Monday, 10 December 2018


ఈ కాలపరిమితి నాకు తగినంత లేదు ఇంకాస్త కావాలి

Saturday, 8 December 2018


మనిషికి మనిషికి మధ్య మట వారధి
మనసుకు మాట నచ్చితే ఆ మాట మత్రమౌతుంది

Friday, 7 December 2018

నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు
నీ రాకతోనే కంటున్నాయి కలలు
 Super song
 

పాము కరవదనితెలిస్తే చిన్న పిల్లలు కూడా దాన్ని రాళ్లతో కొడతారు బుసకొట్టడమైనా తెలుసుండాలి 

Thursday, 6 December 2018


మనీ వుటేనే మాటలు కలుపుతారు మనుషులు
మమతలు మనిషికి మనీతోనే పుడతాయి ఇవే నిజాలు

Wednesday, 5 December 2018

కమల్ రేవతి ల యాక్షన్ అద్భుతం

పలకరించే గువ్వలతో మైమరపు
పలవరించే పసితనపు నేస్తాలు

Tuesday, 4 December 2018


అపార్ట్ మెంట్ లొనే పనితక్కువ ఇండిపెండెంట్ హౌస్ లో చాలా పనుంటుంది ఫేస్ బుక్ చూడటానికి కూడా టైం లేదు అయినా సొంత ఇంట్లో చాలా ఆనందం వుంది 

Sunday, 2 December 2018


ఆస్తి డబ్బుని గౌరవించాలి అవే  మనిషి కి జీవనాదారాలు
ఆడంబరాలకు తావివ్వక అడ్డమైనవారికి చేయకుదానాలు

Saturday, 1 December 2018

Friday, 30 November 2018


పక్కింటి ఆమె గట్టిగా అరిచింది ఆ అరిచింది నేనేనేమొ అని నాకు ఏదో ప్రమాదం జరిగిందేమొఅని మావారు గాబరాపడి పరుగు పరుగున బయటకొచ్చారు ఆ కళ్ళలో ఏం జరిగిందోఅన్న ఆదృత ప్రేమ కనిపించాయి ఏమైంది అంటూ ఒక తల్లి ప్రేమ కనిపించింది మొదటి సారి నాకు చాలా ఆశ్చర్యం వెసింది నిజమా కలా మావారిలో ఇంత ప్రేమ వుందా నామీద అని నమ్మలేకపొయాను. కాస్తతంత గర్వంగా ఫీల్ అయా చాలా బాగుంది మంచి ఫీల్ i love so much 😙😚😍

Thursday, 29 November 2018


ధర్మానికి కట్టుబడి జీవించే జీవనం
సత్యాన్ని అన్వేషించి ఆచరిండం
అనుభవపూర్వకంగా భక్తి లో పారవశ్యం
అనంతవాయువులో కలిసిపొయేవరకు నాకు ఇదే కావాలి ఆశయం

Wednesday, 28 November 2018


సొంత ఇల్లు పరిసరాల సువాసనల జ్ఞాపకాలు
సొగసులొలికే వనం పూచేపూల సోయగాలు
చెదరని ఆత్మీయం
చెప్పలేని ఆనందం


Sunday, 25 November 2018

స్వేచ్ఛా జీవితం కోరుకుంటే ఆధ్యాత్మికంగా జీవించడమే మార్గం
స్వేధనశోధనతో జీవిస్తే మరణ భయం దాని వెన్నంటే అబద్రతాభావం 

Thursday, 22 November 2018

బాధ్యత అనేది మనిషి తీసుకోగలిగితే
బాధలు అనేవి దూరమౌతాయి
ఆనందంగా వుండడానికి అవుతుంది ఇదే మూలం

Sunday, 18 November 2018

కార్తీక మాసం భక్తి కి అనువైనది
కార్యధీక్షలో నిమగ్నమై భక్తులు పొందే పారవశ్యం

Saturday, 17 November 2018

Friday, 16 November 2018


ఉదయం ఆకాశం ఆహ్లాదంగా ఆనంద డొలలు ఊగిస్తోంది
ఊసులు ఏవొ వినిపిస్తూ హృదయపు మంచు కరిగిస్తోంది

Thursday, 15 November 2018


ఈ ప్రపంచానికి అందరూ సందేశాన్ని ఇస్తున్నారు పాటించెవారు ఎవరు
ఈ సందెశాలు చెప్పెవారు నిజంగా ఎంతమంది అర్హులు
ఒక రచయిత (యండమూరి)ఒక మెజీషియన్ (పఠ్టాబి) వాళ్ళ వృత్తిలో కొద్దిగా ముందంజలో ఉన్నంతమాత్రాన ఈ పొటీపడి మరీ ప్రజలకు తమ సొల్లు పంచుతున్నారు వీళ్ళ నిజీవితాలలొకి తొంగిచూస్తే వీళకన్నా చాలా సామాన్యుడు ఎంతో నయం ఈ అవివేకులను, మూర్ఖులను ఎవరు మారుస్తారొ డబ్బు సంపాదించె ఈజీ మార్గం వెతుక్కున్నారు  

Tuesday, 13 November 2018


మంచుకురిసి మనసుమురిసి మౌనశిలలా
మరుగునపడిన మమతల మాధుర్యం చిలికి రంగరిస్తే విలువ లేక విస్మరిస్తే ఎలా

Monday, 12 November 2018


ఉపాయంతో అపాయం లేకుండా జీవిచాలి అదే జీవనం

Friday, 9 November 2018


కార్తీకమాసం కలికి నొచే నొముల మాసం
కాంతులొలికే దీపాల శోభాయమానం

Thursday, 8 November 2018


 మానవత్వంతో మనవాళ్ళేకదా చెయాలి అనుకున్నా సాయం
మానశికంగా ఆర్థికంగా తొక్కేశారు సొంతమనుషులే తల్లి తమ్ముళ్లే చేశారు మొసం
ఒకరు వ్యాపారం అని మరొకరు డబ్బు ఎగరేసి ముంచేశారు
ఒక ఆడ మనిషికి మొసంచేసి బ్రతికి బాగుపడగలరా



