Saturday, 10 December 2016

ఈ విశ్వం ప్రేమ మయం

విశ్వమంత ప్రేమతో
విలీనమయ్యా పరవశంతో
 వెకువ లాంటి వెలుగొ!
వెన్నెల లాంటి చలువో!
వెను వెంటనె వేలరూపాలు
వెన్ను న జుంమ్మను తేజాలు
తనువంతా తెలికైన భావాలు
తన్మయమయి తరించె భగవంతుని భావనలు
తరచి తరచి నన్ను నేను శోదించిన తేజరిల్లు తేజాలు
తాళలేని ఈ ఆనందంలో జాలువారె ఆనంద భాష్పాలు
వర్ణించ తరమా భగవంతుని భావనలు
విరించి కైనా వర్ణించలేని భాష్యాలు