Sunday, 31 December 2017

ఆఖరి రోజు అయిన ఈ సంవత్సరానికి వీడ్కోలు 2017
అఖిలం ఆవహించిన ఆనందాన్ని పరిచయంచెసింది2017
అనంతమైన ఆనందలో తెలి పొవడానికి వస్తోంది  2018
ఆనకట్టలులేని ఆనందానికి నిదర్శనమై నిలిచిపొతుంది                                              వచ్చె ఈ సంవత్సరం 2018

Saturday, 30 December 2017

నాలో అలసత్వం ఏంటి
నాలానేను లేనేంటి
ఆనందం శాతం తగ్గిందా
అనవసర ఆలొచనలపై దృష్టి మళ్ళిందా
సమగ్ర ఆలోచనలు నను ఆవహించాయి
సమతుల్యంత నాలొ కొల్పొయి
కళ్ళముందు అంతా  అస్తవ్యస్తంగా వుంది
కళ్ళు గప్పి మొసం జరుగుతుందనిపిస్తుంది
వేచి చూడాలి ఎం నిర్ణయిస్తుందొ కాలం
వేటికీ తావివక వ్యర్థమైన వాటికి విలువనీయడం పిచ్చి తనం       



Friday, 29 December 2017

అందం ఒక అపురూపమైన వరం
అద్వితీయమైన ఆనందాన్ని ఇచ్చెది అందం
అప్సర గా స్త్రీ అభివర్ణించడం అందుకు నిదర్శనం
అందుకే ప్రకృతిని ప్రకృతి కాంతగా భావిస్తాం
ఆరాధన కు అదం అనేది నిలువెత్తు నిదర్శనం
ఆరాతీసి అందాన్ని అంతుతెల్చెయాలని పొటీపడతాం
అది అసాద్యం అని ఎంతో ప్రయాస తర్వాత తెల్చెస్తాం
ఆదినుంచి అంతం దాకా ప్రకృతి అంతా అద్వితీయం
అణువణువూ ఒక కళాఖండమే ఆ సృష్ఠికర్త చిత్రం
అశ్చర్యంగా అలా చూస్తూ ఆనందించడం
అంతకు మించిన సాహసం చేయలేం
ఆ దేవుడు మళ్ళీ జర్మిచమని ఇస్తే ఆదేశం
అందమైన స్త్రీ గానే పట్టాలని కొరుకుంటా వరం

Thursday, 28 December 2017

అపార్టుమెంటు లో వున్న వాళ్ళుతో కలిగిన జ్ఞానోదయం

ఆవేశం ఏక్కువైతే ఆలోచనకు తావే వుండదు
ఆలశ్యంగా అన్నీ అర్థం అయ్యె సరికి ఏమీ మిగలదు
శివుడికే తప్పలేదు ఆవేశంలో వినాయకుడి తల నరికాడు
శిరస్సు ను తెగలిగాడే గానీ మనిషి తల తేలేకపొయడు
జరుగుతున్న మన కర్మలకు బాధ్యత ఖచ్చితంగా మనది
జరిగేవన్నీ మంచికె దీన్నీ నమ్మడం మనకే మంచిది
ఎంత మంచి తనం వున్నా మాట దురుసుతనం బాధిస్తుంది
ఎంతో గొప్పదైనా తృణప్రాయంగా తోస్తుంది
మానవ సంబంధాలు మాటలమీదే ఆధారపడి వుంది
మాటదొర్లితే అది నచ్చనిదైతే ఆ బంధం చెరిగిపొతుంది
అందుకే మానవాతీతమైన దైవశక్తినే నమ్ముకొడం మంచిది
అందరితో అంటీ ముట్టనట్లు వుండడం ఉత్తమమైనది
మనిషితో ముడిపడ్డవేవీ శాశ్వత ఆనందాన్నిఇవ్వడంకష్టం
మనకు ఆనందాన్ని మనలోనే సృష్టించుకోగలం
ఎవరో మన ఆనందాన్ని దొంగిలించలేరు
ఎవరూకూడా మనలో ఆనందాన్ని నింపనూలేరు



