Monday, 25 August 2014

మరుగేల మాధవా

నీలి గగనంలో చందమామా
నీలమోహనునికి నీవైనా తెలుపుమా
నీ గానాలలో  తేలేము
నీ ధ్యానమే చేసేము
నీ జత లేక విరహించేము
నల్లనయ్యా వెన్న దొంగా
దోబూచేలరా దొరవేనీవుగా
దరిచేరరారా జాగేలరా
దరహాసమే లేదు అధరాలపై
ద్విరేఫము పరిబ్రమించు పుష్పాలపై
సిరివెన్నెల విరిసింది
సింగారి నీకై వేచింది
మరుమల్లెలు పూచాయి
మతేక్కిస్తున్నాయి
మదన మనోహరా రావోయి  
మది ఆలపించి పాడేము
మృదంగద్వనులతో పిలిచేము
మృదుమధుర గానాలతో వలచేము 
మరుగేల మాధవా
నా మనసెల రావా
             -కళావాణి -







Saturday, 23 August 2014

నీజత


జానపదాలు జలజల పారే జలపాతాలు
జాబిలమ్మకు జావలీలు పాడే వెన్నెల్లు
జరిగి జరిగి వొరిగి ఇటు కరిగి
జతగా మసలే సుఖము మరిగి
జిలుగు మొము మరువలేమని ఎరిగి
జాజిపూల మత్తులో మునిగి 
జాలువారు కన్నుల మత్తిడి
జగమున నిలిచే జంట మనదని
జమున మనకు సాక్షమని
జలజాక్షి సన్నిదే మోక్షమని
జర్మ జర్మలకు నీజత కోరి
జీవితమే తరీంచిపొనీ
             -కళా వాణీ -
       

ఉగే ఊగే ఉయ్యాల

ఉగే ఊగే ఉయ్యాల
రాదా కృష్ణులు ఉయ్యాల
గోపికలు ఊపె ఉయ్యాల
ఆనంద డోలల ఉయ్యాల
వయ్యారి రాధమ్మ ఉయ్యాలా 
వొర కంట చూసింది ఉయ్యాలా 
వలపంత పొంగించి ఉయ్యాలా 
వెణువుని ఉదింది ఉయ్యాల 
వోరకంట చూసాడు  ఉయ్యాలా 
 క్రిష్నయ్య చూపుకి ఉయ్యాలా 
రాధమ్మ బుగ్గల్లో ఉయ్యాలా
సిగ్గొచ్చి కమ్మిందే ఉయ్యాలా
రాధమ్మ మనసంత ఉయ్యాలా 
యమునల్లె పొంగింది ఉయ్యాలా
రాధా మాధవులు ఉయ్యాలా 
ఊగెటి ఊయల్లు ఉయ్యాలా
జగానికే జోలలు ఉయ్యాలా 
                   -కళావాణి -





పెళ్లి పందిరి

జీరాడు చీర కుచ్చిళ్ళు
పారాడు పాదాల మువ్వల్లు
ముసిరేటి ముంగురులు
చెదరేటి కుంకుమలు
కదిలేటి ఆధారాలు
చుoబించు మదురాలు
కరిగేటి కాటుకలు
ఎనలేని వెన్నెల్లు
గుచ్చేత్తే అందాలు
గోదావరి పొంగుల్లు
గారాల అచ్చట్లు 
ముదితల ముచట్లు
మురిపాల చెక్కిళ్ళు
సరస సల్లాపాల గిచుళ్ళు
పెళ్లి పందిట్లోపారాడు పడుచులు
పడతుల పలుకులు కులుకులు
కళ్ళకు కనువిందులు
                    - కళావాణి -


ఒకే జత

పల్ల్లవించు పరువంలో
పులకరించు మురిపాలు
పరిమళించు పువ్వుల్లో
ప్రణయ వీణ పలుకుల్లో
పాటలై సాగి వేళల్లో
మాటలే మూగబోయి వేళల్లో
పట్ట పగలే చుక్కలు పొడిచే
పాలవెల్లి పుంతల్లో
పూల గాలి రెక్కలు తొడిగి
విహరించు వేళల్లో
పలుకులలో తేనెలొలుకు చిలకా
పరువాలలో పొంగి పోవు మొలకా
నే నేవరో నీకేరుకా
నీ రాకతో నాకు నిదుర రాక
నువ్వెవరో నేనెవరో
ఇలా వున్నమే ఒకే జతలో
                    -కళావాణి-


