Friday, 24 November 2017

మౌనం

నిర్మలత్వాన్ని నింపె మౌనం
నిర్మాణుష్యమె అంతరంగం
నింగితో లీనం నేలతో నేస్తం
నిగమ నాదాంమృత నినాదం
నిటలాక్షుని నామస్మరణామృతం
నిటలమై నిండు సాగర మదనం
నిత్యం నీ కొలువై నిండే మనసు మందిరం
నితాంతము నీ సన్నిధి నాకది వైకుంఠం
నిష్క్రమించి నిలువలేను నీ ద్యానమే పరమపదం
నిష్కృతి ఎమున్నది జీవమెపుడో నీవశం
నిర్విఘ్నమై కొనసాగనీ ఈ తపస్సు మనస్సిక నీ చరణం
నిరంతరం నిత్యవసంతం నీ స్మరణమె మృదుమధురం
నీలకంఠ శంభో శంకరా నాగాభరణా నీరాజనం
నీలీల అణువణువూ అద్భుతం అనిర్వచనీయం

No comments:

Post a Comment