Friday, 14 August 2015

మధురం అతి మధురం

నాపై నీకు ఎంత ప్రేముంది!
నేను నమ్మలేక పోతున్నానిది!
భర్త అంటే భరించువాడు అని అంటారు
భరించావు నా కోపాన్ని
భారమైనా సహించావు ద్వేషాన్ని
భావించా నాదే గొప్ప ప్రేమని
భాదించా నీకు ప్రేమే లేదని
నా బంగారనివి నీవని
నాకు నీవుంటే చాలని
నాకింకేమి వద్దని
నీకన్నా నాకు మిన్న ఎవరులేరని
నీవే నా ప్రాణమని
నీవేనాకు కడదాకా అని
నా తప్పులు మన్నించమని
మన సంసారం కలతలు లేక సాగాలని
మన కలయిక మధురం అతి మధురమని
                                          --కళా--

Saturday, 18 July 2015

మార్పు

ఉహలలో ఉదయించే ఉషస్సు
ఉదయించే భానుడిలా తేజస్సు
ఒక సంధ్య ముగిసింది
ఒక ఉదయం మొదలైంది
నాలో చీకటి తొలగిపోయింది
నేనెంటో నాకు ఇప్పుడే తెలిసింది
నా జీవితం ఎంతో విలువైనది
నా మనసులో మాయలన్ని తొలగి
నిజమెంటో స్పష్టంగా ఎరిగి
నులుచున్న చోటే పాతాళానికి కృంగి
నిన్నటిదాకా మార్చాలన్న ఆశ కరిగి
నన్ను నేను మార్చుకున్నా యోగినై
నేనే  శాసిస్తున్న నా జీవితాన్ని
నేనే కాక్షిస్థున్నా బంగారు భవిష్యత్తుని
నా వెంట ఎవరున్నా లేకున్నా నాకు నేనే తోడుగా
నా మనసును అశాంతికి గురిచేయక ఆనందమే నా గమ్యంగా
                                                             -కళావాణి - 

Wednesday, 27 May 2015

నిదురమ్మ

సోయగాల కన్నుల 
సోలిపోవు రేయిలా 
సొంపైన  వాలుకన్నులా 
ఇంపారగ నీ రూపం నింపుకున్న కలలా 
సొగసులెన్నో నా చెలి కన్నుల 
శ్వాసలో చేరే చల్లని వెన్నెల 
స్వగతాలు పలికే నిదురమ్మకి ఇలా 
స్వప్నాలలో చెలి తేలే సోలెనిలా 
సోదలు వేతలు మరచిపో అలా 
సరసిలో తేలు కలువ కన్నుల 
సంధ్య దాటి చీకట్లు కమ్మేవేల 
సుందరర వదనం  తోచే సరోజంలా 
నీ సమక్షంలో లేని క్షణాలు నిరర్థకంలా 
నిరీక్షనలే నిన్ను చేరుటకై ప్రతిక్షనాలు 
                            -కళవాణి-







Monday, 11 May 2015

ఆగుమా అలివేణి

ఆగుమా ఆగుమా అందాల నా అలివేణి 
నీ అరవింద నేత్రాల్లో నా నీలి నీడ చూసుకొని 
అలఒకగ సాగే నీ నడకల సొంపులా 
అటు ఇటు ఉగే నీ నడుము ఓంపులా 
ఘల్లు ఘల్లున కలహంసల నడకలతో చేరుకో చెలి 
నల్లనల్లని నీ నీలికనుల నను దాచుకో సఖి 
అప్సరవై  హృదయ సామ్రాజం ఏలేవు 
ఆ దివిలోని అప్సరల తలతన్నే అందాలోలికేవు 
అలిగిన నీ ముద్దుమోము అరవిరిసిన అబుజము 
అధరముల జాలువారు నీ పలుకులు అతి మధురము
అల్లుకు పోయిన నా బాహు బంధాన నిను బంధించనీ 
అల్లన నీ అధారాబృతాన్ని  మేల్లాన చుంభిచు కొనీ 
రా చెలి నిను నా మది కోవెలలో కొలుచుకొనీ 
రాగాలా నా విరిబోని స్వరాభిషేకం చేసుకొనీ 
                                            -కళావాణి-







