Tuesday, 22 April 2014

సుభోదయము


కోయిలలు కుహు రాగాలు పలికే
కోవెల పాటలు శృతులు కలిపే
కోటి వేలుగుల కొంగొత్త కాంతులోలికే,
కమలావుడు కదం తొక్కి కదలి సాగే
కమల కాంతుని లేత వెలుగుల గని
కాకీపురి పురివిప్పి నాట్యాలు చేసే
నీ కైన్కర్యమునకై ఉప్పొంగే నా మనసు
కృతులకు నీవే కారకుడవు
కృతార్త మాయె జీవుల జీవితాలు
                          -కళావాణి-

Friday, 18 April 2014

వెలుగు-చీకటి

చీకటింట కూర్చొని చీకటని చీదరించనేల
చిదిమి చిన్ని దీపం వెలిగించి కాంతి నిపవేల
చిన్ని దీపము చిమ్మ చీకటిని పారద్రోలు
జ్ఞాన మనే వెలుగు అజ్ఞాననమనే చీకటిని పారద్రోలు 
                                                     -కళావాణి-

విజయం

విజయం తప్పక నిన్ను వరిస్తుంది
వజ్ర సంకల్పం దృడంగా  నీకుంటే
వైఫల్యాలు వచ్చినా వదలకు పట్టు
విజయానికి అపజయం తొలిమెట్టు
విభావారికి ప్రబాతనికి తేడాలేక శ్రమించు
విధేయతతో విజ్ఞాన్ని సంపాదించు
విత్తనం చిన్నదైనా మహా వృక్ష మౌతుంది
సకల్పం చిన్నదైనా విశ్వమంతా ఖ్యాతి నిస్తుంది
విఖ్యాతి గాంచిన వారెందరో అపజయాలు  పొందిన వారే
విపత్తులు వస్తాయి పోతాయి చివరకు గెలుపు విజయానిదే
                                                        -కళావాణి-

Thursday, 17 April 2014

నా రేమో కై నేను

ఎడమేరుగని జీవనం కావాలి
ఎద నిండా  నేనే ఉండాలి
కడలంత ప్రేమ కావాలి
కడు తీపి తీరం చేరాలి
ఎడతెగని ఆలోచనలు నావే కావాలి
ఎడబాటేరుగని ఎద కౌగిలి కావాలి
ఎడారి దారి కానీకు మది మజిలి
ఏడ ఉన్నా నీ నీడ నేనై ఉండాలి
ఎండుటాకులమై మనం మిగిలినా
పండుగలై ప్రతిరోజూ పరవసించాలి
                                      -కళావాణి-

Wednesday, 16 April 2014

ఓ లలనా కడు లావన్యమే కదా నీ సొగసు (మౌనిక )

ఓ లలనా నీ లయలు హొయలు ఏమని వర్ణించను
చారడేసి కళ్ళు చక్కదనం ముందు కలువలు మొహం చాటేసాయి
సంపంగి సాటిలేనిదని చాటే చక్కని చెక్కిన నీ ముక్కుని చూసి
దొండపండు దోబుచాడే నీ పెదాల రంగుని చూసి
పారిజాతమే పరవశించే నీ పలువరుసతో తనని పోల్చి చూసి
చంద్రవంక చిన్నబొయే చక్కని నీ మందహసముని గాంచి
చెక్కిలి చమకు చూసి ఆ చుక్కలే వేవేలబోయే
ముఖ కమలము గాంచిన బ్రమరము మకరందమును గ్రోలుటమరచె
సన్నని నీ నడుముకు సరిలేనిదే లేదని సన్నాయి రాగాలు మరచె
 కలికీ నీ కరములు గాంచి తామర తూడలు తామర పత్రముల చాటునదాగే
జీరాడు కుచ్చిల్ల చాటుచేరి పారాడు పాదాలు, పద్మాలు సాటి రావే
హంసలు చిన్నబోయే నీ వయ్యరి నడకలకు తాము సాటిరాలేమని
సెలయేరుల సరవేగములు సెలవనే నీ వయసు పరవల్లకు సాటిలేదని
చుక్కలు గగనాన చప్పున మేఘాన్ని చాటుచేసే నీ చెక్కిలి చమకు చూసి
పట్టుకన్నామృదువైన  నీ కురులు గాంచి పట్టు పురుగు పట్టు నేయక పారిపోయే
అరుదయిన అద్భుత శిల్పానివే నీవు 
అమర శిల్పులు చెక్కిన అపురూప శిలవు నీవు
ప్రాణమున్న శిలవు నీవు నా ప్రేమ దేవతవునీవు
                                                                        -కళావాణి-

Monday, 14 April 2014

వసంత పౌర్ణిమ

వసంత పౌర్ణిమ వచ్చింది
వన్నెల వెన్నెలలు తేచ్చింది
వయ్యారాల వనితల మనసు దోచింది
వగలమారి చందమామ చూపు గుచ్చినది
విరహాల చందనాలు పేర్చింది
వగలు సెగలు మనసున పూయించింది
వలపు పిలుపుల ప్రేమ పులకరించింది

వెలవెలబోయే నా మనసు మబ్బుల దాగిన నిను చూచి
వెన్నెల వర్షం లో నిలువెల్లా తడిచాను మురిసి మురిపించి
వగలమారి జాణవులే జాబిల్లి
వల్ల నన్న వుండనీవు ప్రేమ జల్లి
వల్లే యని నా మనసు మెల్లగ నిను జేరి
వలచినా వివరించలేను మనసు జారి
వయ్యారి మల్లెల వాసనలు మత్తు జల్లె
వరసైన చందమామ చందనాలు జల్లే
వనమంతా వలచే వన్నెల వలరాజుని చూసి
వసంత శోభలై విరిసే జాబిల్లి వెన్నెలలతో కలిసి
                                                     -కళావాణి- .

ఉగాది






ఉగాది వచ్చింది

ఉశ్చ హాన్ని నింపింది
ఊరించే వసంతకాలం వచ్చేసింది
ఒగరు,తీపి,కారం,చేదు,పులుపు,(ఉప్పు)రుచి
ఓహో .. అనే షడ్ రుచులను రుచి చూపించింది
ఉర్రుతలూరించె వయ్యారి వసంతం వచ్చేసింది
ఉప్పొంగే నా మదిని ముంచేసింది
ఉరకలేసే నా మది వసంత కోకిల గానం విని
ఊరకుoడదే  నా మది చిలిపి తలపులు గని
ఉరికే నాలో ఆనందాల డోల
ఉహకె తోచే కవితా హేల
ఊరంతా సబరాలు అంబరాన్ని తాకింది
ఊయాల ఉహాల్ని ఉగించింది
ఉల్లి పొరల దుస్తులు ఊరంతా ధరించింది
ఉండుండి వచ్చే చల్లని గాలికి ఉప్పొంగింది
ఉష్ణోగ్రతలు పెరిగే రోజుల్లో చల్లని గాలికి తపిస్తుంది
ఉహల మదిలో వసంతం విరబుసింది.
                                                  -కళావాణి-

Tuesday, 1 April 2014

సూక్తి





విధానాలు లేని రాజకీయాలు, అంతరాత్మ లేని ఆనందం

పనితో నిమిత్తం లేని సంపద, గుణం లేని జ్ఞానం,
నీతిలేని వ్యాపారం, మానవీయతలేని శాస్రం,
త్యాగం లేని ఆరాధన మనల్ని నాశనం చేస్తాయి.
                                    -మహాత్మాగాంధీ -