Monday, 30 October 2017

వెన్నెల రాజు వెంటపడి వలపుల  వన్నెలు కురిపిస్తున్నాడు
వేణుగానం వెన్నెల రేయి తలపులలో  వేణుమాధడు

Sunday, 29 October 2017

ఆరంభం

అంతు లేని ఆలోచనలే అనుక్షణం
అలుపే రాని ఈ ఆలోచనలకు అడ్డుకట్ట ద్యనం
ఆనందం చవిచూస్తున్నా నాతో నేను మౌనంగా
అద్భుతంగా తోస్తోంది మునుపెన్నడూ లేని విధంగా
అంతరంగం లో ఆనందాల ఆవిష్కరణేఇది
ఆరంభమే ఇది  అంతం లేనిది







పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకు
నీవలె సుకుమారములూ 
నీవలెనే సుందరములు
పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకు 

Saturday, 28 October 2017

నెమలి తన పింఛాన్ని సవరించుకుంటూ వయ్యరం వొలకబోస్తోంది
నేలను నెమలి  ఈకలతో  సుకుమారంగా సుబ్రం చేస్తోంది
నడకేమొ నయనానంద నాట్యం

Friday, 27 October 2017

కళ్ళలో ఆనంద భాషాలు ఉబికి ఉబికి ఉప్పెనలా
కలలు నిజమాయె కార్తికేయుని గర్భగుడిలో దివ్యగానాలు

Wednesday, 25 October 2017

తూరుపు తేజమౌతోంది చీటీకటి భయం తో పారిపోతొంది
తూనీగల గుంపులా మంచు తెరలు పృథ్వి ని ముద్దాడు తోంది
కొండల గంభీరాన్ని చూసి ముచ్చటేసి మంచు మబ్బులు ఆలింగనం చేసుకుంటున్నాయి
కొడిగట్టిన దీపాలను తోలగించి కోవెలలో కొత్త దీపాల వెలుగులు సంతరించుకున్నాయి

Tuesday, 24 October 2017

మౌనం

మనతో మనం గడపడానికి మన శక్తి సామర్ధ్యాలను పెంచుకొడానికి మౌనం ఒక సాదనం
మౌనం ఎంత మధుం మటలలో చెప్పలేని మధురాతి మధురం
మనుషులంతా చుట్టూ చూస్తున్నా నా చూపులు నేల తల్లికే అంకితం
మమతల పలకరింపులు దరిచేరగనే పట్టి ఆపేస్తుంది మౌనవ్రతం
మాటలకందని తీయ్యని భావమేదో మనసంతా నిండి మంచులా చల్లగా కలిగిన వైనం




Monday, 23 October 2017

మనసు తేలిపోయె మబ్బుల్లో

మనసు మబ్బులా.తేలి తేలి పోతోంది
మానసమున మల్లెల వాన జల్లులు కురుస్తోంది
మందార మాలికలు నేలపై తివాచీ పరుస్తోంది
మది పారవశ్యమై పాడేస్తొంది పాదం ఆడేస్తోంది
మంకుపట్టుతో నను పట్టిపీడించె దయ్యం మొన్నటి తో వదిలేసింది
మకతికలో తికమకలో ఇన్నాళ్లుగా మనసు సతమతమై పోయింది
మనుషులు కొందరి మానసిక పైత్యాలు చూసీచూసి రొత పుట్టెసింది
మందుడికి నేడే దహన సంస్కారాన్ని గావిచి మది తలుపులు మూసెస్తోంది
మలినాలన్నీ మచ్చుకైనా లేకుండా మనసు మంచి గధంతో సుద్ది చేసేసుకుంది