దరిచేరరా దయచేసి

నీ చూపు సుడి
నా ప్రేమ సడి
నీ వెంటపడి
నా నిదుర చెడి
పల్లవించు పరువంలో
పులకరించు మురిపాలు
మధుమాస వేళల్లో
మరులోలికే ప్రేమలో
మరుమల్లె తోటలో
మనసైన నీకోసం
మాటుగా వేచేను
కురులు చెదరే
కన్నుల కాటుక కరిగే
నొసటన తిలకం జారే
నీరు సలసల కాగే
నిలువనీక నీకై వేగే
దాగుడుమూతలు మని
దరిచేరరా దయచేసి
        -కళావాణి-


మధుర గట్టo


యమునా తీరం రమ్యమైన తివాచి పరిచినది
యదాయధాలు గ సుమములు సుగంధ పరిమళాలు వెదజల్లినది
యాచించే కృష్ణయ్యను రాధ యుగాలు నిలిచే ప్రేమ కావాలని
యోచించకనే క్రిష్నయ్య తధాస్తు పలికే ప్రేమనివ్వగాలనని
యదార్థమే కదా రాధామాధవుల ప్రణయం
యుక్త మై నిలచియుండును ప్రాణమై
యవ్వని జవ్వని రాధ రాగానే
యదను పరిచే బృందావని పులచే
ఎల్లలు లేనిది గోపెమ్మల ప్రేమ
యశస్సు తో వెలిగే గొపీ మనోహరుడు
యదలో నీ సొదలన్నీ గానమై ఆలపించే
యాగమై ధ్యనమై మనసు రమించె
యందేందు వెదకినా కన్నులందే కన్నయ్య నిలచె 
యెమాయె ఈవేళ మనసు కొలతమేటించే
యుగాలదా ఈ బంధం నను మైమరపించే
యక్షులు గంధర్వులు ఈ మధుర గట్టని కని ధన్యత నొందిరి 
                                      -కళావాణి-

Friday, 22 August 2014

నెమలి నేరజాన


నెమలి నేరజానవే నీవు
నేలపై పురివిప్పి నర్తించెవు
నెమలి పింఛానికి ఎన్ని వర్ణాలు అద్దావు
నల్లనయ్యకు శిఖి పింఛమౌళి బిరుడునిచ్చావు
నాట్య శాస్త్రానికె వన్నె తెచ్చావు
నాట్య మయూరి నీ నడక వయ్యారి
నీలి మేఘాల ఉరుముల మెరుపులు
నీ కాలి అడుగులకు వేసే తాళాలు
నీలి నీలి వర్ణాలెన్నో నీ గళంలో
నిగనిగ ల మెరుపులే నీ గళం వొంపుల్లో
నీ వన్నెకు మెచ్చి ఇచ్చారా కిరీఠo 
వన మయూరీ వన్నె చిన్నెల తువ్వాయి
నీ సరి ఎవోయి


స్నేహం

స్నేహం గోప్పది
నిన్ను న్నిన్నుగా చూపేది
నీ స్నేహితున్ని చూసి
నీ గురించి చెప్ప గలిగేది
స్నేహమనే పదం స్వచ్చమైనది

Thursday, 21 August 2014

పల్లెటూల్లు

పల్లెటూల్లో
పిల్లగాలిలో
పిల్లకాలువల్లో
పల్లపు భూముల్లో
పిచ్చి మొలకల్లో
పిచ్చి పువ్వుల్లు
పచ్చదనాల పరవళ్ళు
పక్కనే గుడిసెల్లో
పందిరి లేని తీగల్లు
పై పై పూచే పువ్వుల్లు
పలకరించు తేనే పలుకుల్లు
పరికించి చూడ మేని పులకల్లు
                            -కళావాణి-

