Saturday, 31 March 2018


ఎంత అందగా ఉందో ఆశ్రమం
ఎప్పుడు వచ్చి తీసుకుంటానో బ్రహ్మచర్యం
ఏదోకరోజు ఇక్కడే వుండిపొడం ఖాయం
ఏం చెప్పను మా నాన్నమ్మ ఒడిలా వుంటుంది స్వచ్ఛత అచ్చమైన నామం
అందరూ వెన్నెల్లో ఆనందగా భొంచెస్తుంటే ఆకాశంలో విహరిస్తున్నట్టుంది
అప్పుడే నాలుగు రోజులు గడిచింది
అంతత్వరగా ఈ రోజులు ఎందుకు గడిచిపోతోంది
అప్పుడుడప్పుడూ నాకొసం కాలం ఆగితే ఎంత బాగుంటుంది
వర్షానికి తడిచిన కొబ్బరాకు చాటుచెసుకుని దొబూచు ఆట ఆడుతున్నాడు చందమామ
వనమంతా వానజల్లుతో ఒక్కక్షణంలొ తడిపెసి మాయమైపొయింది ఇది చినుకు మంత్రమా



Tuesday, 27 March 2018

జీవించడం ఇంతకష్టమా అని భావించిన రోజు నుండి
జీవితం అంటే ఇంతేనా అని ఆనందం విలువ            .            తెలుసుకున్న ఈ రోజు వరకు
అన్నీ చవిచూసాను అప్పుడు బాధపడ్డవన్నీ తలచి ఇప్పుడు నవ్వుకుంటున్నాను
అనిర్వచనీయమైనది జీవితం
అందగా మలచుకొవడం మన కర్తవ్యం



Monday, 26 March 2018

ఈ అనంతంలో నేన్నది చిన్న అణువె అందులో బుల్లి ఇల్లు మాది.  రాముకి సిగరెట్ అలవాటు అదిఎలాగైనా మాన్పించాలని ఎన్నో ప్రయవత్నలు చెసాను. ఆ విషయం వల్ల ఎన్నో గొడవలు మనశ్శాంతి కి దూరంగా ఎన్నో సంవత్సరాలు గడిపెసాం అలవాట్లు జొలికి వెళితెఇన్ని కష్టాలు వస్తాయని తెలీదు కానీ ఒక మంచి అయితే జరిగింది మా అబ్బాయికి ఏ చెడు అలవాట్లు రాలేదు
ఇప్పుడు ఏ గొడవలూ లేవు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉడగలుగు తున్నాను ఈ ఆనందానికి కారణం ఈగొ లేకుండా ఎక్కువ ప్రేమిచడమే నాలో తప్పు లను సరిచెసుకొడం. మావారికి నేను తప్ప ఎవరున్నారు ఎం కావాలన్నా ఎవర్ని అడుగుతారు పాపం. నా పిల్లల తోపాటూ ఆయనా పసిపిల్లవాడె రాము గురించి అన్నీ తెలిసిన ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచిస్తే అర్థం అయింది. మిక్సీ ని ఎలా వాడాలో తెలుసు, మొబయిల్ ఎలా వాడాలో తెలుసు వస్తువులను వాడె విధానం తెలియకపొతె చాలా ఇబ్బదులు పడతాం అలాంటిదె మనుషులతో మసలుకొడంకూడా ఇది తెలుసుకుంటే జీవితం చాలా హ్యాపీగా సాగిపొతుంది. ఒక మనిషికి తెలీదని అంటే చెప్పాలి. తెలుసుకున్న విషయాన్ని ఎలా వాళ్ళజీవితాన్ని మలచుకుంటారన్నది వాళ్ళకేవదిలేయాలి
నేను ఈ భూమి పైన శాశ్వతంగా వుండిపొయెదానిలా ప్రవర్థించకూడదు. నాదంటూ ఏదీ లేదు పొయెటప్పుడు ఈ శరీరంకూడా నాతో రాదు ఒక్క చిన్న వస్తువుకూడా తీసుకెళలేను ఈ రోజు నాదనుకున్న వస్తువు రేపు ఇంకెవరిదో అవసరం వున్నవాటిని ఉపయొగించుకొవాలి
అవసరానికి మించి ఏదీ చేయకపొవడమే మంచిది


