Thursday, 30 November 2017

మా శ్రీ వారి ఆనందానికి అవధులు లేవు
మంచి ఆఫీసర్ గా సాటిలేని ధీరుడు
మాట మంచితనం అందరితో కలుపుగోలుతనం


Wednesday, 29 November 2017

స్రీ, తత్వం లో స్వార్థం వుంటుంది అది ఒక బధ్రతను ఏర్పరచడానికి ఈ స్వార్థ చింతన స్రీ లో లెకపోతె తన పిల్లల పట్ల బాధ్యత ను నిర్వర్తించలేదు ఇది సృష్టిలో ఒక మాయా తల్లి కాగానే స్రీలో అనూహ్య మైన మార్పులు చొటుచెసుకుంటాయి దీనివల్లే కుటుంబాన్ని ప్రేమతో బాధ్యత తొ నిర్వహిస్తుంది స్రీ. పురుష తత్వం కుటుంబాన్ని సమాజంలో సంరక్షించ బడెలా రక్షిిస్తూ వుంటుంది. ఇది ప్రాణకోటిలో సహజం ప్రకృతి సహజం. నేటి సమాజంలో పిల్లల పట్ల తల్లితండ్రు ధోరణి చాలా దారుణంగా మారింది. తల్లి తండ్రుల కన్నా పిల్లలు చాలా తెలివిగలవారు తమ పిల్లలనుండీ నెర్చుకునె అంశాలు చాలా వుంటాయి. పిల్లల కు కొపం వచ్చినాక్షణకాలమె కొపం తగ్గిన మరుక్షణమే కొప్పడ్డవారిపైనే ప్రేమ కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ ఒక్క క్షణమే ఆ తరువాత నాచెల్లి నాతమ్ముడు  మనసులోఏదీ దాచుకొలేరు ఎవరైనా ఏమనుకుంటారో అనే బెరుకు బాధలూ ఏం వుండవు ఆడుకొడానికి గ్రౌండ్ కావాలని అడగరు వున్నచొటే తొచిన ఆట ఆడెస్తారు పెద్ద వారైనా తల్లి తండ్రి వీల్లె ప్రతి చర్యనూ అడ్డుకుంటూ వుంటారు కానీ వాళ్ళను క్షమించెస్తారు ఇలా పిల్లలు చెప్పకనే ఎన్నో పాఠాలు నేర్పుతారు ఆనందంగా ఎలా వుండాలో పిల్లల్ని చూసె నెర్చుకోవాలి. పెద్ద వారైయ్యెకొద్ది వాళ్ళల్లో ఈ ఆనందాలను మెల్లమెల్లగా చిదిమెసెది పెద్దవారె వాళ్ళ మనసులో లేని భయాలను సృష్టించి మెల్లమెల్లగా బాధలను పరిచయం చెస్తారు పెద్దవాళ్ళకు తెలిసిందిఅదే పెద్దలు పిల్లల తో స్నెహం చెయగలిగితె వాళ్ళ ఆనందం రెట్టింపై ప్రపంచాన్నే ఆనందమయం చెసెస్తారు

Tuesday, 28 November 2017

ఆకలిని జయిచడం సామాన్యుడికి సాధ్యం కాని విషయం
ఆకలింపు చెసుకుని సాధనతో తపస్సు చెసెవారికి ఇది                                                       అతి స్వల్ప విషయం
అవనిపై ఎన్నో అద్భుతాలు నిమిళీకృతంమై వున్నాయి
అవపొసన పట్టి ఆచరించగలితె అద్భుతాలు మనిషి                                                                 సొంతమంతాయి
ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగిన గురువులు దొరకడం పూర్వజర్మ సుకృతం
అంధకారం నుండీ బయట పడడం నా తక్షణ కర్తవ్యం
అనంతమైన జీవనలో గతాన్ని ప్రక్కకు నెడితె పునఃజన్మ నాకిది
అర్థవంతమైన జీవనానికి ఆధ్యాత్మిక మార్గం అద్భుతమైనది
అనుభవిస్తెగానీ అర్థం కానిది ఏ భాషకూ అందనిది
అతి పవిత్రమైన నా భారతదేశం లో నెను జర్మించడమె                                                        పరమొన్నతమైనది
అంతిమ దశలో అందిపుచ్చుకునె జ్ఞాన మంతా మొక్ష
ప్రాప్తికె, ప్రతి మనిషికీ అవసరమిది.