వేల్లనీయరా కృష్ణా వేళాయెరా కన్నా


వేలాయెరా మతిమాలి
వేల్లనివ్వరా వనమాలి
వేణుఉది వేదించకూరా
వేళకాని వేల కృష్ణ
వెన్నదొంగా నా మది దోచితివి
వేకువనే నీ తలపులు నను నిలువనీవు
వేచి వేచి విరహంతో వేదిస్తావు
వెన్నులో సెగలవును
వెన్నoటే తలపవును
వేగలేక వెతలవును
వేళకాని వేల నీ పిలుపులాయే
వెదకి వెదకి వేదనాయే
వేలదాటి రాకలాయే
వెళ్ళనీయక నీ రూపు నా కాళ్ళకు బంధమాయే
వేల్లనీయరా కృష్ణా వేళాయెరా కన్నా
                                     -కళావాణీ -

బృందావన సంచారా

యదుకులోత్తమా యమునా తీరాన గోపికల ఎదలో నీ లీల
యశొద తనయా ఎదురుచుపుల వేతను మరచి ఆడిన ఆనంద కేళి
యద యదలో దాగి ఎనలేని ఆనందాల తేలి తేలి
యమునా తీరాన నీ వేణుగాన రాగ సుధల తేలి తేలి
యల కోయిల రాగాల శృతులు కలిపి ఏవో లోకాల తేలి తేలి
యాదవా మాధవా మగువలమానసచోరా శృంగార రసకేళి
యుద్దమే చేయని యవరాజు రాజు రాజ్యం
యదార్థాల సారమైన గీతాబృతం
 యుగ యుగా లకు నీ గీతా సారమే శరణం
యే కాంతకైనా ఏకాంతాన నీ ప్రేమే స్మరణం
యేమని పొగడుదురా బృందావన సంచారా 
యే రీతి కీర్తింతునురా ముగాకర నగాకర
           ముకుందా మాధవా
              -కళావాణి-


నిరీక్షణ

వాలు పొద్దుల్లో కన్నులు కాయలు కాచేలా వేచితి
వొద్దికగా వంగపండు రంగుచీర కట్టితి
వడి వడి గావచ్చా అలికిడి విని నీవని
వాడివాడి గా వెన్నెల గుచ్చే ఆలస్యమయినదేమని
వాడిన జాజులు జాలిగా చూసే నీ పెనిమిటి రాడేమని
వేడి నిట్టుర్పు లాయె ఏమయినదొనని
వేచి వేచి కన్నిరైతి జాడయినాలేదని
వినువీధికి చుపుంచి వేచి వేచి వగపాయే
వంటరినయిన నీ ఉహలు వదలవాయే
విమలము లేని మనసాయె
వోదార్పు లేని వియోగాలాయే
విరించి వేసిన వింత బంధం
విడలేని వివాహ  భంధం
విడిపోము మనము
                -కళావాణి-

Wednesday, 20 August 2014

జాబిల్లి


జాబిల్లి జలతారు మేఘాల దాగి దాగి
జల సంద్రంపై వెండి వెలుగులు జల్లి చల్లి
జలజలా జలపాతలలపై పండువేన్నేల్లెవెన్నేల్లు
జల్లున మేనిని జివునలాగే కొండగాలుల్లు
జత జతగా పేర్చిన కొండకోనల్లు
జలతారు వెలుగులో జీరాడు కుచ్చిల్ల అలల నురగల్లు
జామురాతిరి వెన్నెల జోలల్లు
జరగాలి వేడుకలు వెన్నెల వేదికల్లో
జతచేరి జంటలన్నీ ఆడాలి వెన్నెలల్లొ
జగమంతా మురవాలి వెన్నెల దారుల్లో
                                      -కళావాణి-



ధ్యానం


నీపై ధ్యానం నీ నామమే స్మరణం
నీకే నా జీవితం అర్పితం
తంబుర నాదాంబృతం
తాపసీ తమకం
దీపమై వెలుగు తేరా
దివి నేలే దీరా
మోహనాంగా నీ మోహన వేణుగానం
మొదలై ఇది తుదిలో నిలిచే వేదసారం
మీరా వల్లభం  శ్రితజన రూపం
మీరా మనసు మీటె కృష్ణ గీతం
మీటే ప్రతి రాగం మాధవ స్మృతుల హారం
ఆగమంటే ఆగేనా ఆరాధనా ప్రవాహం
అంగాoగమున నిండే అనంతుని రూపం
మది మందిరాన కొలువై ఉన్నకృష్ణ తేజం
మాధవా అని పిలిచినంతనే ఎదుట నిలిచే గోవిందం
మనసు మాధవ మందిరం
మధురమాయే జీవితం
                    -కాళ్ళవాణి-











