Monday, 27 November 2017

పావురాల జంట ప్రేమ ఉసులేవో చెప్పుకుంటున్నాయి
పారవశ్యం పంట లెవో పండించుకుంటున్నాయి
వడివడిగా దరిచెరి యడబాసి వుండలేనంటొంది
వాడైన ముక్కు తో తను తిన్న దేదో ప్రేమ కానుక ఇస్తోంది
వలపుల వొట్టెసి మురిపాలన్నీ ముట్టజెబుతొంది
వలయంగా చుట్టూ తిరుగుతూ గుడుగుడు రాగం పాడుతొంది
జట్టుగా చేరి జానపద నృత్యం చెస్తొంది
బుట్టలా వళ్ళంతా విచ్చుకుని ముచ్చటిస్తుంది
పరువాల పావురాలకు ప్రేమ మైకం కమ్మెసింది
పరిశీలిస్తె ప్రపంచమంతా ప్రేమ మాయలో పడిపోయింది

No comments:

Post a Comment