Monday, 27 November 2017

పావురాల జంట ప్రేమ ఉసులేవో చెప్పుకుంటున్నాయి
పారవశ్యం పంట లెవో పండించుకుంటున్నాయి
వడివడిగా దరిచెరి యడబాసి వుండలేనంటొంది
వాడైన ముక్కు తో తను తిన్న దేదో ప్రేమ కానుక ఇస్తోంది
వలపుల వొట్టెసి మురిపాలన్నీ ముట్టజెబుతొంది
వలయంగా చుట్టూ తిరుగుతూ గుడుగుడు రాగం పాడుతొంది
జట్టుగా చేరి జానపద నృత్యం చెస్తొంది
బుట్టలా వళ్ళంతా విచ్చుకుని ముచ్చటిస్తుంది
పరువాల పావురాలకు ప్రేమ మైకం కమ్మెసింది
పరిశీలిస్తె ప్రపంచమంతా ప్రేమ మాయలో పడిపోయింది

Sunday, 26 November 2017

వసంతం అలా వచ్చి చెరింది
జీవితం నే మెచ్చె లా మారింది
ఆనందం నదిలా ముంచెస్తోంది

ఆతృతతో అలా అలా పనులన్నీ చక్కబెట్టొచ్చు
అతి తక్కువ వ్యవధిలోనే అవలీలగా చెసేయెచ్చు
అవకాశమె వస్తే ఆ ఆకాశాన్నే తివాచీగా పరిచేయొచ్చు
అభినవ ప్రపంచాన్నే సృష్టించచ్చు
అమృతతుల్యమైన ఆనందన్ని అమాంతం నింపుకుంటే
                                    ఈ సృష్టింనే ప్రతిసృష్ఠి చేయెచ్చు

Saturday, 25 November 2017

సంపంగి సువాసనే హయి హయి

పూలోచ్చి పలికె సంపంగి భావాలోయీ
కోయలకే కుక్కుకూ యదహోరి కాబొజి సంగీతమంటెనె                                                       . ....హయి హయీ




Friday, 24 November 2017

మౌనం

నిర్మలత్వాన్ని నింపె మౌనం
నిర్మాణుష్యమె అంతరంగం
నింగితో లీనం నేలతో నేస్తం
నిగమ నాదాంమృత నినాదం
నిటలాక్షుని నామస్మరణామృతం
నిటలమై నిండు సాగర మదనం
నిత్యం నీ కొలువై నిండే మనసు మందిరం
నితాంతము నీ సన్నిధి నాకది వైకుంఠం
నిష్క్రమించి నిలువలేను నీ ద్యానమే పరమపదం
నిష్కృతి ఎమున్నది జీవమెపుడో నీవశం
నిర్విఘ్నమై కొనసాగనీ ఈ తపస్సు మనస్సిక నీ చరణం
నిరంతరం నిత్యవసంతం నీ స్మరణమె మృదుమధురం
నీలకంఠ శంభో శంకరా నాగాభరణా నీరాజనం
నీలీల అణువణువూ అద్భుతం అనిర్వచనీయం

Wednesday, 22 November 2017

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 1 ||
అఙ్ఞానతిమిరాంధస్య ఙ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || 2 ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || 3 ||
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 4 ||
చిన్మయం వ్యాపియత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 5 ||
త్సర్వశ్రుతిశిరోరత్నవిరాజిత పదాంబుజః |
వేదాంతాంబుజసూర్యోయః తస్మై శ్రీగురవే నమః || 6 ||
చైతన్యః శాశ్వతఃశాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాద కలాతీతః తస్మై శ్రీగురవే నమః || 7 ||
ఙ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః || 8 ||
అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే |
ఆత్మఙ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః || 9 ||
శోషణం భవసింధోశ్చ ఙ్ఞాపణం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః || 10 ||
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || 11 ||
మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః || 12 ||
గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || 13 ||
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవ దేవ || 14 ||

