Thursday, 28 September 2017

సెలవు

సెలవిక సంసార జీవనానికి
సేవలో సేదతీరాలిక
సంకల్పించా నాకు తోచిన
సహయం చెయడానికి
సేవే ఊపిరైనది దొరికిందొక వేదిక
సత్వరమే సేవలు మొదలెట్టాలిక
సమాజంపై నా బాధ్యత నిర్వర్తించేందుకు
సామరస్య మైన నా కాంక్ష నెరవెరాలిక

Wednesday, 27 September 2017

హద్దేలేని ఆనందం

ఆనందమైన జీవనం జీవించడం ఇంతసులువు అని ఉహించనేలేదు
అనురాగం పంచేకొద్దీ అంతులేనిదై నను ముంచెస్తుందని అస్సలు అంచనా వేయలేదు
అహం తోలగిపోతే అర్థవంతమైన జీవనం జీవించడం ఎతోసులువు ఇందులో సందేహమే లేదు
అందరిలోకలిసి వున్నా నేనింతేనంటూ గిరిగీసుకు బ్రతికే జీవనం నాకు అస్సలొద్దు
అరుదైనది ఈ జీవీతం అనుక్షణం ఆహ్లాదకరంగా గడపడానికి నాకు లేదేదీ హద్దు
అన్నీ నాలోనే వున్నాయ నిజం నమ్మలేకున్నా పరివర్తన చెందితే నేనుఅవుతానేమొ బుద్ధునిలా
అద్భుతమైన బుద్ధని చరిత్ర చదివాక నాలో సందేహాలు
సద్దుమణిగాయి
" వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట
  చెసిన ధర్మం చెడని పదార్థాం చేరును నీ వెంట"
                ఆదీ లేదు అంతం లేదు   

నవరాత్రి

నవరాత్రి రోజులు నిత్య నిష్ఠ పూజనీయం
నరుడికి విజయాన్ని ప్రసాదించే శక్తి పుంజం
నాగరికతను చాటేదే మన సత్ సాప్రదాయం
నాభీనుండీ పలికే ఆఓం ఆప్రకంపనలు అద్భుతం
నీ నామాలు పలికితేచాలు ఉప్పొంగేను నా హ్రుదయం
నా నీలి కన్నులు ఆనంద బష్పాల  జాలువారు జలపాతం

 లింగ భైరవి స్తుతి
జై భైరవి దేవి గురుభ్యో నమః శ్రీ
జై భైరవి దేవి స్వయంభో నమః శ్రీ
జై భైరవి దేవి స్వధారిణి నమః శ్రీ
జై భైరవి దేవి మహా కళ్యాణి నమః శ్రీ
జై భైరవి దేవి మహా భద్రాణి నమః శ్రీ
జై భైరవి దేవి మహేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి నాగేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి విశ్వేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి సోమేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి దుఖః సంహారి నమః శ్రీ
జై భైరవి దేవి హిరణ్య గర్భిణి నమః శ్రీ
జై భైరవి దేవి అమృత వర్షిణి నమః శ్రీ
జై భైరవి దేవి భక్త రక్షిణి నమః శ్రీ
జై భైరవి దేవి సౌభాగ్య దాయిని నమః శ్రీ
జై భైరవి దేవి సర్వ జనని నమః శ్రీ
జై భైరవి దేవి గర్భ దాయిని నమః శ్రీ
జై భైరవి దేవి శూన్య వాసిని నమః శ్రీ
జై భైరవి దేవి మహా నందిని నమః శ్రీ
జై భైరవి దేవి వామేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి కర్మ పాలిని నమః శ్రీ
జై భైరవి దేవి యోనీశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి లింగ రూపిణి నమః శ్రీ
జై భైరవి దేవి శ్యామ సుందరి నమః శ్రీ
జై భైరవి దేవి త్రినేత్రిని నమః శ్రీ
జై భైరవి దేవి సర్వ మంగళి నమః శ్రీ
జై భైరవి దేవి మహా యోగిని నమః శ్రీ
జై భైరవి దేవి క్లేశ నాశిని నమః శ్రీ
జై భైరవి దేవి ఉగ్ర రూపిణి నమః శ్రీ
జై భైరవి దేవి దివ్య కామిని నమః శ్రీ
జై భైరవి దేవి కాల రూపిణి నమః శ్రీ
జై భైరవి దేవి త్రిశూల ధారిణి నమః శ్రీ
జై భైరవి దేవి యక్ష కామిని నమః శ్రీ
జై భైరవి దేవి ముక్తి దాయిని నమః శ్రీ
ఆమ్ మహా దేవి లింగ భైరవి నమః శ్రీ
ఆమ్ శ్రీ శాంభవి లింగ భైరవి నమః శ్రీ
ఆమ్ మహా శక్తి లింగ భైరవి నమః శ్రీ
నమః శ్రీ నమః శ్రీ దేవి నమః శ్రీ

Tuesday, 26 September 2017

యేగా

మనిషి మేధస్సు అవగాహనతోకూడినదై వుండడం అవసరం!. మానవతకు తగిన అనుభవ పూర్వకమైన జ్ఞనంఅత్యవసరం!. మేధోశక్తికి అవగాహన అనుభవం లేకుంటే మనస్సౌతుంది తప్పిదం!. మనసు ఏకత్వమై అనుభవపుర్వకమైనదే సత్యం!. మనలోని సత్యం అద్భుత అనుభవాలసారం!. మానవ సార్వజనీనత అస్తిత్వ వాస్తవం!. మన వ్యక్తిత్వం అన్నది ఒక ఉహాలోకం!. మనసు నిశ్చలమై పూర్తి స్రృహతోవున్నదాన్నే యెగా అంటాం!. మనసులొని ఆలోచనలు వెనక్కి తగ్గి అద్భతస్పందనగల మౌనంలోకిజారుకుంటాం!.

Sunday, 24 September 2017

గురు దేవా


గురు దేవా నా గమ్యం అగమ్యగోచరం
గుండెలో గుడికట్టెసా నీవే నా మర్గదర్శం
గుడ్డిదాన్ని చేసింది నాలోవున్న ఆద్యాత్మికం
గడియ గడియ నాలో.పారవశ్యమైన మైకం
గీర్వాణుడవు నీవు నీకు నా పాదాభివందనం
ఘాడాంధకారంమైన నా జీవన మార్గం
ఘటన మై వెలిగించావు నాలో భక్తి జ్ఞానం
ఘంటాపథంగా చెప్పగలను నీవల్లె ముక్తి తధ్యం

గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవేన్నమః

Thursday, 21 September 2017

పుడమి

పుడమి పునీతం పూడ్చి న ప్రతిదీ విలీనం ఆయిపోతుంది
పున్యం ఏమొ పాపమెమొ కానీ ఆయువయితే                                                              ........    ముగిసిపోతుంది    

Wednesday, 20 September 2017

ఆనందం

మధురమైన ఆనందంలో మౌనం ఎంతో మనోహరం
మనసు ఊహలూ ఎటు తోస్తే అటువెల్లి మనోవెధే గతం
మనసనే పలక పై ఎది రాసుకుటే అదే చదవగలం
మనసు కోతి వంటిది అంటే నమ్మలేదు అమాయకత్వం
మనిషిని కుప్పిగంతులు వేయించె మనసుని అదుపులో                 . ....                                వుంచడం అసాధ్యం
మన జీవితాన్ని భక్తి తో మధిస్తే చివరి కి వచ్చేదే జ్ఞానం