ మని వెడిశెగలను వెదజల్లుతొంది
వెసారిపొతున్నా వడగాలికి శ్వేదం నదిలా పారుతోంది

Tuesday, 17 April 2018

కాల చక్రం పరిగెడుతొంది
కాసెపు అలా కునుకుకైనా సమయంలేకుంది

Monday, 16 April 2018

కొలువైన వసంతం కొసరి కొసరి కొయిలకు స్వరా అమృతాన్ని తాగిస్తోంది
కొయిల తన గొంతు సవరించి కుహూ గానామృతం చల్లుతోంది
కొరి కొరి నేను ఈ వసంత కొయిల గానం కొసమె ఎదురు చూసెది
కొంత ఆలస్యంగా కూసిన కొయిలపై నాకు ఆందొళన కలిగింది
కొత్త సంవత్సరం కొయిల పాటతొ మొదలవ్వాలి ఎందుకో కొయిల ఆలస్యంగా కూస్తొంది




Sunday, 15 April 2018

 ఆకలి కి విచక్షణ ఉండదు

Saturday, 14 April 2018

శ్వేత తామరమా నిను తాకిన తన్మయత్వమా
      శ్రేయస్సు కు మనస్సుకు మనిషి బుద్ధి వికశించుటకు 
                                                        నీవే చిహ్నమా
శ్రేష్టతకు నీకే అగ్రస్థానం మొగ్గవైన నీవు శంఖాకారం
                                  తుమ్మెద స్పర్శకు పుష్పాకారం
శ్రేయము చేకూరు  శంకరునికి  శతపత్త్రం సమర్పణం                                చెయగనే కలుగు మనస్సు ప్రశాంతం

Friday, 13 April 2018

తీయని స్నేహం

మంచి ముత్యమంటి స్నేహం నే మెచ్చిన మనసు స్వచ్చం
మరచిపొలేను నీ ప్రేమ పలకరింపు నా మదికి మైమరపు                                    మల్లెలమత్తె నువ్వు అల్లిన స్నేహం
I love u so much

Thursday, 12 April 2018

రైలు ప్రయాణం

ప్రయాణాల్లో మంచి మనుషులతో పరిచయం
ప్రత్యేకంగా ఒకరికొకరు సహయం చెసుకోడం
మనసులో ఎందాచుకొకుండా మన అనే భావంతో మాట్లాడం
మంచి మాటలు అందరికీ నచ్చుతాయి కొందరు వాళ్ళ ఇంటి బాధలు చెప్పుకోవడం
ఒక తండ్రి తన పిల్లల్ని ఎప్పుడు చూస్తానా అని తపించడం
ఒక అమ్మాయి మా అందరి మాటలకూ చివరిదాకా నవ్వుతూనే వుండడం
ముసలాయన తన కొడుకు  తెలివితక్కువతనానికి తనలో బాధను పంచుకోడం
ముకపరిచయం లేకపొయినా అందరికీ తన తల్లి తన భార్య తగువు గురించి చెప్పుకొవడం
నాకు నీళ్ళు అవసరం వచ్చినప్పుడు పరుగున వెళ్ళి ఒకతను తీసుకురావడం
నాసీటు విండోదగ్గర ఇక ప్రకృతిని చూస్తూ నాఆలొచనలు ఆనందతొ పరుగులు తీయడం
అందరూ అన్నీ మర్చిపొయి అలా మనసువిప్పి మాట్లాడుకొడం
అన్నిమాటలు అందరంకలిసి మాట్లాడుకున్నా అభిప్రాయ బెదం రాకపొవడం గొప్పవిషయం
సలహాలు సమాచారాలు సహయం బాధలూబాధ్యతలూ పంచుకొడంలో మానవత్వం కనిపించింది
సరదా సరదాగా ప్రయాణం సాగింది


Wednesday, 11 April 2018

శ్రీవారి కి ఎడబాటు బాధ తప్పలేదు
శ్రీ హరికి కూడా లక్ష్మీ దేవి ఎడబాటు తప్పలేదు
మావారికి ప్రియమైన ప్రేమ లేఖల రాయాలని
మాటలన్నీ మొసుకొచ్చి ముచ్చటగా పెర్చాలని
మార్చి మార్చి మంచిముత్యల మాటలను తీర్చినా తనివితీరదు
మాణిక్యాలు మణులు పదాలుగా అమర్చి మినుగురు మెరుపులద్దినా మనసు నిండలేదు
మాకు ఒకరి అభిప్రాయం ఇంకొకరు అర్థం చెసుకోడానికి చాలాకాలంపట్టింది
మార్పుసహజమె మొండిగా నేను వ్యవహరిస్తే మౌనంగా భరించడం తన వంతైయిది
మావారనే వస్తువుని ఎలావాడాలో తెలీకపొవడంవల్ల వచ్చినకష్టాలే నావి