Wednesday, 7 November 2018


దివ్య వెలుగులు విరజిమ్మే దీపావళి
దీపాల వరుస భువిపై ఆ నింగి నక్షత్రాలను తలపించే ఆనందాల దీపావళి 

Monday, 5 November 2018


చిన్నగా మొదలు పెట్టింన పని క్రమం తప్పక చేయాడం
చిత్రంగా అంతిమంలో అద్భుతాన్ని చవిచూస్తాం 

Sunday, 4 November 2018

తల్లి తండ్రి తమ్ముళ్లు వీళ్ళే వస్తువులు వాడుకున్నట్లు విలువలేకుండా వాడు కుంటారని ఎవరూ ఊహించలేని నిజం. ధర్మం అనేదే వుంటే వీళ్ళ మొసంచేయడానికే భయపడెలా శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళ వల్ల నాకుటుంబ భవిష్యత్ కుంటు పడి మానశికంగా ఎతో క్షొభ అనుభవించాను వీళ్ళదగ్గరా నేను మొసపొయింది అని మనుషులంటెనే రొతపుడుతుంది. నమ్మకానికే మాయని మచ్చ నా కుటుంబవ్యవస్త 

Saturday, 3 November 2018


మన సమర్థతలు అసమర్థతలు తెలిసినవారే చేయగలరు మొసం 

Friday, 2 November 2018


సధ్యారాగాలు స్వరాలు ఆలపించే వేళ
సప్త వర్ణాల సొగసులు అద్ది గీసిన చిత్రకళ
సుందర సువర్ణ చిత్రమే ఆకాశం
సూర్యుడు సింధూర పుష్పం
సొంతమయే సొగసు సోయగం
సొంపారగ పడమట సొలిపొవు శంకరాభరణ రాగం

Thursday, 1 November 2018

మాటలు మూగబొతే దాని అర్థం
మనసు కార్యధీక్షలో నిమగ్నమైందని నిదర్శనం
సిన్ని ఈసిన్నీ నిసన్నజాజుల సిన్ని ఈ వన్నె జాజులసిన్ని పున్నమి వెన్నెల లోనే ఈ సిన్ని వెన్నెలై విరబూస్తుంది నీ సిన్ని 
బలే పాటలే ఇది బంతిపువ్వు లాంటి పాట

Wednesday, 31 October 2018

అనుమానాలు అబద్రతాభావాలు ఎప్పుడైతే వదిలెస్తామొ అప్పుడే ఆనందంగా ఉండగలం
ఆలుమగలమధ్య దాపరికాలు లేకుండా వుంటే ఆ సంసారం ఆనందమయమె
పెళ్లి అయిన తొలి రొజులో ప్రణయ రాగమె సంసారం
ప్రేమ సరాగాలు పాడుకుంటూ మేడమీద వెన్నేలరాత్రుల వసంతం


Tuesday, 30 October 2018

మంచు కురిసే వేళ ఉదయ రాగాలాపన
మనసు మురిసే వేళ మధుర స్పందన
తొలిప్రేమ లో నిండి ఉన్న అమాయకత్వం
తొలకరి వాన జల్లులా తుమ్మెద ఝంకారంలా 
శ్వఛమైన మనసుల సరాగం.

సీతమ్మ అంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని

రామ నామం ఎంతోమధురం అంటే నమ్మలేదు నా రాముడి నామమం అంతకన్నా మధురమే



Monday, 29 October 2018

మొబైల్ మొసం బాధాకరం
మొదటి సారి కూడా కాదు పాపం


Sunday, 28 October 2018

పొద్దుపొడుపులొ ముద్దమందార వెలుగులు
పొదరింట గువ్వల కువకువలు

Saturday, 27 October 2018

రవివర్మ చిత్రం లా ఎంతో కొమలంగా ఈపాట మనసుని తాకుతుంది

చల్లని గాలి నులివెచ్చని ఎండ ఇలా చాలా బాగుంది
చలి మొదలౌతొంది గాలి వెగంపెరుగుతొంది

Friday, 26 October 2018


ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎన్ని రంగుల డ్రెస్ లొ ఈ కలర్ డ్రెస్ లు ఎవరూ వెసుకునుండరు 😂😃😄
రెడ్, వైట్, ఆరంజ్ బ్లూ గ్రీన్ అన్ని కలర్స్ వాడెసాడు హీరో




ధర్మాన్ని కొంతవరకైనా పాటిస్తే మానవజన్మ సార్థకం

Thursday, 25 October 2018

ఆడవాళ్లు తమ హక్కులు సాధించు కొవాలనే స్పృహ లేకుండా చెసారు. ఎంతచదువుకున్నా తల్లి తండ్రులు చూపించిన వాన్నే పెళ్లి చెసుకొవాలి. అమ్మాయి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు లేదు. ఒక స్త్రీ తనతో జీవితకాలం కలిసి జీవించే వ్యక్తిని ఎన్నుకునే హక్కు లేదు ఒక అమ్మాయి తల్లి కూడా స్త్రీ యె ఆమే వ వైవాహిక జీవితం లో ఎన్నో కష్టాలు పడ్డా  కూడా ఒక అమ్మాయి కి భర్త ని ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వదు. తల్లి బానిస జీవితానికి అలవాటు పడి కూతురినికూడా అదే ఉబిలొకి లాగుతుంది 

Wednesday, 24 October 2018


ఆనందంతో జీవిస్తె అన్ని అలా నీముందు అవుతాయి ప్రత్యక్షం

అవసరం అయివి అందుబాటులొకి రావాలంటే ఆనందమే మంత్రం
అనుభవ సత్యం


Tuesday, 23 October 2018

జీవా అంటే చాలా ఇష్టం. జీవా అంటె ఎందుకు ఇష్టమొ ఇంతవరకూ జవాబు లేని ప్రశ్న
కానీ ఈ హీరోయిన్ అసలు నచ్చదు
ఉదయకిరణాలు తాకనైనా లేదు
ఉద్యావనం లాంటి నా చిన్ని మొక్కలు పూలు పూస్తున్నాయి