Saturday, 9 May 2015

తుళ్ళి


తుళ్ళి తుళ్ళి గంతులేసే మది
తూనీగల్లే తెలితేలి  మబ్బులతో భేట్టి పడి
తనువు విల్లులా వంచి తకిట తకిట తాలమెసి అడి
తాచుపామువంటి జడ ఉగి తూగు ఎగసిపడి
తడబడే అడుగు నిను తలచిన మది ముడిపడి
తాకిన తన్మయమే తలచి తలచి తడబడి
తబ్బిబ్బుల ఎగసిపడే అలల ఓలే ఎద అలజడి
తరియించెనె నా తనువూ ఏడడుగుల బంధమిడి
తల్లడిల్లు నిన్ను వీడి క్షణమైనా బ్రతక లేను  విడివడి
తళుకు తళుకు తారలాగా నిలిచి పోవు నింగి నిండి




నాన్నమ్మ ముద్దు

అమ్మ ప్రేమ కన్నా మిన్న ప్రేమ నా సొంతం
నాన్నమ్మ గారాల పట్టి నేనే నన్న అమిత గర్వం 
చిన్న తనం అంతా నాన్నమ్మముద్దే 
సంద్రం అంత ప్రేమకు హద్దే లేదు 
ఓడిలోచేరి అల్లరిచేస్తే ఆపే చెయ్యే లేదు
నాన్నమ్మ గోరుముద్దలు మరువలేనేప్పుడు 
నాన్నమ్మను అల్లుకుపోయే హాయే ముద్దు 
నాన్నమ్మ ప్రేమ కేదీ సాటిలేదు 
నన్ను ఒడిలో చేర్చి లాలించే లాలి  ముద్దు 
నన్ను ఊయలూపె జోలపాడే జోల ముద్దు 
నన్ను ముద్దులతో ముంచె ఆ బోసినవ్వు  ముద్దు 
నన్ను గిలిగింతలు పెట్టి నవ్వించే తీరు ముద్దు 
నన్ను బుడి బుడి అడుగులు వేయించే చేయి ముద్దు 
నేను నేలపడితే తన గుండెకు హథుకొను ప్రేమ ముద్దు 
నాతో దొబూచాట ఆడే ఆ సేహం ముద్దు 
నను బుగ్గ గిల్లె అమ్మ ఆట ముద్దు 
నన్ను ఊరంతా తిప్పి నిద్రపుచ్చు తీరు ముద్దు 
నన్ను ముద్దుగా పెంచిన నాన్నమ్మ జ్ఞాపకం ముద్దు 
నిన్ను తలచిన నా కన్నీటికి లేదు హద్దు  

Sunday, 3 May 2015

నా శ్రీవారికి అంకితం


గుండెల్లో మ్రొగే ప్రియ రాగాలు
గున్నమావి కొమ్మల్లో గండు కోయిల గీతాలు
గుప్పెట్లో దాచా కోటి ఉహలు
గువ్వలా ఎగసే కోటి ఆశలు
గుడిగంటలా నా శ్రీ వారి పిలుపులు
నీ గుండియపై వాలే క్షణాలు
గుచ్చిన సంపెంగల సువాసనలు
గుమ్మానికి వేలాడే నీకై నా చూపులు
గుర్తు పట్టేను నామది నీ పాద సవ్వడులు
గుట్టుగా దాచా నీపై నా ప్రేమలు
గుండియలో నా రామ నామాలు
గుసగుసలు చెప్పే మన ప్రణయాలు
గుర్తుకొస్తుంటాయి నిత్యం నీ స్మృతులు
                                           -కళావాణి-













స్వర రాగ మధురం

నా పాట స్వర రాగ మధురం
నీ పేరు పలికిన అధరామృతం
నర్తించు నా పాదం నటరాజ మంజీరం
నిద్రించే నా కనుల నిండెను నీ రూపం
నల్లనయ్య నీ పిల్లనగ్రోవి పలికే మోహన రాగం
నీ పల్లవిలో నా పదమల్లుకుపొయె భుపాలరాగం
నల్లని నా జడలో తెల్లని మల్లెలు తురిమితి నీకోసం
నిరీక్షించు నన్ను దాటి దాగి ఆడే నీ గారభం
నీ అపెక్షలెన్ని ఉన్న ఉపేక్షించునా విరహం
నిండు చందమామలో నిన్ను చూచునానందం
నంద నందనా వెన్నెల్లో వన్నెల సిరి గోపురం
 నీ రాధనురా నీ కలయిక అతి మధురం


