Monday, 30 December 2013

మనల్నిమనం ప్రశాంతంగా ఉంచుకొందాం

నిన్నటి రోజున గతం గుర్తోచ్చి కన్నీటి పర్యంత మైంది మనసు ఎందుకంత బాదపడ్దానో నాకే తెలియలేదు
కష్టాలు అందరికి వస్తాయి ఇంకేప్పటికి బాదపదకూడదని ఈరోజు నిర్ణఇంచుకున్నా ఎందుకంటే ఈ రోజు ఉదయమే నవ్వడం తోనే రోజుని మొదలు పెట్టా ఈ రోజంతా అలా నవ్వుతూనే ఉండి పోయా నాకే తెలియలేనంత ఆనందాన్ని చవిచుసా మనం సంతోషంగా ఉంటె చుట్టూ వాతావరణాన్ని కూడా సంతోషంగా ఉంచగలం చాలా రోజులనుండి కోపాన్ని కుడా రానీయడం లేదు ఎదుటిమనిషి కొప్పడ్డా ఎక్కడ కోపానికి కారణమో చెబితే ఎదుటివాల్లలోను మార్పు గమనించా అర్తం లేకుండా అరవడం గొడవ పడడం వృదాప్రయాస ఉపయోగం ఏమి ఉండదు అందుకే మనల్నిమనం ప్రశాంతంగా ఉంచుకొందాం

Friday, 20 December 2013

paruvama chilipi parugu

కొంటె చూపు చిన్ని నవ్వు

  

 కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు
 తోలిపాటేనాలో పలికినది



Thursday, 19 December 2013

క్షేత్రయ్యే మల్లి పుడితే నారూపు రేఖలపైనే కాస్తోకూస్తో కవితలురాసిమ్మంటా

 



యక్ష కన్య ఓలే తెజమహో ఇష్ట సఖి జయహో

 
 

ఎదైనా నీకు సాధ్యమే

సమస్యలొస్తే ధర్యాన్ని కోల్పోకూడదు
సమస్యకు పరిష్కారం వెతకాలి
ప్రతిదానికి చావే పరిష్కారం కాదు
ప్రతిది నువ్వు కోరుకోన్నట్టే వుండదు
నువ్వు చేస్తున్న పనిని కి ఫలితాలే సంతోషమైనా ధుఖమైనా
నువ్వు వెళ్ళే దారి సరైనదైతే ఎదైనా నీకు సాధ్యమే
 

మాటలు మంచి వైతే దాని ఫలితాలు అద్భుతాలౌతాయి

మాటలు మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి మనిషిలోని భావాలకు మాట్లాడే మాటలకూ పొంతనలేకుంటే అపర్తలే వస్తాయి మనిషి తనకు నచ్చినవారినే మాటలతో బాదిస్తే నచ్చనివారి మాటేంటి? ప్రేమంటే ప్రేమించినవారిని అనుమానించి అవమానించడమా దాన్ని ప్రేమంటారా?ఒక మనిషిని అవమానించే హక్కు నీకేక్కడిది మాట్లాడే ముందు ఆలోచించాలి . అనుమానించడానికి నీకున్న అర్హతేంటి ఇంతకూ నీకు కావల్సిన్దేంటి నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు ఒక మనిషి గురించి తెలుసుకోనేటందుకు నువేన్నుకున్న మార్గాలు సరైనవ్వేనా?వాటివల్ల నీకు అన్నీ నిజాలే తెలుస్తున్నాయని నీవు నమ్ముతున్నావా? ఒకవేల అవి అబద్దలైతే నీ మాటలు వెనక్కి తీసుకోగలవా మాటలు ఒక మనిషిని దగ్గరచేయగలదు అవేమాతలు సరిగా వాడకపోతే అపార్తలు చోటుచేసుకోవచ్చు మాటలు మనం సందర్భాన్ని బట్టి వాడక పొతే అనర్థాలే మిగులుతాయి.ఒక మనిషి ఇంకో మనిషిని నమ్మాలంటే దానికి తగ్గ ప్రవర్తన నీలొఉoదా నీకు నువ్వు మంచివాడివి అనుకొంటే సరిపోదు నీ మాటలు ఎదుటివారిని నీకు ఇష్టమైన వారిని నొప్పించకుండా ఉండగలగాలి నీవు ప్రేమించే మనిషే నిన్ను అర్థం చేసుకోలేదు అంటే అది నీ తప్పే అందుకు నీ ప్రవర్తనే కారణం ఇది తెలుసుకొంటే దీన్ని సరైనదారిలో పెట్టగలిగితే నువనుకోన్నది సాదించినట్టే కడివెడు పాలలో చిటికెడు విషం వేసినట్టు ఒక్క పదం నొప్పించెదున్నా మంచి మాటలకు విలువ ఉండదు దాని తాలుకు మచ్చ మనసులో ఉండిపోతుంది