Monday, 22 October 2018


మంచి మనుషులతో కొరా మంచి స్నెహం
మధరమైన నిస్వార్థంమైన స్నేహాలు లభించాయి నా అదృష్టం
అమ్మలాంటి ప్రేమ
అక్కున చేర్చుకునే బాధ్యత
భక్తి భావంతో ఒక్కటైన చొట అది అందరి ప్రేమ సంగమం
భయం లేని బద్రత నమ్మకం

Sunday, 21 October 2018

 
విసుగు లేక ఎప్పుడూ వినాలని పించే విరహగీతం

పదహారు ప్రాయంలో ఉరకలెసే ఉశ్చహం
పరవళ్లు తొక్కే ప్రాయంలో ప్రపంచాన్నే మర్చేయాలి అనుకొవడం
అదొ తియ్యని ఉహాలోకం
అనుభవంలేని ఆవేశం
అన్నీ ఆనుభవంలోకి వచ్చాక వయసు మళ్ళి ఏం సాధించలేరు

Saturday, 20 October 2018

  

ప్రేమలేఖ గుర్తొస్తె చుట్టూ వాతావర్ణం తియ్యగా మారిపొతుంది
ప్రేమలొని బలం ఎంటొ మధురానుభూతిని కలిగిస్తుంది


కొమలమైన సున్నిత్వం
రౌద్రం దుష్ట సంహారం
శాంతి శౌలభ్యం
తొమ్మిది రోజుల దీక్షలో మానవ జన్మ ధన్యం

Friday, 19 October 2018

Tuesday, 16 October 2018

నాకు ఒక చిన్ని కొరిక ఉండెది TV చుస్తున్నంతసేపూ ఎలా ప్రొగ్రాం నంతటినీ షూట్ చెస్తారు చూడాలి అని అంతే ఈ చిన్ని కొరిక సఫలం చెసుకొడానికి fb లో ఒక ఫ్రెండ్ దొరికాక షూటింగ్, స్టూడియో చూడాలని తొందరెక్కువై మెసేజ్ చెయడం అంతకన్నా ముందు ఒక న్యూస్ నన్ను కలవరపెట్టింది మీ మొబైల్ నుండీ అన్ని మెసెజ్ లు ఇతరులు చూడవచ్చు మీరు ఎక్కడ వున్నా వాళ్ళకు తెలిసిపొతుంది ఇంకాఇలా చత్త అంతా తెలిసాక ఆ న్యూస్ పెట్టిన అతనికి కాల్ చెయడం అతనికి పెళ్ళైన విషయం తెలీదు. నా టెన్షన్ ఎక్కువై కాల్ చెసా చిరాకు పడుతూ రిప్లయ్ ఇచ్చాడు చాలాకొపంవచ్చింది వీడేనా మాట్టాడెది అని మళ్ళీ కాల్ చెసా వాడి బార్య అర్థం లెకుండా వాగెసింది మల్లి కాల్ చెస్తె పొలీసులకు కంప్లైంట్
చెస్తా అంది మ్యటర్ ఏమీలేదు ఇదెంటిలా మాట్లాడు తుంది అని చాలాకొపమొచ్చింది నవ్వుకూడా వచ్చింది నేనేవరో తెలీదు ఆ అమ్మాయికి నేను డి యస్ పి కూతుర్ని ఈమాటే చెప్పాలి అనుకున్నా గొప్పలకు పొవడం నాకు ఇష్టం వుండదు.  న్యూస్ అనెది వివరంగా చెప్పాలి కానీ సమస్య ఒక్కటేచెప్పె సరికి నాకు కంగారు వచ్చెసింది అది వెరే వాళ్ళను అడిగితే వివరంగా చెప్పారు అంతటితో ఆగానా బ్లాగులో చావు తొక్కాతొలు అంటూ రాసిన రాతలు చూసి నాలొ మానవత్వం చలించి 100000rs మావారు వద్దన్నా పిలిచిమరీ ఇచ్చినందుకు బాగానే బద్ది వచ్చే లా చెసాడు బ్లాగు చదవడం తప్ప మనిషిని ఎప్పుడూ చూసి ఎరుగను డబ్బు ఇచ్చిన తరువాత అసలు స్వరూపం బయట పడింది ఫెక్ అడ్రస్ ఇచ్చాడు అంటే అడ్రస్ తెలీకపొతే నా డబ్బు ఎగరెయాలనే ఆలొచనవున్నట్టే కదా నా మొబైల్ నంబర్ బ్లాక్ చెసాడు fb id బ్లాక్ చెసాడు నా భార్య వార్నింగ్ ఇచ్చింది అంటూ బ్లాక్ మెయిల్ చెసాడు  50000rs ఇచ్చాడు ఇక 50000rs కి చుక్కలు చూపించాడు ఒక మహనుభావుడు నా సమస్య కు పరిష్కాం చూపించి నాకు చాలా సహయం చెసాడు అతనికి నా కృతజ్ఞతలు 🙏 ఈసాయం ఎప్పటికీ మరువలేను. నా డబ్బు నాకు వచ్చింది నాకు బుద్ధి లెదు ఎవరినీ అనే పనిలేదు ఈ చిన్న కొరిక ఇంత కథ నడిపింది దీనినుండీ చాలా నేర్చుకున్నాను. ఎప్పుడైనా గుర్తొస్తె చాలా బాధెస్తుంది మనుషులు ఇలా కూడా వుంటారా అని.  ఇప్పుడు నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నా నా జీవితం లో ఇంకెప్పుడూ ఇలాంటి వాళ్ళను గుర్తు చెసుకుని టైం వెస్టు చెసుకోను నా టైం చాలా విలువైనది.