Tuesday, 21 November 2017

సుందర మమతల స్వగృహన్ని సుచిగా సమకూర్చా

Monday, 20 November 2017

రోజంతా నిదరోయి ఎన్నోరోజులుగా మిగిలియున్న నిద్ర ను పూర్తి చేశాను
రోదసి ఒడిలో సెదతీరీనంత ప్రశాంతంగా పారవశ్యన్ని పోందుతున్నాను
మేడమీద కూచుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తుంటె               ఆకాశం నాకొసం రంగుల రంగవల్లులు దిద్దుతోంది
మెరపడి నా మనసు మెలకువ లోనె మైకంలో పడుతోంది
పవనకుమారుడు ప్రభాకరున్ని పండు గా బ్రమించడంలో                                            అచ్చెరువెమీ లేదనిపించింది
పరవశించి పంచమమై పంచమ స్వరాన్ని ఆలపించాలని      ..                                                                   వుంది
పగడపు పల్లకీ ఎక్కి పాలపుత చీర కట్టి ఊరంతా                                                                          ఊరెగుతొంది
పండుగేకదా ప్రతిరోజూ ప్రకృతిలో అందాలను ఆశ్వాదించే     .                                               ఆ మనసు నాదైంది 

Sunday, 19 November 2017

మా ప్రేమ మధురం

మధురమైన పాటలొ మనసులోని మాటల మాధుర్యం
పాటపాడుతుంటే మావారు పొగుడుతుంటే పరవశం



మధురాతి మధురం మన ప్రేమ మధువు 
మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 
మది నిండునోయి .. తమి చేరునోయి 

చరణం 1: 

నిను వీణ చేసి .. కొనగోట మీటి .. అనురాగ గీతాలే .. పలికించనా 
ఆ పాటలోని .. భావాలు నీవై .. నీలోని వలపు .. నాలోన నిలుపు 

చరణం 2: 

చిరు కోర్కెలేవో ..చిగురించ సాగే .. ఎదలోన ఆశా ... ఊరించ సాగే 
నీ ఆశలెన్ని .. విరబూయగానే .. పూమాల చేసి .. మెడలోన వేతు 

చరణం 3: 

నా గుండెలోనా .. గుడి కట్టినానూ 
గుడిలోన దేవతలా .. నివసించవా 
గుడిలోన ఉన్నా .. ఏద మీద ఉన్నా .. 
నీ దేవి .. నీ కొరకే .. జీవించునులే ...
                             

Saturday, 18 November 2017

మా శ్రీ వారికంకితం

Beautiful song
మత్తైన పాట
ఓహో.....హో
Sorry సిగపు నడుం లేదు. కడు సుకుమారులు




 ఛాంగురే ఛాంగు ఛాంగురే
ఛాంగురే  బంగారు రాజా!
ఛాంగు_ ఛాంగురే బంగారురాజా!
మజ్జారేమగరేడా_ మత్తైన వగకాడా!
అయ్యారే!_...అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా              ||ఛాంగురే||
ముచ్చటైన మొలక మీసముంది_
భళా! అచ్చమైన సింగపు నడుముంది!
జిగిబిగీ మేనుంది_ సొగసులొలుకు   మోముంది
మేటి దొరవు  అమ్మక చెల్ల!నీ సాటి ఎవ్వరుండుట కల్ల              ||ఛాంగురే||
కైపున్న మచ్చకంటిచూపు_ అది చూపుకాదు పచ్చలపిడిబాకు
పచ్చలపిడిబాకో_ విచ్చిన పువురేకో!
గుచ్చుకుంటె తెలుస్తుందిరా_
మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా                                      || ఛాంగురే||
గుబులుకొనే కోడెవయసు  లెస్స_     దాని గుబాళింపు ఇంకా హైలెస్స
పడుచుదనపు  గిలిగింత _ గడుసు గడుసు పులకింత
ఉండనీయమేమి సేతురా_ కైదండలేక నిలువలేనురా              ||ఛాంగురే||

Friday, 17 November 2017

నిర్వాణషట్కం

                                   నిర్వాణషట్కం

 మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం – న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౧ ||
న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః – న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౨ ||
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ – మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౩ ||
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం – న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౪ ||
న మృత్యుర్న శంకా న మే జాతిభేదః – పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౫ ||


అహం నిర్వికల్పో నిరాకారరూపో – విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణామ్
సదా మే సమత్వం న ముక్తిర్న బంధః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || ౬ ||
చిత్రం చిత్తంలో చిదానందుడి ద్యానం
చితిలో కూడా చెరగదు నిశ్చలం
                 
             ...          