Wednesday, 27 December 2017

యెగీశ్వరా జ్ఞాన తేజోమయా
భూతేశ్వరాయా అభయహస్తాయా
కాళేశ్వరాయా కైవల్యపదాయా

Tuesday, 26 December 2017

నిదురమ్మా కనుమరుగయి పోయావె
నిద్దురను సద్దుచేయక నా కన్నుల నింపెయవె
కొమ్మ ల్లో గాలి మెల్లగా మెనుతాకివెళ్ళుతొంది
కొమ్ముకాచి  చిమ్మ చీకటి కళ్ళనిండా కమ్మెస్తుంది

Monday, 25 December 2017

సద్గురు:  ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ఆవునా..? ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” – అనేది ఒక మంచి మంత్రం. ఈ మంత్రం లేకపోతే, మీకు తలుపులు తెరుచుకోవు. సరే, ఇది ఒక స్థాయిలోని విషయం. కానీ, మౌలికంగా, మనం ప్రేమ అని దేనిని పిలుస్తున్నాము?
మనిషి తన జీవితంలో ఏ మెట్టులో ఉన్నా సరే, అతను ఏమైనా సరే, అతను ఏమి సాధించినా సరే, ఎక్కడో ఏదో ఒక లేమి అన్నది ఉంది. అతను ఏ విధంగా ఉన్నా సరే, అది అతనికి సరిపోదు. ప్రస్తుతం ఉన్నదానికంటే మరొకదానిని, అతనిలో భాగంగా చేర్చుకుందామనుకుంటాడు. ఇది అతనిలో మరింత సంపూర్ణ అనుభవం కలగడం కోసం చేయాలనుకుంటాడు. మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే పెద్ద ఆకాంక్షే ప్రేమ.
మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే ఆకాంక్ష భావపరంగా వ్యక్తమైనప్పుడు, మనం దానినే ప్రేమ అని పిలుస్తున్నాం. ఒకవేళ మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే ఆకాంక్ష శారీరికంగా వ్యక్తమైతే, దానిని మనం లైంగికత అంటున్నాం. ఇది మానసికంగా వ్యక్తమైతే, దానిని మనం ఆశయం అనో, దురాశ అనో లేదా మరేదైనా అంటాం. ఈ కృషి అంతా కూడా, మరొకదానిని మీలో భాగంగా చేర్చుకోవడానికే. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే కాదో, అది కూడా మీరు అవ్వాలని మీ కోరిక. ఇటువంటి ఆకాంక్షే – ప్రేమ.ఇది అదే ఆకాంక్షకు, భావపరమైన అభివ్యక్తి. మానవుడు ఎల్లప్పుడూ దేనినో, తనలో భాగంగా ఇముడ్చుకొవాలని ఇకాంక్షిస్తూనే వున్నాడుఇది మీ చుట్టూరా ఉన్న చిన్న- చిన్న విషయాలను పొగుజేసుకోవడం దగ్గర నుంచి ఆధ్యాత్మికత వరకూ వర్తిస్తుంది. ఆకాంక్ష అదే, మరొక దానిని మీలో భాగంగా చేసుకోవాలని. ఈ ప్రాధమికమైన ఆకాంక్ష, ప్రస్తుతం మీరు అనుభూతి చెందుతున్న దానికంటే జీవితానుభూతిని మరింత పెంపొందించుకోవడానికి. ఇదే, మీ ఆకాంక్ష..కదూ..?? ఇప్పుడున్న జీవితం మీకు నిండుగా అనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న దానికంటే మీరు జీవితాన్ని మరికొంచెం అనుభూతి చెందాలనుకుంటున్నారు. మరొకరిని మీలో భాగం చేసుకోవాలన్న ఈ ఆకాంక్షే ప్రేమ.
భావపరంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, (ఏకత్వానికి) మీరు చివరిదాకా వెళ్ళినట్లే అనిపిస్తుంది. అటువంటి క్షణాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ మరుక్షణమే మీరు అక్కడి నుంచి జారిపోతారు. మీరు దానిపట్ల ఎంత తీవ్రతతో ఉన్నా సరే, అది నిలవలేదు. మీరు దాని దగ్గర దాకా వెళ్తారు. కానీ, అది జారిపోతుంది. ఇది మీకు అన్నిటితో ఏకం అయిన అనుభూతి కలిగిస్తుంది. కానీ, మిమ్మల్ని అక్కడ స్థిరంగా ఉండనివ్వదు. ప్రేమ అనేది, అన్నింటితో ఏకత్వం పొందడానికి ఒక వాహనం లాంటిది. మీరు దేనికోసం అయితే కాంక్షిస్తున్నారో, అది ఏకత్వం. అక్కడికి చేరుకోవడానికి భావాలూ లేదా ప్రేమ అన్నది కేవలం ఒక రకమైన వాహనం. ఈ వాహనం మిమ్మల్ని ఒడ్డుదాకా తీసుకువెళ్తుంది కానీ అక్కడి నుంచి వెనుతిరిగి పోతుంది. ఇది మిమ్మల్ని ఆవలి ఒడ్డుకి చేర్చదు. ఎప్పటికీ చేర్చదు. అందుకని, ఈ ప్రక్రియలో మీరు చాలాసార్లు దెబ్బ తిన్న తరువాత, అప్పుడు మీరు అనుగ్రహానికి సంసిద్ధమవుతారు.