నీ రాధనురా రాదేయా

నువ్వు నా కళ్ళలోకి చూడు నువ్వే కనిపిస్తావు
నువ్వు నా మనసులోకి వేదికి చూడు నీవే నిండి ఉన్నావు
నిన్ను వదలి ఉండలేను రా నీ రాధనురా రాదేయా
నీ కన్నుల కనుసన్నలలో నన్ను దాచరా కన్నయ్య
నిన్ను తలచి తలచి నన్ను నేను ఏనాడో మరిచాను
నీ రాకకై వేచి వేచి వెన్నెలలో వేశారాను
నీవు రాణి వేల విరహపు సెగలు నన్ను దహీంచునురా
నిన్ను కన్న వేల మది వేయి వీణలు మీటునురా
నీలమోహనా నీ అలికిడి విన్ననా మనసున మయురంబులై నటిఇంచు
నీ చేయి తాకిన నా మెనూ వేయి మెరుపు తీగలు వెలుగులు వెలిగించు 
నీరజాక్షా వేణుగాన సమ్మోహనా నా మది రాగాలు ఆలపించు
నీలమేఘశ్యామా ఏనాడో నా మనసు నీవసమా నన్నాదరించు
నీ పలుకే సుస్వరాల రాగామలికలే కూర్చు
నీ ప్రేమలో మది బృందావనిలో పొన్నలు పుఇంచు
నీ మురళిని నేనై నను నీ అధరములలో చేర్చు
నీ ప్రణయాన నను పరవసించనీ మైమరచి
                                             -కళావాణి -

Monday, 11 August 2014


కలువల కొలనులో కమలములు విచ్చినవి
కన్నయ్య రాకతో నా కన్నుల కలువలు విచ్చినవి
రాధను నేను నా రాదేయుదడితో రాగారాధన చేసేవేల
రాజీవుని మురళీ రవళి కి రాజీవములు విచ్చె నిలా
రాయి కైన చలనము కలుగు రాగాలాపనలో
రాజ హంసలు తలలూచి శృతి కలిపే రస కేళిలో
రయ్యన ఎగిరివచ్చి కాకి పురములు నాట్యమాడగ నిలచె
రమ్యమైన శారద రాతిరిలో రాజీవునిచెంత  నా మనసు నిలిచే


 

 

పుత్తడి బొమ్మ రాధమ్మ

పూవ్వులో తావిలా నిన్నంటి నేను నాలో ఒదిగి నీవు
పూబొని విరిసేను నీ వదనము నను గనినంతనే
పున్నమి జాబిలివి పట్టపగలే వెన్నెల విరిసేనే
పువ్వంటి నీ మేని అందాలు తాకి పులకించితినే
పుడమి పుణ్యమెమో మన జంటతో తరియించెనే
పూమాలలాయే నా మేడలో నీ మమకారమే
పురుషులలో పుంగవుడనైతి నీ ప్రేమచే
పుండరీకాక్షుడనని పులకించావే మైమరపించవే
పుత్తడి బొమ్మపూరెమ్మ నీవేనా ప్రాణమమ్మా
పునర్వసుడకు ప్రతిస్పందన నీవేనమ్మా
పున్నాగపూవే నువ్వు నీ చుట్టూ బ్రమరము వోలె నేను
పూర్వజర్మ సుక్రుతములే ఇది మధురము నీవు నేను
పురాణాలలో నిలచి ఉండు మనప్రేమ ఇది నిజమౌను
                                                       -కళావాణి -



Thursday, 7 August 2014

నిండు పున్నమి వెన్నెల

నిండు పున్నమి వెన్నెలారబోసింది 
జుంటు తేనే తాగే గువ్వ గుసగుసలాడింది 
పుట్ట మీద పాలపిట్ట  పులకించి పాడింది 
చెట్టు మీది చిన్ని గువ్వలు గంతులేసి ఆడాయి 
నీటతెలుహంసల జంట వెన్నెల విహరించాయి 
పట్టపగలే సిరివెన్నెల సిందేసి ఆడింది 
పక్షులతో కొలువైన ప్రకృతెంతో మురిసింది
అందాల జాబిల్లి అందుతుందేమో అనేలా 
ఆవనిపై అందాలు అరబోసేనే ఇలా
వేల కన్నులు కావాలి వీక్షించడానికి 
వెలలేని సౌరభాలు ఇలా చిత్రించడానికి 
           -కాళావాణి-



