Wednesday, 28 February 2018

నా మదిని దొచేస్తోంది సుందర సూర్యాస్తమయం
నాకొసమె ఆకాశంలో తిరిగి అలసిన అరవిదునికి పాడాలి లాలి గీతం

Tuesday, 27 February 2018

మొక్కలపై మమకారం పెరిగిపోతోంది
మొత్తం అన్నిరకాల మొక్కలూ నా పెరట్లోనే వుండాలని నా మది ఆశిస్సోంది

Monday, 26 February 2018

పుడమి తల్లి పచ్చని ప్రేమని అదిస్తుంది
పుట్టిన ప్రతి ప్రాణీ ఇక్కడ పరవశిస్తోంది
పులకింతలతో ప్రకృతి అందాలను ఆరబొస్తోంది
పూలన్నీ పూచి ప్రతి పువ్వూ అందానికి పొటీ పడుతుంది

Sunday, 25 February 2018

పాడవుల పాదాల గుర్తులు చూసాం
పాలుపోక ఎవరో రాతిపైచెక్కారేమొ అని నేనంటే అంతా నవ్వుకున్నాం
పట్టపగలే వెన్నెల కాస్తుంది చందమామ పలకరిస్తున్నాడు
పచ్చని చెట్లు కొండలు లోయలు క్రిష్ణా నది పుట్టిన చోటిది

Saturday, 24 February 2018

Aga khan palace

గాంధీ గారి జైలు జీవితం
గాంధీ గారి భార్య మరణం
అగా ఖాన్ ప్యలస్స్ రాజవైభవం

Friday, 23 February 2018

శనివార్ వాడ

అందమైన కొటగొడలు, బురుజులు
ఆహ్వనాలు పలికే పూలమొక్కలు
అపురూపమైన వృక్షాలు కొత్తచిగులతో చిందిస్తూ వున్నాయి చిరునవ్వులు
ఆకాశాన్ని తాకుతున్నట్టు అశోక వృక్షాలు
అన్నీ చూస్తూ నా మనసు ఆనంద పరవళ్ళు


ప్రయాణంచెస్తూ పాటలు వింటూ నిద్రలోకి జారుకుంటే ఆ ఆనందమే వేరు
ప్రణయాల పాటలు పైనుండి చంద్రవంక చంద్రుడు తార వింటూ చేరువయ్యారు
ముచ్చట గొలిపె దృశ్యం మురిసిపోయి చూస్తూ నేను
ముంచుకొస్తున్న నిద్రని ఆపుకుంట ఆనందిస్తున్నాను

Tuesday, 20 February 2018

                        ప్రతిజ్ఞ
1.ఈప్రపంచానికి నేను తల్లిని
2.ఈశరీరాన్ని కాను నేను మనసు కూడాకాదు
3.నాజీవితంలొ ఎవెవిజరుగతున్నాయొ అవన్నీ సరిగ్గానె  జరుగుతున్నాయి ఇంకొలా జరిగె అవకాశంలేదు
4. ఈసృష్టిలో ప్రతి జీవికి ప్రతివస్తువికీ ప్రతిసంగటనకూ నేను బాద్యురాలిని
5. ఈ ఒక్క క్షణం అత్యంత ముఖ్యమైనది

6.అన్ని రూల్స్ నా రూల్స్

Monday, 19 February 2018

డయాబెటిస్ పారిపొవాలి డైట్ మొదలైంది
డాక్టర్ ఇచ్చె మందులు వాడాల్సిన అవసరం లేదు

Saturday, 17 February 2018

నాలో మార్పు సామాన్యమైందికాదు
నాకే తెలుస్తోంది చకచకా ఎందుకు జరుగుతున్నాయొ తెలీడంలేదు
నాగుండె ఆగిపొవచ్చెమొ తెలీదు
నా చావు తెలిస్తే బాగుండు చావుకు భయపడేదీలేదు
      మరణం మదురం అఖిలం మదురం
      మృత్యోర్మా అమృతంగ మయా 