Sunday, 25 March 2018

మనిషి మెధాశక్తిలోంచి పుట్టుకొచ్చిన ఎన్నో పరికరాలు
ప్రగతి సాధించాయి అది అద్భుతం
మనసుకు నచ్చిన మనిషితో మెరుగైన జీవితం గడపడం అవుతోంది దుర్భరం
అనవసరపు ఆలోచనలతో భాధలు పడడం
ఆవసరమైనంత శ్రమ శరీరానికి లేకపొవడం
నాగరికత పెరిగి ఆహరంలో మార్పులు రావడం
నాగతంలోనూ సమస్యలు కబళించాయి వాటిని అధిగ మించడ నా అదృష్టం
నన్ను నేను మలచుకొవడం
నిన్నటిని తలవకపొవడం
నా చిన్ని చిన్ని తప్పల్ని మా వారు క్షమించడం
నాలో అది పెద్దమార్పుకు దారితీయడం
మా అనుబంధం గట్టిపడ్డం అది నాకు వరం
మా జీవితం ప్రేమమయం అయిపొవడం ఆనందమైన విషయం
అమితమైన ప్రేమలో మునిగి పొవడానికి ఇదొక మహత్తర అవకాసం
అన్నింటికన్నా మిన్న ఎంటంటే సద్గురు చెప్పిన సందేశాలన్నీ పాటించడం






Saturday, 24 March 2018

కొయిల తన గళం విప్పి పాడలేదు వసంతగానం
కొమ్మల్లొ లేతచిగురులతో నిను పిలువలేదా వసంతం

Friday, 23 March 2018

వసంతం పచ్చని చీరను కట్టి ముచ్చటగా రంగు రంగుల పూలన్నీతలలొ తురిమింది
వస్తోంది కోయిల తన గొంతు సవరించుకుంటూ కొత్తపాట ను మొసకొస్తోంది

Thursday, 22 March 2018

ఓ మనిషి

                           ఓ మనిషి
నీరు నీశరీరంలో మూడు వంతులు నిండివుంది
నీటికి చాలా ప్రాధాన్యత వుంది ప్రాణికోటి అంతా నీటిపై ఆధారపడివుంది
నీళ్ళు అన్నవి పంచభూతాల్లొ ఒకటి గా వున్నాయి
నీలో పంచభూతాలు ఇమిడి వున్నాయి
నీలా ఏజీవీ ఈనీటిని కలుషితం చేయలేదు
నీ మనుగడ కోసం ప్రకృతిని పాడు చెస్తున్నావు దీనికి మూల్యం తప్పదు
నీ అవసరాలకు మించి అన్నిటి నీ వాడి వృధా చెస్తున్నావు
నీ ఆగడాలకు సముద్రం నీరు కలుషితమై అందులో                              . జీవరాసులు అంతరించిపొయెలా చెసావు
నీవే నీటిని కొని తాగే దుస్థితి కి తెచ్చావు
నీనేలపై నీటిని మాయంచేసి చద్రునిపై నీటి ని వెతుకు   .....       తున్నావు
నీవు ఇకనైనా కళ్ళు తెరు ఏ ప్రళయమొ దానంతట రాదు                                       ఆ పరిస్థితి నీవే కల్పిస్తున్నావు

అనుగ్రహం కొసమె యొగా
అవి నాలుగు రకరకాల యొగాలు
1జ్ఞాన యొగా
2.భక్తి యొగా
3. ఖర్మ యొగా
4. క్రియా యొగా
అన్నింటి కలయికే అనుగ్రహం
అది సాధిస్తే అద్భుతం
అనంతం అంతా భగవత్ స్వరూపం
అవతారపురుషుడు ఆ శివుని సర్వస్వం
అంతర్ముఖులై సొధిస్తే, ఆది, అంతం అంతా శివమయం
అర్పించుకుని ఐఖ్యం అయిపొతే తధ్యం మనకు మోక్షం
అమరం జీవం అశాశ్వతం దేహం
అమృత వాఖ్యలతో మృదుమధుర గానంతో సద్గురువు
అందరి భక్తులలో అజ్ఞానాన్ని తోలగించె తొలిగురువు