నేలంతా పరచిన తివాచిలా


పూల పరిమళంలా 
ఎటిలోని అలల్లా 
గాలి గలగలా 
నీటి మిల మిలా 
గువ్వ కువకువలా 
నవ్వు కిలకిలా 
మువ్వగల్లు గల్లు లా 
రాయంచ నడకలా 
రామచిలుక పలుకులా 
తేనీటి వాగులా 
నీలాల నింగిలా 
నేలంతా పరచిన తివాచిలా
ఈ ప్రకృతిని కన్న కన్ను డన్యత నోందేలా 
నెల విరిసిందిలా మనసు మురిసిందిలా   

                                              -కళావాణీ\-

Wednesday, 6 August 2014

గోవర్ధన గిరిధరా







గొల్ల గోపన్నల సమేతా గోవర్ధన గిరిధరా
గోవుల్లు కాచేటి గోవిందా
గోవులు నీ గానామృతమును విని మేతమానే
గోధూళి వేళ గోవులన్నీ నీ వెంటే నడచేనే
గోప బాలురకు నీ మాటే వెదమాయెనె
గొల్ల స్నేహాల  నీ అల్లరి ఆటలు
గొల్ల గోపికల తో సరస సల్లాపాలు
గోమాతల శోకము తీర్చిన కాళి మర్ధనా
గోవర్ధన గిరిని నెత్తి వ్రేపల్లె ప్రజా రక్షకా
గొడవలాయె అత్త కోడళ్ళకు వెన్న దొంగా
గోకులానికినీవే అండ దండవుగా
గొప్పగా స్తుతించే ప్రపంచమెల్ల నీ రాజ్యన
గోపికా మానస సంచారి





రాధా మాధవుడు


  • రాగాల లోలుడు నీవు 
  • రాసకెళ్ళి వేల రాధా ను నేను
  • రమణీయ బృందావనిలో 
  • ఏకాంత వేల నీ ఏకాంత సేవ 
  • నాలో నీవు నీలోనేను లీనమౌదము 
  • మల్లెతీగాల్లె అల్లిన మనబంధం మధురం
  • మదిలో మల్లెలు పూచిన అతి మధురం
  • ఎరుల్లొ వాగుల్లో ఏమునా నది తీరంలో 
  • ఎల్లలు లేని మన ప్రేమ పరవళ్ళలో 
  • హద్దులు లేని పోద్దులకోసం ఆరాటం
  • ముద్దుల క్రిష్నయ్య కౌగిట్లో కోలాటం   
  • చల్లనమ్మే గోపికా మానస చోరా 
  • ఎల్లలు లేవురా మనప్రేమకు మానసచోర 
  • బృందావనం వెలసింది మనకోసం 
  • నీమందహాసం మదిలో రేపింది కోలాహలం 
  • ఈ బంధం చిరకాలం నిలువునులే 
  • ఈ ప్రేమ మన మనసున పదిలములే 
  • రాగాల మనోహరా నీదే ఈ రాధ
           _కలావాణి _





పసుపు ఆరబోసిన ఆకాశం

పసుపు ఆరబోసిన ఆకాశం
బంతి లా భానుడు బడలి ఒరిగేవేల
గువ్వలన్ని గూటికి చేరెవేల
చీకట్లు చిలికి చిలికి కమ్మే వేల
పిల్లగాలి ఈలలు వేసేవేల
మనసు ఈ సందెవేళ
మంచులా హాయి గోలుపులే
                          -కళావాణి - 

సందె సీకట్లో సంపంగి వెలుగులు
















సందె సీకట్లో సంపంగి వెలుగులలో 
శకుoతలములు సేదతీరువేలలలో 
సాగరుడు శాంతించు వేళల్లో 
సందె గాలి సన్నాయి పాదెవెళల్లొ 
సొలసి అలసిన మనసులు నీ 
సువర్ణ లేత కిరణాలు సోకి సత్వరమొందేను 
                                             - కళావాణి-