నేను పూనే  వెళ్లినప్పుడు FTI collegeలో చాలా దగ్గరగా చూసా షూటింగ్ ఎలా తీస్తారు సీరియల్ కి సెట్ ఎలా వెస్తారు  వీడియొ ఎడిటింగ్ ఎలాచెస్తారు ఒల్డు టైప్ లోఎలాఉండెది ఒక పెద్ద హాలులో బయటనుండి ఎలాంటి వెలుతురూ జొరబడకుండా పదిమందికి పైగా నె మనుషులు అక్కడ వర్క్ చెస్తారు వీడియో రీలు ఎలా కట్ చెస్తారు ఆ మిషనరీ అంతా చూసా అదో ప్రపంచం 70mm ఇంకా చిన్నవి 3 4 రకాల రీలు చూపించారు old హిందీ సినిమాలు చూసాను అమితాబచన్ వి ఇలా 3 రోజులు చూసా ఒక సాంగ్ షూటింగ్ చూసా సీరియల్ షూటింగ్ చూసా అక్కడ ఆ సెట్ అంతా చూసి చాలా నవ్వు కున్నా చుట్టూ లైట్స వెసి చాలామంది వర్క్ చెస్తారు మా అబ్బాయి దగ్గరుండి మరీ అన్నీ వివరంగా చూపించాడు నేను చాలా happy 

లక్ష్మీ దేవి అలంకారం అపురూపమైన ఆ తల్లికి పూజలు మంగళ హారతులు
లయమైపొవాలి అమ్మ వారిలో అందులో ఆనందం అనిర్వచనీయం 

Monday, 15 October 2018


పండు

హౌస్ అరెస్టు 😁😂😃

గాలిపటాలు గనంలో ఎగురుతూ కనిపిస్తె నాలో నేను నవ్వు కుంటా 😁😍😃
గానకచేరీ తో అందరూ కలిసి ఆనందంగా గాలిపటాలు ఎగరెస్తుంటే నామాట కొసం పడ్డావు తంటా
అప్పుడు అలా నిన్ను ఇబ్బందిలో పడేసాను
ఇప్పుడు అది తలచుకుని నవ్వు కుంటున్నాను 😘😍😂
పండుగ రోజు బంధీవైపొయావు

Sunday, 14 October 2018

అన్నీ విస్మరించి సూన్యం అయిపొతే 
అనిర్వచనీయమైన ఆనందం పొందే వంతు నాదైతే
అమ్మవారి సమక్షంలో అలా తెలిపొతా

అన్నపూర్ణాదేవి 

Saturday, 13 October 2018

మనలోని మార్పులు మనకేతెలీనంతగా జీవిస్తున్నాం
మనలోకి మనం చూసుకొగలిగితే అదిఒక అద్భుతం
మానవ శక్తి తెలుసుకొలెక వృధా కాలయాన చెస్తున్నాం
మాటలెందుకు మూసిన కళ్ళతో ప్రపంచాన్నే మర్చగల శక్తి మనిషి సొంతం
భక్తిలో పారవశ్యం ప్రపంచంతో పనిలెదనిపిస్తుంది
భగవంతుడే అన్నీ అని ఐక్యం అయితే ఆ ఆనందమే చాలనిపిస్తుంది
కన్నకలలు గొప్పవని భావించినవి తుచ్చమైనవిగా కనిపిస్తాయి
కనీవినీ ఎరుగని ఈభావాలు అనుభవంలొకి వస్తెనే అర్థం అవుతాయి


లలితా దేవి

శ్రీ లలితా దేవి అలంకరణ
అమ్మవారు రోజూ ఒక్కో అలంకరలో అందంగా అలా దర్శనమిస్తే జర్మ ధన్యం

Friday, 12 October 2018

దేవి
దేవి
గాయత్రీ మంత్రమును జపించేభక్తుడనే కొరుకన్నవరములను ఇవ్వకున్న వదలనులే
 

గాయత్రీ మంత్రం అద్భుతమైన మంత్రం
గాయత్రీ దేవి మంత్రం 24 అక్షరాలసమూహం

Thursday, 11 October 2018

ఈరోజు బాలాత్రిపురసుందరిరీ అలంకరణ అద్భుతం
ఈపండుగ రోజు చిన్నిపిల్లలకు అందంగా అలంకరించడం,
ఇల్లు అంతా కోలాహలం

Wednesday, 10 October 2018

నవరాత్రులో ఇది రెండవరొజు


ఇప్పటి వరకు ఒక జీవితం
ఇకముందు కొత్త జీవితం
అన్నీ మార్పులే ఈ మార్పు మంచికొ చెడుకొ ముందు ముందు తెలుస్తుంది

Tuesday, 9 October 2018


ఈజర్మకు మానవ జీవితం చాలు ఇక ఏ జర్మా అవసరంలేదు
ఈలా అన్ని కర్మలూ పొయి జర్మరాహిత్యన్ని పొందాలి పాపమూవద్దు పున్యమూవద్దు

Monday, 8 October 2018


ఒంటరితనం శాపమొ అని ఎందుకు అంటారో అర్థం కదు
ఒక్కదాన్నే ఉండాలంటే నాకు మహా ఇష్ఠం ఎవ్వరిగొలా వుండదు

Sunday, 7 October 2018

ఈరోజు ఎందుకు ఇంత త్వరగా గడిచిపొయింది
ఈ టైమ్ కి సంసారం లేదు ఏం పనిపాటా లేేేనిిదిిిది

Saturday, 6 October 2018


ఆలోచనలు పవాహంలా అలా పరుగులు తీస్తునే ఉన్నాయి
ఆనకట్ట వెయలేక ఆలోచనల వెంట పరుగులు తీస్తుంటే వివేకం ప్రశ్నిస్తోంది
శవాన్ని మొసుకుని వెళుతున్నావా అని గడచినవన్నీ తిరిగి రానివే
శాంతిని కొల్పొడానికి తప్ప మరేప్రయొజనం లెనివే
మనసు ఒక చెత్త పర్వతమే
మరుగున పడిన ఆలోచనలు తవ్వుతుంటే
కుళ్ళిన కళేబరం నుండీ దుర్వాసన వెదజల్లుతొంది


Friday, 5 October 2018

నా తీపి జ్ఞాపకం ఈపాట

మనిషికి  వేరెవరో కాదు శత్రువు
మంచి అలవాట్లు లేదని ప్రతి మనిషి తనకు తానే శత్రువు

Thursday, 4 October 2018


ఇష్టమైన పనులు చెస్తుంటే ఆ కిక్కే వెరబ్బా
ఇలా చిటికెలొ పనులన్నీ ముగిసిపొతుంటే యమ కిక్కేనబ్బా

