Wednesday, 29 April 2015

ప్రాణ సఖుడు


సఖి నీ ప్రాణ సఖుడు అతి సుందరుడు 
కలువ కన్నుల వాడు
కరివదనుడు కవలక్షుడు
కరిమబ్బు మేని చయవాడు
కడు కొమలుడు నీ వలకాడు
కారుణ్య ధరుడు
కంఠీరవము ను అధిష్టించిన వాడు
నీ కన్నుల వెలుగుల కాంతుడు
కండర్పుడికే కన్ను చెదురు వాడు
కందళిo చు  ప్రేమకు మన్మధుడు
కాటుక కన్నుల వాడు
కళానిధి కన్నా కడు చల్లనివాడు
కన్నయ్య వాడు నీ కన్నె మనసు చోరుడు వాడు
నీ కపోతంబు  పై చిటికే వేయు చెలికాడు
నీ కరమును చేపట్టు కమనీయుడు వాడు




మనసు మ్యాజిక్

నీ భాగస్వామిని నువ్వే  ప్రేమించాలి.  నీ మనసులోని ఎప్పుడు తన భావనలే మెదలాలి ఎక్కడున్నా తన బొమ్మనే ఉహించుకుని i love u చెప్తూ ఉండాలి 10,15 times మించి చెప్పుకోవాలి ఇలా చేయగలిగితే నీలోని ప్రేమ నీ భాగస్వామికి చేరుతుంది తనలో కుడా మార్పు వస్తుంది.  ఆఫీసు నుండి ఇంటికి వచ్చే ముందు అలా అనుకుని చూడండి మార్పు మీరే గమనిస్తారు నీ భాగస్వామిపై కోపం వచ్చినపుడు నీ భాగస్వామి కున్న మంచి గుణాలు ఒక మూడింటిని రాయండి అలా రాస్తే మీ మనసులో కోపం పోయి ప్రేమతో నిండిపోతుంది. నీ భాగస్వామి కోప్పడుతుంది అంటే దానికి కారణం భయం అది భయమని వారికే తెలియకపోవచు.నీ భాగస్వామి భయపడుతుంది అని గ్రహిస్తే చాలు సమస్య సగం తీరినట్టే అలా కోప్పడినప్పుడు"భయపడకు నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు" అని దగ్గరకు తీసుకుని భుజాన్ని తట్టి ధర్యం చెప్పాలి కుదిరితే కౌగలించుకుని భరోసా ఇవండీ నేనున్నాను నీకేం కాదు నేను చూసుకుంటాను నువ్వు ధర్యంగా ఉండు అని చెప్పే చిన్న మాట ధర్యాన్ని ఇస్తుంది.మెల్లగా భయానికి గల కారణం మంచి మాటలతో అడిగి తెలుసుకొని పరిష్కరించండి. భయం కలిగినప్పుడు మనం భయానికి గల కారణం ప్రశాంతంగా ఆలోచించాలి నాకు భయం వేస్తుంది ఇలా భయపడడం వళ్ళ ఏంటి ప్రయోజనం, దీనికి ప్రత్యామ్నాయంగా నేను ఎం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. వ్యాపారంలో నష్టం వచ్చింది బాదేస్స్తుంది సరే భాదపదడినంతమాత్రాన లాబాలు రావుకదా సరే నష్టం వచ్చింది నేను కృంగిపోను ఇది నా మంచికే జరిగింది నేను ఇంకా జాగర్తగా ఉండాలి నేను ఇంత చిన్నదానికే భయపడితే ఎలా అనుకోవాలి ఇది వ్యాపారంలోనే కాదు సంసారంలో కుడా ఇలాగే సమస్యలనుండి బయటపడాలి జరిగిపొయినదాన్ని వెనక్కి తీసుకు రాలేం అందుకే జరిగేవన్నీ మనమంచికే అనుకోవాలి భాదపడితే ఆరోగ్యం పాడాయి మల్లి ఆరోగ్యం పాడయిందని బాధపడాలి. ఒక కుటుంబంలో ఒకరి ప్రవర్తన సరిగా లేదు అంటే దాని వల్ల కలిగే బాధ అందరిది అవుతుంది అందుకే మనవల్ల మనవాళ్లే బాధపడకుండా ఉండాలంటే మనమే మారాలి. నీ భాగస్వామిని నువ్వే ద్వేసిస్తే అదే ద్వేషమే నీ భగస్వమినుండి నీకు ఎదురౌతుంది. అదే ప్రేమిస్తే అంతే ప్రేమ నీకు ఎదురౌతుంది కేవలం నువ్వు మారడంతోనే నీతోపాటుగా నీ భాగస్వామి లో మార్పు వస్తుంది ప్రతిరోజు నీకు నువ్వు మనసులో  "నేను lovely person ని "అని అనుకుంటూ ఉండాలి. ఇది మనసు మ్యాజిక్. ట్రై చేసి చుడండి.