            The end

Sunday, 22 October 2017

కొండా కొన

కొండగాలి వీస్తుంది కోయిల గానంచేస్తుంది
కొడవలితో పల్లె పడుచు లేత గడ్డి కొస్తోంది
కొలనులో కొండల చాయ గమ్మత్తుగా కనువిందు చెస్తోంది
కొలువు తీరి వృక్షాలన్నీ మేము లేని గడ్డపై ఎలా       .........                                     జీవిస్తారన్నట్లుంది
కొమ్మ కొమ్మ చాటుచెసి గువ్వలన్నీ గూడుకట్టుకుని సప్త స్వరాల పలుకు తున్నాట్లుంది
కొమలమైన కలువల కన్నెలు కొలనులో జలకాలాడు యతున్నాయి
కోవిదులు కోవెలలో కొలువై వేదాలు వల్లిస్తున్నారు
కోటగొడలాగా చుట్టూ కొండలూ అన్నింటినీ పేర్చికట్టినట్లు వున్నాయి
కోనలు నీటి పాయలు, పరిసరాలమొత్తం పచ్చదనం సంతరించుకున్నాయి
కోపాలు తాపాలు ఇక్కడి మనుషులో మచ్చుకైనా, అగుపించవు
కోరికోరి వచ్చా ఇకడి మమతలు చూసి ఎంతో మెచ్చా ఇక్కడ ఏ రాగద్వెషాలు లేవు
కోవెలలో కొలువైన నా దేవున్ని కొలుచుకోడానికి కొలువు కూడా ప్రాప్తించిది
కోకనదము చెబూని కోమల మై మనసులో  శంకరుడికి మౌన ద్యానాభిషేకాలు చేస్తొంది


Saturday, 21 October 2017

మనసు

మనసు మనిషి ని మరబొమ్మనుచేసి ఆడిస్తుంది
మనుగడలో జరిగినవి జరగనివీ అన్నీంటినీ ముందుంచుతుంది
మనిషిని క్షణమైనా ఏ ఆలోచనా లేని స్థితి లో ఉంచదిది
మబ్బుల్లా కమ్మెస్తాయి కళ్ళు మూసినా తెరచినా ఏదో ఒక జ్ఞపకాన్ని మొసుకొస్తుంది





పారిజాతం

పారిజాతాలు సందెవెళ కాగానే పరిమళాలతో పలకరిస్తాయి
పరితపించిపోతుంది నా మనసు పూల సువాసన ఆస్వాదించడానికయి
పవ్వళించాలనుంది పారిజాత సుమదళాల పానుపుపై
పరవశించనీ  పండువెన్నెల సోయగాల మాలికలపై
ప్రచేతనుడు కూడా పారిజాతాలకు ప్రభావితుడై వాన జల్లై తాకుతున్నాడు
ప్రభాత వెళ కాగానే ప్రభాకరుడు రాగానే పారిజాతాలు పుడమిపై చెరి పులకించుచుండు

Friday, 20 October 2017

తామర

నేను తలచా తామరని కొలనులో చూడాలని ఒక నాడు
నే తలచినదే తడవుగా కనువిందు చేస్తోంది ఈనాడు
ఏమని రాయను కవిత అలా చూస్తూవుండి పోయా మాటలు రాక
ఎదమెప్పించె శ్వేత వర్ణపు తామర తాకితే చాలు తరించిపోయె నా కోరిక



Thursday, 19 October 2017

మా నాన్నకు శాంతి కర్మ

నాన్నకు శాంతి కర్మ జరిపించినందుకు నా మనసు కు శాంతి గా వుంది
నన్ను కన్న మా నాన్న ఋణం ఇలా తీరింది
నడి రాత్రి అమావాస్య లో శాంతి కర్మ సవ్యంగా సాగింది
నాన్నా నిన్ను ఎన్నోసార్లు నొప్పించాను నన్ను క్షమించు
నాకంట కన్నీరు ఆగక ఉప్పెనై పొంగె, ఒక్కసారి కనిపించు
నిన్ను మరచిందెపుడు ఎన్నో జ్ఞాపకాలలో నాతో ఉన్నావు
నీవు నన్ను పిలిచిన ప్రేమ పిలుపులో ప్రతిసారి కనిపిస్తావు
నాలోని చిత్రకళను మొదటీ సారి గుర్తించిందే నీవు
నాకు నచ్చిన చిత్రకళను ప్రోశ్చహించావు
నేను రాష్ట్ర అవార్డు పొందితే పొంగిపోయావు
నను సన్మానం చేస్తె ఊరందరికీ చెబుతూ                                                                ఉప్పొంగి పొయావు







