Monday, 30 June 2014

పూలు తేవే సఖి పూజకు వేలయే



పుడమి తల్లి ప్లకించి విచ్చిన వనం లో
పుష్పించిన పూలు తేవే సఖి పూజకు వేలయే
పువ్వుల సరి సుకుమారివి
నవ్వుల జరి జలజాక్షివి
ప్రత్యుష వేల పువ్వులేరు పుబొనివి
ప్రకర్షమైన నీ స్పర్ష పువ్వ్లలకు సోకి పులకిoచినవి
ప్రభాతుని వెలుగు తో విరులన్ని విప్పారినవి
ప్రతి దినం నీ రాక పూల వనానికే వన్నె తెచ్చె
పూల మాలలల్లిన కోమలి కూర్చిన కూరిమి నేర్చే 
ప్రణవము ప్రకృతినంతా వ్యాపించే
ప్రభువైన పరమేశ్వరుడు నీ పూమలకై వేచే
పూమాల ధరించి పరమేశ్వరుడు పరవశించే
                                        -కళావాణి-