కర్పూర గౌరం కరునావతారం
సంసార సారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే
భవం భవానీ సహితం నమామి

Thursday, 16 November 2017

కొత్త పెళ్లికూతురిలా కొత్త కోర్కెలతో నా ఇంట్లో అడుగెడున్నట్లుంది
కోటి కాంతులు నన్ను గాంచిన మావారి కళ్ళల్లో మెరుస్తోంది
కొసరి కొసరి మావారు భొజనం వడ్డిస్తుంటె నను వీడివున్న ఎడబాటు నా కంటకన్నీరొలికించింది
కొరితే కాదనరే ఏదైనా కొండత మనసే మావారిది
కొలిచె దేవుడైనా కోరితేనె వరమిస్తాడు కోరకనే అన్నీఇచ్చే మావారి మనసు వెన్నకన్నా మిన్నైనది
కొందలము తో  కళ తప్పి చింతాకాంతుడై చెకోర పక్షిలా మావారి మనసు తపిస్తోందని నాకు అర్థమైంది
కోరుకున్నంత స్వేచ్ఛ నిచ్చి నా కంటతడికె కలవర పడి వరాలోసగె మా వారి మనసు మధురం
కొలువుకు సెలవని నా రాకకై పరుగున ఏతెంచిన నిండైన ప్రేమకి నా మనసు దాసోహం
కొరత లేదు ప్రేమకు నిండైన మనసులుమావి మెడైన ప్రేమ కుటీరంమాది
కొంగుబంగారమై కొలువైయింది ఇలలో మా జంటకు సాటేదీలేదంది

Wednesday, 15 November 2017

ఇల్లాలులేని ఇల్లు ఎలావుంటుదో ఆలోచిస్తే గుండె జల్లు           ......                                                 మంటుంది
ఇలా ఎలా రాగలిగానో ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగానో        ...                        ..అంతా ఆశ్చర్యమై తోస్తోంది
ఈసురోమని మావారు వంటరిగా ఎలావున్నారో                               ...            తలచుకుంటె గుబులౌవుతుంది
ఈ వేళే పెల్లుబుకుతోంది నాలో పాశం కానీ తప్పనిదిది
ఇల్లు గుర్తుకొస్తోంది తిరిగి వెళ్ళె సమయం వచ్చెసింది
ఇంతకాలం ఇక్కడ ప్రాశాంతంగా ఆనందంగా గడిచింది
ఇదొక అంతులేని ఆద్యాత్మికత ఈ ఆనందమె              .                                  .  ...                      ప్రత్యేకమైంది
రైలు రాత్రంతా పరుగులు తీసి అలసిపొయి ఆగింది
రైయ్యిఅని దూసుకుపోయె ధూమశకటానికి పగలేది      .                                                                      రాత్రేది
పూలమొక్కలపొదల్లో ముంగీస ఆశ్చరువొంది చూసెసరికి           ..........                                              తుర్రుమంది
పూలు పరిమళాలు వెదజల్లుతున్నాయి తెనెటీగ తెనెను                                                               జుర్రుకుంటొంది



అమావాస్య

అమావాస్య చీకట్లో తారలు తళ్ళుకులు
ఆకాశవీధుల్లో వెలుగు నింపె దీపాలు
చీకటి చీకటని మనకేల చీదరింపులు
చిమ్మ చీకట్లో చిద్విలాసం చెసె చిన్ని వెలుగలు
చుక్కలన్నీ నేలపై మక్కువై ఇచ్చె మినుకు మినుకులు
చక్కనైన పక్కపై పవ్వళించి పరికించి చూస్తే పాలపుత                                                                   సొయగాలు   మసక మసక వెలుగులో మత్రమెసినట్లు మత్తు గాలులు
మస్తకమున మెదలె మొహనరాగం తాలం వెసె పలికె                                                                      పెదవులు
వెతలకు చీకటి పోలిక ఎందుకో వ్యపించి వున్నాయి                                                చక్కని చుక్కల వెలుగులు
వెతికి వెతికి వెసారి పొతున్నా ఎన్నెన్ని అందాలు
లెక్కలేనన్ని పదాలున్నా ప్రకృతిని కొలిచెందుకు తక్కువై                                                                 తొస్తున్నాయి
లిఖించాలంటే భాషకు అంతుచిక్కని భావాలన్నీ                                                     నిఘూడమై నిష్క్రమిస్తాయి



Tuesday, 14 November 2017

       కలువ కొలనులో బుజ్జిబుజ్జి పాములు పలకరిస్తాయి        కొంగలు యెగిలా కొనేటి లో తపస్సుచెస్తున్నాయి             తామరాకు చాటుచెసి తాబేలు తొంగి చూస్తున్నాయి
     పాలపిట్టలు పరవశంతో పాడిన పాటే పాడుతున్నాయి
   చిట్టిపొట్టి గువ్వలన్నీ సంగీతంలోని స్వరాలన్నీ సాదన చెస్తున్నాయి 
 సూరిడు నింగిలో నున్న అందాలు చూసిచూసి అలసి నిదరొచ్చి పడమర పడకేశాడు





