Thursday, 8 May 2014

నల్లనయ్య



చల్లగ వీచే పిల్లగాలికి
మెల్లగ మెదలే ఉహలకి
అల్లుకుపోయే భావాలకి
కన్నుల నిండిన నీ రూపుకి
నల్లనయ్య నీ రాకకి
వెల్లువలై పొంగే మదికి
హద్దులు లేవాయే
పొద్దులు తెలియవాయే
                   -కళావాణి-

వర్ష లావణ్యo


వానజల్లు వొళ్ళంతా తడిపేస్తుంటే                  
తెనేజల్లులా తీయని రాగం పాడుతుంటే
సంపంగి సువాసనలు నను కంమేస్తుంటే
సప్తస్వరాలు శృతి మెత్తగ మదిని మ్రోగిస్తుంటే
అబరాన్నితాకే అనంద వెల్లువలు పొంగుతుంటే
అత్యంత అమోఘ అద్వితీయ మైన భావాలు కమ్ముకుంటే
మట్టివాసనలు మదిని మెల్లగా మీటు తుంటే
మిట్టపై చెట్టు చెరువున మయూరి నాట్యమాడుతుంటే
ముత్యాల జల్లులు నను ముద్దముద్దగా ముచేస్తుంటే
వాలు పొద్దుల్లో వరదగుదేస్తుంటే
వాగు గట్టుపై వలపు చిన్దేస్తుంటే
వర్ణించతరమా వర్ష లావణ్యo
                              -కళావాణి-