Thursday, 30 October 2014

నేను

నింగిలో నీలిమేఘాలు
నిండి పోయే నాలో కొత్త భావాలు
నేలంతా పరిచే అందాలు
నన్ను అల్లుకునే గాలిగందాలు
నాకై పూచే పుల కుసుమాలు
నా కాలికి మొలిచే రెక్కలు
నింగికిఎగసి చేరే చుక్కలు
నేలవంక తో చేరి ఆడే ఆటలు
నిరీక్షించే నాకై వసంత  మాసాలు
నిరపేక్షలేని ఆమనీ అందాలు
నిరంతరం నాకై కలవరింతలు
నారుపురేఖలకే పుట్టాయే కవితలు'
నాలోని మమతలకే  విరిసాయే మల్లెలు
నాకోసం కలవరించే కాలాలు
నావల్లే పుడమికి పుట్టే పులకింతలు
నే నడిచొస్తే నేలంతా పూల తివాచీలు
నేనుంటేనే ఈ నెల ఉందంట
నామాటే  వేదమేనంట
నేను లేకుంటే లోకమేమౌనంట
నింగిలేదు నేలలేదు లోకమే తంటా




Wednesday, 29 October 2014

తియ్యనైన జ్ఞాపకం నీవేలే

తియ్యనైన జ్ఞాపకం  నీవైతే
 తిమిరం కమ్మిన స్నేహమాయే
తిరస్కారాలకు గురిఆయే 
తీవ్రమైన సంద్రపుగోషలాయె
తీరం  చేరలేక ఘర్షణ పాలాయే
తికమకలోనిను నిందించిన నేరమే
తిరిగి  చేరలేనంత దూరమాయే
తేలిపోయే మబ్బుల తెరలు
తేటతెల్లమాయే తెల్లని నీ మనసు
తప్పులుంటే క్షమించు నేస్తం
                          -కళా వాణి -

                          


 



Tuesday, 28 October 2014

ప్రేమ కావ్యం

మేఘాలు మెరిసి మురిసి కురిస్తే
మెల్లన నా వెన్ను చేరి నను అల్లుకుపోతే
మెత్తని నా కొంగుతీసి నీ తల తుడుస్తుంటే
మెదిలే ఈ ప్రేమ కావ్యం మధురములె
మేలికేలుతిరిగే ప్రాయం కవ్వింపులే

నీవులేని నేనులేను



నీ చెక్కిలి అద్దంలో నను చూసుకోని చెలి
నీ మధుర గానలలో నను మైమరచిపోని చెలి
నీ అధర మధువులో నను మునిగిపోని సఖి
నీ అరవిరిసిన కన్నుల నను దాచేయి చెలి
నీ కురుల వింజామరల్లొ నను సేదతీరని సఖి
నీ బిగి కౌగిట శాస్వత బందినై పోనీ సఖి
నిర్మలమైన నా మనసులో నీవే నిండావు చెలి
నీవే నా ప్రేమకు నిర్వచనం సఖి
నిక్కము నిన్నే నమ్మితి ననువీడకు నేచేలి
నిను మిక్కిలి ప్రేమించితి నను వీడకు నేచేలి
నిదురలేక కలలురాక కలవరమాయే చెలి
నీలో ఆ కడలికన్న మిన్న ప్రేమ నాదే చెలి
నీవులేని నేనులేను నీలోనే నిండి  ఉన్నా చెలి
నీవు నాలోనే కొలువయి ఉన్నవే   సఖి
                                    -కళా వాణి-

నిండు పున్నమి జాబిల్లి నీవు



పండువెన్నెల్లో నిండు పున్నమి జాబిల్లి నీవు
పరదాలలో ప్రణయాలు స్వరాలూ పలికించెవు 
పరువాల ప్రాణాలు తోడేసేవు
ప్రణయాల వీణ శృతి మెత్తగా  మీటేవు
పలుకు రాక సిగ్గుల పైట కంమేస్తుంటే
పలుకులేల అని నా సిగ్గు దోచేస్తావు
ప్రాణమున్న బొమ్మనై మైమరచిపోతుంటే
ప్రాణాలు తోడేస్తావునేనున్నానని కంమ్మేస్తావు
పలుకుతెనేలోలుకు నీ పిలుపు వింటే
పలికింది నామది వేయి వేణువుల రాగమై
పన్నిటి స్నానాలై నీ ఉపిరి సోకుతుంటే
పులకించి ఉప్పొంగే నామది వేయి యమునలై
నీవులేక నిలువలేనురా నల్లనయ్య
నీతోడులేనిదే బ్రతకలేనురా కన్నయ్య 
                                       -కళా వాణి -
 