Sunday, 12 November 2017

అంబరం సిందూరాన్ని సింగారించుకుంది
కొలను కుంకుమ కషాయం తాగెసింది
కొబ్బరి తోట కొలాటమాడుతొంది
వయ్యరి హంసలు జంటకట్టి సరసమాడుతున్నాయి


Saturday, 11 November 2017

 
తనివి తీరదే తామరలను చూసే కనులకు.                     తమ్మి తెంపి తెచ్చి తంపరలుగ పేర్చితిచూసి తరించుటకు తామర తల్పముపై తలవాల్చాలని తలంపే తన్మయం     తుషార బిందువుల తడి ముత్యమై మెరిసే సోయగం      
తుమ్మెద ఝంకారం తోయజము యొక్క తెజం సుందరం               

Friday, 10 November 2017

అందరూ కలిసి ఒకచోట ఆత్మీయతలు పంచుకోడం
ఆదరాభిమానాలు ఆప్యాయత  పిలుపులు అద్వితీయం
ఆనందవదనాలతో వెలిగిపొయె ఆవచ్ఛస్సు అనిర్వచనం
అణువణువునా ప్రేమలు కురిపించే ప్రేమామృతం
అమ్మను మించిన అనురాగం అమృతమనసుల సొంతం
అమరమై నామదిలో నిలిచిపోవు అనుభవం
అమృత గడియలివి నా జీవితంలో మరువలేని మధరం
ఆశయాలను పండిచుకొను పవిత్రమైన స్థలం
ఆశ్రమమం అంటే ఆక్కున చెర్చుకునే ఆత్మీయం


Thursday, 9 November 2017

నిత్యం ఇలా నిర్మలంగా సాగాలి జీవనం
నియతము కలిగి నిరంతరం చేయాలి సాధనం
నాంది నేడే ఆశయం నిశ్చితం
నా జీవితానికి గమ్యం స్పష్టం







Tuesday, 7 November 2017

జై భైరవి దేవి

                జై భైరవి దేవి గురుభ్యో నమః శ్రీ
                జై భైరవి దేవి స్వయంభూ నమః శ్రీ
                జై భైరవి దేవి స్వధారినీ నమః శ్రీ
                జై భైరవి దేవి మహాకళ్యాణీ నమః శ్రీ
                జై భైరవి దేవి మహా బధ్రాని నమః శ్రీ
               .జై భైరవి దేవి మహేశ్వరీ నమః శ్రీ
                జై భైరవి దేవి నాగేశ్వరీ నమః శ్రీ
                జై భైరవి దేవి విశ్వేశ్వరీ నమః శ్రీ
                జై భైరవి దేవి ధుఃఖసంహారీ నమః శ్రీ
                జై భైరవి దేవి హిరణ్యగర్భిణి నమః శ్రీ
                జై భైరవి దేవి అమృతవర్శినీ నమః శ్రీ
                జై భైరవి దేవి భక్త రక్షిణీ నమః శ్రీ
                జై భైరవి దేవి సౌభాగ్యదాయినీ నమః శ్రీ
                జై భైరవి దేవి సర్వజననీ నమః శ్రీ
                జై భైరవి దేవి గర్భదాయినీ నమః శ్రీ
                జై భైరవి దేవి సూన్యవాసినీ నమః శ్రీ
                జై భైరవి దేవి మహా నందినీ నమః శ్రీ
                జై భైరవి దేవి వమేశ్వరీ నమః శ్రీ
                జై భైరవి దేవి కర్మపాలినీ నమః శ్రీ
                జై భైరవి దేవి యొనేశ్వరీ నమః శ్రీ
              ..జై భైరవి దేవి లింగరూపిణీ నమః శ్రీ
          . .   జై భైరవి దేవి శ్యమసుందరీ నమః శ్రీ
                జై భైరవి దేవి త్రినేత్రినీ నమః శ్రీ
                జై భైరవి దేవి సర్వమంగళీ నమః శ్రీ
                జై భైరవి దేవి మహాయొగినీ నమః శ్రీ
                జై భైరవి దేవి క్లెశనాశినీ నమః శ్రీ
                జై భైరవి దేవి ఉగ్రరూపిణీ నమః శ్రీ
                జై భైరవి దేవి దివ్యకామినీ నమః శ్రీ
                జై భైరవి దేవి కాళరూపిణీ నమః శ్రీ
                జై భైరవి దేవి త్రిశులధారినీ నమః శ్రీ
                జై భైరవి దేవి యక్షకామినీ నమః శ్రీ
                జై భైరవి దేవి ముక్తిదాయినీ నమః శ్రీ
                ఆఓం మహా దేవీ లింగభైరవి నమః శ్రీ
                ఆఓం శ్రీ శాంభవీ లింగభైరవీ నమః శ్రీ
                ఆఓం మహా శక్తి లింగ భైరవి నమః శ్రీ
                    నమః శ్రీ నమః శ్రీ దేవీ నమః శ్రీ