-

Monday, 4 August 2014

శోకార్చి శోకార్చి


శోకార్చి శోకార్చి కన్నుల నీరన్ని కడతేర్చి
నీవు ఏతేoచకున్న వేచిన వెతను విడమర్చి
నిన్నల్లో మొన్నల్లో వెన్నెల్లో తేనేర్చి
నన్ను వల్లనన్న నల్లనయ్యకయి కన్నీరొడ్చి
మల్లెకన్న తెల్లని మనసు నాది చూడు నీ మనసు చేర్చి
మబ్బుల్లో చూసా నిను పోల్చి
కొమ్మలకు కోయిలలకు చెప్పా నీను గూర్చి
కొండలు కోనలు నా స్థితి చూసి ఓదార్చే
పొన్నల పూల పొదరిల్లు నాకందించే గాలిలో గంధాలు చేర్చి
పక్షులు నాకయి వినిపించే సుస్వరాలు తన గొంతులో కుర్చీ
చల్లనమ్మి వచ్చి  నల్లనయకై వేచి వేచి నిట్టూర్చి
చల్లగాలీ నీవయినా నా వెతను నల్లనయ్యకు చేర్చు
క్షణమైనా నిను వీడి ఉండలేనని మధురమయిన మాటలన్నీ కూర్చి
                                                                     కళావాణి 

కమ్మని మనప్రేమ కమనీయము కమనీయం


మదన మన్మదాకారా ముకుంద వదనా
మరులు గొలుపు నీ రూపు మరువగలనా
నా కన్నులనీ రూపు చెదరునా
నా మసున నీ గానం మరువగలనా

రాధికా నా రాగల మాలికా
రంగు లన్ని రంగరించిన రoగవల్లి కా
రా రమ్మని పిలిచే నీ చూపుల నన్నేలిక
రాగాల లోలుని కవ్వించే కావ్య నాయికా

చూపులు కలిసెను లోకము మరచెను
చుక్కలు పొడిచెను మక్కువ గొలిపెను
చక్కదనాన చెక్కిలి మెరిసేను
చమకు చమకుల ముక్కెర మెరిసేను

కమ్మని మన ప్రేమ కమనీయము కమనీయం
కలకాలం నిలుచును
                                        -కళావాణి -

Sunday, 3 August 2014

కళల కావ్యాo




ఆమని అందాలు జలజల సాగే జల పాతాలు మనసును మరులు గొలిపించు తేలి మంచు సోయగాలు
పరువాల పల్లె పడుచు పరికిణి లాంటి ప్రకృతి పచ్చదనాలు
పాల ధారా వోలే గంగ శివాభిషేకానికై తపియించు తలపులు
కళల కావ్యాo లా కదలి సాగే కమనీయ పిల్ల కాలువలు
కన్నుల విందుచేసే వర్ణించ లేని కావ్యాలు
వీచే గాలి గంధాలు పూచెపుల పరిమళాలు
పరచిన తివచీల పచ్చ దనాలు
ప్రియుని పిలుపులా తీయటి గాలుల గానాలు
చిగురుటాకుల చమరింతలు
కొండల కొనల కోకిల గానాలు
కడతేరిపోవాలి నా జీవితం ఇక్కడే ఇప్పుడే
                                                -కళావాణి-

శిఖి పించమా నీవైనా తెలుపుమా



నీ రాధా నీ కోసం నిలువెల్లా కనులతో నీకై వేచేనురా కృష్ణ 
నీవైనా తెలుపుమా శిఖి పించమా నా వేదన సిఖిపించ మౌళ్ళికి 
నీలిమేఘమాలా జాలితో నీవైనా తెలుపుమా నా ఆవేదన నీలమెఘశ్యమునికి 
కాటుక కన్నీరు యమునలై సాగే యదోలని వేతను తెలుపు  వేణు మాధవునికి
                                                                    -కళావాణి-

Saturday, 2 August 2014

మీరా



తంబుర శృతిచేసి తన్మయత్వంతో నిన్నే స్మరియితునురా క్రిష్నయ్య
నా తలపుల తనువుల తలచి తరియింతునురా క్రిష్నయ్య 
తపించే నీ మీరా కన్నులందు కొలుచుకుంటా నిన్నే కన్నయ్య 
తరలి రారా తార తరసుధా పూర్ణ హృదయా 
తనివార నిను గాంచి తరియింతునురా కన్నయ్య 
కృష్ణ కమలనయనా భక్తులను కాపాడే బృందావన విహారి
                                                                  - కళావాణి-