పల్లె పడుచులతో దీపావళి సందడి

దీపావళి పండుగ సందడి (ట్రైబల్ )


అమ్మవారి పూజ లు అలంకారాలు
అందంగా అమర్చి దేవికి సమర్పించే నైవేద్యాలు
ఆనందంగా చిందులేసే ఆదివాసులు
అందరితో పాటు సై అంటూ ఆడెసాయి నా పాదాలు


Wednesday, 18 October 2017

ఆనందం

అరమరికలు లేని ఆనందాలు ఎలా వుంటాయొ చవిచూస్తుంన్నాను
ఆకాశంలో విహరిస్తున్నా ఇంత ఆహ్లాదాన్ని మొయలేక పోతున్నాను
ఉక్కిరిబిక్కిరి ఆయిపోతున్నా ఇక్కడి మనుషుల మధ్య ప్రేమ గౌరవం ఎనలేనివి కొనలేనివి
ఉసుపోని ఉహలతో కాలమంతా వృధా చేసానని క్షమించెస్తున్నా గడచినవి గతించినవి
ఏది చూసినా ఇంకొంచం ఆనందంగా వుండగలిగెదెదో నేర్పుతుంది
ఎంత ఆనందాన్ని నాతోనింపుతున్నా ఇంకాస్తెదో మిగిలే వుందెమొ అనిపిస్తుంది
నేను చేరుకునే తుది మజిలీ ఇదేనని నాక‌ర్దమైపోతోంది



Saturday, 14 October 2017

రైలు ప్రయాణం

4/10/17.
చీకట్లు కమ్మెసాయి చిద్విలాసం చెస్తోంది చల్లగాలి
చిత్రించాలనుంది పండు వెన్నెల్లో జాబిల్లిని చుక్కల్ని
చిలిపి చందమామ మబ్బుల్లో దోబూచాడే అల్లరిగా
చుకుబుకు రైలు స్టేషన్ వస్తే ఆగింది మెల్లమెల్లగా
చూస్తూ వున్నా ఎన్ని స్టేషన్స్ వస్తాయా ఆతృతగా
చెయ్యి కిటికీనుండీ బయటకు చాచా చిన్నిచిన్ని                                చినుకులు తాకుతున్నాయి చల్లచల్లగా




 

Thursday, 12 October 2017

నే మరువలేని అద్భుతం

అనుకున్నది జరగలేదా అంతులేని బాధ
అణుచుకున్నా ఆగడంలెదు కన్నీటి వెధ
సంకల్పం తో వెళ్ళానా అద్దాంతరంగా ఆగిపొతే                                                                   సంకటమెకదా
సంకాశము లేక నాపై సంకుచిత బేధమేల సచ్చితానందా
నిట్టూర్చి నిను నిందించి నిదురమరచి రాత్రంతా రొద
నిబ్బరించి బాధను నిగ్రహించుకుని నిష్క్రమించవలెనని        ..                        నిర్ణయించి ఎంచా నీదే భారముకదా
ఉదయమే వెళ్ళాను ఉహించనంతగా ఉహలన్నీ తలక్రిందులాయె
ఉల్లాసంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయె నిర్ణయించే గడువు మారిపోయే
అద్భుతమె ఇది ఎలా సాధ్యం అంతా నీమాయె కదా
అశ్చర్యంతో అంతుపట్టలేని అయెమయమాయె                                            .      .....   నందనంద ఆనందా