Saturday, 2 May 2015

వెన్నెలా


వెన్నెలా వెన్నెలా నన్ను దాటి వెళ్లాకే 
వన్నెలే చిన్నేలే నాకు పంచి వెల్లవే 
 వెన్నెల్లో చక్కని చుక్కలతో సయ్యాటలాడేవే
వెతికాను మక్కువగొలిపే మబ్బులలో  దోబూచాడే నిన్నే  
వెన్నెలరేడు చీకటిని చీల్చేసి చల్లదనం చల్లాడే 
వెన్నెలమ్మ ముగిట్లో చెమ్మ చెక్క లాడవే 
విధువు విచేసిన వేల చల్లని వింజామరా నను తాకి వెల్లవే
విభావరిలో విరి శయ్యపై సంపగి సువాసనలుచాల్లవే
విజనమున జాబిల్లి నా తోడుగా విచ్చేయవే
వారిధి పై నీ వన్నియచూడ  కన్నులు చెదరునే
వలకాడవు నిను వర్ణించుట నాతరమగునే

Wednesday, 29 April 2015

ప్రాణ సఖుడు


సఖి నీ ప్రాణ సఖుడు అతి సుందరుడు 
కలువ కన్నుల వాడు
కరివదనుడు కవలక్షుడు
కరిమబ్బు మేని చయవాడు
కడు కొమలుడు నీ వలకాడు
కారుణ్య ధరుడు
కంఠీరవము ను అధిష్టించిన వాడు
నీ కన్నుల వెలుగుల కాంతుడు
కండర్పుడికే కన్ను చెదురు వాడు
కందళిo చు  ప్రేమకు మన్మధుడు
కాటుక కన్నుల వాడు
కళానిధి కన్నా కడు చల్లనివాడు
కన్నయ్య వాడు నీ కన్నె మనసు చోరుడు వాడు
నీ కపోతంబు  పై చిటికే వేయు చెలికాడు
నీ కరమును చేపట్టు కమనీయుడు వాడు




మనసు మ్యాజిక్

నీ భాగస్వామిని నువ్వే  ప్రేమించాలి.  నీ మనసులోని ఎప్పుడు తన భావనలే మెదలాలి ఎక్కడున్నా తన బొమ్మనే ఉహించుకుని i love u చెప్తూ ఉండాలి 10,15 times మించి చెప్పుకోవాలి ఇలా చేయగలిగితే నీలోని ప్రేమ నీ భాగస్వామికి చేరుతుంది తనలో కుడా మార్పు వస్తుంది.  ఆఫీసు నుండి ఇంటికి వచ్చే ముందు అలా అనుకుని చూడండి మార్పు మీరే గమనిస్తారు నీ భాగస్వామిపై కోపం వచ్చినపుడు నీ భాగస్వామి కున్న మంచి గుణాలు ఒక మూడింటిని రాయండి అలా రాస్తే మీ మనసులో కోపం పోయి ప్రేమతో నిండిపోతుంది. నీ భాగస్వామి కోప్పడుతుంది అంటే దానికి కారణం భయం అది భయమని వారికే తెలియకపోవచు.నీ భాగస్వామి భయపడుతుంది అని గ్రహిస్తే చాలు సమస్య సగం తీరినట్టే అలా కోప్పడినప్పుడు"భయపడకు నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు" అని దగ్గరకు తీసుకుని భుజాన్ని తట్టి ధర్యం చెప్పాలి కుదిరితే కౌగలించుకుని భరోసా ఇవండీ నేనున్నాను నీకేం కాదు నేను చూసుకుంటాను నువ్వు ధర్యంగా ఉండు అని చెప్పే చిన్న మాట ధర్యాన్ని ఇస్తుంది.మెల్లగా భయానికి గల కారణం మంచి మాటలతో అడిగి తెలుసుకొని పరిష్కరించండి. భయం కలిగినప్పుడు మనం భయానికి గల కారణం ప్రశాంతంగా ఆలోచించాలి నాకు భయం వేస్తుంది ఇలా భయపడడం వళ్ళ ఏంటి ప్రయోజనం, దీనికి ప్రత్యామ్నాయంగా నేను ఎం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. వ్యాపారంలో నష్టం వచ్చింది బాదేస్స్తుంది సరే భాదపదడినంతమాత్రాన లాబాలు రావుకదా సరే నష్టం వచ్చింది నేను కృంగిపోను ఇది నా మంచికే జరిగింది నేను ఇంకా జాగర్తగా ఉండాలి నేను ఇంత చిన్నదానికే భయపడితే ఎలా అనుకోవాలి ఇది వ్యాపారంలోనే కాదు సంసారంలో కుడా ఇలాగే సమస్యలనుండి బయటపడాలి జరిగిపొయినదాన్ని వెనక్కి తీసుకు రాలేం అందుకే జరిగేవన్నీ మనమంచికే అనుకోవాలి భాదపడితే ఆరోగ్యం పాడాయి మల్లి ఆరోగ్యం పాడయిందని బాధపడాలి. ఒక కుటుంబంలో ఒకరి ప్రవర్తన సరిగా లేదు అంటే దాని వల్ల కలిగే బాధ అందరిది అవుతుంది అందుకే మనవల్ల మనవాళ్లే బాధపడకుండా ఉండాలంటే మనమే మారాలి. నీ భాగస్వామిని నువ్వే ద్వేసిస్తే అదే ద్వేషమే నీ భగస్వమినుండి నీకు ఎదురౌతుంది. అదే ప్రేమిస్తే అంతే ప్రేమ నీకు ఎదురౌతుంది కేవలం నువ్వు మారడంతోనే నీతోపాటుగా నీ భాగస్వామి లో మార్పు వస్తుంది ప్రతిరోజు నీకు నువ్వు మనసులో  "నేను lovely person ని "అని అనుకుంటూ ఉండాలి. ఇది మనసు మ్యాజిక్. ట్రై చేసి చుడండి.

