Thursday, 28 December 2017

అపార్టుమెంటు లో వున్న వాళ్ళుతో కలిగిన జ్ఞానోదయం

ఆవేశం ఏక్కువైతే ఆలోచనకు తావే వుండదు
ఆలశ్యంగా అన్నీ అర్థం అయ్యె సరికి ఏమీ మిగలదు
శివుడికే తప్పలేదు ఆవేశంలో వినాయకుడి తల నరికాడు
శిరస్సు ను తెగలిగాడే గానీ మనిషి తల తేలేకపొయడు
జరుగుతున్న మన కర్మలకు బాధ్యత ఖచ్చితంగా మనది
జరిగేవన్నీ మంచికె దీన్నీ నమ్మడం మనకే మంచిది
ఎంత మంచి తనం వున్నా మాట దురుసుతనం బాధిస్తుంది
ఎంతో గొప్పదైనా తృణప్రాయంగా తోస్తుంది
మానవ సంబంధాలు మాటలమీదే ఆధారపడి వుంది
మాటదొర్లితే అది నచ్చనిదైతే ఆ బంధం చెరిగిపొతుంది
అందుకే మానవాతీతమైన దైవశక్తినే నమ్ముకొడం మంచిది
అందరితో అంటీ ముట్టనట్లు వుండడం ఉత్తమమైనది
మనిషితో ముడిపడ్డవేవీ శాశ్వత ఆనందాన్నిఇవ్వడంకష్టం
మనకు ఆనందాన్ని మనలోనే సృష్టించుకోగలం
ఎవరో మన ఆనందాన్ని దొంగిలించలేరు
ఎవరూకూడా మనలో ఆనందాన్ని నింపనూలేరు



No comments:

Post a Comment