Sunday, 24 December 2017

అందరితో కలిసి ఆనందం పంచుకుటే ఆ ఆనందమే వేరు
ఆదరాభిమానాలు వేడుక సందర్భాలో వ్యక్తపరుస్తారు

Saturday, 23 December 2017

నిర్విరామంగా చెసెపనికి దానంతటఅదే గుర్తింపు వస్తుంది
నిరాటంకగా పనిసాగెలా వుండాలి చిత్తశుద్ధి
నిమగ్నతతో ఏపనిచెసినా జనాదరన పొందుతుంది
నిన్ను నువ్వు ప్రపంచానికి పరిచయంచెసుకునే అవసరంలేదు

Friday, 22 December 2017

జీవనప్రయాణం అర్థం లేనిది

Thursday, 21 December 2017

సప్త ఋషి హరతి కన్నులపండుగగా జరిగింది
సమస్త మానవాళికీ వీరే యెగా నేర్పింది
సగౌరవంగా వారిని గౌరవించడం మనకర్థ్వం
సరళమైన యెగ జీవించడానికి పెంచుతుంది సామర్థ్యం

Wednesday, 20 December 2017

భూమి పై ఎంతో హయిగా జీవించగలిగే పాణి మనిషి

Tuesday, 19 December 2017

ప్రపంచ పోకడలను కొన్నింటిని తట్టుకోడం కష్టం
ప్రతిదీ మనిషి వికృత రూపానికి నిదర్శనం
ఇందులో ఆడ మగ అన్న తారతమ్యం లేదు
ఇందంతా నిజమా అనే అనుమానం రాక మానదు
మన అనుకునే మనుషులను చంపడానికి కూడా సిద్దం
మానవత్వం మచ్చుకైనాలేదే ప్రేమకు మారిపోతోంది అర్థం 

Monday, 18 December 2017

మాయదారి మాటలలో కాలం కరిగి పొయింది
మాట్లాడేంతసేపూ మనసు ఉప్పొంగి పొతుంది


Sunday, 17 December 2017

నిద్ర ఈ రోజు ను అలా మింగేసింది
నింద అంతా నిద్రే అయింది
నిద్రించినందుకు హయిగా వుంది
నిరుపయొగంగా రోజు గడిచింది

Saturday, 16 December 2017

మాట మూగబొయింది
మనసు బోసిపోయింది
రాముతొపాటే వెళ్ళింది మనసు
రారమ్మంటూ పిలుస్తోంది ఊసు
తిరిగొచ్చెదాకా తికమకే నాకు
తీపికబుర్లు వస్తాయి గుర్తుకు
నువ్వు అన్న మాటకు నేను
నవ్వు కుంటా నాలోనేను
మంచులా కరిగె నీ కోపం
మచ్చటై తొచే నాకు మరుక్షణం


Friday, 15 December 2017

బాగుంది ఇలా ఇంటి పనులో మావారు తొడుంటే
బాధ్యతగా వ్యవహరాలన్నీ చకచకా చక్కబెడుతుంటే
బాంధవ్యానికి మావారి మనసులో పెద్ద పీటే వెస్తుంటే
బాధలెముంటాయి సంసారం లొ ఇలా సర్దుకుపొతుంటే