Monday, 27 April 2015

ప్రేమ

ప్రేమ అనేది ఒక మనిషిని చూడగానే పుట్టేది కాదు. చూడగానే పుట్టేది ఆకర్షన అది ఎక్కువ కాలం ఉండదు. నిజమైన ప్రేమ ప్రతిసారి కలిసి మాట్లాడే మాటల్లోనూ ప్రేమగా తాకే స్పర్సలోను కొంత కొంత అర్థం చేసుకుంటూ వెళ్లేదే  రొజూ కొంత కొంత  ప్రేమని పరిచయం చేసుకుంటూ పోవాలి  రోజు తను ప్రేమించే మనిషితో వీలైనంత సమయాన్ని గడపాలి జోక్స్ వేయాలి చిలిపి పనులుచేయాలి, ముఖ్యంగా ప్రేమించినవారిపట్ల భద్రతా భావాన్ని కలిగించాలి నమ్మకంకలిగి ఉండాలి నిజాయితిగా ఉండాలి  ఈ విషయాలు  మాత్రం చాలా జాగర్తగా ఉండాలి ఇదే ప్రేమకు పునాది ఈ రెండూ లేనివాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా ప్రేమలేనట్టే, దూరంగా ఉండి ఎన్నో మాటలు చెప్పుకునే వారి ప్రేమా అంతే గాలిలో మేడలు కట్టినట్లే ఉంటుంది అది ఎక్కువకాలం నిలవదు ప్రతిరోజు పక్కనే కూర్చుని కష్ట సుఖాలను పంచుకునే వారు కప్ కాఫీ కుడా ఇవ్వకపోయినా సరే వాళ్ళలో గొప్ప ప్రేమ ఉంటుంది గిఫ్ట్స్ ఇవ్వకపోయినా వారి మద్య ప్రేమ ఉంటుంది ప్రేమకు అర్థం చేసుకునే గుణమే పునాది అధికారాలు చెలాఇంచడమ్ అహంకారాలతో ఒక మనసును గెలవలేరు ప్రతిరోజు నీపై నాకు ఇంత గొప్ప ప్రేమ ఉంది అని చేప్పడం కన్నా ప్రేమించిన వారికి ఎంకావాలో వీలైనంత చేతనైనంత సాయం చేయగలిగితే చాలు నిజమైన ప్రేమ స్వార్థం లేకుండా ఉంటుంది ప్రేమించే వారు కొన్ని కట్టుబాట్లు ఉండాలి ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి ఒకె మాటపై ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకోగలగాలి ఒక పొరపాటు జరిగితే ఎవరికీ వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అంతే కాని నీది తప్పు అంటే నీదే తప్పు అని వాదించు కోకూడదు ఎదుటివారిని మార్చాలి అనే ఆలోచన మానేయాలి ఎందుకంటే ఎవరినైనా మార్చే శక్తీ మన చేతుల్లో ఉండదు అలా మర్చలేరుకుడా అలా మార్చాలి అనుకోవడం కుడా మూర్ఖత్వం సమస్యకు పరిష్కారం మనమే మారాలి ఇది వింతగానే ఉంటుంది కాని నిజం మనలను మనమే మలచుకోవాలి మన ప్రేమని గెలుచుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా దానికి కారణం మనమే మనలోని ఆలోచనలే దానికి ఎదిటివాల్లె కారణం అనుకోవడం ముర్కత్వం నాదెం తప్పులేదు అనుకోవడం మూర్ఖత్వం మనం ప్రేమించే మనిషిని ఎక్కువ ప్రేమించ గలిగితే ఎగోడవాలూ రావు గొడవలకు ముఖ్య కారణం భయం.  గొడవ పడేవారికి ఈ విషయం అర్థం కాదు కాని భయమే అన్నింటికీ కారణం.  ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ వారే ఆలోచించగలిగితే సమస్యలే రావు ప్రేమికులుగాని, పెళ్ళైన వారు కాని ఇప్పుడు వారు ఉన్న స్థితికి వారే కారకులు అది సంతోషంగా ఉండటానికైనా దుఖంలో ఉన్నా దానికి కారణం మీరే నీ భాగస్వామి కి i love u చెబుతూఉండు  ఎంత కోపంలో ఉన్నా ఇట్టే కోపం తగ్గిపోతుంది నీ మనసులో ప్రేమను నింపుకొని చూడు అన్ని మారిపోతాయి ఇది నిజం first మనమే మారాలి ప్రేమనిండిన మనిషిలా మారిపోవాలి ఇలా ఉండగలిగితే ఎజంటా విడిపోదు

  

Saturday, 25 April 2015

కుందనాల బొమ్మ


నా కళ్ళల్లో కొలువైఉన్నవె బొమ్మ
కనుముస్తే కలవై కమేస్తావమ్మ
నా ముందు నిజమై నిలిచేదేపుడమ్మ
నిను చుసిన కంటికి నిదురే కరువమ్మ
కావ్యాలెన్నో రాసాను నీకై నేను కవిని కానమ్మ
కోపంలో కూడా నువ్వు అందాల బరినవమ్మ
కారుచీకటి కంమేసేవేల చేరువై వస్తావు నువ్వే నా వెలుగమ్మ
కూనిరాగం తీసావంటే సిగ్గుపడి పారిపోవు కొయిలమ్మ
కనుల ముందు నువ్వంటే ఎ కష్టా నైనా దాటేస్తా నమ్మా
కుదురైనా లేదు నా మనసుకి కుందనాల బొమ్మ
కడదాకా కలిసుంటావా కనుపపవై కొండపల్లి బొమ్మ