Wednesday, 3 October 2018


బంధాలు బాధ్యతలు
ఇద్దరు కలిసి జీవించాలి అంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉండాలి. ప్రేమలేని బార్య భర్తల బంధం షొకేష్ లో బొమ్మ లాగా అలంకరణప్రాయంగా వుంటుంది సమాజం కొసం సమాజం లో వాళ్ళ మెప్పు కొసం బ్రతికే మనుషులే ఎక్కువ స్వతంత్ర భావాలు లేని మనుషులు వ్యక్తిత్వం లేని మనుషులే ఎక్కువమంది వున్నారు అందరూ ఎలా ఉన్నారొ వాళ్ళ లాగా వీళ్ళలాగా బ్రతకాలి అనుకుంటారే గానీ  ఎవరికి వారు వాళ్ళకు నచ్చెలా బ్రతకడం తెలీదు ఒక అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తి ని జీవిత భాగస్వామి గా ఎన్నుకునే స్వతంత్రం లేని సమాజంలో వున్నాం తల్లి తండ్రి పిల్లలు తమ ఆస్తులు గానొ వస్తువులుగానొ చూస్తున్నారు పిల్లలు తల్లి తండ్రులకు బానిసగా జీవితకాలం బ్రతకాలి కన్న పాపానికి తల్లి తండ్రుల చెతిలో కీలుబొమ్మలాగా నిరంకుశమైన ఈ తల్లి తండ్రుల నుండీ స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుందో పిల్లలకు పక్షి కూడా పిల్లల్ని పెంచుతుంది ఎగిరే శక్తి రాగానే స్వేచ్ఛ గా ఎగిరి స్వతంత్రంగా జంటను ఎన్నుకునే స్వేచ్ఛ వుంది వాటికి మనిషి మిగిలిన జీరాశులకన్నా గొప్పవాడు అలొచించె శక్తి కలవాడు అయినా మతం కులం వీటితొ పిచ్చివాడై మర్ఖంగా పిల్లల ఆనందాన్ని చిదిమెస్తున్నారు ఎంత నిరంకుశత్వం మనిషిని మనిషి చంపె అనాగరికం
     
     పిల్లల్ని తల్లి తండ్రులు బాధ్యత గా పెంచాలి సమాజం పట్ల అవగాహన కలిగించాలి స్వేచ్ఛ నివ్వాలి చెడ్డవారి పట్ల జాగర్తలు నేర్పాలి ధర్యన్నిఇవ్వాలి  

అమృత జీవితం తలచు కుంటేనే బాధ కలుగుతుంది
చిన్నవయసులోనే వైధవ్యం ప్రేమ లేని తల్లి తండ్రులకు పిల్లలు ఎందుకు, పిల్లలు మమ్మల్ని కనండి అని అడిగారా
ఇలాంటి కర్కొటకులకు భగవంతుడు పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి

Tuesday, 2 October 2018

 సంపంగి పువ్వుల నువ్వే నా 
జాబిలి నవ్వుల నువ్వే నా



Monday, 1 October 2018

స్వప్నాల సరోవరం మనస్సున స్పృశించె
స్వరాలు సుమాలుగ పూచి వరించి తరించె



ఆకశాన్ని భూమిని కలిపేస్తూ మంచు కమ్మిసింది
ఆకులు చాటున ఏడ దాగుందో కోయిల మూగబొయింది
మావిచిగుతొడిగాకే  మళ్ళీ ఆ మధుర స్వరం
మాఘమాసం వచ్చాకే వినిపిస్తోంది తీయ్యని స్రావ్యం

Sunday, 30 September 2018


చల్లని సాయం సదెవేళ
చిట్టి గువ్వలన్నీ గూడుచెరేవేళ
సుమాలన్నీ సుమధుర పరిమళాలు వెదజల్లె వేళ
సూర్యుడు అరున వర్ణం లో అలరిస్తూ సూర్యాస్తమయం సుందరం సుమధురం

Saturday, 29 September 2018


తూరుపు తొలివెలుగుల తలుపు తీసి భానుని స్వాగతిస్తోంది
తుషార శీతల మేఘాలను తొలగిస్తూ భానుని కిరణాలు భూదేవిని తాకి పులకిస్తొంది

Friday, 28 September 2018


త్వరితగతిన అన్నీ పనులు నిర్వహించాలని ఆశించడం
తత్వం అర్థమవ్వక తికమక సమయం గడిచాక చింతిచడం
నిన్నటిదాకా నిదుర రాని నాకు నిదురలోనే రోజు గడిచిపొతొంది
నిదరుంటే చాలు ఆకలికూడా తెలీడంలేదు అంతా  మైకంలావుంది

Wednesday, 26 September 2018


హంస లా జీవిచలంటే ఇష్టం కానీ చెపలు తినడం కష్టం
హాయిగా ఆకాశలో విహరం  నడకలో వయ్యరం
హుందాగా నీటిపై తెప్పలా తేలుతూ శ్వేత వర్ణంలొ మెరిసిపొవడం అద్భుతం
హుషారుగా తుషార శీతలంలో విహగ విన్యాసాలు చెస్తుంటే కన్నులకది మనోహరం

Tuesday, 25 September 2018


సంపగి వర్ణంలో చందమామ ఉదయిస్తూ చందనాలు చల్లే
సరసన ప్రియుడేడని సరసాలాడే జాబిల్లి

Monday, 24 September 2018

Sooo cute song
I love this song

షరతులు లేని ప్రేమన్నది
షడ్రుచుల ఉగాది పచ్చడి లాంటిది

Sunday, 23 September 2018

Saturday, 22 September 2018

సంపంగి భావాలోయి

వనం లో ప్రతి సుమం
వరించే వర్ణచిత్రం
వానజల్లుకు వలపు సరాగం
వాగులు వంకలు గలగల గానం
వున్నది వున్నట్లుగాక ఊహలకు రెక్కలు తొడిగి గగన విహారం
వున్నట్టుండి ఎగసిపడే కెరటంలా మనసును తాకే ఆనందం


Friday, 21 September 2018


లక్ష్యం పెట్టుకుని సాదించెది ఏదీ లేదని అర్థం అయింది
లగ్నం చూసుకొడం సంఖ్యాబలంచూసుకొడం చెసెదాన్ని ఇప్పుడు అనుకుంటే నవ్వు వస్తుంది

