Wednesday, 19 February 2014

ఆత్మగౌరవం మనలోని అద్భుత భావన

ఒక రైల్వే స్టేషన్ లో ముష్టి వాడు తన చిప్ప నిండా పెన్సిళ్ళతో కుర్చుని ఉన్నాడు ఒక యువకుడయిన అధికారి అటుగా వచ్చి బిచ్చగాడి చిప్పలో ఒక డాలరు పడవేశాడు, కానీ పెన్సిల్ తీసుకోలేదు. ఆ తరువాత ఆతను రైలెక్కాడు. బోగి తలుపులు మూసుకుంటూ ఉండగా, హాఠాత్తుగా ఆ యువకుడు రైలు దిగి మల్లి ఆ బిచ్చగాడి దగ్గరకెళ్ళాడు చేతిలో కొన్ని పెన్సిళ్ళు తీసుకుని, "నేనీ పెన్సిళ్ళు తీసుకుంటున్నాను వీటి ధర సరిగ్గానే ఉన్ది. ఎంతైనా నువ్వు కూడా నాలాగే వ్యపారివే కదా," అని ఆటను పరిగెత్తి రైలు అందుకున్నాడు .
ఆరు నెలలు తరువాత ఆ యువకుడు ఒక పార్టీకి వెల్లాడు . ఆ బిచ్చగాడు కూడా ఆ పార్టికి వచ్చాడు, కానీ సూటూ , టైతో ఉన్నాడు బిచ్చగాడు యువకుణ్ణి గుర్తుపట్టాడు అతనిదగ్గరకెల్లి, "మీరు బహుశా నన్ను గుర్తుపట్టలేదనుకుంటా
కానీ మీరు నాకు గుర్తున్నారు,"అన్నాడు. ఆ తరవాత వాళ్లు ఆరు నెలల క్రితం ఎలా కలుసుకున్నదీ గుర్తుచేసాడు అప్పుడు యువకుడు "అవును, మీరు చెప్పాక నాకు గుర్తొచ్చింది. మీరారోజు అక్కడ అడుక్కుంటున్నారు. మరి ఇప్పుడిక్కడ సూటు వేసుకుని టై కట్టుకుని ఎం చేస్తున్నారు? అని అడిగాడు. ఆ బిచ్చగాడు, "బహుశా మీరు నాకారోజు ఎంత ఉపకారం చేశారో మీరు గ్రహించి ఉoడరు. నాకు బిచ్చం ఇవ్వటానికి బదులు మీరు నన్ను చాలా మర్యాదగా చుసారు. చేతిలోకి కొన్ని పెన్సిళ్ళు తీసుకుని, "వాటిధర సరిగ్గానే ఉంది, ఎంతైనా నువ్వు కూడా నాలాగే వ్యపారివె అన్నరు. మీరు వెళ్ళిపోయాక నేను ఆలోచించాను నేనిక్కడేం చెస్తునాను? బిచ్చం ఎందుకు ఎత్తుతున్నాను? అనుకుని, నాజీవితాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోవాలని నిర్ణించుకున్నాను. నా వస్తువులు సర్దుకుని, అక్కణ్ణించి కదిలి, పని చేయటం మొదలు పెట్టాను. ఇవాళ ఇక్కడున్నాను. మీరు నాకు నా ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చారు. మీకునా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఆ ఒక్క సంఘటన నా జీవితాన్నే మార్చేసింది," అన్నాడు
      ఆ బిచ్చగాడి జీవితంలో మార్పు ఎలా వచ్చింది? ఆ మార్పు ఏమిటంటే, అతని ఆత్మగౌరవం మేల్కొంది, దానితో ఆతను కష్టపడి  పనిచేసి పైకి వెళ్ళగలిగాడు మన జీవితాలలో ఇటువంటి అద్భుతాలు సృష్టించగల శక్తి ఒక్క ఆత్మగౌరవానికే ఉంది.

Tuesday, 11 February 2014

ప్రతి మనిషికి ప్రతి జాతికి మూడు ముఖ్య విషయాలు

ప్రతి వ్యక్తిని, ప్రతి జాతిని ఘనతరం చెయ్యడానికి మూడు విషయాలు ముఖ్యంగా అవసరం
అవి:
1. సౌజన్యానికున్న శక్తులపట్ల దృఢవిశ్వాసం.
2. అసూయ,అనుమానాలు లేకపోవడం.
3. తాము మంచిగా ఉండి ఇతరులకు మంచి చెయ్యాలని ప్రయత్నించేవారికి సాయపడటం.
                                                                                  -స్వామి వివేకానంద