Thursday, 14 December 2017

కాసెపు ఆగవే కాలమా
కాసింత నను కనికరించమ్మా
కలవర పెట్టకు గడియలలా గడిపెస్తూ
కలం పట్టి గగనం లో విహరిస్తూ
కవితలు రాయలని సంకల్పిస్తే
కనికరంలేక కాలాన్ని కాలరాస్తే
                                    ఎలా
కమ్మని కవిత మనసులో కదులుతొంది
నేమ్మదిగా కాలం కదిలితే పొయెదెముంది



Wednesday, 13 December 2017

చిన్న నాటి స్నేహలవల్లే మనిషి ఎన్నో నేర్చుకోంటాడు
చిన్ని చిన్ని ఆనందాలను అదనంగా పంచెస్తూవుంటాడు
చీకూలేదు చింతాలేదు అటలలో అలుపూలేదూ
చీవాట్లుపెడుతున్నా అమ్మ చీమకుట్టినట్లుకూడా వుండదు
చీకటి పడినా స్నేహం కబుర్ల కమ్మదనంలో పొద్దేతేలీదు
చీకుబండ పై జారుతూ కెరింతలు కొట్టె ఆ చిన్నతనం
ఇకరాదు
చిగురాకులా లెతమనసున్న లాలిత్యమైన స్నేహం ఎంతో ముద్దు
చినుకు లన్నీ పొగెసి దొసిట్లొ స్నేహితులపై చిమ్మెస్తుంటె చినుకు సద్దు
చిర్రుబుర్రులాడి పెద్దలు జలుబు చెస్తుదని బెదిరిస్తే జడిసి పోవద్దు
చిందులేస్తూ వాననీటి చప్పట్లకు చిట్టిపాదాల చిద్విలాసం ముద్దు
చిట్టిపొట్టి స్నేహాలు కల్మషంలేనివి నేటి స్నేహాలు ముప్పు వద్దు బాబోయి నమ్మనే వద్దు






Tuesday, 12 December 2017

అమ్మ కు అలవాటు ఆడపిల్లల కు పొడుగాటి జడలల్లి అందంగా సింగారించడం
అమ్మమ్మ మాకొసం పూలమొక్కలు పెంచి పూలను కోసి పంపడం
అమ్మ తన చెత్తో పూలజడ వేసి  ఫోటోలు తీయించుకుంటే ఆమేకెంతో అనందం
అద్దంలో చూస్తుటే  వయ్యరంగా ఊగే మొగలిపూలజడ దానికి జడకుప్పెలచందం
అంతటా అలా గాల్లో అల్లుకుపోతూ మత్తెక్కిస్తున్నాయి మొగలిపూల మల్లెల సుమగంధం
అమ్మ  ఇరుగు పొరుగు వాళ్ళకు జాజి చమంతి సన్నజాజి పూలను పంచిరమ్మనడం
అందాల పూలజడ ఎక్కడ కందిపొతుందోఅని అడుగులో
అడుగెసి మెల్లమెల్లగా నేను వెళ్ళడం
అమ్మలక్కలంతా నా పొడుగాటి జడకు పూలజడ ఎంతో బాగుందని మెచ్చుకొవడం
అలా పొగిడినందుకు నేను సిగ్గు పడడం అబ్బొ అంత సిగ్గె అంటూ బుగ్గగిల్లడం
ఆడుకొడం ఆపి నా స్నేహితులు అంతా నా పూలజడ ముచ్చట్లతో ముంచెయడం
అపురూపమైనవి నా చిన్ననాటి రోజులు ఆ ఆనందానికి అమ్మె కారణం


Monday, 11 December 2017

గుండె గుడిలో కొలువై వుంది నీరూపం శివా
గూడు కట్టుకుని వున్న  భక్తిఆంతా నీస్వరూపమె శివా
నన్ను నీ భక్తిప్రేమ నుండీ దూరం చెయకు రా శివా
నన్నే నేనూ మరిచిపోతుంటారా నీ మాయలో శివా
నీ భక్తిలో నాదంతా  మిడిమిడి జ్ఞానమే నయ్యా శివా
నీదే భారం ఈ భవసాగరం నే దాటలేనయ్యా శివా
సృష్టిని సుందరంగా చెక్కిన నీచెతిని స్పృశించాలని ఉందయ్యా శివా
సృష్టికర్తవు నీవు సుస్తిరమైన భక్తితో నిన్ను స్తుతించెద నయ్యా శివా