Wednesday, 21 March 2018

ఈ రొజు అడవుల దినోత్సవం నేను నఉసిరి విత్తనాలు నాటాను
ఈ అడవులన్నీ పూర్వపు వైభవాన్ని సంతరించుకొవాలని కొరుకుంటున్నాను
ఈ దేశానికి నిండైన అందం అడవులే
ఈ నేలను సుభిక్షం చెసేది నదులే
ఈ ప్రపంచంలోని ప్రజలకు కడుపు నింపెది రైతె
ఈ భరత మాతను సంరక్షించే సైనికుడే
ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ జీవించి మనుగడ సాగించాలంటే చెట్లు వుండాల్సిందే
ఈతరంలో మనం నాటిన మెక్కలే రేపటి మన పిల్లలను రక్షించెది
ఈసూత్రం అందరూ సాప్రదాయంగా సజావుగా పాటిస్తే సస్యశ్యామల దేశం మనదౌతుంది


అశాంతి నుండి ప్రశాంతత లోకి చెరాక ఆనంద శిఖరాలు అలా తాకేస్తున్నాను
అసంతృప్తి కి తావే లేదు అశల హరివిల్లులో హయిగా నిదురిస్తున్నాను
అందరిపైనా క్షమా గుణం వచ్చెస్తోంది
అందరినీ ఆడిపొసుకుని ఎం సాదిస్తాం అద్దాంతరంగా పొయె ప్రాణమిది
అమితంగా మరణాన్ని ప్రేమిస్తే ప్రాణామంటే వుండదు భయం
అనంతమైన ఆనందంలో ఓలలాడుతున్నా యొగా సాదనలో ఇప్పుడే మొదలైంది ఆనందం
అంతరిక్షంలో నా మనసుకిరెక్కలు తొడిగి విహారిస్తున్నట్లుంది
అతీంద్రియ శక్తి ఏదో ఆవహించినట్లుంది
ఆధ్యాత్మికతలో లోతెంతో తెలియాలి
అది అనితర సాధ్యం అయినా ఫలించాలి




Tuesday, 20 March 2018

కొపం వచ్చి నపుడు ఎదిటి మనిషి తప్పే కనిపిస్తుంది
కొద్దిగా తేడా గమనిస్తే, ఈ కోపం ఎదిటిమనిషి మనపై చూపిస్తే చాలా బాధ కలుగుతుంది
కొన్ని సత్యాలు ఇలానే ఉంటాయి
కొందరు సద్గురువుల బోధనలు వింటే నిజాలు బొధపడతాయి

Monday, 19 March 2018

కర్మ తగ్గాలంటే మాటలు మాట్లాడం మనేయాలి
కళ్ళముందు వున్నది వున్నట్టుగా ఆశ్వాదించాలి
మౌనం అన్నింటికీ మంచిది


Sunday, 18 March 2018

ఉగాది

ఊరించే ఉగాది రానే వచ్చింది వసంత కోకిల తన గొంతు                                                      ఇంకా సవరించలేదు
ఊహించని విదంగా ఉదయ భానుడు ఉగ్రరూపం                                                                          దాల్చలేదు
ఊరట నిస్తోంది ఉగాది నిన్నటి వర్షంతో చల్లని గాలితో                                                          హయినిగొలిపిస్తోంది
ఊహకందని ఉగాది ఇది వంటగదిలో వెడికి వండి వడ్డించె                           ఇల్లాలికి చల్లని వాతావరణం వరమైంది
ఊపిరిసలపని పండగపనుల్లో ముచ్చెమటలతో విసుగు                  రాకుండా వసంతగాలి వనితకు హయినిస్తోంది
ఊరు ఊరంతా ఉగాది వేడుకల్ని వేకువజామున నే మొదలెట్టింది
ఊరుకోదే నామనసు ఉప్పొంగె ఉగాదికవితను రాయ కుండా, ఏశక్తీ ఆపలేనిదిది 

Saturday, 17 March 2018

ఉగాది సినిమా

ఉగాది సినిమా చూసాక కృష్ణా రెడ్డి గారికి నేను బిగ్ ఫ్యన్ అయిపొయా ఆ స్మైల్ ఆ యాక్షన్ నాకు బాగా నచ్చెసిది ఆ కొంటెచూపూ ఆ ఓదార్పు అలవొకగా అలా నటించెసాడు అప్పుడేప్పడొ చూసిన సినిమా అయినా ఇప్పుడే చూసి నట్లు అనిపిస్తుంది లైలా కృష్ణారెడ్డి మంచి జంటగా కనిపిస్తారు లైలా స్మైల్ కూడా చాలా బాగుంటుంది