భైరవి దేవి

సవినయాం సర్వపావనాం మహశక్తి రూపే నవనీతం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే హరిద్రం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే చందనం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే కుంకుమం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే వస్త్రం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే పత్రం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే పుష్పం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే దీపం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే నైవేద్యం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే తాంబూలం సమర్పణం
సవినయాం సర్వపావనాం మహాశక్తి రూపే శ్రీఫలం సమర్పణం




Monday, 6 November 2017

క్యండిల్ లైట్సలొ భోజనం
కమ్మని విజిటబుల్ బిరియాని అద్భుతం
పరాఠా, మసాలా కర్రీ బహురుచికరం
ఫ్రూట్స్ సలాడ్, చాట్ మసాలా మరువలేం
దిల్ పసంద్ మనసుని దొచెసింది



Sunday, 5 November 2017

నంద నంద ఆనందమయం ఆశయాలు పండే శుభతరునం
నాదగానాబృతము మానసమున ఉదయించె ప్రేమాంబృతం
నాట్యమాడు నెమలి  నింగిలోని నల్లని మబ్బును గని అది నయనా నందం
నాళీకము నీటిపై తేలి తేలి తేజరిల్లు తొంది నీటి నికటం
నాయకుడై ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తది ఎంతటి నైపుణ్యం
నా మనసు కడు మృదులము ఆ మృడుడికే తెలుసు సమాలించడం
నాలోని నన్ను పరిచయం చేస్తోంది ఈ అందమైన సృష్టిలా మలచెది ఒకే ఒక్కడు నా పరమ శివం


Saturday, 4 November 2017

తొమ్మిది రోజులు తొమ్మిది క్షణాల్లా గడిచిపోయాయి
తొలిసారిగా నాలో అనూహ్యమైన అనుభూతులు                                                                 కలిగాయి
తొలిరోజు మౌనంగా సాగి పృథ్విసుద్దితో పున్యమై            .                                              పోతుంది చెయి
తొలికోడి కూసెలోపే కోవెలలో సేవలు మొదలౌతాయి

తొలకరి మంచు లా మనసంతా ఎంతోహయి
తోటలో పచ్చనిపైర్లు, పైరగాలి నను తడిమి వెళ్ళిపొతాయి
తొందరెందుకో ఈ కాలానికి ఎవరో తరిమినట్లు పరిగెడుతొంది కాస్త ఆగ ఓయి
తోడుకోసం తపిస్తున్నాఎమొ పక్షులన్నీ జంటకోరి పదేపదే కుహూ గానాలు చెస్తున్నాయి
తొత్తునైపోయా ఈ అడవిలోని అందాలకు మత్తులో మునిగి కళ్ళు మైమరచి పొయాయి
తోతెంచునె ఈ ఆమని సొయగాలు కనులను మరల్చనీయకున్నాయి



Friday, 3 November 2017

వెన్నెల్లో భోంచెస్తుంటే ఈ వేళ వెనకటి రొజులు ఒక్క సారి కళ్ళముందుకొచ్చాయి

Thursday, 2 November 2017

     జాజిమల్లేల మాలలల్లి జతగాడవని నీ మేడలోవేసా జల్లున కురిసే వానజల్లుకు జానతనం జతచేసా

జాబిల్లి కొలువైన కార్తీక పౌర్ణమి పూజలు
జగతినేలే ఆదిశంకరుడికి క్షీరాభిషెకాలు


Wednesday, 1 November 2017

పొన్నలు పొగడలు ఇలా చూసిపూలన్నంటిమీద కవిత రాయలనుకున్నా కాలం సరిపొవడం లేదు