Sunday, 26 October 2014

వానజల్లు

మబ్బుల్లో జారిన వానజల్లు
మేనంతా తడీపేనే మంచు జల్లు
ముక్కేరై మెరిసేనే చినుకు జల్లు
ముత్యమయి నన్ను తాకి వెళ్ళు
మెరుపల్లె చిలకరించు వెలుగుల్లు
మయూరినై నర్తించే నాట్యాలు
మనసంతా మురిసెనే జల్లుల్లొ
ముత్యాల చినుకుల్లు ముంగిట్లో
ముగ్గులే వేసెనే సందేట్లో
మువ్వలె మొగాయే గల్లు గల్లు 
మురిసి మది పాడిందే సుస్వరాలూ
మేఘాలలోతెలి అంబరాన్నితాకే ఆనందాలు
మావికొమ్మల్లో పాడేటి కోయిలలు
మధురమే కదా వానలో ఉగే ఊయలలు
హాయి హాయి లే వనలో తుల్లి ఆడే ఆటలు
హంసలా తేలిపోయే మనసు తుళ్ళింతల్లో  

Sunday, 19 October 2014

నిజమైన ప్రేమకు సూత్రాలు

1. నిజమైన ప్రేమలో వెతిరేకంగా మాట్లాడడం ఉండదు
2. మనం సంతోషంగా లేకపోవడానికి మన భాగస్వామి కారణం అని నిందలు వేయకూడదు నిందలువేస్తే అది నిజమైన ప్రేమ కాదు.
3.జీవిత భాగస్వామి ఏ మంచిపని చేసినా మెచ్చుకోవాలి అలా చేయక పోతే నిజమైన ప్రేమ కాదు.
4.జీవిత భాగస్వామి లోని మానవత్వన్ని గుర్తించకపోతే అది నిజమైన ప్రేమ కాదు
5,ఏదైనా కృషి చయడం మొదలుపెడితే పూర్తి చేయాలి మద్యలొఆపకూడదు అలా ఆపేస్తే అది నిజమైన ప్రేమకాదు.
6. జీవితభాగస్వామి చేసే పనిని గుర్తించాలి అలా గుర్తించకపోతే అది నిజమైన ప్రేమ కాదు.
7. జీవిత భాగస్వామితో సంబంధం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అలా లేకుంటే అది నిజమైనా ప్రేమ కాదు.
8. మనలోని ప్రేమను వ్యక్త పరచాలిలేకపోతే అది నిజమైన ప్రేమకాదు.
9. జీవిత భాగస్వామి కోసం కొంత సమయాన్ని కేటా ఇంచుకోవాలి తన అందాన్ని తెలివితేటలను పొగడాలి అలా చేయకుంటే అది నిజమైన ప్రేమ కాదు.
10. ఒకరికొకరు ఎక్కువగా మాట్లాడుకోవాలి ఒకరికొకరు జాగర్తలు తీసుకోవాలి ఇలా లేకుంటే అది నిజమైన ప్రేమ కాదు.
11. దయా గుణం ఉండాలి జీవిత భాగస్వామిని బాధించే మాటలు,పనులు చేయకూడదు అలా చేస్తే అది నిజమైన ప్రేమ కాదు.
నిజమైన ప్రేమలో ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి లేకపోతే అది నిజమైన ప్రేమ కాదు

Saturday, 11 October 2014

tha great painting mona lisa

mona lisa పెయింటింగ్ వేయాలనే కోరిక తీరింది
ఒక మంచి పెయింటింగ్ వేసననే ఆనందంగా ఉంది 
tha great painting mona lisa