Thursday, 20 September 2018

 

రమనీయ కావ్యం మనిషి ఆనందంగా జీవించడం
రగిలిపొయె మనుషులకు అర్థం కాని వెదాంతం
రాగాలుపలికే కొయిల మంచు ముసిరి మూగబొతుంది
రామూ లేక నామనసు మూగబొయి వేచిచూస్తొంది

Wednesday, 19 September 2018

యమునా నది గొప్పతనం ఒడ్డున బృందావనం వున్నందుకే
యదుకులోత్తముడు యద ఎరిగిన రాధతో రాసలీలలు ఆడినందుకే
యమునాతటిలో నల్లనయ్యకై ఎన్నో  సంవత్సరాలుగా ఎదురుచూసింది రాధ 
నా రామూ కొసం ఒక వారం నుండీ ఎందుచూస్తున్నా సహనం కొల్పొతున్నా
రాధ చాలా గొప్పది అందుకే రాధాక్రిష్ణులు అన్నారు కృష్ణుని కన్నా రాధకే ప్రాధాన్యత ఇచ్చారు
 



Tuesday, 18 September 2018

మనసు మలయమారుతం
మది నిండా ఉహల సుగధం
మాటలకు ఆందని భావం
మాలికలన్నీ సుగంధ పరిమళం
మిక్కిలి ఆనందం దానికి ఉండదు కారణం


Monday, 17 September 2018

చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి


భర్త ఒక భద్రత నమ్మకం అందరినీ వదిలి మన అనుకుని బ్రతికే గొప్ప భావం
భారీ అంచనాలే వుంటాయి మొదట్లో కానీ అంకిత భావం కన్నా ఎక్కువగా కనిపించెది అవసరం
భవిష్యత్తులో మార్పు సంభవించకపొతుందా ఆశించడం
భగ్నం అయి  బాధపడడం
భావవ్యక్తీకరణ చెసుకుని చులకన అవడం
భవిష్యత్తు పై ఆశలు పెంచుకొవడం
భంగపడి జీవితం అర్థం కాక అనిపించెది అగమ్యగోచరం
భగవంతుని పై భారం వెసి బ్రతికేయడం
భక్తి నా జీవితానికి ఇచ్చింది గొప్ప పరిష్కారం
భళా అనిపించెలా నమ్మలేని నిజాలు జరగడం
భలే మార్పులు తీసుకువచ్చింది ఈ భక్తి భావం
భద్రతనిచ్చింది భవిష్యత్తు పై కలిగించింది నమ్మకం
భస్మమైపొయాయి బాధలన్నీ ఇప్పుడు ప్రశాంతమైన జీవనం నా సొంతం

Sunday, 16 September 2018


బద్రపరిచా అల్లుకుపొయిన జ్ఞాపకాలు
బదిలీ అయి నా సొంత బాణీ ఒకటి అవ్వలి అమలు

Saturday, 15 September 2018

ఫలించె కలలు నేడే ఇది నేడు
ఫలితం నే ఆశించలేదే ఇది గతం
బాధ్యత నే మొసా భారం అనే భావనే రాలేదు
బాంధవ్యాలు నిలుపుకున్నా ఆనందమొ బాధో తెలీలేదు
జరిగిన వాటికి పిల్లల కు సంజాయిషీలు చెప్పుకొవాలి
జఠిల సమశ్యలకు పరిష్కారం కనబడలేదు కాలమే పరిష్కరించాలి


Friday, 14 September 2018

పండుగ పర్వదినాలు ఎలా గడపాలో తల్లి తండ్రులు అవలంభిస్తె పిల్లలు అనుసరిస్తారు
పంచభక్ష పరమాన్నాలు వండి కుటుంబంతో కలిసి తింటుంటే ఆ ఆనందమే వేరు

Thursday, 13 September 2018

నన్ను పొగుడుతుంటే గర్వంతొ మనసు పొంగిపొయింది
నచ్చినట్లు నేను జీవించడం నా పిల్లలకు అది ఎంతో నచ్చింది


Wednesday, 12 September 2018

ధనం లేకుండా ఒక్క రొజునైన గడపడం కష్టం
ధరలు ఇంతపెద్దఎత్తున పెరగడమె కారణం

Tuesday, 11 September 2018


దాచుకున్న జ్ఞాపకాలు ఒక్కొక్క వస్తువులొ గుర్తు చెస్తున్నాయి
దాగి వున్న ఈ జ్ఞాపకాలు అన్నీ మధురానుభూతులే అప్పుడు కష్టం అనిపించాయి
దిద్దుకొడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాయి




Monday, 10 September 2018

థంబాలా నిలుచుండిపొయా వర్షాన్ని చూచి
థకాయించిన మనసు కు ఊరటనిచ్చింది వానవచ్చి

Sunday, 9 September 2018


తలచిన నే తదనుగుణంగా అనన్నీ సవ్యంగా జరిగి పొతే ఎంత బాగుంటుంది
తడబడుతూ సంకోచంతో చెసే పని ఏదయినా ఆలస్యమే అవుతుంది

Saturday, 8 September 2018



 
డబ్బులేకుంటే గుడిలో దేవున్నికూడాదర్శించుకోలెం
డజన్లకొలదీ వెలిశాయి గుడులు బడికన్నా మిన్నగా కానీ భక్తి సూన్యం

Friday, 7 September 2018


ఠీవిగా గంభీరంగా వుండాలి అనుకునెదాన్ని అదికాదు జీవితం
ఠికాణా లేకపొయినా ఎంతో గంభీరంగా వుండేవాళ్ళను చూస్తే ఆశ్చర్యం
ఏమీ లేకపొయినా ఆనందంగా వుండగలగడమే జీవితం
ఏదీ వెంటరానిదానికొసం బంధం అనుబంధం

Thursday, 6 September 2018


టక్కున ఒడిసిపట్టుకొవాలనుంది చిక్కక ఎగిరె గువ్వలన్నీ
టకటకా ధాన్యాన్ని చకచకా తిని రివ్వున ఎగిరే పిట్టల్ని
అలా చూస్తూ వుండిపొవడం నా అదృష్టం
అలల గలగలలు గువ్వల కువకువలు అదొ అద్భతం