మనశాంతి

ఒక గ్రీకు గాధ ఉంది. ఒకసారి దేవతలంతా కలిసి సభ జరుపుకున్నారట ఆనాటికి దేశాలు, ప్రజలు, పశువులు వoటి వెమీలేవు. సభలో ఒక ఆసక్తికరమైన విషయం చర్చకు వచ్చింది. దేవతలు ప్రతిరోజూ తినడం, తాగడం, సుఖాలను అనుభవించడం మాత్రమే జరుగుతోంది. ఎవ్వరికి చెప్పుకోదగ్గ పనిలేదు. యుగాల తరబడి వారికి వయసు మారదు కాబట్టి సుఖాలను అదే విధంగా అనుభవించి విసుగు పుట్టింది అందుచేత మానవాళిని సృష్టించి, వాళ్ళ మంచి చెడ్డలను తలో దేవత చేపట్టాలని నిర్ణయిoచుకున్నారు అయితే చిక్కు ఎక్కడోచ్చిoదంటే ఆ మనిషికి కూడా దేవతల్లాగే శాంతినిస్తే కష్టపడడు కాబట్టి అది ఇవ్వకూడదు అని కొందరు దేవతలు అనుకున్నారు. కాని మిగతావారు ఒప్పుకోలేదు.
     పోనీ ఓ పనిచేద్దాం శాంతిని ఒక కొండ గుహలో దాచిపెట్టి, దాని ద్వారం వద్ద పెద్ద బండరాయిని పెడదాం. ఆ మనిషి కష్టపడి ఆ రాయిని తొలగిస్తే అతనికి శాంతి లభిస్తుంది అని సెలవిచరు ఒక దేవత. ఛఛ అలా చేయడం చాలా సులువు. బలవంతుడైతే బండను అవలీలగా ఎత్తి పడేస్తాడు.  శాంతిని  ఎత్తైన మంచు శిఖరం మీద పెడితే అక్కడికి చేరుకోలేడు. కాబట్టి అదే మంచి పద్దతి , అని మరో దేవుడు అన్నాడు.
ఎడిచినట్లుoది. మంచు చలినుండి కాపాడుకోవడానికి మనిషి ఏదో మార్గo తెలుసుకుని కొండ ఎక్కుతాడు అంతకన్నా సముద్రంలో అట్టడుగున పెడితే బెస్టు. దాన్ని మించిన మార్గంలేదు అని మరొకదెవుదు సలహా ఇచ్చాడు. మీవన్నీ చచ్చు ఐడియాలు, కొండలు, గుహలు, సముద్రాలు పనికిరావు. శాంతిని సంపాదించాలంటే మనిషి బాగా తిరగాలి. అందుచేత ఎక్కడో మనిషి దూరలెని ప్రదేశంలో పెట్టడం మమ్చిది. శాంతికొరకు మనిషి బాగా శోధించి  సాధించాలి దీనికేమంటారు? అన్నాడు ఇంకో చాదస్తపు దేవుడు
       ఛీఛీ మీ బుర్రలు బూజు పట్టిపోయినట్లుఉన్నాయి. ఇవేవి పద్దతులుకావు. శాంతిని దాచడానికి మంచి మార్గం బాగా ఆలోచించండి అని ఓ పెద్ద దేవుడు చికాకు పడిపోయాడు. దాంతో దేవతలంతా మళ్ళి ఆలోచనలో పద్దరు. చివరకు ఓ చిన్నదేవుడు ఐడియా అని గట్టిగా అరిచాడు. మిగతా దేవుళ్ళు ఉలిక్కిపడ్డారు. ఏమిటో చెప్పి ఏడూ, ఎందుకు గావు కెకపెత్తవు? అని ఒక సీనియర్ దేవుడు కసురుకున్నాడు . తనకోచిన ఐడియా చిన్న దేవుడు చెప్పాడు. అది విన్న దేవతల బుర్ర తిరిగిపోయింది. ఆహా! చిన్న వాడివైనా ఎంత చక్కని ఐడియా ఇచ్చావో అని అభినందించారు చివరకు అదే అమలు పరచారు.
           మనిషి శాంతి కొరకు అటూ ఇటూ తిరగడం కన్నా, అతనిలోనే ఒకమూల ఉంచడం బెస్టు. వాడు పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరుగుతాడు తప్ప తనలోనే శాంతి ఉందని గ్రహించడు. మనశాంతికొరకు తిరిగి తిరిగి మతి పోగొట్టుకుంటాడు ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. ఆనాటినుండి ప్రతి మనిషీ లోను మనశాంతిని దాచాలని నిర్ణయించారు