సూరీడు దర్శనం ఇచ్చాడు రేండు రోజులు కనిపించలేదు
సూర్యుడు లేకుంటే ఊహించుకోలేము జీవరాసే లేదు
ఉచితంగా ఎన్నో ఉపయొగాలు పొందుతాం
ఉదయం అరుణవర్ణంతో భాస్కరుడు దర్శనం
ఉప్పొంగుతుంది నాలో ఆనందభాష్పాల వర్షం
ఉందో లేదో ఈ లోకం గుర్తేరాదు ప్రకృతిని చూస్తే పరవశం
సూన్యంలో ఈ సృష్టి లో ఎన్నో వింతలు కన్నులకు విందె చెస్తోంది
సూక్ష్మంగా ఆలోచిస్తే విశ్వంలో సూన్యమే ఆవహించి వుంది



Friday, 16 March 2018

వర్షం వచ్చి అలా పలకరించి వెళ్ళిపోయింది
వరమల్లె వస్తుంది వాన నిలువెల్లా తడిపెస్తుంది
వీచె గాలికి నేను గల్లంతు అవుతానేమొ
వీణలు మీటి వీణాగాలు పలికిస్తున్నాఏమొ
వాలే ప్రతి వాన చినుకూ వొళ్ళంతా గిలిగింతలు పెడుతోంది
వాకిట్లో నిలుచునివున్న నన్ను ఊరిస్తోంది ఉడికిస్తుంది
వెల్లువల్లె ముంచెస్తుంది
వెల్లివిరిసి మత్తెక్కిస్తుంది
వానకారు రాలేదు ఎంటో వింతవాన
వానంటే వానకాదు వలపులవాన



Thursday, 15 March 2018

చల్లగాలితో కాసెపు కబుర్లు చెప్పుకుని
పిల్లగాలికి పక్షులు పలకరిస్తుంటే విని
కళ్ళలో ఆనందాని నింపుకుని
కాళ్ళ కు తకధిమి తాళం ఆడించుకుని
మళ్ళీ ఎవరైనా చూస్తున్నారెమొనని గమనించుకుని
గళం విప్పి నాలుగు పాటలు పాడుకుని
ఖాళీగా అలా గడుపుతున్నావు అని
తుళ్ళిపడి పనులన్నీ గుర్తు తెచ్చుకుని
దీని తల్లీ ఎప్పుడైపొతాయొ తొక్కలొ పనులన్నీ అని
ఇల్లు సర్దుకునే పనులు మొదలెట్టాను.
       .....😂😃😂😄😅......

Wednesday, 14 March 2018

నా జ్ఞాపకాలలో తియతియని తెనెలొలికే పాటలు పాతపాటలే అయినా నను మరపిస్తాయి
నాలో మధురమైన భావాలతో మనసుకు హత్తుకుపొయి అందమైన ఉహల్లో తెలే బుజ్జి కథలున్నాయి
నాతో అల్లుకుపొయి అల్లిబిల్లి కథలు చెప్పె చాలా పాటలు వున్నాయి
నాకొసమె వచ్చినట్లు అప్పట్లో నా భావాలకు తగినట్లు ఈ పాటలు నన్ను అలరిస్తాయి