Monday, 27 April 2015

ప్రేమ

ప్రేమ అనేది ఒక మనిషిని చూడగానే పుట్టేది కాదు. చూడగానే పుట్టేది ఆకర్షన అది ఎక్కువ కాలం ఉండదు. నిజమైన ప్రేమ ప్రతిసారి కలిసి మాట్లాడే మాటల్లోనూ ప్రేమగా తాకే స్పర్సలోను కొంత కొంత అర్థం చేసుకుంటూ వెళ్లేదే  రొజూ కొంత కొంత  ప్రేమని పరిచయం చేసుకుంటూ పోవాలి  రోజు తను ప్రేమించే మనిషితో వీలైనంత సమయాన్ని గడపాలి జోక్స్ వేయాలి చిలిపి పనులుచేయాలి, ముఖ్యంగా ప్రేమించినవారిపట్ల భద్రతా భావాన్ని కలిగించాలి నమ్మకంకలిగి ఉండాలి నిజాయితిగా ఉండాలి  ఈ విషయాలు  మాత్రం చాలా జాగర్తగా ఉండాలి ఇదే ప్రేమకు పునాది ఈ రెండూ లేనివాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా ప్రేమలేనట్టే, దూరంగా ఉండి ఎన్నో మాటలు చెప్పుకునే వారి ప్రేమా అంతే గాలిలో మేడలు కట్టినట్లే ఉంటుంది అది ఎక్కువకాలం నిలవదు ప్రతిరోజు పక్కనే కూర్చుని కష్ట సుఖాలను పంచుకునే వారు కప్ కాఫీ కుడా ఇవ్వకపోయినా సరే వాళ్ళలో గొప్ప ప్రేమ ఉంటుంది గిఫ్ట్స్ ఇవ్వకపోయినా వారి మద్య ప్రేమ ఉంటుంది ప్రేమకు అర్థం చేసుకునే గుణమే పునాది అధికారాలు చెలాఇంచడమ్ అహంకారాలతో ఒక మనసును గెలవలేరు ప్రతిరోజు నీపై నాకు ఇంత గొప్ప ప్రేమ ఉంది అని చేప్పడం కన్నా ప్రేమించిన వారికి ఎంకావాలో వీలైనంత చేతనైనంత సాయం చేయగలిగితే చాలు నిజమైన ప్రేమ స్వార్థం లేకుండా ఉంటుంది ప్రేమించే వారు కొన్ని కట్టుబాట్లు ఉండాలి ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి ఒకె మాటపై ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకోగలగాలి ఒక పొరపాటు జరిగితే ఎవరికీ వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అంతే కాని నీది తప్పు అంటే నీదే తప్పు అని వాదించు కోకూడదు ఎదుటివారిని మార్చాలి అనే ఆలోచన మానేయాలి ఎందుకంటే ఎవరినైనా మార్చే శక్తీ మన చేతుల్లో ఉండదు అలా మర్చలేరుకుడా అలా మార్చాలి అనుకోవడం కుడా మూర్ఖత్వం సమస్యకు పరిష్కారం మనమే మారాలి ఇది వింతగానే ఉంటుంది కాని నిజం మనలను మనమే మలచుకోవాలి మన ప్రేమని గెలుచుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా దానికి కారణం మనమే మనలోని ఆలోచనలే దానికి ఎదిటివాల్లె కారణం అనుకోవడం ముర్కత్వం నాదెం తప్పులేదు అనుకోవడం మూర్ఖత్వం మనం ప్రేమించే మనిషిని ఎక్కువ ప్రేమించ గలిగితే ఎగోడవాలూ రావు గొడవలకు ముఖ్య కారణం భయం.  గొడవ పడేవారికి ఈ విషయం అర్థం కాదు కాని భయమే అన్నింటికీ కారణం.  ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ వారే ఆలోచించగలిగితే సమస్యలే రావు ప్రేమికులుగాని, పెళ్ళైన వారు కాని ఇప్పుడు వారు ఉన్న స్థితికి వారే కారకులు అది సంతోషంగా ఉండటానికైనా దుఖంలో ఉన్నా దానికి కారణం మీరే నీ భాగస్వామి కి i love u చెబుతూఉండు  ఎంత కోపంలో ఉన్నా ఇట్టే కోపం తగ్గిపోతుంది నీ మనసులో ప్రేమను నింపుకొని చూడు అన్ని మారిపోతాయి ఇది నిజం first మనమే మారాలి ప్రేమనిండిన మనిషిలా మారిపోవాలి ఇలా ఉండగలిగితే ఎజంటా విడిపోదు