Wednesday, 11 October 2017

చిన్ననాటి జ్ఞాపకాలు

చిన్న తనం లో పాఠశాలకు వెళ్ళె దారిపొడుగునా       ..                  ..  ...         చిందులు  వేస్తూ వెళ్ళెవాళ్ళం
చిందులేస్తుంటే రెండు జడలు అటూఇటూ ఊగుతుంటే
                    లయబద్ధంగా గంతులేస్తూ వెళ్ళే వాళ్ళం
చిన్నారి పొన్నారి పిల్లలమంతా చేతిలో చెయి వేసుకుని
                                  గాల్లో ఊపుకుంటూ  వెళ్ళెవాళ్ళం
 చేతితో స్నేహన్ని మెడచుట్టూ,నడుంచుట్టూఅల్లెసుకుని                                                    నవ్వుతూ వెళ్ళెవాళ్ళం
చెవిలో గుసగుసలు చెప్పుకుంటూ  వెళ్ళెవాళ్ళం
చాడీలు ఒకరిపై ఇంకొకరు తెగ చెప్పుకునె వాళ్ళం 
చెట్లు కనిపిస్తె చుట్టూ రాలి పడ్డ పూవ్వులేరి తెచ్చు                            ...                                         కునెవాళ్ళం
 చెతి వేళ్ళతో వాటిని చిదిమి చిన్ని బుడ్డ చేసి కొడితే టప్ప
                ఆని సబ్దాన్ని వినగానే బలే ఆనందించె వాళ్ళం
చెరువలోనే (పాఠశాలచెరువలో)చెట్టుకింద శీమచింత           .......          .        కాయలను పోటీ పడి వెతికె వాళ్ళం
చెట్టు క్రింద కూచుని అందరం పంచుకుని తినె వాళ్ళం
చెమ్మాచెక్క, తొక్కుడు బిళ్ళ దాగుడుమూత ఇలా ఎన్నో         .....                                          ఆటలు ఆడెవాళ్ళం
చెరిగిపోని జ్ఞాపకాలు చిన్ననాటి స్నేహాలు స్వచ్ఛమైనవి                  అందమైనవి. గడిచి పోయిన కాలంలోకి వెళ్ళలేం
 చిత్రం ఏంటంటే ఆ ఆనందాలు ఆటలు పెరిగేకొద్ది అవి        .                కూడా పెరగాలి కానీ బాధలు అసహనం
                         చిరాకు వీటివైపె మనంవెళుతున్నాం

Monday, 9 October 2017

శంభో శంభో

శంభో శంభో
శివుడి అభిషెకాల సెవలో తరించిపోయా
శివ లింగంపై వేపాకువుంచి నీటిధారగా
                   పోసె విదానం కొత్తగా తోచాయి
నీటిధార లింగం చుట్టూ నిలవుండిపోతాయి
నిగనిగ మంటూ శివలింగంపై ఆభరణాలు మేరిసి
                                                     పోతున్నాయి
మంత్రాలతో ఆలయం మారు మొగుతుంది
మనిషిని భక్తిలోకి లాగి మంత్రముగ్దుల్ని చేస్తోంది
అరవింద నేత్రాలతో చూడచక్కని మొము
అవతార పురుషుడు అద్వితీయమైన తేజము




Sunday, 8 October 2017

ఎన్ని అందాలో ఈ సందెల్లో

సందెవేళ కాగానే సన్నజాజి గుబాలిస్తుంది
సంపంగి ముక్క ని నొక్కి కదలనీక ఆపేస్తుంది
సోగసైన ఈ ఆమనిని చూస్తే అసూయ కలుగుతుంది
పచ్చని తివాచీ నాకోసమే పరిచినట్టు
పలకరిస్తూ చందమామ పిలుస్తున్నట్లు
విహంగాలు వాలిపోయి జోల పాడినట్లు
వేయి వేణువు లాలనగా వింటున్నట్లు
పారిజాత పుష్పాలు నాకై పరిమళాలు జల్లి నట్లు
పారే సెలఏరు పట్టి తనలోకి లాగుతున్నట్లు
తుమ్మేద ఝంఖారం తామరను తాకినట్లు
తరచి తరచి ఈ ఆమని లో తరించినా తనివే
   ...                 .....       .         తీరనంటోంది