Sunday, 10 December 2017

తాళం తకధిమి తకధిమి కి ఆడేస్తుంది పాదం
తాళపాక అన్నమయ్య పాటకి అది అమృత నాదం

Saturday, 9 December 2017

నీలాకాశం లో అలా అలా తేలిపొతున్నా
నీలి మేఘాల హంసతూలిక పై విహరిస్తున్నా
నిండైన ఆనందానికి కారణం ఈ నెలపై నేనుపుట్టడం
నిండుమనసుతో ఎంత కొలిచినా తీరదే ఈ నేలతల్లి                                                                          ఋణం
నిజమే కదా దేవతలుసైతం భూమి మీద జర్మంచాలీ                                                                  అనుకొవడం
నిత్యనూతనమై అప్యాయతను పంచె పుడమి                                                                      అత్యభ్భుతం
నిశ్చలమైనది మచ్చలేనిది దేవతలు ముచ్చటపడేది
నిశితంగా చూస్తే ఈ నేలకు ప్రేమ మత్తు హత్తుకుని వుంది
నిరంతరంగా మనిషి భక్తిప్రేమ ముక్తిప్రేమ దేశప్రేమ అంటూ                                                           తపించిపొయెది
నిలువెల్లా ప్రేమతో నిండిన దేశంమనది అందుకె దేవతలు                                            ఈ నెలపై పుట్టాలనుకునేది
నిఖిలం త్యజించిపోనీ ఈ నేలపై జీవించాలని వుంది                                              మరణాన్నే జయించాలనుంది

Friday, 8 December 2017

కాలం పరిగెడుతోంది కళ్ళెం వెసి పట్టి ఉంచేదెలా

Thursday, 7 December 2017

నిర్వాణషట్కం

మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం – న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౧ ||
న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః – న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౨ ||
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ – మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౩ ||
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం – న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౪ ||
న మృత్యుర్న శంకా న మే జాతిభేదః – పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౫ ||
అహం నిర్వికల్పో నిరాకారరూపో – విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణామ్
సదా మే సమత్వం న ముక్తిర్న బంధః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౬ ||

Wednesday, 6 December 2017

మౌనంగా మనసు భక్తి మాయలోపడింది
మౌడ్యమై వుండే భక్తి భావం మెల్లిగా జ్ఞాన దశకు                                                                      దగ్గరౌతొంది

Tuesday, 5 December 2017

గురు పూజ

అపవిత్రః, పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా
యశ్మరేథ్ పుండరీ కాక్షం
సభాహ్య భ్యన్తర సుచిహి
ఆవాహనం
నారాయ్కనం పద్మభవం వశిష్ఠం
శక్తించ తత్ పుత్ర పరాశరంచ
వ్యసం షుకం గౌదపదం మహంతం
గొవింద యొగింద్ర మతస్య శిష్యం
శ్రీ శంకరాచార్య మతస్య పాదం
పాదంచ హస్తా మలకం చ శిష్యం
తరన్ త్రొటకం వర్థికకారమవ్యన్
అస్మాద్ గురున్ సన్ తతమాన తోస్మి
శృతీ స్మృతీ పురానాం
ఆలయం కరుణాలయం
నమామి భగవద్ పాదం
శంకరం లోకశంకరం
శంకరం శకరాచార్యం
కేశవం బాధరాయణం
సూత్ర భాష్య కృతవ్ వందే
భగవతవ్ పునః పునహః
యదవారే నిఖిల నిలింప పరిషద్
శద్దిం విదత్యె నిషం
శ్రీమత్ శ్రీ లసితం జగత్ గురు పదం
నత్వాత్మ తృప్తిం గతః
లోకాజ్ఞాన పయొధ పతనధృరం
శ్రీ శంకరం శర్మదం
బ్రహ్మానంద సరశ్వతించ శ్రీ బ్రంహం
ధ్యాయామి జొతిర్మయం.

