సోయగాల కన్నుల
సోలిపోవు రేయిలా
సొంపైన వాలుకన్నులా
ఇంపారగ నీ రూపం నింపుకున్న కలలా
సొగసులెన్నో నా చెలి కన్నుల
శ్వాసలో చేరే చల్లని వెన్నెల
స్వగతాలు పలికే నిదురమ్మకి ఇలా
స్వప్నాలలో చెలి తేలే సోలెనిలా
సోదలు వేతలు మరచిపో అలా
సరసిలో తేలు కలువ కన్నుల
సంధ్య దాటి చీకట్లు కమ్మేవేల
సుందరర వదనం తోచే సరోజంలా
నీ సమక్షంలో లేని క్షణాలు నిరర్థకంలా
నిరీక్షనలే నిన్ను చేరుటకై ప్రతిక్షనాలు
-కళవాణి-