మావారిది చిన్నపిల్లాడి మనస్తత్వం నాకంటికి చిన్నపిల్లాడే చిన్న పిల్లాడికి అడిగిన బొమ్మ ఇవ్వకపొతే ఎలా మారాం చెస్తాడొ అలానే చెస్తారు నాకు ఆయన చెసె మారాం కూడా బాగుంది. ఇంతకు ముందు నేను ఈదృష్టి తో చూడక పొవడమె నాతప్పు. నాకొసం ఎదురుచూడ్డం బాగుది నెనే ఊరువెళితే అన్నీ గుర్తు చెయడం ఎలా వెళ్ళాలి అని కాల్ చెసిచెప్పడం ఆ కెరింగ్ ఇంకా నచ్చిది. నెనే ఇంటికి రాగలను అని అన్నా ఏరోజూ నాకూ వీలుకాదు నువ్వే వచ్చెయి అనలేదు ఆఫీసర్ గా ఎన్ని బధ్యతలు వున్నా ఏదోకటి మాయచెసి వచ్చి ఇంట్లో దించి వెళతారు ఎంత ఎండఅయినా వానపడినా వంటరిగా రమ్మనరు. ఊరినుండీ రాగానే నన్నుచూడగానే ఆ కళ్ళలో మెరుపు నన్ను మిస్స్ అయిన బాధనంతా తనకళ్ళలో తెలిసిపొతుంది పాపం మావారు బంగారం

Tuesday, 10 April 2018

గురు పూజ పాట కొసం కలవరించా
గురువు అనుగ్రహం కలిగిందెమొ ఇప్పుడు నేర్చా
                   
ఆశ్రమంలో వేసిన ట్యగ్ గురుపూజ వాలంటరీ చెసినందుకు
ఆనందానికి హద్దులేవు అడగకనే ఇచ్చిన వరంఇది నాకు

Sunday, 8 April 2018

పుడమి కి ఎంత ప్రేమొ తనలో అన్నీ దాచుకుంటుంది
పూచెపూల సుగందాలు  మనం చెత్తనువేస్తె మట్టినుండే వస్తుంది
మొక్క లేకుంటే మనం లేము
మొక్కాలి వీటిని అవే మనలోని ప్రాణము
పుడమి ఒక అద్భుతం కర్మభూమి ఇది
పుండరీకాక్షుడే మెచ్చిన పుడమి ఇది
జలజలా పారే నదులున్నభూమి
జఠాధరుని తలపై జాలువారిన గంగ అవతరించిన భూమి


Saturday, 7 April 2018

మువ్వల్లే కూస్తున్నాయి గువ్వలు ఆనందంగా
మువ్వన్నె చీరకటి నేను ముగ్దమనోహరంగా
సవ్వడులు వింటున్నా శకుంతలాల స్వరాలాపనలో
సవ్వాలక్ష వ్యపకాలనుండీ విముక్తి పొందా నాదారాధనలో

Friday, 6 April 2018

కోయిల కెమయింది తన కొత్త పాట వినిపించలేదు

Thursday, 5 April 2018

వసంత గాలి వీస్తొంది వఠవృక్షాలన్నీ కడిగిన ముత్యంలా మిలమిలా మెరుస్తున్నాయి
వర్షం వచ్చి మొక్కలకు వన్నె తెచ్చింది పక్షులు పలుకులతో నా మనసుకు వచ్చింది హయి

Wednesday, 4 April 2018

వజ్రాసనంలో కూర్చుని ఆసనాలు వెస్తుంటే
వంగి వళ్ళు వంచే  ఆసనాలతో కీళ్ళ నొప్పులకు తాళలేక                         పొతున్నాను
వరమా ఇది జ్వరమా ఇక ఆపెయాలనిపిస్తుంటే
వద్దు వద్దంటూ వారిస్తున్నారు స్నేహితులు నన్ను

Tuesday, 3 April 2018

వాన హోరుమంటూ కురుస్తూ నేను తడుస్తుంటే
వానచినుకు నెలజారి వలయంగా ముగ్గెస్తుంటే
వాటితో పాటే చినుకు మొగ్గనై నే మారిపొవాలి
వాలిపొయి ప్రతిపువ్వుపై చినుకులా చిందెయ్యలి
వాంఛలన్నీ ఒక్క సారె నన్ను కమ్మి ఆనందం లో ముంచెస్తున్నాయి
వాగులా వలపులా మదిలో మెరుపులా ఉరుములా నా ఉహలా చినుకులు చిలిపిగా తడిపెసాయి

Monday, 2 April 2018

పగడపు రంగు దుస్తులు దరించి పసిడిరంగు కిరణాలతో                     నన్ను అభిషేకం చెస్తున్నాడు సూరీడు
పండుగ వైభవంగా ఆశ్రమంలో పౌర్ణిమ గడిచిన రేండోరోజు  దీపాల వెలుగులో వెెడుకలు

Sunday, 1 April 2018

వాన వచ్చె నేను మెచ్చెలా
వాగులా మార్చె నెల నిండె గంగమ్మ చీర కుచ్చెళ్ళలా

అందమంతా ఈ చందమామలొనేవుందా
అంత ఆకర్షణ ఎంటోయినీకు కట్టిపడేస్తున్నావు
మాయలో పడేసే మాయదారి చందమామా
మాటలే లేకుండా నీ వెన్నెల జల్లులేంటమ్మా
ఆ తారను నీ ప్రేమలో ఎలా పడేసావు
ఆ తీరుగా ఏ మత్తు చల్లావు
నింగినంతా నీ తేజంతో నింపెసావు
నిన్ను మించిన అందగాడు లేడనిపిస్తున్నావు
ఇన్ని తళుకులేంటోయి నీకు
ఇక చాల్లే ఆపు తరిగిపొయేనీకు ఈ సొగసులెందుకు