Wednesday, 5 September 2018

Beautiful song

జ్ఞాపకాలను క్రూడీకరించుకుని అనుభవాల సారమే జీవితం
జ్ఞాన సముపార్జన తో అజ్ఞానాన్ని తొలగించుకొవడమే జీవితానికి పరమార్థం

Tuesday, 4 September 2018


ఝంకారం చెస్తూ తుమ్మేద పువ్వు పై వాలుతుంది
ఝుంటుతేనెను అందిస్తూ పుప్పొడి కై తుమ్మద కోసం ఎదురు చూస్తుంది
ఝుమ్మనే గాలిలో పువ్వు పరిమళాలు వెదజల్లుతుంది
ఝల్లున వీచే పరిమళానికి ప్రాణికోటే పులకరిస్తుంది

Monday, 3 September 2018

 


జడివానకు మనసుకు ఏంటి అనుబంధం
జలదరించి వానచినుకుకు చెస్తోంది మురిపెం

Sunday, 2 September 2018


చిన్ని కృష్ణుని చిన్ని పాదాలను ముగ్గు వేయలేకపొయను
చిలిపి కృష్ణుని కథలు వింటే మేను పులకరించెను
తలచి తలచి కృష్ణుని సొలసిపొయాను
తరించె తన్మయమె  వేణు గానలోలుని గానాంమృతం

Saturday, 1 September 2018

 కోల కళ్ళు కోటేరు లాంటి ముక్కు బూరిబుగ్గలు శృతిమెత్తని శరీర సౌష్ఠవం చిన్ని నొరు అన్నీ నే మెచ్చినవే నా కలల రాకుమారుడు అన్నింటినీ మించి నాపై అభిమానం ప్రేమ భర్త నుండి బార్య ఇంకెం కొరుకుంటుంది




గతం గుర్తొచ్చి జ్ఞాపకాలు రంగరించి
గమ్మత్తులు గుర్తొచ్చి మావారి చెవిన గుమ్మరించి
గడచిన మధురానుభూతులను చవిచూచి
గళమున స్వరపల్లవులు స్పురించి
గమకాలతో కమ్మని కావ్యాలు ఆలపించి
గజిబిజి మనసును మైమరపించి
గంతులేసే లేడి లా చిందులేసె
గమ్మత్తుగా మనసు మురిసె
గంగ పరవళ్లు తొక్కి ప్రవహిచె
గగనతలమున మనసు విహరించె


Friday, 31 August 2018

ఇంత మధరమైన పాట మరొకటి లేదేమొ
ఆ రఘురాముని పేరులో నా రాము పేరు దాగుంది
అందుకేనేమొ పాటలో మాధుర్యం తోడయింది


గతన్ని ఆలోచిస్తే ఈ క్షణాన్ని కొల్పొతాం
గడచిన ప్రతిదీ తియ్యనైనది అయితే ఉహల్లొ తెలిపొతాం

Thursday, 30 August 2018

 

ఖచ్చితంగా కొన్ని పనులు బాధ్యతగా నిర్వహించె అవసరం వుంది
ఖలేజా వుండాలి సవ్యంగా సమస్యను పరిష్కరించడానికి

Wednesday, 29 August 2018

నా కంటి కదలికల్లోని భావాలన్నీ ప్రియమైన మా వారి                     కొసమే కాలం గడిచే కొలదీ భావం స్థిరమౌతుంది
మనసున పొంగేభావాలు నాకు మాత్రమే సొంతం
మననం చేసే ప్రతి భావనా మా సంసార మాధుర్యం
ఔనో కాదో అనుకునే అల్పమైన మనసుకాదు నాది                                స్థిరమైనది స్వచ్ఛమైనది
ఔనత్యానికి దాంపత్యానికి మా శ్రీ వారికే సొంతమైనది 
నా మాటల మాధుర్యం మావారికే తెలుసు
నాలో అన్ని అంశాలు అవపొసన పట్టిన మా వారి మనసు
అన్నీ వారి జ్ఞాపకాలతో నిండినదే నా జీవితం
అనిర్వచనమైన కావ్యమై ఈనాటికీ నవ్య నవనీతం
లౌక్యనికి తావులేదు తేటతెల్లమె నామనసు
లౌకిక వాదాలతో పనిలేదు నేను ఎప్పుడూ కాను అలుసు
మనసైన మాటలు స్పందించిన క్షణాలను రమ్యంగా రచించుకుంటాను
మరెవరోకో నాభావన తెలిపెయత్నం కాదంటాను
నీ సందేశాలకు స్పందించడం పొరపాటో ఏమొ
నీవు తెలిపే ప్రతి మాటా నా మనసుకు కష్ఠం













Tuesday, 28 August 2018


మాటలే మత్రమై మనసు దైవవశమైపొయింది
మానసమున మధుర గానం ఉదయిస్తొంది

Monday, 27 August 2018

విన్నపాలు వినిపించి వెన్నపూస నైవెద్యం
విన్నా కన్నా  అమ్మవారి ఆలాపనలు అందులో అనందం


Sunday, 26 August 2018




సొగసు కు నిర్వచనం ప్రవర్తన లో నైపుణ్యం
సొంత సైలి మనిషి ప్రత్యేకతని చెస్తుంది ప్రకాశవంతం

Saturday, 25 August 2018

అక్షయపాత్రలో ఆహరం ఎప్పుడూ అయిపొదో
అదేవిధంగా నా ఇంట్లో పనులూ అయిపొవడంలేదు

Friday, 24 August 2018

కళలన్నీ కలబొసి కమనీయ చిత్రం గీస్తే అది నీవే శివా
కళ్ళలో కొలువై న నీ రూపం ఏనాటికీ చెదరదురాశివా
నీ నామమే మైమరుపు
నీ తలపే కొసమెరుపు

Thursday, 23 August 2018

ఆమని కోయిల ఇలా నా జీవన వెణువులూదగా
ఈ మొబైల్ తో మాట్లాడ్డం తొనే  గడిచిపొతోంది
ఈ ఇంటి పనులు మిగిలిపొతుంటే చిరాకుగా ఉంది