Saturday, 7 October 2017

ఆనందమయ శ్లోకాలతో మేలుకొలుపులు
ఆకశంలో చద్రుడు రాత్రంతా నాకోసం వేచి
      అలసి పడమరకు సోలినట్లు నాలో భావాలు
రా రమ్మంటూ చందురున్ని నే పిలవగా సిగ్గతో కొండ                                                       చాటుకు పరుగులు
రేరాజుకు అలసిన నా మామకు రాగమాలికల జోలలు
పగలంతా నిద్దరోయి రాత్రికి నేనలసిన వేళకు రమ్మని                      ...                                             విన్నపాలు
పవ్వళించె వేలకు కావాలి నీ పలకరిపులు
     



Friday, 6 October 2017

ఆనందం

వెన్నెల్లో విహరిస్తుంటే మనసు ఆనంద డొలలాడూతుంది
వన్నెల కలువ నెలరాజును రారమ్మంటూ తలాడిస్తుంది
కలువలరేడు కొబ్బరాకు చాటుచేసి కవ్వస్తున్నాడు
కలిసేనా ఈ చెలిమి అవనికి ఆకాశానికి దూరం ఆమీడు
ఏంటో ఈ ఆనందం దీనీకీ అవధులే లేవు
ఏముంది ఈ నేలలో ఈగాలిలో ఏవీ గుర్తురావు
నాజీవితంలో ఇంత ఆనందం చవిచూడలేదు
నాలో ఈ మార్పు  మునుపెన్నడూ లేదు
వసంతాలు పూయిస్తుంది వీణలు మీటుతుంది
వనంలో పువ్వుల్లా నాలో నవ్వులెండబోస్తోంది
డమరుకం మొగిస్తుంటే నన్ను మరచి నాట్యమాడేసాను
డ్యాన్స్ అందరితో కలిసి ఆడెస్తుంటే ఆ ఆనందం                ..                     .....     ..              మాటల్లోచెప్ప లేను
దోసిట్లో దీపం పెట్టి కోవెల్లో ముగ్గెపెట్టి ఆడాం ముంగిట్లో    .....              ....      ....               .....       కోలాటం
దరువెస్తుంటే లయబద్దంగా సై అంటుది నా పాదం


Thursday, 5 October 2017

నిన్నటి రోజు ఊదయం రైలు కూతతో మేలుకున్నా
నీలాల కళ్ళని నెమ్మదిగా తెరచి చూసా తెల్లని ఆకాశాన్ని
మబ్బులు కమ్ముకుని చల్లగాలితో ఈ రోజు మొదలైంది
మగత నిద్ర ని పక్కుకు నెట్టి చూస్తె నా గమ్యం వచ్చెసింది
గబగబా నా లగేజ్ తీసుకుంటుంటే ఒక వ్యక్తి సాయం        ..,.........              చేయడానికై ఎంతో చోరవతో వచ్చాడు
గోప్ప మనసున్నోడె అనుకున్నా మావారి జాబ్ ఏంటని
       ........                                                   అడిగాడు
తదేకంగా చూస్తుంటే ఏటా అని ఆనుమానం వచ్చింది            .  ........            నేను వాడి వైపుచూస్తె నవ్వుతాడు
తన్నాలనిపించింది నాకు ఎదవ పొట్టొడికి వేషాలు చూడు
తన్నుకొచ్చె కోపాన్ని ఆపుకుని ఛీ ఏ వయసు వాళ్ళనీ      .. ....వదలరే ఏబ్రాసి మొహలు మింగెసెలా చూస్తున్నాడు
మొహంమీదే ఛీకొట్టి వచ్చెసాను









చందమామ

ఉదయాన్నే చంద్రున్ని చూసా చందనాలు చల్లుతున్నాడ
ఉల్లిపొరలాంటి మేఘాలు దాటి తోంగి తోంగి చూస్తున్నాడు
చీకట్లో నడుస్తుంటే చిన్ని  కీటకాలు పెద్దగా అరుస్తున్నాయి
చిత్రం మైన  స్రృష్ఠి వర్షం పడగానే అందాలు ఆరబొస్తాయి
నేలంతా చిన్ని చినుకు  కు పచ్చని పుడమి పులకింత
నేలతల్లి నవ్వినట్లు పూలన్నీ నన్ను పిలిచె పలకరింత
సూర్యుని కిణాలు నీటి పైపడి తలుక్కన్న చమక్కు