  

Saturday, 25 April 2015

కుందనాల బొమ్మ


నా కళ్ళల్లో కొలువైఉన్నవె బొమ్మ
కనుముస్తే కలవై కమేస్తావమ్మ
నా ముందు నిజమై నిలిచేదేపుడమ్మ
నిను చుసిన కంటికి నిదురే కరువమ్మ
కావ్యాలెన్నో రాసాను నీకై నేను కవిని కానమ్మ
కోపంలో కూడా నువ్వు అందాల బరినవమ్మ
కారుచీకటి కంమేసేవేల చేరువై వస్తావు నువ్వే నా వెలుగమ్మ
కూనిరాగం తీసావంటే సిగ్గుపడి పారిపోవు కొయిలమ్మ
కనుల ముందు నువ్వంటే ఎ కష్టా నైనా దాటేస్తా నమ్మా
కుదురైనా లేదు నా మనసుకి కుందనాల బొమ్మ
కడదాకా కలిసుంటావా కనుపపవై కొండపల్లి బొమ్మ




Friday, 24 April 2015

ఇది అద్వితీయ సృష్టి

తొలకరి చినుకులకు ఇంత చల్లదనం ఎక్కడిది
తేనెలొలికే పూలకు ఇంత సుఘంధమేక్కడిది
తీపి రాగాలు పలికే కోకిలకు రాగాలు ఎవరు నేర్పింది
తుళ్ళి తుళ్ళి గంతులేసే లేడికి పరుగులేవరు నేర్పింది
తారలకు ఇంత చమక్కు ఎక్కడిది
తామరాకు తడి అంటని గునమేక్కడిది
తీగకు పైపైకి పాకే తీరేక్కడిది
తబుర తీగను మీటిన శృతి ఎక్కడిది
తననీయము నకు వన్నె ఎక్కడిది
తపనుడికి ఈ తెజమేక్కడిది
తాబులానికి ఎరుపెక్కడిది
తరంగం తీరం చేరేదెందు కని
తరుణీ తలచిన వరున్ని చేరి తరించు నెందుకని
తరచి చూస్తే ఇది అద్వితీయ సృష్టి అందుకని




సందెల్లో అందాలు


ఆ నింగి ఎర్రని చీరకట్టి సూర్యున్ని సిందురంగా మార్చుకుంది
మబ్బులను మల్లెలుగా ముడిచింది
అలల కెరటాలతో సంద్రం తాకాలని తపిస్తుంది 
నింగి వంగి సంద్రాన్ని ముద్దాడింది 
ఆకాశంఅల్లంత దూరాన సంద్రాన్ని మబ్బులతో కమ్మేసింది 
అంబరం లోని  రంగులన్నీ సాగరం విలీనం చేసుకుంది
ఈ సంగమం సందెవేళ కన్నుల విందులయింది 
విహంగాల కల కల కిల కిల  రావాతతో శృతి పలికింది 
చల్లగాలి పిల్ల తెమ్మెరతో  ఉగిసలాడింది  
ఇది చూచిన నా మది తన్మయం చెందింది 
ఈ ప్రకృతికి ఏది సాటిలేదంది 
కదలనీక కాళ్ళకు బంధం వేసింది 
కారు చీకటి కమ్మే దాకా నను మంత్రించింది,