Super songs


Tuesday, 13 March 2018

గతాన్ని గుర్తు చెసుకుంటే నాన్నమ్మ ప్రేమలో నేను పొందిన ఆనందం ఆ గారాబం తనఒడిలో ప్రేమ గుబాలింపు ఇప్పటికీ గుర్తెనాకు నాన్నమ్మ మరణం తలచిన నాకంట కావెరీ ప్రవాహమే, అమ్మమ్మ, మా నాన్న వీళ్ళు లేని లోటు ఎవరూ తీర్చలేనిదె మరణం ఎంత దయలేనిదో వున్నదొక్కతే అమ్మ అందుకే వెళుతున్నా అమ్మదగరకి
అమ్మ వంటరికాదు నేను వున్నానని ఎంత ఏడ్చిందొ ఒంటరిగా పాపం పిచ్చిది. ఈ జ్ఞాపకాలు నన్ను కన్నీటి పర్యంతం చెసెస్థాయి అగని ప్రవాం కట్టలు తెంచుకుంటాయి అమ్మనైనా ఆనందంగా ఉంచాలి రొజూ నా కాల్ కొసం ఎదురు చూస్తూవుంటుంది. తనదగ్గరే వుండి తనకున్న రొగాలన్నీ మటుమాయం చెయ్యలి.
ఆనందాన్ని చవిచూపించాలి ఇక ఆలస్యం చేయక వెళ్ళడానికి వీలైనంత త్వరగా పనులన్నీ ముగించుకొవాలి

Beautiful song



హైదరాబాద్

వచ్చాను  ఎన్నో ఆశలతో  హైదరాబాద్ నగరానికి
వచ్చిన పనులన్నీ ముగిసాయి తిరిగివెళుతున్నా నా                                                                           తీరానికి
మా ఊరు నన్ను తిరిగి రమ్మని పిలుస్తోంది
మా‌విచిగురులాంటి పచ్చని జ్ఞాపకాలను మళ్ళీ పంచమంటొంది
మాఇంటిని పొదరింటిని  పదిలపరిచెందుకై మనసు పరుగులు పెడుతొంది
మారిపోకు మా నను మరచిపోకుమా హైదరాబాదు నగరమా
మాకొసం వెచిచూడు అప్పుడప్పుడూ షాపింగ్ కై వస్తాసుమా
మాటి మాటికీ నీకై రాలెనయ్య ట్యాంకుబడిపై సుందర సూర్యాస్తమయం చూడడానికి
మాటరాని మౌనంతో చూస్తూ వున్నా నీటి మద్యన బుద్ధుని ప్రతిమని
మాటాడె పక్షులు కొలువై వున్న నెహ్రూజూలాజికల్ పార్కు నాకెంతో ప్రియమైంది
మాఘమాసంలో సందెవెళ సీతాకోకచిలుకలునై నెనూ సందడి చెయాలనుంది
వందేళ్ల కు సరిపడ ఆనందాన్ని ఒక్క క్షణం కూడా వదలకుండా అలా తెలిపొతూ గడిపేస్తా

Monday, 12 March 2018

వసంతం వాలిపోతోంది పచ్చని పట్టు చీర కట్టి పైరగాలితో కోలాటం ఆడుతోంది
వరించివచ్చే వయ్యరిభామలా వనమంతాపూల పరువాల తో వొళ్ళు విరుచుకొంటోంది
వీటన్నింటినీ చూస్తే ఆనంద పలళ్ళు లేడి పిల్లలా గంతులెస్తుంది
వీక్షిస్తూ ఈకొండల్లో  విపంచిలా  వినీలాకసంలో విహరిస్తూ వుండిపోవొలనుంది
వెన్నెల్లో లోయల్లో లొతెంతో తెల్చెయాలని నా మనసు లోయల్లో కీ దూకెస్తుంది
వెనుక చెరి నన్నెవరో తరుముతున్నట్లు పడిపొతావంటూ పట్టుకున్నట్లు చెయ్యెదో అందిస్తోంది



Sunday, 11 March 2018

ఇది నా అందమైన జ్ఞపకం

నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి



Saturday, 10 March 2018

నాలో నాకు ఒంటరిని అనే భావన లేదు
నాఆలోచనలో బాధ అనే పదానికి చొటులేదు
ఆనందమైన జీవనం నాదే
ఆరోగ్యం లోనూ విజయం నాదే
గతం లో చేదు అనుభవాలు నేను సృష్టించుకున్నవే
గందరగోళం గొప్యం నాలో భయాన్ని పెంచెవే
ఇప్పటి ప్రశాంతత ముందు అన్నీ బలాదూర్
ఇంక  కష్టాలకు కృంగిపొయెదిలేదు కష్టాలకు కబడ్ధార్                  ...   .                                          


Friday, 9 March 2018

ప్రేమ గురించి రాయాలి అమ్మనుకదా ఆ ప్రేమామృతాన్ని నాచెయి అలవొకగా రాసెస్తుంది
ప్రేరణ మనిషికి ప్రేమే, అపురూపంగా మొదలై అనంతంగా సాగుతోంది