ఆవాహనం, ఆసనం,స్నానం, వస్త్రం, చందనం, పుష్పం, ధూపం, దీపం, ఆచమన్యాం, నైవెద్యం, ఆచమన్యాం,
శీ గురు చరణ కమలేభ్యో నమః

ఆరాత్రికం

కర్పూర గౌరం కరుణా వతారం
సంసారసారం భుజగేంద్రహారం
సదా వసంతం హృదయారవిందే
భవం భవానీ సహితం నమామి
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || 3 ||
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 1 ||

Monday, 4 December 2017

నాతోనే నేను పరమానందంగా వుండడం గొప్ప విషయం
నాకు నాతో గొడవేలేదు గతం పలకరిస్తె నవ్వు కొవడం
నా భవిష్యత్తు పై గొప్ప గొప్ప ఆశయాలేమీ లేకపొవడం
నాకై వున్న ఈ క్షణాన్ని ఉశ్చాహంగా గడిపేయడం
నాకొసమె పూచె పూలు నా కనులకు ఒక కావ్యం
నా చెతితొ నాటిన విత్తు మొక్క గా తాకితె గెయం
నాలో పొంగె భావం, వ్యక్తం అయ్యె వ్వక్తిత్వం




Sunday, 3 December 2017

నిండు పున్నమి వెన్నెల జగతినంతా నింపెసింది
నిగనిగ లాడుతూ జాబిల్లి ప్రేమ మత్తు జల్లుతొంది
నింగికి అందం చందం చద్రుడి వెన్నెల వెలుగులది
నిమిషమైనా రెప్పవెయక చూసే కనులకు ఇంపైనది
నిద్దురకు మద్దతునిచ్చి మెలమెల్లగా నిద్రపుచ్చెది
నిండైన వెండి మెఘమాల నిండిన నింగి నిగారింపుఅది
నిక్కము చుక్కలతో చెక్కిన పాలపుత చక్కదనంబది
నిన్నలలో మొదలై ప్రేమ వెన్నుతట్టి పిలుస్తుంది
నీలాంబరినై నిలిచి వన్నెల మనసు వెన్నెలలో కరిగిది

Saturday, 2 December 2017

ఆటల్లో అన్నీ ఆనందాలే

ఆల్లరి పిల్లల తో అల్లిబిల్లి ఆటలు
ఆడుకుంటుంటే వచ్చె ఆనందాలు
చిన్న పిల్లలంతా చెరి వచ్చీరాని పాటలు
చిటికెలేస్తూ పాటకు డ్యాన్సులు
ఆంటీ ఆంటీ అంటూ అంల్లుకు పొవడాలు
అలా లీనమై నే చెప్పె కథలకు వచ్చె సందెహలు
ముచ్చటగా ఆడాం అలుపు లేని ఆటలు
మచ్చికైన ముద్దు ముద్దు పిల్లలు
రెపటి కి మిగిలాయి ఇంకా ముచ్చటలు
రెక్కలు ఒక్కటే లేవు వుంటె ఆకాశంలో చెసెం విహారాలు
రొజులన్నీ ఇలానే గడిచెలా చెయాలి ఏర్పాట్లు




Friday, 1 December 2017

శీతవేళ ఉషొదయ కిరణాలు పుడమిని ముద్దాడు
శీతల తుషార తెరలను తొలగించుకుని ఉదయించె భానుడు                                                              
సప్తాశ్వుడు మంచు మబ్బుకు జడిసి ఆలస్యంగా ఆడుగిడుతున్నాడు
సహస్రపాదుడిని గాంచిన సుమాలు ముసిముసిగా నవ్వాయి
దుప్పటి తీయలెని తిప్పలు చప్పున తగ్గదే ఈ చలి
దులుపుకుని ఎలాగో ధర్యంచెసి కాలు నేల మొపగా                                                    మంచు లా జివ్వున చలి
తాళలెక మసుగుదన్ని నిదురమ్మ ఒడిలో నిదరొయా
తారాపథం లొ సూర్యుడి వెచ్చని వెలుగులు వెదజల్లి ముచ్చటగా మెలుకొలిపాయి