Thursday, 23 April 2015

ఆమని


ఆమని అందాలూ అల్లుకుపోయే లతా సౌరభం
అడుగడుగునా అద్వితీయ సుమనోహర కావ్యం 
అలవోకగా సాగే సంపెంగల సుగంధ పరిమళం 
అంకురించే నాలో సరికొత్త భావాల స్వరజతం 
ఆలకించే కనులకు ప్రకృతి ఉగాది సంబరం 
ఆలపించే వసంత కోకిల గానం 
ఆహ్వాదించే మనసుకు అద్వితీయ భావం 
ఆణువణువూ పులకలే పుడమి అందం 
అరికాళ్ళకు రెక్కలుమోలిచే నా ఆశ నిజం
అంబరాన్ని తాకి మబ్బుల తేలే  నా పాద మంజీరం




Wednesday, 22 April 2015

వాన జల్లు


వసంత కాలం లో వేడి వాడి ఎండల్లో
వచ్చే చల్లగాలికి వేచే స్వేద దేహం
వసంత కోకిల కమ్మని రాగాలతో
వినిపించే కోటి స్వరాల జల్లులు
వాలి ఉగే కొమ్మల్లో  విరజాజులు విరిసే
వాలే పొద్దులో చల్లగాలికై తపించే మనసే
విహరించే ఆకాశాన అప్పుడప్పుడు నల్ల మబ్బులు
విల్లులా వంచిన ఇంద్రధనుస్సు మెరిసే ఏడూ రంగులు
వాన జల్లు కోసం  తపించే పుడమి తల్లి
వర్షించిన నీటికి తడిసి న మట్టి మత్తుజల్లే
వన మయూరి పురివిప్పి నర్తించే
వేసవిలో వర్షం జల్లులో తడిసిన మధురమే
వజ్రంలా మెరిసే చినుకుల్లో ముద్దయితే  అతి మధురమే

Thursday, 9 April 2015

గొల్ల గోపాల


    
గోపాలా ఎల్లలు లేవురా నీ ప్రేమకు 
గోవులకాచే గొల్లబాలురకు నీవే దిక్కు 
గోవులు మురిసే మురళి గానమునకు 
గోవర్ధన గిరిధారి నీవే ఆధారం రేపల్లెకు 
గోధూళివేళ నీ పదములే దారి గోవులకు
గొల్లల మానసచోర జల్లను ఉల్లమునకు 
గొల్ల భామలను అల్లరి చేసేవు వెన్నకోరకు  
గోవిందా వేచితి నీ ముఖారవిందమును కాంచుటకోరకు
గోచరించుటలేదే  ముగ్ధ మనోహర రూపము నా కన్నులకు 






  

Monday, 12 January 2015

kshatriya putrudu sanna jaaji 2



సన్నజాజి పడకా..
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే.. ||3||
అడిగితే సిగ్గేసిందీ.. సిగ్గులో మొగ్గేసిందీ..
మొగ్గలా బుగ్గే కందీ పో..యేనే..

||సన్నజాజి||

సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే.. 
మనసులో ప్రేమేఉందీ.. మరువనీ మాటేఉందీ..
మాయనీ ఊసేపొంగి.. పాటై రావే..

||సన్నజాజి||

కొండమల్లి పూవులన్నీ.. గుండెల్లోనీ నవ్వులన్ని..
దండే కట్టి దాచుకున్నా.. నీ కొరకే..
పండు వెన్నెలంటి ఈడు.. యెండల్లొన చిన్నబోతే..
పండించగ చెరుకున్నా.. నీ దరికే..
అండ దండ నీవేననీ.. పండగంత నాదేననీ..
ఉండి ఉండి ఊగింది నా మనసే...
కొండపల్లి బోమ్మా ఇక.. పండు చెండూ దోచెయ్యనా..
దిండే పంచే వేళయినది రావే..
దిండే పంచే వేళయినది.. రా..వే..