Friday, 14 August 2015

మధురం అతి మధురం

నాపై నీకు ఎంత ప్రేముంది!
నేను నమ్మలేక పోతున్నానిది!
భర్త అంటే భరించువాడు అని అంటారు
భరించావు నా కోపాన్ని
భారమైనా సహించావు ద్వేషాన్ని
భావించా నాదే గొప్ప ప్రేమని
భాదించా నీకు ప్రేమే లేదని
నా బంగారనివి నీవని
నాకు నీవుంటే చాలని
నాకింకేమి వద్దని
నీకన్నా నాకు మిన్న ఎవరులేరని
నీవే నా ప్రాణమని
నీవేనాకు కడదాకా అని
నా తప్పులు మన్నించమని
మన సంసారం కలతలు లేక సాగాలని
మన కలయిక మధురం అతి మధురమని
                                          --కళా--