Beautiful song
మత్తైన పాట
ఓహో.....హో
Sorry సిగపు నడుం లేదు. కడు సుకుమారులు
ఛాంగురే ఛాంగు ఛాంగురే
ఛాంగురే బంగారు రాజా!
ఛాంగు_ ఛాంగురే బంగారురాజా!
మజ్జారేమగరేడా_ మత్తైన వగకాడా!
అయ్యారే!_...అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా ||ఛాంగురే||
ముచ్చటైన మొలక మీసముంది_
భళా! అచ్చమైన సింగపు నడుముంది!
జిగిబిగీ మేనుంది_ సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్ల!నీ సాటి ఎవ్వరుండుట కల్ల ||ఛాంగురే||
కైపున్న మచ్చకంటిచూపు_ అది చూపుకాదు పచ్చలపిడిబాకు
పచ్చలపిడిబాకో_ విచ్చిన పువురేకో!
గుచ్చుకుంటె తెలుస్తుందిరా_
మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా || ఛాంగురే||
గుబులుకొనే కోడెవయసు లెస్స_ దాని గుబాళింపు ఇంకా హైలెస్స
పడుచుదనపు గిలిగింత _ గడుసు గడుసు పులకింత
ఉండనీయమేమి సేతురా_ కైదండలేక నిలువలేనురా ||ఛాంగురే||
ఉండనీయమేమి సేతురా_ కైదండలేక నిలువలేనురా ||ఛాంగురే||
No comments:
Post a Comment