Friday, 24 April 2015

ఇది అద్వితీయ సృష్టి

తొలకరి చినుకులకు ఇంత చల్లదనం ఎక్కడిది
తేనెలొలికే పూలకు ఇంత సుఘంధమేక్కడిది
తీపి రాగాలు పలికే కోకిలకు రాగాలు ఎవరు నేర్పింది
తుళ్ళి తుళ్ళి గంతులేసే లేడికి పరుగులేవరు నేర్పింది
తారలకు ఇంత చమక్కు ఎక్కడిది
తామరాకు తడి అంటని గునమేక్కడిది
తీగకు పైపైకి పాకే తీరేక్కడిది
తబుర తీగను మీటిన శృతి ఎక్కడిది
తననీయము నకు వన్నె ఎక్కడిది
తపనుడికి ఈ తెజమేక్కడిది
తాబులానికి ఎరుపెక్కడిది
తరంగం తీరం చేరేదెందు కని
తరుణీ తలచిన వరున్ని చేరి తరించు నెందుకని
తరచి చూస్తే ఇది అద్వితీయ సృష్టి అందుకని




సందెల్లో అందాలు


ఆ నింగి ఎర్రని చీరకట్టి సూర్యున్ని సిందురంగా మార్చుకుంది
మబ్బులను మల్లెలుగా ముడిచింది
అలల కెరటాలతో సంద్రం తాకాలని తపిస్తుంది 
నింగి వంగి సంద్రాన్ని ముద్దాడింది 
ఆకాశంఅల్లంత దూరాన సంద్రాన్ని మబ్బులతో కమ్మేసింది 
అంబరం లోని  రంగులన్నీ సాగరం విలీనం చేసుకుంది
ఈ సంగమం సందెవేళ కన్నుల విందులయింది 
విహంగాల కల కల కిల కిల  రావాతతో శృతి పలికింది 
చల్లగాలి పిల్ల తెమ్మెరతో  ఉగిసలాడింది  
ఇది చూచిన నా మది తన్మయం చెందింది 
ఈ ప్రకృతికి ఏది సాటిలేదంది 
కదలనీక కాళ్ళకు బంధం వేసింది 
కారు చీకటి కమ్మే దాకా నను మంత్రించింది,

Thursday, 23 April 2015

ఆమని


ఆమని అందాలూ అల్లుకుపోయే లతా సౌరభం
అడుగడుగునా అద్వితీయ సుమనోహర కావ్యం 
అలవోకగా సాగే సంపెంగల సుగంధ పరిమళం 
అంకురించే నాలో సరికొత్త భావాల స్వరజతం 
ఆలకించే కనులకు ప్రకృతి ఉగాది సంబరం 
ఆలపించే వసంత కోకిల గానం 
ఆహ్వాదించే మనసుకు అద్వితీయ భావం 
ఆణువణువూ పులకలే పుడమి అందం 
అరికాళ్ళకు రెక్కలుమోలిచే నా ఆశ నిజం
అంబరాన్ని తాకి మబ్బుల తేలే  నా పాద మంజీరం




Wednesday, 22 April 2015

వాన జల్లు


వసంత కాలం లో వేడి వాడి ఎండల్లో
వచ్చే చల్లగాలికి వేచే స్వేద దేహం
వసంత కోకిల కమ్మని రాగాలతో
వినిపించే కోటి స్వరాల జల్లులు
వాలి ఉగే కొమ్మల్లో  విరజాజులు విరిసే
వాలే పొద్దులో చల్లగాలికై తపించే మనసే
విహరించే ఆకాశాన అప్పుడప్పుడు నల్ల మబ్బులు
విల్లులా వంచిన ఇంద్రధనుస్సు మెరిసే ఏడూ రంగులు
వాన జల్లు కోసం  తపించే పుడమి తల్లి
వర్షించిన నీటికి తడిసి న మట్టి మత్తుజల్లే
వన మయూరి పురివిప్పి నర్తించే
వేసవిలో వర్షం జల్లులో తడిసిన మధురమే
వజ్రంలా మెరిసే చినుకుల్లో ముద్దయితే  అతి మధురమే

Thursday, 9 April 2015

గొల్ల గోపాల


    
గోపాలా ఎల్లలు లేవురా నీ ప్రేమకు 
గోవులకాచే గొల్లబాలురకు నీవే దిక్కు 
గోవులు మురిసే మురళి గానమునకు 
గోవర్ధన గిరిధారి నీవే ఆధారం రేపల్లెకు 
గోధూళివేళ నీ పదములే దారి గోవులకు
గొల్లల మానసచోర జల్లను ఉల్లమునకు 
గొల్ల భామలను అల్లరి చేసేవు వెన్నకోరకు  
గోవిందా వేచితి నీ ముఖారవిందమును కాంచుటకోరకు
గోచరించుటలేదే  ముగ్ధ మనోహర రూపము నా కన్నులకు