 

Tuesday, 17 December 2013

సుభోదయము

సప్తాశ్వుడు ఉషాస్సులతో మనస్సును స్పృసించే
సమస్త లోకాలకు సువర్ణ సౌదామినులు కురిపించే
సుమనస్సు  సుమనోరజములు వెదజల్లే
సరస్సున సరోజములు సౌరభ్యములతో విప్పారే
శాకుంతలలు సౌమ్య స్వర రాగ సుధలు చిలికించే
సాహిత్యము నా మనస్సున సరళమై సాగే
సప్తస్వరములు శృతి మెత్తగా వీణలు మీటె
సర్వజనీనమే కదా ఈ సుందరము
సుమనోహారము కడు సుకుమారము

కన్నెపిల్లవని కన్నులున్నవని



నా హృదయంలో నిదురించే చెలీ

       

 

Monday, 16 December 2013

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే

  

Movie : Aithe(ఐతే)(2003)
Cast : Sashank, Janardhan, Mohit, Abhishek, Sindhu Tolani
Direction : Eleti Chandra Sekhar
Music : Kalyani Malik
Song Lyric : Chitapata chinukulu 

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే umbrella ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే

నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలిబాబా ఉంటే ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే alladin genie ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం మన fate యే flight అయ్యే runway

నడి రాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావు మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగ నిజమైతే నష్టమా

mona lisa మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా
ఇలా రావా.....

వేకువనే మురిపించే ఆశలు
వెను వెంటే అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు

ఇలాగేనా ప్రతి రోజూ
ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే umbrella ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే

సరేలే ఊరుకో పరిషనేందుకు

   

అంజలి అంజలి పుష్పాంజలి

  


ప్రభావితం

ప్రతి మనిషిలో ఒక ప్రల్లదుడు (దస్యుడు ,దుర్మార్గుడు )నిక్షిప్తమై ఉంటాడు
ప్రతి పనిలో వీడు పతనాన్నిపిరికితన్నాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు
ప్రారంభంలోనే పసిగట్టి నీ ప్రత్యర్తిని పతనం చేసావంటే
ప్రమొదమైన ప్రశాంతమైన జీవితం నీ వెంట ఉన్నట్టే
ప్రజ్ఞ తో  ప్రావీణ్యం తో సమస్యలను చేదిన్చావంటే
ప్రసంసించదా ప్రపంచమంతా నీ వెన్నంటే
ప్రశాంతతే నీలో ఉంటె ప్రతిదీ ఫలించినట్టే
ప్రఘాడమైన విశ్వాసాన్ని ప్రజ్వలిమ్పచేసుకొంటే
ప్రభాతమై ప్రభంజనమై ప్రపుల్లవై ప్రభాకరుడై ప్రకాసిస్తావు 

Sunday, 15 December 2013

ఇందుజ

ఇంపైన ఇందుడిని చూడ ఇందీవరమాయె నా కన్నులు
దుఃఖమనే దస్యుడిని దూరం చేశా ఇక నా డెందమున
                                            పూయు దరహసములు
జలదము కరిగి వర్షించి జలమై నా మొము జలజము
                             తాకిన వెళ్లి విరియు ఆనందములు

Saturday, 14 December 2013

ఆరంభం

అంకురించే నాలో అంతర్గతమై ఉన్న కవితా ప్రవాహము
అంబరమే హద్దాయే అనంతమైఎగసే  కావ్య సాగరము
అంతకరణమున అంశమాయె కావ్య స్వరము
అనంతమైన కావ్య ప్రపంచం ఇక నా సొంతం
ఆపాద మస్తకము అవహించే కవితావేశము
అక్షయ పాత్రగా మారే అక్షర మస్తకము
అత్యంత అద్భుతానైనా అవపోసన పట్టేస్తా
అవలీలగా హిమాలయాలనైనా అదిరోహిస్తా
అదిక్షేపములు అడ్డొచ్చినా ఛేదిస్తా
అందమైన ప్రపంచంలోకి అడుగేసా
అలలైన ఆలోచనలతో ముడేసా
                                -కళావాణి-
                            -