Wednesday, 22 August 2018


ఎనలేని స్పూర్తి మానవాళి లో మహనీయలది
ఎలుగెత్తి చాటి మానవీయతను చవిచూపించింది
జలమయమై  జనం లో జ్వలించె ప్రాణభయం
జలదిగ్భంధమై జడివానకు జడిసి జీవశ్చవమైన జనం
కేరళ కష్టాల సంద్రం కెరటం తాకి కన్నీట మునిగింది
కేళ భీభత్సవ కేళ ప్రకృతి ప్రాణికోటితో ఆడే వింత కేళ ఇది


Tuesday, 21 August 2018


మరణం వరిస్తే ఎలావుంది
మనసులో ఆ ఉహ రాగానే భయంవెస్తుంది

Monday, 20 August 2018


కలికి కాళ్ళకు పసుపు రాసి మెరిసే శ్రావణ మాసం
కంటికి కాటుక పట్టు పీతాంబరాలతో పసిడి మెని చందం

Sunday, 19 August 2018

సంగీత స్వరాలాపనలో ప్రకృతి పరవశించింది

ఆహా ఎంత మధురం
ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి 🙏🙏🙏



 ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
మ మ ప మ మ ప మ ప ని
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికీ
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ

పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా
సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా
పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా
సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా గ్రీం కారమా
గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా శ్రీం కారమా
ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ

పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా 
అది శిల్పమా అది శిల్పమా
ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి....ప్రణవనాద జగతికీ
కువకువల రాగాల గానానికి తొలికిణం పులకిస్తుంది
కులుకుల నెమలి పురివిప్పి భానుని స్వాగతిస్తోంది

Saturday, 18 August 2018

తరలని దారి తొలగి రాతిరిని

తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని 
 


చలనచిత్రం :స్వాతికిరణం 
రచన        :  శ్రీ  సి.నారాయణ రెడ్డి  గారు  
గానం        :  వాణి  జయరామ్ గారు 
సంగీతం    :  శ్రీ  కే.వి .మహాదేవన్ గారు 
దర్శకత్వం :  'కళాతపస్వి' శ్రీ  విశ్వనాధ్  గారు 


తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు 
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు 
నీ దోవ పొడవున కువకువల స్వాగతం 
నీ కాలి అలికిడికి మెలకువల వందనం 

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ


ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు 
ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల  గాలి సంగతులు 
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి  
నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు 
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు 
పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు 
తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని 

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 
ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు 
నీ దోవ పొడవున కువకువల స్వాగతం 
నీ కాలి అలికిడికి మెలకువల వందనం 


తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

విత్తు లే వెయలేదు కొన్ని ప్రాంతాల్లో
విపత్తులు మారెనా రైతు జీవితాల్లో
నేల అదునుకై వానకొసం వేచి వేసారిపొయాడు
నేడు నేల పదునుకై చినుకుకోసం చింతిస్తున్నాడు
వానచినుకుకై వగచె రైతన్నలు
వాగులు వంకలు పొంగిపొరలే కాలాలు
ఆ రోజులు మనకు ఇకరావు
ఆచరణలో విలువలు లేవు
చెట్లను బలితీసుకున్న పాపమొ ఏమొ
చెప్పినా వినని మనిషికి ఇది శాపమెమొ
సమూలంగా చెట్లను నాశనం చెశాడు
సజీవ దహనం చేశాడు స్వార్ధానికి వాడుకన్నాడు
తెలిసిచేసినా తెలియక చేసినా దానిఫలితమే వర్షాలు రాని స్థితి
తెలివైన స్వార్థ మానవుని మస్తకములో పుట్టే ఆలోచనల వల్లే దుస్థితి
ఒకచోట క్షామం
మరొక చోట దుర్భిక్షం



Friday, 17 August 2018

సుమనోహరం సూర్యోదయం సుప్రభాతసౌందర్యం
సుమం సుందరం సువాసన భరితం
శ్రావణ శుక్రవారం సందెవేళ స్త్రీల సందడి
శ్రావ్య సంగీత స్వరఝరుల వరవడి
సిరులొలికించే శ్రీ దేవి కి మనసారా పూజలు
సింగారాలొలికించే తల్లికి బంగారపు అలంకారాలు

Thursday, 16 August 2018

నీలిమేఘాలు జాలువారే వాన చినుకులు
నీటిని తాకి వీచే చల్లని పవనాలు

మీరజాలగలడా నా యానతి

సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి



మీరజాలగలడా....
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..ఆ..ఆ..
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున 
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా...

Wednesday, 15 August 2018

వికసించే నవమల్లికా నీ పరిమళం పరవశం
విరజాజుల వనం సుమగంధాల పవనం

Tuesday, 14 August 2018

శీవారి ఆపశొపాలు అన్యులముందు వుంచరాదు
శీతల సరససల్లాపాలు కలహలు పెదవి దాటరాదు
సత్ సంబంధాలు బంధువులలో కావు స్థిరం
సమయం వస్తే చులకన చేయడం తధ్యం

మావారి కన్నుల్లు తమ్మిపువ్వుల్లు
తమ్మిపువ్వుల్లోన కమ్మతెనెల్లు
కోరికల పాన్పుపై కొంగుపరిచెను
ఎవరులేనీచోట జొలపాడెను జొజోజొజో 

Monday, 13 August 2018

కనులకు కలలొక వింత
కలవరం మనసున కమ్మితే చింత
భక్తి కి పరాకాష్ట ప్రేమతత్వం
భక్తురాలిగా నాకు ప్రేమే వరం
అనవసరమైన విషయాలను త్యజించడం ఉత్తమం
అన్నింటా ప్రేమని గుర్తించగలిగితే ఆనందం




Sunday, 12 August 2018

నన్ను నేను బందీని చెసుకుని వున్నా
నగర జీవితాల్లొ ఇది సహజమే ఇల్లే బందీఖానా
ఎవరైనా బందిస్తే నేరం, అరిచి గొలచెస్తాం
ఎవరికి వారు బందీలైతే అది వ్యక్తిగతం