Thursday, 8 March 2018

ఉదయం రైల్వే స్టేషన్ లొ ఒక అమ్మాయి అబ్బాయి
ఉన్నారు వాళ్ళిద్దరూ భయంగా అబ్బాయి వళ్ళంతా గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి
నాకెందుకొ అనుమానం వచ్చి అడిగా మీకెమైనా ప్రాబ్ల్ం వుందా నెను మీకు సాయం చెయగలనా అని
నా కళ్ళలోకి చూడలేక ఆ అబ్బాయి  తలదించుకునే  సమాదానం ఇచ్చాడు వద్దని
ఏమైనా తిన్నారా అని అడిగా తిన్నాం అన్నాడు
ఏం చెయాలో తొచలేదు నాదగ్గర యపిల్స్ వున్నాయి ఇచ్చి జాగర్త అని చెప్పి వచ్చెసాను

Wednesday, 7 March 2018

భావస్పందన సాధన సుఖక్రియ, ఆఓంకారం మొదలైయింది
భారమంతా దించుకునెందుకు యొగా ఒక వరమై వచ్చింది
నాలో చాలా మార్పు భక్తి వల్లే సాద్యం అయిది
నా మనసులో బాధలకే ఎక్కువ స్పందనవుండెది
నిజానికి బాధ అన్నది నాకునేను సృష్టించుకున్నది
నిజమెంటో బొధపడ్డాక గతంగుర్తొస్తె నవ్వు వస్తుంది
జీవితం ఆనందమయం చెసుకొడం మన చెతుల్లొనేవుంది
జిలుగులు వెలుగుల్లో దీపావళి లా జీవితం సాగిపొతొంది
మార్పు వచ్చింది యొగావల్లె అధ్భుతమైన మార్పుఇది
మార్చివెసింది నన్ను మెరుగైన జీవితంనాకిది

Tuesday, 6 March 2018

అమ్మ అరక్షణం విశ్రాతి లేకుండా పనిచెయించెస్తుంది
అమ్మొనావల్లకానిపని అనిచెప్పాలనుకన్నా పాపం కదా అనిపిస్తుంది

Monday, 5 March 2018

అమ్మని జబ్బులులేని స్థితిలోకి తీసుకురావాలనే ప్రయత్నం విఫలం అయింది
అలవాట్లు అంత త్వరగా మానలేకపొతోంది

Sunday, 4 March 2018

కొబ్బరాకు చాటున చందమామ తొంగిచూస్తొంది
కొత్త గా చూస్తున్నట్టు వింతగా తోస్తుంది

Saturday, 3 March 2018

చలి పోయి వెశవి ఎండలు మొదలయ్యయి
చమటలతో చిరాకులు మొదలయ్యాయి

Friday, 2 March 2018

పూనే చూడ్డం ముగిసింది
పూలమొక్కలు మొదలుకుని మహావృక్షాలవరకు అద్భుతంగా వుంది
అడవి అందాలు కొండలు కొనలు
అడుగు ముందుకు వెయనీవు అందమైన భంధాలు
వదలేక వదలేక వెనుతిగాను గానీ వదిలి రావలనిలేదు
వంద సంవత్సరాలు అయినా ఈ అందాలను                                                 చూసేందుకు సమయం సరిపోదు
ఒక్కోచెట్టుది ఒక్కో అందం
ఒక్కసారె అలాచూసి రాలేం
ప్రపంచంలో ప్రకృతి కన్నా ఆందమైనదేదీలేదు
ప్రప్రథమ స్థానం పుడమి తల్లిదే ఈమాటకు తిరుగులేదు

Thursday, 1 March 2018

వెన్నెల్లో ప్రయాణం చెస్తుంటే మత్తైన మైమరపు
వెన్న పూసల్లె కరిగె మనసు, చందమామను చూస్తే తొంగి చూసె తొలకరివలపు
వల వేసి జాబిల్లి వైపు లాగేస్తుంది
వలపుగాలి చల్లగా తాకుతొంది
వన్నెచిన్నెల తారలతొ చందమామ సైయ్యటలాడుతొంది