Friday, 16 February 2018

చిత్రంగా తొచింది ఈరోజు మావారిని ఈషా ఆశ్రమం మార్చెసింది
చిరాకుకు మారుపేరే మావారు చిటపటలాడె మావారిలో కాస్త మౌనం చొటుచెసుకుంది


Thursday, 15 February 2018

బంగారం లాంటి ఫోన్ పోయింది

Wednesday, 14 February 2018

అడావుడి లేకుండా ప్రశాంతంగా గడిచింది
ఆశ్రమం భక్తులతో నిన్నటిదాకాకిటకిటలాడింది

నిన్న శివ రాత్రికి సేవలు అందించడం
నిమిషమైనా తీరిక లేకపొవడం
అటు ఇటు తిరగడం లోనే అలసిపోవడం
ఆడి పాడి ఆనందలో ఓలలాడిపొయాం
రాత్రి త్వరగా గడిచింది
రాతిగుండే సమయానిది
పరుగులు పెట్టాఏమొ గడియారంముల్లు

Monday, 12 February 2018

ఆశ్రమం లో వంట గది చూస్తే ఆశ్చర్యం వెసింది
అస్సలు ఆలోచించనేలేదు వంట ఇంత వండుతారని
అలారం మొగినట్లు టైంకి వెళ్లి తినడమే కానీ
అలా వెళ్ళి వంటపనులలో సాయం చెశాక అర్ధం అయింది
అంతమందికి అన్నం ఎలాపెడుతన్నారన్నది
అందులో ఉడతాభక్తిగా నాసాయం అందించినందుకు చాలా ఆనందంగా వుంది

Sunday, 11 February 2018

ఈరోజు అద్భుతమైన రోజు మొట్టమొదటిసారి సద్గురు పాదాలు సృశించిన రోజు
ఈరోజు కై ఎంత తపించిందో నామనసు నా భక్తిమార్గానికి తొలిమెట్టు ఈరోజు
హిమాలయాలు అధిరోహించిన ఆనందం
హంకారమే లేని నిలువెత్తు జ్ఞానతేజం
సద్గురు పాదస్పర్శ నిజమాకలయా నమ్మలేని నిజం
సమీపంలో సద్గురు వున్న నాకంట ఆనందభాష్పాల వర్షం
నానొట మాట రాదు వర్షించె కంటి వూసుతప్ప
నాముందు సద్గురు వుంటే నాలో ఉప్పెన అందులో నామనసు తెలియాడు తెప్ప
ఈ ఆనందాన్ని వర్ణిచ  వీలుకాదు అది దివ్యమైనది
ఈ అనంతాన్ని అర్థవంతంచెసె మార్గం గురువు చెతిలొనేవుంది

Saturday, 10 February 2018

పుట్టినరోజు

పుట్టినరోజులు ఎన్ని జరుపుకున్నా ఇదే తొలి పుట్టినరోజులా తోస్తుంది
పుట్టుక అందరిదీ ఒకేలావున్నా నాజీవితం చరిత్ర పుటల్లో నిలిచిపొవాలనుంది
పుడమి పులకించాలి అరుదైన ఆరోజు రావాలి
పూచినపూవ్వు నాచిత్రపటంముందు వాలుటకై తపించాలి

Friday, 9 February 2018

వర్షం కురుస్తుంటే వలపు గాలి వంతపాడుతుంది
వనంలో వానచినుకు నను తడిపేస్తుంటే వరమైతోస్తోంద
వల్లమాలిన ఆనందం వద్దన్నా కమ్మెస్తుంది

Tuesday, 6 February 2018

అనుభూతులు అన్నీ పలకరిస్తున్నాయి
అసాధ్యం అనుకున్నవి అనుభవంలోకి వస్తున్నాయి

Sunday, 4 February 2018

అమ్మ లో చాలా మార్పు వచ్చింది
అమ్మొ ఇంతమార్పా అనిపించెలా వుంది
నమ్మకం ప్రేమ నయనాలలో వ్యక్తమౌతోంది
నమ్మి చెడెదెముంది, నారాకకై ఎదురుచూస్తోంది


Friday, 2 February 2018

ఆరోగ్యం బాగుండాలనే చింత ఎక్కువైయింది