Wednesday, 4 October 2017


నిద్ర రాని నాకు నైట్ అంతా నీట్ గా ఇల్లు సర్దుకొడం లో సరిపోయింది
నీలి ఆకాశం తెల్లబోయి చూస్తుంది నీ నీలికళ్ళల్లో నిదరెందుకు రాలెదని. నా పుట్టినింటికి వెళ్ళాలి ఆనందం ఉప్పోంగి నిదుర దరిచేరనంది. హడావుడి గా బయలుదేరిన నాకు ప్రశాంతమైన ప్రయాణం సాగింది
చుట్టూ పచ్చ దనం గడ్డి మొక్కలు చిరుగాలికి  ఉగుతున్నయి నీలగిరి చెట్లెమొ ఆకాశానికి బూజు దులుపుతున్నాయి తాటి చెట్లు తన ఆకులతో తాలం వెస్తున్నాయి తంగెడుపూలు విరగ బూసి సిగ్గుతో నేలకేసి రాస్తున్నాయి పక్కనే పిల్లకాలువలు. కువ కువ మంటూ గువ్వలు . చెరువులన్నీ నీటితో నిండిపోయున్నాయి. పచ్చని పోలాల్లో తెల్లని కొంగలు కదలకుండా నిలుచున్నాయి నేను వెళుతున్న రైలెమొ కూతకూస్తూ పరిగెడుతుంది గాలివాటానికి నా ముంగురులు మొముపై నాట్యం చేస్తున్నాయి రాత్రి నిదుర పోని నా కనులు కునుకు తీస్థున్నాయి. పసువులకాపరి రాతి గుట్టపై పడుకుని ఏవో పద్యాలు పాడుతున్నాడు. విహంగాలు ఏవో  వింత నాదాలు చేస్తున్నాయి ప్రయాణం లో నా మది పరవశించి పోతుంది.

Monday, 2 October 2017

వర్షం నన్ను ముంచెసింది

వర్షం వద్దన్నా వస్తుంది
వాగై రహదారిని ముంచెసింది
వచ్చా షాపింగ్ కి నచ్చ లేదు ఏదీ
వెనుతిరిగెలోపే వాన వచ్చెసింది
వేచి చూస్తున్నా రెండు గంటలు గడిచింది
వేగంగా కురుస్తుందేకానీ తగ్గడంమే లేదిది
వేళకాని వేళ వర్షమేంటి అయినా బాగుంది
వెళ్ళాలి ఇంటికి కంటికి కనిపిచదేది దారి
వచ్చేటప్పుడు కారులో వచ్చుంటే బాగుండెది
వేడి వేడి కాఫీ తాగాలనిపించినా వివేకం వద్దంది
వడి వడిగా నా కాళ్ళు రోడ్డును దాటేసింది
వోళ్ళంతా ఒక్క క్షణం లో తడిచి ముద్దైయింది
వెంటతీసుకెల్లడానికై మా శ్రీవారు వచ్చినతీరు
              .......                 నాకెంతో నచ్చింది
వెంటనే బండేక్కేసాను వర్షం కుండపోతగా మాపై
            ..        ..                     కురుస్తునేవుంది
వేల వేల సార్లు నేను తపించినదే ఇలా తడవడమన్నది
వెలకట్టలేని అవకాశం నాకిది
వరమై నాకోసం వచ్చెసింది
వాన పాటలన్ని నామది ఉల్లాసంగా పాడేస్తుంది
వాలు కళ్ళపై వాననీటిని తొలగించి చూస్తే అప్పుడే
  ..                 ...                 మా ఇల్లు వచ్చెసింది
వీలుచూసుకుని ఇలాంటి అవకాశం మళ్ళీ నాకోసం
                                                తప్పక వస్తుంది
వీడుకోలిక ఈ క్షణానికి మరువలేని మధుర కావ్యమిది